శంకరార్యా ! జ్వరం తగ్గిందా ? ప్రస్తుతం ఆరోగ్యం ఎలాగుంది ? ఇంటిదగ్గరే యుంటిరిగా ?
వసంత కిశోర్ గారూ,జ్వరం తగ్గింది. దగ్గు, ఒంటినొప్పులు, నీరసం మిగిలాయి. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు.
ఇలన తిరిగెడు రక్కసు డెవ్వడనినజనుల వంచించి బ్రతుకుచున్ జలగ వోలెరక్తమును ద్రాగువాడెపో! భక్తు డనగసహన శీలియు దాతయు సత్య వ్రతుడు
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఇలను’ అనండి.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !అలరింప నున్నవి !అమాయక ప్రాణులను బలి యిచ్చి రక్తంత్రాగే పూజారులు భక్తులూ ఎందరో !01)____________________________________జాలి విడనాడి మేలైన - లాలికములకూత తోడనె మేల్కొల్పు - కుక్కటములఅన్నెమును పున్నెమెరుగక - చెన్ను లొలుకువేట లను; కట్టి యిష్టితో - పీక గొట్టిరక్తమును ద్రాగువాఁడె పో - భక్తుఁ డనఁగ !____________________________________
వసంత కిశోర్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాల నేత్రుని మదినమ్మి భక్తి తోడశిరములన్ సుమాలుగ జేసి శివుని గొల్చెరాక్షసుండైన నేమియు రావణుండెరక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగ
ఆంజనేయ శర్మ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభోదయం !యేసు ప్రభువు రక్తము దార బోసె మనకుబుద్ధి మెండుగా గలుగగ బుధుడు చెప్పెరిక్త జనులు పరుగులిడిరి గురు చెంత రక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగసావేజితజిలేబి
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుక్తిగ పనులు జేసెడి శక్తి యున్న మోస మందున జనులను ముంచి ముంచి మాన ధనముల దోచెడి మౌని యనగ రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ
రాజేశ్వరి అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాక్ష సుడనగ బరగును రహినిభువినిరక్తమునుద్రాగువాడెపో,భక్తుడనగతనదుజీవితమంతయు దన్మయతనభగవ దారాధ నమునందు బరగునతడు
పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంబమందున నీ స్వామి కలడె? యనినసందియమ్మేల? సర్వము చక్రి యనుచునెవడు కీర్తించ నరసింహుడిలను దనుజరక్తమును ద్రాగు! వాఁడె పో భక్తుడనగ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,బొట్టు .బూది. పెట్టుకొని దేవుని గుడి కడతిరుగులాడ ఫలమె మతి స్థిరము లేక ?పనికి రాని వేషములతో భక్తు డగునె ?మనుజుల. కుపకృతి సలిపి , మధుర మైన --రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ.………………………………………………………{ ర క్త ము = నానార్థము = అ ను రా గ ము. త్రాగు = ఆ స్వా ది౦ చు }………………………………………………
గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రహిని ప్రాణుల హింసించు రక్కసుడనరక్తమును ద్రాగు వాడెపో-భక్తుడనగముక్తి గోరుచు పరమాత్ము మోకరిల్లిజీవహింసను నిరసించు జీవుడగును !
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీరమారాధిత పదాబ్జ చింత నామృతంబు నిత్యము సిక్కని యంబలి వలె,చిత్తమెప్పుడు హరినామ చింతనానురక్తమును, ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భుక్తి కొరకయ్యు వేటాడి యుక్తిగానురక్తమును ద్రాగువాడె పో భక్తుడనగభక్త కన్నప్పశివనామ పఠన చేత ముక్తిబొందెను మూలమా శక్తియందు|
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములుతో..===========*===============రామ చంద్రుని పాదము రక్తి తోడ బట్టి, లంకకు వారధి గట్టి వీరవానరుల తోడను వెడలి వైరితతుల రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !
