అన్నయ్యగారూనమస్తే.నిన్నటి సమస్యను ఒకసారి చూడండి. నిండు కొలువులో నానాతిని యవమాన పరచినట్టి యా దుష్టుని పవనసుతుడు చంపి వానిరక్తము ద్రావె సంగరమున రక్తమును త్రాగువాడెఫో భక్తి పరుడు.
అన్నయ్యగారూనమస్తే.నిన్నటి సమస్యను ఒకసారి చూడండి. నిండు కొలువులో నానాతిని యవమాన పరచినట్టి యా దుష్టుని పవనసుతుడు చంపి వానిరక్తము ద్రావె సంగరమున రక్తమును త్రాగువాడెఫో భక్తి పరుడు.
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ ద్రౌపది ని దుశ్శాసనుడు అవమాని౦చినపుడు మిగత నల్వురు భర్తలు ఊరకు౦డ గా , భీముడు ఒక్కడే ఆగ్రహ౦చెను. అపుడ౦దరు అనుకున్నారు = " ద్రౌపది శోకము బాప భీము డొకడే ద్రౌపది భర్త. "ి ి ………………………………………………..
ఓ చెలియా నా హృదినే
రిప్లయితొలగించుదోచితివని చెప్పినంత దూరిన నీవే
నాచెలిమిని యాశించుచు
నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చెలిమిని నాశించుచు’ అనండి.
వేచితిని నీకొరకెదురు
రిప్లయితొలగించుచూచితి కనులార నీదు సోకులు చూడన్
వాచితి నాలస్యమ్ముగ
నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏచెంత నుంటి వోమరి
రిప్లయితొలగించునాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా
నీచెంత నుండు వారలు
నీచింతన మందు మునిగి నిస్త్రాణు లగున్
------------------------------
జూచితి నిన్నొకనాడని
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా
నాచెంత నున్న సతిగని
నీచెంపలు వాయ గొట్టు నిక్కము సుమ్మీ
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించురాచెంత కనెను కనులే
రిప్లయితొలగించుమాచెంతకు రా యనెనుగ మానస మధురా
నీచెంతకు తను రాగన
నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా :)
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(సారంగధరుడు చిత్రాoగితో )
రిప్లయితొలగించునా చినతల్లివి, కొడుకగు
నాచెంతకు జేరినావు న్యాయమ? చెలియా
వేచితి ననెడు నరేoద్రుడె
నీ చంద్రుoడౌను గాదె నిజముగ జననీ !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించుమీ పూరణ గొప్పగా ఉంది. అభినందనలు.
నాచెలి కానిని వలచియు
రిప్లయితొలగించునాచెంతకుచేరినావు న్యాయమ చెలియా
చాచానెహ్రూపటమును
దాచితినిట నీకుగానుదల్లీ! గొనుమా!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆచారవంత గృహమున
రిప్లయితొలగించుప్రాచార్యుని భార్యవగుచు భద్రతనుండన్
గోచారమేల కాదనె ?
నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా ?
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆచారవంత గృహమున
రిప్లయితొలగించుప్రాచార్యుని భార్యవగుచు భద్రతనుండన్
గోచారమేల కాదనె ?
నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా ?
వేచితి నే బహు కాలము
రిప్లయితొలగించుచూచితి పలుచోట్లు వెదకి సుందర వదనా!
నా చివరి గతిని గాంచగ
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా!
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య నీ చింత దీర్చ నెంచగ
రిప్లయితొలగించునాచెంతకు జేరినావు న్యాయమచెలియా
ఏచింత నుండదిక ని
శ్చింతగ బ్రతుక గలము విను చింతేల ప్రియా.
2.దాచిన ప్రేమను దోచియు
నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా
బ్రోచెడి నీ సహనంబే
ఆచరణా దరణ లుంచ?ఆనందంబే|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
వరూధినితో ప్రవరాఖ్యుడు....
రిప్లయితొలగించుఆచారపు గేస్తునయిన
నాచెంతన జేరినావు న్యాయమ చెలియా?
