కె. ఈశ్వరప్ప గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. ‘లక్ష్మణుండు+అడవికి’ అన్నపుడు సంధి నిత్యం. ‘ఇడువలేక’ అన్న పదం లేదు. ‘విడువలేక’ సాధువు. ‘విపినమున కేగె నన్నను విడువలేక’ అనండి. ‘బహువిధ గంధమనగ’...?
ఆంజనేయ శర్మ గారూ, మీ రెండు పూరణలు వైవిద్యంతో బాగున్నవి. మొదటిపూరణలో ‘ఎఱింగి’ని ‘ఎఱంగి’ అన్నారు. రెండవపూరణలో మొదటిప్రశ్నకు కేవలం ‘లంక’ అని సమాధానం వస్తుంది. ‘లంక నేలెను’ అన్న సమాధానం రావాలంటే ‘ఏమి చేసెను’ అని ప్రశించవలసి ఉంటుంది. ‘తామసుండైన రావణుం డేమి చేసె’ అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?
రావణుడు జచ్చె; మేటిగ రాముడు పలు
రిప్లయితొలగించండికును నిలిపె విభీషణుడనుకూలముగను
లంక నేలెను రాజయి ; లక్ష్మణుండు
సీత రాముడు నెల్లరు ముదము గనగ !
సావేజిత
జిలేబి
జిలేబి గారు మీపూరణ చాలా బాగున్నది. నాల్గవ పాదములో యతి భంగమయినట్లున్నది. “సీత రాముడు నెల్లరుఁ బ్రీతినొంద.” అంటే బాగుంటుంది.
తొలగించండికామేశ్వర రావు గారు !
తొలగించండినెనర్లు !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కామేశ్వర రావు గారి సవరణను గమనించినందుకు సంతోషం!
****
కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు.
తొలగించండిఅదేమిటో గానీండి కంది వారు,
చందం సాఫ్టు సీత కి "ముద" మునకి యతి సరిపోయె అని చూపించేసే !
సరే వేసి చూద్డాము అనుకుని వేసా; సరి కాదని తెలిసింది
జిలేబి
తొలగించండిసీత కి 'ముదానికి' పొత్తు కుదరదనుకుంటా :) జేకే !
జిలేబి
రావణాసురు డానాడు కావరాన
రిప్లయితొలగించండిలంకనేలెనురాజయి|”లక్ష్మణుండు
అడవికేగెను తనయన్ననిడువ లేక|
బంధమన్నది బహువిధ గంధమనగ”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
‘లక్ష్మణుండు+అడవికి’ అన్నపుడు సంధి నిత్యం. ‘ఇడువలేక’ అన్న పదం లేదు. ‘విడువలేక’ సాధువు. ‘విపినమున కేగె నన్నను విడువలేక’ అనండి. ‘బహువిధ గంధమనగ’...?
భీతుడై త్రాణ గోర విభీషణుండు
రిప్లయితొలగించండిలంక నేలెను రాజయి.లక్ష్మణుండు
శీతములడెచ్చె పట్టాభిషేచనమ్ము
రాముడొనరింప సాంద్ర తీరమ్ము నందు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండి1.
రామ చంద్రుని ఘనతనె ఱంగి యతని
శరణ మనుచు వేడిన విభీషణుడు తుదకు
లంక నేలెను రాజయి, లక్ష్మణుండు
భాతృ సేవయె తనకెంతొ భాగ్యమనియె
2.
రావణుండిల యేలిన రాజ్యమేది?
మురిసె నెపుడు సుగ్రీవుండు ముదిత జేరి?
భాతృభక్తితోనెవడంట వనము కేగె?
లంకనేలెను రాజయి లక్ష్మణుండు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిద్యంతో బాగున్నవి.
మొదటిపూరణలో ‘ఎఱింగి’ని ‘ఎఱంగి’ అన్నారు.
రెండవపూరణలో మొదటిప్రశ్నకు కేవలం ‘లంక’ అని సమాధానం వస్తుంది. ‘లంక నేలెను’ అన్న సమాధానం రావాలంటే ‘ఏమి చేసెను’ అని ప్రశించవలసి ఉంటుంది. ‘తామసుండైన రావణుం డేమి చేసె’ అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?
ధన్యవాదములండీ.,,,సవరీస్తాను
తొలగించండిసమరమున దశ కంఠుడు సమయగానె
రిప్లయితొలగించండిరాము దయ విభీనుండు తా రమణతోడ
లంక నే లెను రాజయి , లక్ష్మణుండు
అన్నతోడ నయోధ్యకు ననుసరించె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘విభీనుండు’...? ‘రాము దయ విభీషణుడు తా రమణతోడ’ అనండి.
