5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సమస్య – 1935 (కోమటింటఁ దెగెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కోమటింటఁ దెగెను కుక్కుటములు.

56 కామెంట్‌లు:

  1. తీసికొనినయప్పు తీర్చనందుకు గాను
    కోపమొందినట్టి కోమటీడు
    కోటిగాని యింటి కోళ్ళన్ని తాతెచ్చె
    కోమటింటఁ దెగెను కుక్కుటములు

    రిప్లయితొలగించండి
  2. విందు లందు జనులు విరివిగా చికెనులు
    వండి తినెద రిపుడు దండి గాను
    కులము మతము లేల కోరితినగ నెంచి
    కోమటింటఁ దెగెను కుక్కు టములు

    మౌళి గారు హేట్సాఫ్

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి కవిమిత్రులెల్లరులకు నమస్కారములు


    కొత్త యల్లు డొచ్చె నత్తవారింటికి
    తెచ్చినారు హెచ్చు వెచ్చములను
    కోమటింట, దెగెను కుక్కుటములు నాడు
    అల్సజీవులదిని యతిథి మురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారు
      అల్లుడు + వచ్చె = యల్లు డొచ్చె > దుస్సంధి అవుతుంది.
      "అల్లుడరుగుదెంచె నత్తవారింటికి" అనండి

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
      ‘జిగురు’ వారి సవరణను గమనించండి.

      తొలగించండి
    3. గురువు గారికి ధన్యవాదములు......జిగురు సత్యనారాయణ గారూ ముందు నేనలాగే రాసాను.....కానీ కొత్త అల్లుడు అంటే ఇంకా పరీపూర్ణత వుంటుందనీ తరువాత పేరాశ కు పోయాను,, మీసూచనకు ధన్యవాదములు

      తొలగించండి
    4. గురువు గారికి కవిమిత్రులెల్లరులకు నమస్కారములు


      అల్లుడరుగు దెంచె నత్తవారింటికి
      తెచ్చినారు హెచ్చు వెచ్చములను
      కోమటింట, దెగెను కుక్కుటములు నాడు
      అల్సజీవులదిని యతిథి మురిసె

      తొలగించండి
  4. కోమటింటి పేరు కులముజూడగ రెడ్డి
    బంధుగణము రాగ వంటలందు
    నాటు కోడికూర నయముగఁ జేయించె
    కోమటింటఁ దెగెను కుక్కుటములు!!

    రిప్లయితొలగించండి


  5. వెలది వెలది యైన ఆట యే గదరా :)-

    శుభోదయం !



    మావ వచ్చె మంచి మరువము తోడను
    భామ మెచ్చె పొంగు పరువము గన
    జాము యనగ వచ్చె జాణకు జావళి
    కోమటింటఁ దెగెను కుక్కుటములు !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మావ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘మామ’ అనండి. ‘జాము+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘జా మనంగ వచ్చె’ అంటే సరి!

      తొలగించండి
  6. పెండ్లి జరుగు చుండె వైభవ ముగమన
    కోమటింట,దెగెను కుక్కుటములు
    ఊరి వారి కొరకు నోరార తినగను
    షడ్రుచులమిళితపుశాకమదియ

    రిప్లయితొలగించండి
  7. వర్తకమును బాగ భరియించ వలెనుగా
    ఊరి వారి నంత నూర డించి
    విందు సేయ వలె వివిధ తెగ వారికి
    కోమటింట తెగెను కుక్కుటములు.