కందుల వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో..============*================ధనికులదిక మయినయట్టి ధరణి యందు కులము బలమని దిరుగెడి ఖలులను,తన వారనక కలియుగమందు వైరి తతులరక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !
కందుల వరప్రసాద్ గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
శక్తి దేవతల గొలువ ముక్తి యనుచు క్షుద్ర శక్తుల బూజించ భద్ర మనుచు రక్త నైవేద్య మిడుచుచు భొక్తు డగుచు రక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగ. విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు
డా. మూలె రామముని రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరయ్యలు స్వస్తులై సాగు కొరకు జలుబు జ్వరములు శీఘ్రమే చచ్చు గాక సాహితీ సమస్య లనెడి సంగరమున విజయు లైనిత్య మవనిని వెలుగు గాక విద్వాన్ డాక్టర్ మూలె రామమమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు
డా. మూలె రామముని రెడ్డి గారూ, ధన్యవాదాలు.
రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగనల్లులును పేలు జలగలు పిల్లులు పులి ప్రభువు కృప చేత పాలకులైరి నేడులంచ మను పేర రక్తమ్ము త్రాగు చుండ్రి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రావణుండనె లంకకు రాముడనెడి నరుని , తోడుగ వచ్చు వానరుల బట్టి నాదు యాజ్ఞగ లిప్తలో నడచి , వారి రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేతపతి లోకమున్ జేరు పేదవారిరక్తమును ద్రాగువాడెపో, భక్తుడనగదేవుని భజించుచున్ తాను దినము రాత్రినార్తి జనులను కాపాడు నట్టివాడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరార్యా ! జ్వరం తగ్గిందా ? ప్రస్తుతం ఆరోగ్యం ఎలాగుంది ?
రిప్లయితొలగించండిఇంటిదగ్గరే యుంటిరిగా ?
వసంత కిశోర్ గారూ,
తొలగించండిజ్వరం తగ్గింది. దగ్గు, ఒంటినొప్పులు, నీరసం మిగిలాయి. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు.
ఇలన తిరిగెడు రక్కసు డెవ్వడనిన
రిప్లయితొలగించండిజనుల వంచించి బ్రతుకుచున్ జలగ వోలె
రక్తమును ద్రాగువాడెపో! భక్తు డనగ
సహన శీలియు దాతయు సత్య వ్రతుడు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఇలను’ అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
అమాయక ప్రాణులను బలి యిచ్చి రక్తంత్రాగే పూజారులు భక్తులూ ఎందరో !
01)
____________________________________
జాలి విడనాడి మేలైన - లాలికముల
కూత తోడనె మేల్కొల్పు - కుక్కటముల
అన్నెమును పున్నెమెరుగక - చెన్ను లొలుకు
వేట లను; కట్టి యిష్టితో - పీక గొట్టి
రక్తమును ద్రాగువాఁడె పో - భక్తుఁ డనఁగ !
____________________________________
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాల నేత్రుని మదినమ్మి భక్తి తోడ
రిప్లయితొలగించండిశిరములన్ సుమాలుగ జేసి శివుని గొల్చె
రాక్షసుండైన నేమియు రావణుండె
రక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభోదయం !
రిప్లయితొలగించండియేసు ప్రభువు రక్తము దార బోసె మనకు
బుద్ధి మెండుగా గలుగగ బుధుడు చెప్పె
రిక్త జనులు పరుగులిడిరి గురు చెంత
రక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగ
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుక్తిగ పనులు జేసెడి శక్తి యున్న
రిప్లయితొలగించండిమోస మందున జనులను ముంచి ముంచి
మాన ధనముల దోచెడి మౌని యనగ
రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాక్ష సుడనగ బరగును రహినిభువిని
రిప్లయితొలగించండిరక్తమునుద్రాగువాడెపో,భక్తుడనగ
తనదుజీవితమంతయు దన్మయతన
భగవ దారాధ నమునందు బరగునతడు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంబమందున నీ స్వామి కలడె? యనిన
రిప్లయితొలగించండిసందియమ్మేల? సర్వము చక్రి యనుచు
నెవడు కీర్తించ నరసింహుడిలను దనుజ
రక్తమును ద్రాగు! వాఁడె పో భక్తుడనగ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
బొట్టు .బూది. పెట్టుకొని దేవుని గుడి కడ
తిరుగులాడ ఫలమె మతి స్థిరము లేక ?