నీచేదోడు నడుగు నను
చేచాచుట సబబు గాదు శిఖరిణి విడుమా!!!
శైలజ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముఁడు శూర్పణఖతో....
రిప్లయితొలగించుఆ చెంతను తా నొంటరి
గా నా తమ్ముండు గలఁడు కడఁగి యతనినిన్
యాచింపక సతి గలిగిన
నా చెంతను జేరినావు న్యాయమె చెలియా?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చక్కటి యితి వృత్తము తో మీ పూరణ భాసిస్తున్నది. రెండవ పాదము లో ప్రాస మరచినట్టున్నారు.
తొలగించుకామేశ్వర రావు గారూ,
తొలగించునిజమే... ధన్యవాదాలు. సవరిస్తాను.
(సవరించిన పూరణ)
తొలగించురాముఁడు శూర్పణఖతో....
ఆ చెంతను తా నొంటరి
యై చింతిలు లక్ష్మణుఁడు నయంబుగ నతనిన్
యాచింపక సతి గలిగిన
నా చెంతను జేరినావు న్యాయమె చెలియా?
నీ చూపుతూపు గాయము
రిప్లయితొలగించునీ చెయిదము మరచిపోతి నిప్పట్టున ప్రే
రేచగ మానిన ఘాతము
నా చెంతకు చేరినావు న్యాయమ చెలియా
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఓ చంచరీకమా! నువు
రిప్లయితొలగించునా చెంతకు జేరినావు న్యాయమ చెలి, యా
పూచిన సంపంగి పిలిచె
నీ చెలిమిని గోరి, కాదనేవే ల సఖా.
చెలి=స్నేహితుడు, స్నేహితురాలు, ఆడుది
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నువు' అనడం దోషం. 'ఓ చంచరీకమా యిటు...' అనండి. ఇటు = ఈవిధంగా.
దాచిన దాగునె మోసము
రిప్లయితొలగించునీచేసిన ద్రోహ మాగునే యూరక నిం
గాచెడి వారలు లేకన
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా.
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సర్వము కోల్పోయి వనవాసమేగు నలుడు దమయంతితో...
రిప్లయితొలగించుసైచదు నీ దేహమ్మిది
కాచెదరని తల్లిదండ్రి గడపమనంటున్
వాచించిన కానలకిల
నాచెంతకు చేరినావు న్యాయమ? చెలియా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈచలి చంపుచునుండగ
రిప్లయితొలగించునాచెలి బిగికౌగిలినిగొన హృది తపించన్
కాచుకొనియుంటి, తడవుగ
నాచెంతకు చేరినావు న్యాయమ చెలియా!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరూధిణితో ప్రవరుడు:
రిప్లయితొలగించుఆచారము వీడను విధి
వైచిత్ర్యమునన్ హిమగిరి పాలైతినిలన్!
చూచెడు సతినింటగలదు!
నాచెంతకు చేరినావు న్యాయమ? చెలియా!
సహదేవుడు గారూ,
తొలగించుమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నయ్యగారూనమస్తే.నిన్నటి సమస్యను ఒకసారి చూడండి.
రిప్లయితొలగించునిండు కొలువులో నానాతిని యవమాన
పరచినట్టి యా దుష్టుని పవనసుతుడు
చంపి వానిరక్తము ద్రావె సంగరమున
రక్తమును త్రాగువాడెఫో భక్తి పరుడు.
నేటిపద్యము:
నాచిన్నప్పటి సఖియవు
ఓచెలియ నాచెంతకు చేరినావు న్యాయమ చెలియా
దాచుచువలపును మదిలో
వేచిన నను మోసపుచ్చ వేడుకయౌనా!
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నిన్నటి సమస్యలో ‘నాతిని నవమాన...’ అనండి.
నేటి సమస్యలో రెండవపాదంలో గణదోషం.‘ఓ చెలియ’ను తొలగిస్తే సరి!
అన్నయ్యగారూనమస్తే.నిన్నటి సమస్యను ఒకసారి చూడండి.