    రిప్లయితొలగించండి
  8. కోమటీడు తాను కోరి కిరాయిని
    రెడ్డికద్దెకిచ్చె రెండు గదులు
    ఆదివారమందు నలవాటుగానట
    కోమటింటఁ దెగెను కుక్కుటములు

    రిప్లయితొలగించండి
  9. ఇంటికద్దె రాక యిరువది నెలలాయె
    మాంసభక్షకులని మానినంత!
    మడుగు ప్రక్కఁ బెట్టి యడుగుఁ బెట్టగనీయ
    కోమటింట దెగెను కుక్కుటములు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. గ్రామ దేవతలకు ఘనమైన మ్రొక్కుగా
    నిడుదురెల్ల జనులు నిశ్చల మతి
    కులము కన్న భక్తి మేలంచు నమ్మెడు
    కోమటింట దెగెను కుక్కుటములు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మిక్కుటముగ దీప మక్కడ వెలుగంగ
    చక్కగ గుమి గూడి సంధ్య వేళ
    మిణుగుఱు లపుడు మితిమీరగ నెగురంగఁ
    గోమటింటఁ దెగెను కుక్కుటములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      కుక్కుట శబ్దానికి గల అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మితిమీర నెగురంగ’ అని ఉండాలి. టైపాటు కాబోలు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “మితిమీరగన్” లో దోషమేమైన యున్నదాండి? “గ” లేకపోతే గణ దోషముగద.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      అక్కడ గణదోషం ఉండడం వల్లనే నేను సవరణను సూచించాను. అక్కడ రెండు ఇంద్రగణాలు ఉండాలి కదా. మితిమీరగ (IIUII - సలల - ఇది ఇంద్రగణం కాదు)

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “డుమితి” నగణము.”మీరగ “ యతి తో ఇంద్ర గణము.
      “మిణుగు ఱులపు డుమితి మీరగ నెగురంగఁ”

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      నన్ను మీరు క్షమించాలి. నేను నిశితంగా పరిశీలించకుండానే వ్యాఖ్య్తానించాను. మీ పద్యంలో ఏ దోషమూ లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సిగ్గుపడుతున్నాను.

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అంత మాట అనకండి. అన్ని పద్యాలను పరిశీలించినపుడు పొరపాటులెవవరికైనా సహజము. ధన్యవాదములు.

      తొలగించండి
  12. పెండ్లి జరుగు చుండె వేడుకతోడనా
    కోమటింట;దెగెను కుక్కుటములు
    కోడి పందె మాడ గుడిముందుభాగాన
    శుద్ధి చేయ రండు సుజనులార.

    రిప్లయితొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కలిపి వైచె మ౦ట , కులపు టాచారమున్

    పెద్ది శెట్టి | గ్రామ పెద్ద. యైన

    కోమ టి౦ట తెగెను కుక్కుటములు - మిక్కు

    టముగ. | బీరు బ్రా౦ది డ్రమ్ము లెగిరె


    రిప్లయితొలగించండి
  14. కోరి విం దొసంగెఁ గోమటి నరసింహ
    రెడ్డి బంధు హితులు ప్రీతినొంద
    మాంస మనిన మిగుల మక్కువఁ జూపించు
    కోమటింటఁ దెగెను కుక్కుటములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రణామములు గురువుగారు..నెట్ ప్రోబ్లమ్ వలన వ్యాఖ్యను జోడించు రావటం లేదు..అందుచే మీ ప్రత్యుత్తరం దగ్గర నాపద్యము పోస్టుచేస్తున్నాను....



      చక్కగాను జూడ శంబర యాత్రను
      బంధుజనులు రాగ పందిరేసి
      విందుజేయు చుండె వేడ్కతో నా కలిం
      కోమటింట దెగెను కుక్కుటములు!!!

      తొలగించండి
    2. ఫోకస్ గారూ (ఈ పేరుతో గతంలో వ్యాఖ్యలు పెట్టి అది నేనే అంటూ పేరు చెప్పుకున్నారు కాని నాకు జ్ఞాపకం రావడం లేదు.)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కలింకోమటి’...?

