9, ఫిబ్రవరి 2016, మంగళవారం

సమస్య – 1939 (రుక్మిణీ ప్రాణనాథు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు నిజము.

37 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. గురువు గారికి కవిమిత్రులెల్లరులకు నమస్కారములు....

      ఎవతె కృష్ణు బట్టపు రాణి? యేమి వరుస
      గౌరికి శివుడౌ? నెవ్వండు కవ్వడనగ?
      కర్ణుడేకుంతి సుతుడన కల్లయౌన
      రుక్మిణీప్రాణనాథుడర్జునుడు నిజము

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది.
      ‘కవ్వడి+అనగ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘కవ్వడి యన’ అనండి.

      తొలగించండి
  2. సత్య భామకు సఖుడౌను సరస మందు
    వేల భార్యల నడుమను వేడు కనుచు
    కృష్ణ లీలలు దెలియుట కృతము గాదె
    రుక్మిణీ ప్రాణనాధుఁ డర్జునుఁడు నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కరింపబడలేదు.

      తొలగించండి
    2. సత్య భామకు సఖుడౌను సరస మందు
      వేల భార్యల నడుమను వేడు కనుచు
      రుక్మిణీ ప్రాణనాధుఁ డర్జునుఁడు నిజము
      కాదనగ కృష్ణ లీలలు బేధ మెంచి
      ------------------------------------------
      అంటే ఇన్ని లీలలు చేయగలిగిన వాడు ఏదో ఒక అవతారములొ అర్జునుడు కాగలడు అని నాఉద్దేశ్య మన్నమాట .అది అసల్ సంగతి

      తొలగించండి
    3. అక్కయ్యా,
      మీ సవరణ, వివరణ సమర్థనీయం కాదనిపిస్తున్నది. మన్నించాలి!

      తొలగించండి
    4. గురువులకు ప్రణామములు
      ఎంతమాట ? మీరె నన్నుమన్నించాలి తప్పులు తడకలు రాసి శ్రమబెట్టినందుకు

      తొలగించండి
    5. గురువులకు ప్రణామములు
      ఎంతమాట ? మీరె నన్నుమన్నించాలి తప్పులు తడకలు రాసి శ్రమబెట్టినందుకు

      తొలగించండి
  3. మానవ మనోవికాసంపు మర్మములను
    జాతి కర్తవ్య పాలనా సరళిఁ దెలియ
    గీతనందించు కారణభూతులైరి
    రుక్మిణీ ప్రాణనాథుఁ,డర్జునుఁడు నిజము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  4. చక్కగ తెలిపె కృష్ణుడు సరస యతియె
    రుక్మిణీ, ప్రాణనాధుఁ డర్జునుఁడు, నిజము
    మన సుభద్రకు; తనుకూడ మనసు నిచ్చె;
    వారి యిరువురి కలయిక వరము మనకు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘తనుకూడ’ అన్నదానిని ‘తానును’ అనండి. అలాగే ‘వార లిరువురి...’ అనండి.

      తొలగించండి
  5. గురుదేవులకు ప్రణామములు
    కర్ణాటకలోని ఒక గ్రామము నందు యిప్పటికీ పంచ పాండవుల పేర్లు భారతంలో పాత్రల పేర్లు పెట్టుచున్నారని ఈనాడు పుస్తకం లో చదివాను మరియు కొన్ని పేర్లు విన్నాను. బెంగళూరులో మా ఇంటి ఓనర్ గారి పేరు రుక్మణి .
    ============*=============

    ద్రౌపదికి భర్త కృష్ణప్ప, రాచ నగరి
    రుక్మిణీప్రాణనాథుడర్జునుడు నిజము
    కలియుగపు మాయ యిది కాదు కాదు
    కోటి లింగాల లోనిది క్రొత్త గాదు !
    ( రాచ నగరి= మైసూర్ , కోటి లింగాలు = మంజునాధ సినిమాలోని ఊరు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందుల వరప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘మాయయా యిది...’ అనండి.

      తొలగించండి
  6. వాసుదేవ వాసవుల నపార భక్తి
    నసిత పథుడు వేడంగ నాహారమునకు
    ఖాండవ వన దహన ఘన కార్య రతులు
    రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు నిజము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. అంతముసలుప బూభారమవనిబుట్టె
    రుక్మిణీ ప్రాణ నాథుడ ర్జునుడునిజము
    గా నరుని యంశమందున కాంచె జన్మ
    దునుమ భువిపైన బుట్టిన దనుజ జాతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మత్స్యయంత్రమ్ము ఛేదించి మగువ కృష్ణ
    మదిని గెలచిన పాండవ మధ్యముండె
    వీరుడునసవ్యసాచియే వినుము వదిన
    రుక్మిణీ! ప్రాణనాథుడర్జునుడు నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. ఇది సుభద్ర వాక్యమా?
      ‘వీరుడును’ టైపాటువల్ల ‘వీరుడున’ అయింది.