రావణ వధాంతరమ్మున రమ్యముగను
రిప్లయితొలగించండిదోష రహితుండు ఘనుడు విభీషణుండు
లంక నేలెను రాజయి లక్ష్మణుండు
రామచంద్రుండు దీవింప రాగమొప్ప
తతస్త్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాసనే
తొలగించండిఘటేన తేన సౌమిత్రి రభ్యషించ ద్విభీషణమ్. వా. రా. 6-115-14
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విభీషణ రాజ్యాభిషేక శ్లోకాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.
రావణుని సంహరించగ రాఘవుండు
రిప్లయితొలగించండిశాస్త్ర యుక్తము గావిభీషణుడు కడకు
లంక నేలెను రాజయి, లక్ష్మణుండు
పట్టమును గట్ట నతనికి పాడిగాను!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రావణుడు గూలగానని రామునాజ్ఞ
రిప్లయితొలగించండిప్రియము మీరగ దల్చి విభీషణుండు
లంక నేలెను రాజయి ; లక్ష్మణుండు
సీత రాముడయోధ్యకు చేరుకొనగ
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శూర్ఫణఖ వలచితినన జోడు గలదు
రిప్లయితొలగించండిసీత నాకటంచుఁ బలుక శ్రీరఘుపతి
కామ పూరిత దృక్కుల గాంచి వచ్చు
లంక నేలెను రాజయి లక్ష్మణుండు!
(లంక = రంకులాడి)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ సందిగ్ధంగా ఉంది. శూర్పణఖను లక్ష్మణుడు ఏలుకొనలేదు కదా!
గురుదేవులవారికి ప్రణామములు. తాత్కాలికంగా ఆమె లక్ష్మణుని మోహంతో చూసినంత సేపు అని ఆమె పరంగా వ్రాశాను. లక్ష్మణుని పరంగా ఆలోచించవలదని ప్రార్థన.
తొలగించండిరావణాసురుడనిలోనరాముచేత
రిప్లయితొలగించండిభీకరంబుగబోవవి భీషణుండు
లంకనేలెనురాజయి ,లక్ష్మణుండు
సంత సంబున నతనికి సహక రించె
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండి‘భీకరంబుగ బోవ’...? ‘రాముచేత| పెద్దనిద్దుర వోవ విభీషణుండు...’ అందామా?
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ ల౦కను విభీషణుని ప్రస్తావి౦చ
కు౦డా పూరి౦చాను మరి ! }
రావణుడు కూలగా సమరమ్ము న౦దు
నా యయోధ్యను , సూర్య కులాత్మజు డక -
ల౦క నేలెను రాజయి | లక్ష్మణు౦డు ,
హనుమ , విశ్వాస మార. సేవన మొనర్ప
( అకళ౦కము = అకల౦కము ;
అకల౦క. = త .వి. = కల౦కము లేని స్థితి .
……………………………………………………
అకల౦కన్ = కల౦కము లేని రీతి న్
అకల౦క నేలెను = మచ్చ లేని రీతి గా నేలెను }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండివైవిద్యంగా అద్భుతమైన పూరణ నందించారు. అభినందనలు.
ధ న్య వా ద ము లు
తొలగించండిగు రు వు గారూ !
తొలగించండిగురుమూర్తి గారి పూరణ చాలా బాగుంది ; సమస్యా పూరణ అందులో నూ విభీషణుడు "నిషిద్దుడై" !!
జిలేబి
నమస్కారములు
రిప్లయితొలగించండిఎందుకైనా.... మంచిదని ......?...? ...?
రాయ....లేదు
రావణానుజుండు రాముని కరుణచే
రిప్లయితొలగించండిలంక నేలెను రాజయి;లక్ష్మణుండు
భ్రాతృభక్తి తోడ వనముల కేతెంచి
విడని నీడ వోలె వెంట నడిచె.
సమస్య :-
రిప్లయితొలగించండిలంక నేలెను రాజయి, లక్ష్మణుండు
పూరణము....
మొదటిసారి తేటగీతిలో....
వినయుడువిభీషనుడురామభక్తితోడ
లంక నేలెను రాజయి, లక్ష్మణుండు
వెడలె సీతరాములతోడ రాజ్యమునకు
జ్యోతి నవ్యాఖిలా! నీకు జోత కృష్ణ!!