      తొలగించండి
  15. సానికొరకు నేర్చె సంసారమే మాని
    మాంస బక్షణంబు-మతమువీడి
    కోమటింట దెగెను-కుక్కుటములుకొన్ని
    కోమలాంగి గోర? కోర్కెదీర్చ.
    2.వంటకొరకు సరుకు వెంటనే గొనిదెమ్ము
    కోమటింట.”దెగెను కుక్కుటములు
    మంత్రిగారి కొరకు-యంత్రాంగమేదిన
    మెచ్చు నట్లువంట నచ్చుకొరకు

    రిప్లయితొలగించండి
  16. లోహ మందసమ్ము లోనున్న ధన మెల్ల
    కోమటింట దెగె ను కుక్కుటములు (కుక్కలు)
    మొరుగ నిరుగు పొరుగు నరుగు దెంచిరికను
    గోడుగోడు మనియె కోమ టీ డు

    రిప్లయితొలగించండి
  17. పోచమ్మ మైసమ్మ ఊరడమ్మలు గ్రామ దేవతలు గ్రామాలలో ఆ దేవతలకు మేక గొర్రె కోళ్ళను బలి ఇవ్వడం ఆచారం గా కొనసాగుతూ నే వుంది

    ఉరడమ్మ పేర నుత్సవమ్ముజరిగె
    కోమటింట, దెగెను కుక్కుటములు
    భక్తి తోడ వారు బలినిచ్చినారైరి
    మూఢ నమ్మకమది మూర్ఖ జనుల

    రిప్లయితొలగించండి
  18. కర్మచారులంత కలిసిరి యొకచోట
    జనులు లేని పాడు సదన మైన
    కోమటింట, దెగెను కుక్కుటములు
    మత్తు నిచ్చు మద్య మచట జేరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. విరించి గారు రెండవ పద్యము మూడవ పాదములో గణదోషముందనుకుంటాను. పరిశీలించండి యొకసారి.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.
      *****
      ఆంజనేయ శర్మ గారూ,
      మూడవపాదాన్ని ‘కోమటింటఁ దెగెను కుక్కుటములు కొన్ని’ అనండి.

      తొలగించండి
    4. అవునండి మరిచాను .....యేదో పరధ్యానంలో జరుగుతున్నాయి పొరపాట్లు ఆటవెలది మూడో పాదంలో చివరిరెండు ఇంద్రగణాలు
      కోమటింట దెగెను కుక్కుటములపుదు అని రాసుకున్నాను కూడా టైపులో మరిటా కామేశ్వరరావు గారికి ధన్యవాదములు

      తొలగించండి
  19. వెలమ దొరల యింటి పెండిలి సమయాన 
    ఊరబంతి బెట్టు యూహతోడ 
    సరుకులగొనిరాగ పొరుగు వీధి ననున్న
    కోమటింట , దెగెను కుక్కటములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. కుల వివక్ష పోవ కోమటి పెండ్లాడె
    కాపులింటి పడుచు కన్య. నొకతె,
    నామె తల్లి దండ్రులల్లుడింటికి రాగ
    కోమటింటఁ దెగెను కుక్కుటములు.

    రిప్లయితొలగించండి
  21. "వెనుక నడక హొయలు పెద్దమ్మ వే"యన
    కినుక మాని జ్యేష్ట చనియె. లంకె
    కోమటింట దెగెను .కుక్కుటములు కూయ.
    పౌష్యలక్ష్మి నిలిచె వైశ్యు నింట
    పౌష్యలక్ష్మి నిలిచె వైశ్యునింట

    రిప్లయితొలగించండి
  22. కోమటింటఁ దెగెను కుక్కుటములునెల్ల
    కోసుకోనితినరుదాసుకొనగ
    కోమటయ్యదాన్ని అమ్మిలాభపడెగా
    జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కోసుకొను, దాసుకొను, దాన్ని’ అన్నవి సాధుశబ్దాలు కావు. ‘కోసి తినఁడు దాచుకొనును తాను| కోమటయ్య దాని నమ్మి లాభపడెను’ అనండి.

      తొలగించండి