పనికి రాని వేషములతో భక్తు డగునె ?
మనుజుల. కుపకృతి సలిపి , మధుర మైన --
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ.
………………………………………………………
{ ర క్త ము = నానార్థము = అ ను రా గ ము.
త్రాగు = ఆ స్వా ది౦ చు }
………………………………………………
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రహిని ప్రాణుల హింసించు రక్కసుడన
రిప్లయితొలగించండిరక్తమును ద్రాగు వాడెపో-భక్తుడనగ
ముక్తి గోరుచు పరమాత్ము మోకరిల్లి
జీవహింసను నిరసించు జీవుడగును !
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రహిని ప్రాణుల హింసించు రక్కసుడన
రిప్లయితొలగించండిరక్తమును ద్రాగు వాడెపో-భక్తుడనగ
ముక్తి గోరుచు పరమాత్ము మోకరిల్లి
జీవహింసను నిరసించు జీవుడగును !
శ్రీరమారాధిత పదాబ్జ చింత నామృ
రిప్లయితొలగించండితంబు నిత్యము సిక్కని యంబలి వలె,
చిత్తమెప్పుడు హరినామ చింతనాను
రక్తమును, ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భుక్తి కొరకయ్యు వేటాడి యుక్తిగాను
రిప్లయితొలగించండిరక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
భక్త కన్నప్పశివనామ పఠన చేత
ముక్తిబొందెను మూలమా శక్తియందు|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములుతో..
రిప్లయితొలగించండి===========*===============
రామ చంద్రుని పాదము రక్తి తోడ
బట్టి, లంకకు వారధి గట్టి వీర
వానరుల తోడను వెడలి వైరితతుల
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !
కందుల వరప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో..
రిప్లయితొలగించండి============*================
ధనికులదిక మయినయట్టి ధరణి యందు
కులము బలమని దిరుగెడి ఖలులను,తన
వారనక కలియుగమందు వైరి తతుల
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !
కందుల వరప్రసాద్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
శక్తి దేవతల గొలువ ముక్తి యనుచు
రిప్లయితొలగించండిక్షుద్ర శక్తుల బూజించ భద్ర మనుచు
రక్త నైవేద్య మిడుచుచు భొక్తు డగుచు
రక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగ.
విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు
డా. మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరయ్యలు స్వస్తులై సాగు కొరకు
రిప్లయితొలగించండిజలుబు జ్వరములు శీఘ్రమే చచ్చు గాక
సాహితీ సమస్య లనెడి సంగరమున
విజయు లైనిత్య మవనిని వెలుగు గాక
విద్వాన్ డాక్టర్ మూలె రామమమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు
డా. మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
రిప్లయితొలగించండినల్లులును పేలు జలగలు పిల్లులు పులి
ప్రభువు కృప చేత పాలకులైరి నేడు
లంచ మను పేర రక్తమ్ము త్రాగు చుండ్రి
రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
రిప్లయితొలగించండినల్లులును పేలు జలగలు పిల్లులు పులి
ప్రభువు కృప చేత పాలకులైరి నేడు
లంచ మను పేర రక్తమ్ము త్రాగు చుండ్రి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రావణుండనె లంకకు రాముడనెడి
రిప్లయితొలగించండినరుని , తోడుగ వచ్చు వానరుల బట్టి
నాదు యాజ్ఞగ లిప్తలో నడచి , వారి
రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేతపతి లోకమున్ జేరు పేదవారి
రిప్లయితొలగించండిరక్తమును ద్రాగువాడెపో, భక్తుడనగ
దేవుని భజించుచున్ తాను దినము రాత్రి
నార్తి జనులను కాపాడు నట్టివాడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.