కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.
(తమ్ముడు, బావమరదుల దశదినకర్మలకు వెళ్తున్నాను. మూడు రోజులు మీ పూరణలను అవకాశాన్ని బట్టి సమీక్షిస్తాను. మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. ఈ మూడు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు.)
తృష్ణగ పూజించ దలచి
రిప్లయితొలగించండికృష్ణపదారాధనమ్ము,కీడొన రించు
న్నుష్ణము లనుతొల గించగ
విష్ణువును గొలిచి నంత వీడును క్లేశం
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండికొంత గందరగోళంగా ఉన్నా మీ పూరణ బాగున్నది.
'క్లేశం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. చివరి పాదంలో గణదోషం. 'విష్ణువునే కొలిచినంత విడు క్లేశమ్మే' అనండి.
తృష్ణక్కుడైన విజయుడు
రిప్లయితొలగించండివిష్ణువుతో మైత్రి సలిపి విజయము గోరన్
జిష్ణువు శత్రువులకు నా
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'జిష్ణువు'కు అన్వయం?
జిష్ణువు అర్జునుడు గదా
తొలగించండిఅర్జునుని శత్రువులకు అతని కృష్ణపదారాధన కీడుదెచ్చిందని భావంతో
కృష్ణుని గని శిశుపాలుడు
రిప్లయితొలగించండికృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్
కృష్ణుని పూజ వలదనగ
కృష్ణుడు పూజార్హుడనియె "కృష్ణ" యు గనుమా
ఆఖరు పాదం లో రెండవ కృష్ణ ద్రౌపది
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణుఁడు దేవుఁడు గాదని
రిప్లయితొలగించండివిష్ణువు తానేయటంచు వెఱ్ఱిగ బలికే
నిష్ణాతిహీన "పౌండ్రక
కృష్ణ" పదారాధనమ్ము కీడొనరించున్
సంపత్ కుమార్ శాస్త్రి గారు పౌండ్రక వాసుదేవుని ప్రస్తావిస్తూ మీరు జేసిన పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'పలికే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'యటంచు ప్రేలెడివాడౌ' అనండి.
శ్రీకామేశ్వర రావుగారు,
తొలగించండిధన్యోస్మి.
గురువుగారికి వందనములు.
మీ సవరణ సర్వదా ఆమోదయోగ్యమేకదా.
కృష్ణుడు భగవంతుడుగద
రిప్లయితొలగించండికృష్ణునిబూజించనొసగు గైవల్యంబు
న్గృష్ణుని నిటులన నాయమె?
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విష్ణుపదప్రాప్తము భ
రిప్లయితొలగించండిక్త్యుష్ణము సుతదారధన వియోగము ననగన్
తృష్ణవిహీన జనాంచిత
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.
[ముక్కంటిని సేవించువారు బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండగ రమామనోవిభుని సేవించు వారు గడుఁ బేదలౌటకు కారణమడిగిన ధర్మరాజు తోకృష్ణుడుచెప్పిన మాటలు: ఎవనిపై నా కనుగ్రహము కలుగుతుందో యా యుత్తముని సమస్త సంపదలు హరించ వాడు ధహీనుడై బంధుమిత్రులచే విసర్జితుడై హరి భక్తులతో స్నేహము చేసి భక్తుడై వైకుంఠ ప్రాప్తికి నర్హున్ని చేస్తాను. ]
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుని సాయము కొరకై వెళ్లిన సుయోధనుని అంతరంగం:
రిప్లయితొలగించండినిష్ణాతుడ నా కీర్తికి
కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్
తృష్ణగ సాయమడుగ మృగ
తృష్ణ! శిరో భాగమున ప్రతీక్షణ మేలౌ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండివైష్ణవులు జేయు నిరతము
రిప్లయితొలగించండికృష్ణపదారాధనమ్ము, కీడొనరించున్
కృష్ణుని దూరిన చక్రము
నిష్ణాతులయిన వదలక నిర్జించునిలన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ పౌ౦డ్రక వాసు దేవుని మాటలు }
కృష్ణుని శ౦ఖము గదయున్
గృష్ణుని. చక్రము గలిగిన నే నే నిజమౌ
కృష్ణుడ. మీ కా యాదవ
కృష్ణపదారాధనమ్ము కీ డొన రి౦చున్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిష్ణునకు మేలొనర్చెను
రిప్లయితొలగించండికృష్ణ పదారాధనమ్ము, కీడొనరించున్
నిష్ణా తులయ్యు విద్యల,
విష్ణుని సతతమ్ము దూఱు విమతుల కెపుడున్
జిష్ణుడుః విజయుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణుడు నేనే యనుచా
రిప్లయితొలగించండికృష్ణుని వలెవేషమేసి కావరబుద్ధిన్
కృష్ణుని దిట్టుచు యనెతా
కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్.