రిప్లయితొలగించునిండు కొలువులో నానాతిని యవమాన
పరచినట్టి యా దుష్టుని పవనసుతుడు
చంపి వానిరక్తము ద్రావె సంగరమున
రక్తమును త్రాగువాడెఫో భక్తి పరుడు.
నేటిపద్యము:
నాచిన్నప్పటి సఖియవు
ఓచెలియ నాచెంతకు చేరినావు న్యాయమ చెలియా
దాచుచువలపును మదిలో
వేచిన నను మోసపుచ్చ వేడుకయౌనా!
ఏ చింతను జేసితి వో
రిప్లయితొలగించునా చెంతను వీడి ''యమర నాధు '' ని గనగ
న్నీ చలిలో , జూడగ దగు
నా ?, చెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా!
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించువిలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నయ్యగారూ నాపూరణలనోసారి చూడరూ
రిప్లయితొలగించుఅన్నయ్యగారూ నాపూరణలనోసారి చూడరూ
రిప్లయితొలగించుచూసి వ్యాఖ్యానించాను కదా! మీ పూరణలు రెండు సార్లు ప్రకటింపబడ్డాయి. మొదటి సారి ప్రకటించిన పూరణలపై వ్యాఖ్యానించాను.
తొలగించుధన్యవాదాలన్నయ్యగారూ.
రిప్లయితొలగించుధన్యవాదాలన్నయ్యగారూ.
రిప్లయితొలగించునా చెంత జానకి యుండ
రిప్లయితొలగించునీ చింతను దీర్పనలవి నెట్లగు జెపుమా?
ఈ చింతలు మా నుకొనక
నా చెంతను జేరినావు న్యాయమ చెలియా!
అరణ్య వాసములో శ్రీరాముని మోహించి చెంత చేరిన శూర్పణఖ నుద్దేశించి
శ్రీరాముని ప్రశ్న యిది.
విద్వాన్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు
విద్వాన్ మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో మూడవగణంగా ‘కియుండ’ అని జగణం వేశారు. ‘నా చెంత సీత యుండగ’ అందామా?
రిప్లయితొలగించు* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ ద్రౌపది ని దుశ్శాసనుడు అవమాని౦చినపుడు మిగత నల్వురు భర్తలు
ఊరకు౦డ గా , భీముడు ఒక్కడే ఆగ్రహ౦చెను.
అపుడ౦దరు అనుకున్నారు = " ద్రౌపది శోకము బాప భీము డొకడే ద్రౌపది భర్త. "ి
ి
………………………………………………..
పాపము పుణ్య మ౦ చనక పయ్యెద
నిగ్గుచు , కొప్పు నీడ్చుచున్ ,
ద్రౌపది నోలగమ్మునకు లాగెను దుష్టుడు
దుస్ససేను ; డే
పాప మెరు౦గ మే ( ఏ ) మనుచు భర్తలు
నల్వురు మౌనమూనగా ,
నా పవమానపుత్రుడు మహాగ్రహ మొ౦ది
తురమ్ము న౦దు మి
మ్మే పడగి౦తు న౦చనియె | " ని౦తకు
నాయమ. శోక మార్పగా
ద్రౌపది కొక్కడే పతి గదా " యని చెప్పిన
మెచ్చి రెల్లరున్
ే
నే చెప్పిన వినకయె నీ
రిప్లయితొలగించువా చింతలచెట్టు నీడ నండను గొనుచున్
వేచిన దయ్యము దిగగా
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా :)
రిప్లయితొలగించునీ చెక్కిళ్ళ నిమర లే
నే! చక్కగ కాచినావు ణిసిధాత్వర్థం
బే చిక్కనీక రమణీ
నా చెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా !
జిలేబి
ఉద్ధవ్ ఠాకరే:
రిప్లయితొలగించు"నా చింతన హిందూత్వము
నీ చిత్తము రోమునుండు నిరతము సోనీ!
కాచేయుచు నాదు మనము
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా!"
రిప్లయితొలగించుకాచి దరి యట్లకాడని
సాచి చురచురయని చూచి జ్వాలపు వేగం
బై చరచుచున్ జిలేబీ
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా!
నారదా!
జిలేబి