12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

పద్యరచన - 1169

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

29 కామెంట్‌లు:

  1. ఆత్మ విశ్వాసమేయున్న నప జయమ్ము
    దరికి జేరంగ నీయక దరిమి కొట్టు
    పెద్దపులినంచు దాదల్చు పిల్లియైన
    ఆత్మ న్యూనత వలదంటినార్యులార ......1.

    నీడ గాంచిన యోకూన నిన్ను నీవు
    పెద్దననుచు తలవనేల పిల్లి వీవు
    వన్నె యొకటైన నిత్తడి స్వర్ణమవదు
    ఉప్పు కప్పురమ్మవదుగా ఉర్వియందు. ......2.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి.
      మొదటి పద్యంలో ‘పిల్లికైన’ అంటే బాగుంటుందేమో?
      రెండవ పద్యంలో ‘స్వర్ణ మగున| యుప్పు కప్పుర మగునొకో యుర్వియందు’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారు సరి జేస్తాను

      తొలగించండి
  2. బింబమున యున్నటి ప్రతి
    బింబము నిక్కము యగుటకు భీరువు గానన్
    అంబ బలము నీ లోపల
    పెంపొందించుము సకలము పెరుగును మేలౌ

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం మొదటి పాదాన్ని ‘బింబమ్మున గన నగు ప్రతి...’ అనండి. (బింబమున+ఉన్న అన్నపుడు యడాగమం రాదు. ఉన్నట్టిని ఉన్నటి అనరాదు.) అలాగే ‘నిక్కము+అగుటకు’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిక్కమ్మగుటకు’ అంటే సరి. చివరిపాదంలో ప్రాస తప్పింది.

      తొలగించండి
  3. చక్కని నీప్రతి బింబము
    మక్కువగా జూచి జూచి మరిమరి మురియన్
    నిక్కము నీదేయనుకొని
    మిక్కిలి సంతసము నొందు మేలగు నీకున్

    రిప్లయితొలగించండి
  4. పిల్లి యచ్చటి బావిని బెదురులేక
    చూచు చుండెనుబింబముచూడ్కులార
    తనదు రూపుగా నెరుగకతలచెనేమొ
    వేరు మార్జాల మదియనివివశతయయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      పద్యం బాగుంది.
      అక్కడ ‘బావి’ ఎక్కడిది? ‘వివశత గని’ అనండి.

      తొలగించండి
  5. మార్జాల కిశోరము గనె
    తర్జన దృగ్జాల సంయుత గుహాశయమున్
    గర్జితముం దననట సము
    పార్జిత ధైర్య సువిహార పరితోషితనున్

    రిప్లయితొలగించండి
  6. . పులివలె డాంబికంబుగను”పుట్టినపిల్లి” భయంబు యేలనో
    దెలియద?నీటి బింబమది తీరిక చేతను జూడ బోకనే
    మెలుగుచు నీకునీవె భయమెంచిన?మూషిక మెట్లు జిక్కు?ఆ
    కలి నిను జేరుచుండిన వికారము నందున గానుపింతువా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగుంది.
      ‘భయంబు+ఏలనో=భయం బేలనో’ అవుతుంది. యడాగమం రాదు. ‘భయం బదేలనో’ అనండి.

      తొలగించండి
  7. నీటిలోన ప్రతిమ నీ టుగా కనిపించ
    తలచె తా నిజ ముగ పులినటంచు
    పెంచు కున్న వారి పంచలో చేరెను
    కుక్క దాడి జేయ బిక్కుమనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. పిల్లివి నీవను కొనిన
    న్నుల్లమ్మున, నవసరార్థ మోహో పులిలా!
    చెల్లునటంచును, లోకముఁ
    దల్లడపఱచు నటులుండు తరహా మేలోయ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘పులిలా’ అనడం వ్యావహారికం. ‘పులిగా’ అనండి.

      తొలగించండి
  9. నీడగాంచి పిల్లి నిజముగా తానొక
    పులియనుచుతలంచె పుడమియందు
    ఇంత కంటె వెర్రి యింకొకటిగలదే
    చావు దెబ్బ తినుచు చచ్చె పిల్లి.

    రిప్లయితొలగించండి
  10. నీడగాంచి పిల్లి నిజముగా తానొక
    పులియనుచుతలంచె పుడమియందు
    ఇంత కంటె వెర్రి యింకొకటిగలదే
    చావు దెబ్బ తినుచు చచ్చె పిల్లి.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి వందనములు.
    ఎన్ని బాధలలో ఉన్నా కూడా బ్లాగునిర్వహణ అనే యజ్ఞమును నిరాఘాటంగా కొనసాగిస్తున్నందులకు నా శిరసాభివందనములు.

    విశ్వాసంబిసుమంతయున్న నిక నీవే సర్వ కార్యంబులున్
    విశ్వంబతయునేలగల్గెడు మహా విజ్ఞానముల్ కల్గునే
    శశ్వత్కీర్తియుతుండుగా నిలుతువే సాధింతువెట్లైన లా
    భైశ్వర్యంబులనిజ్జగంబున శుభవ్యాపార సంప్రాప్తులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      బహుకాల దర్శనం... ధన్యవాదాలు.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. గురువు గారూ,
    నేను గణదోషం గురించి భ్రమపడి వ్రాసినదీ, తర్వాత తెలుసుకున్నదీ ఈ బొమ్మలో ఉన్న అంశానికి ఉదాహరణగా ఉంది. :)

    రిప్లయితొలగించండి