డా.బల్లూరి ఉమాదేవి గారూ - రెండవ పాదంలో యతి తప్పింది.గమనించండి.
రిప్లయితొలగించండిడా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమంచి భావం. మీ పద్యానికి నా సవరణ...
కృష్ణుడ నేనే యని యా
కృష్ణుని వేషమ్ము దాల్చి కృత్రిమ బుద్ధిన్
కృష్ణుని దిట్టుచు ననెఁ దాఁ
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.
.తీష్ణముగా కంసుడనుకొను
రిప్లయితొలగించండికృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
తృష్ణయె తుదముట్టించెను
కృష్ణా|నీనామ భయమె నెగడగమదిలో {కంసుడు కృష్ణునికలవరమందున నామజపమువైరిఆరాధన}
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణలో 'తీష్ణము'? మొదటి పాదంలో గణదోషం.
కృష్ణుని నిందించు శిశుపాలుని మాటలుగా
రిప్లయితొలగించండివిష్ణుద్వేషమ్మే ఘన
తృష్ణగ శిశుపాలుడిట్లు తిట్టుచు నుండెన్
కృష్ణుడు వ్యర్థుడు చోరుడు
కృష్ణపదారాధనమ్ము కీడునొసంగున్ .
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.కృష్ణుని మిత్ర బృందము
రిప్లయితొలగించండినిష్ణాతులె భక్తియందు—“నేనను నహమే
తృష్ణను బెంచగ వారికి
కృష్ణ పదారాధనమ్ము కీడొన రించున్.”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది.
మొదటి పాదంలో గణదోషం. 'కృష్ణుని మిత్రసమూహము' అనండి.
కృష్ణ యన కారునలుపయె
రిప్లయితొలగించండికృష్ణా యన కాకిరౌతు కృష్ణాయనగా
జీష్ణుని సతీ యగు గావున
కృష్ణు పదారాధనమ్ము కీడొనరించున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని మూడవ పాదానికి అన్వయం?
గురుదేవులకు ప్రణామములు
తొలగించండిజీష్ణుని సతీ కృష్ణ యని నామాంతరముగల ద్రౌపది
ద్రౌపది పదారాధన చేయుట ఆనవాయితీ లేదు కదా
తృష్ణను శిశుపాలుండనె
రిప్లయితొలగించండికృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
విష్ణువె సారధి కాగా
జిష్ణువు నిర్జించ రిపులు చేరిరి యమునిన్
నిన్నటి పూరణ
మంచి బ్రతుకుకై పాశ్యాత్య మరగి వెలుగు
వారి కన్నను మన దేశవాసులిపుడు
భరతమాతను దూషించువారె; బుధులు
మాతృ భూమిని గొలుతురు మాత గానె
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిప్రయాణంలో ఉన్నాను. పూరణలను నిశితంగా పరిశీలించలేకపోతున్నాను. నా దృష్టికి రాని దోషాలుండవచ్చు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి. మన్నించండి.
తృష్ణను బాపక సతతము
రిప్లయితొలగించండివిష్ణుసతిఁ గొలిచి యటకను బిందెలు బానల్
కృష్ణ ధనమ్మును దాచెడి
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
రిప్లయితొలగించండివిష్ణువుని యంశ గా తను
జిష్ణుని హితునిగ రథమ్ము జిగిదేర్చెగదా!
తష్ణీభావంబో? యే
కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్?
జిలేబి