      తొలగించండి
  9. సమస్య ప్రేమబెరుగంగ పెద్దలు పెళ్లిజేయ
    రుక్మిణి ప్రాణ నాథుడర్జునుడు నిజము
    సురభి నాటక మందున|”.చూడ వేరు
    పగటి బ్రతుకులయందున భార్య భర్త.”

    రిప్లయితొలగించండి
  10. నరుడు హరియును కలియగా నరహరి యన
    హరికి యవతారమై కృష్ణు డవని లోన
    రుక్మిణీ ప్రాణ నాథు. డర్జునుడు,నిజము
    హరికి ప్రాణ సఖు0డైన నరుడు గాదె

    రిప్లయితొలగించండి
  11. నరుడు నారాయ ణుండును నరయ యయిరి
    రుక్మిణీ ప్రాణనాధుడర్జునుడు నిజము
    గమరి దైవస మానులుగాదె!మరియు
    భూరివిక్రమవంతులుభువినివారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘...నరయ నయిరి’ అనండి.

      తొలగించండి
  12. నంద నందను ప్రాణమే ననుకొనియెను
    విప్రునికి యామె చెప్పిన వివరమదియె
    వాసుదేవుని వెన్నంటు బాసట యనుట
    రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు నిజము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంథా భానుమతి గారూ,
      మీ పూరణలో అన్వయం లోపించినట్టుంది. మీరు చెప్పచలచుకున్న భావం స్పష్టంగా లేదు. ‘విప్రునికి నామె’ అనండి. ‘బాసట యనుట’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. నిజమే.. కదా.. ధన్యవాదాలు. క్రమాలంకారంలో చెప్దామని ప్రయత్నించా. వేరే రకంగా రాయాలి.

      తొలగించండి
  13. అన్నయ్యగారూ నిన్నటి పూరణలను సరిశీలించగలరు.
    1.హర్షము తోడను పలికెను
    కర్షకుని తనయుడు తికమక పడుచు చదివెన్
    వర్ష ఋతువునందేయీ
    వర్షాకాలము వచ్చె వైశాఖమునన్.
    2.వర్షంబునకోసారియె
    వర్షాకాలము వచ్చు;వైశాఖమునన్
    కర్షకుడుల్లాసముతో
    హర్షముతోడను పొలమును అరకతొ దున్నెన్.

    నేటి పూరణ
    కపట యతిగ వచ్చినయట్టి కవ్వడిఁగని
    రుక్మిణీ!ప్రాణనాథుడర్జునుడు నిజము
    మనసుభద్రక టంచునా మాధవుండు
    పలుక వినుచు హర్షము నందెపడతి తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నిన్నటి మొదటి పూరణలో చివరిపాదం అన్వయించడం లేదు. రెండవపూరణలో ‘ఓసారి’ అనడం గ్రామ్యం. ‘...కొకసారియె’ అనండి. ‘అరకతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. ‘పొలమును+అరక= పొలము నరక’ అవుతుంది. మీరు విసంధిగా వ్రాశారు. ‘పొలముల నరకన్ దున్నెన్’ అంటే సరి.
      ఇక ఈనాటి పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు, నిజము
    భావ మరుదులీ యిరువురు ప్రాణ సఖులు
    ఘోర కురుక్షేత్ర రణమందు భీరువైన
    పార్థునకు గీత బోధించె ప్రభువతండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘కురుక్షేత్ర’ అన్నపుడు రు గురువై గణదోషం. ‘భీకర కురుక్షేత్రమునందు భీరువైన’ అందామా?

      తొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురువరులకు ప్రణామములు
    తెలిసిగూడ దోషాలు చేస్తున్నందులకు చింతిస్తున్నాను. మీ సవరణకు ధన్యవాదములు. మార్చినాను
    రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు, నిజము
    భావ మరుదులీ యిరువురు ప్రాణ సఖులు
    భీకర కురు క్షేత్రమునందు భీరువైన
    పార్థునకు గీత బోధించె ప్రభువతండు.

    రిప్లయితొలగించండి
  16. అంధు డడుగగ కనుదృష్టి నంద జేయ
    నైహికము నకె ధృతరాష్ట్రు డాశ జెంద
    ననుభవించగ జేసిరి యాతనలను
    రుక్మిణీ ప్రాణనాథుఁ , డర్జునుఁడు నిజము.

    రిప్లయితొలగించండి