7, ఫిబ్రవరి 2016, ఆదివారం

సమస్య – 1937 (కాలగతిని నిల్పఁగలఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే.

63 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు

   నేలను బుట్టిన నరుడే
   మేలగు పరిశోధనలను మేటిగ జరుపన్
   వీలగు నిక శంక వలదు
   కాలగతిని నిల్పగలడు గద మానవుడే

   తొలగించండి
  2. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. 40)
  చేతికున్నవాచి అతిగతిరుగుచుండె
  ముల్లు వేగ మాప ముల్లునాపెనొకడు
  కాల గతిని నిల్పఁగలఁడుగా మానవుఁడే.
  జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. షిరు పధ్య ప్రయోగము.. భాషాలోపమున్న క్షంతవ్యం

   తొలగించండి
  2. షిరు పధ్య ప్రయోగము.. భాషాలోపమున్న క్షంతవ్యం

   తొలగించండి
  3. కృష్ణమోహన్ గారూ,
   ఇది ఏ ఛందస్సో అర్థం కావడం లేదు. ‘షిరు పద్య ప్రయోగం’ అన్నారు. వివరిస్తారా?

   తొలగించండి
  4. సార్
   అది కందమే కాని
   నెనంత భాషాప్రావీణ్యున్ని కాదు... అలా అని పద్యాలు రాయాలనే తపన...గణదోషాలున్న, పద దోషాలున్న క్షమించ గలరు...
   అది చిరు ప్రయత్నమే... షిరు అచ్చుతప్పు

   తొలగించండి
  5. సార్
   అది కందమే కాని
   నెనంత భాషాప్రావీణ్యున్ని కాదు... అలా అని పద్యాలు రాయాలనే తపన...గణదోషాలున్న, పద దోషాలున్న క్షమించ గలరు...
   అది చిరు ప్రయత్నమే... షిరు అచ్చుతప్పు

   తొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి

  ఆరుద్రగారన్నట్లు
  మానవుడే మహనీయుడు- శక్తిపరుడు యుక్తిమతుడు
  మానవుడే మాననీయుడు- మానవుడే మహనీయుడు :

  01)
  ________________________________________

  బాలుడు మార్కండేయుడు
  కాలుని నోడించె, కాల - కాలుని కరుణన్ !
  మేలగు భక్తిని గలిగిన
  కాలగతిని నిల్పఁగలఁడు - గద మానవుఁడే !
  ________________________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   బహుకాల దర్శనం! బాగున్నారా?
   మార్కండేయుడు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. సుమతేమైనా తక్కువా - సూర్యుణ్ణాపలేదా ?

  02)
  ________________________________________

  జ్వాలవలె కోప మెగయగ
  వ్రాలిన పతిజూచి సుమతి - సూర్యుని నాపెన్ !
  గోలలు తక్కువ గాదులె !
  కాలగతిని నిల్పఁగలఁడు - గద మానవుఁడే !
  ________________________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   మీ రెండవ పూరణలో సూర్యగమనాన్ని నిరోధించిన సుమతి గురించి చెప్పి చక్కని పూరణ నందించారు. అభినందనలు.
   రెండవపాదంలో యతి తప్పింది. ‘సోలిన పతిఁ జూచి సుమతి సూర్యుని.../ వ్రాలిన పతిఁ జూచి సుమతి భాస్కరు నాపె’ అనండి.

   తొలగించండి
  2. శంకరార్యా ధన్యవాదములు !

   అయ్యా ! ఏం జెప్పను ?
   ఉన్నానంటే ఉన్నాను !
   లేనంటే లేను
   ఉన్నానో లేనో - లేనో ఉన్నానో
   నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను
   కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు పూడుకు పోయినై
   రెండు కాళ్ళకూ శస్త్రచికిత్స చెయ్యాలన్నారు
   పోయినసారి హైదరాబాదు వచ్చినప్పుడు care hospital లో
   ఈ నెలలో చేయించుకుందా మనుకుంటున్నాను !

   *****
   సుమతేమైనా తక్కువా - సూర్యుణ్ణాపలేదా ?

   02అ)
   ________________________________________

   జ్వాలవలె కోప మెగయగ
   సోలిన పతిజూచి సుమతి - సూర్యుని నాపెన్ !
   గోలలు తక్కువ గాదులె !
   కాలగతిని నిల్పఁగలఁడు - గద మానవుఁడే !
   ________________________________________

   *****

   పరమాత్మలను బాలలుగా - బాలలను పరమాత్మలుగా
   మార్చిన అనసూయమ్మకు కాలగతిని మార్చడ మొక లెక్కా :

   03)
   ________________________________________

   బాలల నూయల నజులుగ
   శ్రీలదె నర్థింప మార్చె - ననసూయమ్మే
   ఏలా సందేహమికను ?
   కాలగతిని నిల్పఁగలఁడు - గద మానవుఁడే !
   ________________________________________
   అజుడు = పరమాత్మ
   అజులు = పరమాత్మలు(త్రిమూర్తులు)
   శ్రీలు = ముగ్గురమ్మలు

   *****

   తొలగించండి
  3. త్రేతాయుగములో కాదు ఈ యుగములోనే
   మన కళ్ళ ముందే జరిగినది గద
   కాలంతో సమాన వేగముంటేనే కాలాన్నాపినట్టు
   ఆదిత్య-369(కాలయంత్రము-time machine)
   కాలాతిక్రమణము జరిగితేనే సాధ్యం :

   04)
   ________________________________________

   వేలాది యుర్వటము లవ
   లీలగ ఘన బాల కృష్ణ - లిప్తను జేరెన్
   కాలములోముందు వెనుక !
   కాలగతిని నిల్పఁగలఁడు - గద మానవుఁడే !
   ________________________________________

   తొలగించండి
  4. సమయాని కే సభైనా జరుగుతుందా ?
   సమయానికొచ్చే ప్రముఖు లెవరైనా ఉన్నారా?
   అంతా అకాలమే గదా :

   05)
   ________________________________________

   వేళకు నే సభ జరిగెను ?
   వేళకు నే ప్రముఖు డమరె ?- విధికిన్ దరమే
   వేళల దెలియమి? కాన, న
   కాలగతిని నిల్పఁగలఁడు - గద మానవుఁడే !
   ________________________________________

   తొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
   మీ ఆరోగ్యపరిస్థితి తెలిసి బాధపడుతున్నాను. మీకు అన్ని విధాల స్వస్థత చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
   మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. వేళకు నిద్దుర లేచి, ప్ర
  ణాళిక మేరకు నడచుచు నమ్మిక తోడన్
  చాలిన పనులెంచంగ న
  కాలగతిని నిల్పఁ గలఁడు గద మానవుఁడే!

  రిప్లయితొలగించండి
 6. వేలాది యుగము లందున
  లీలగ తమశక్తి చేత లేమలు నిలిపెన్
  కాలుని భక్తిగ కొలిచిన
  కాలగతిని నిల్పఁ గలఁడు గద మానవుఁ డే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీరు చెప్పదలచుకున్న భావాన్ని సమర్థంగా ఆవిష్కరించలేకపోయారు. లేమలు నిలిపెన్ అని క్రియాపదాన్ని ఏకవచనంగా వ్రాశారు.

   తొలగించండి

 7. ఆ లయకారుని మనమున
  వీలుగ మేటిగ తలచిన వినుతెరువరియున్
  మేలుగ తను వినువీధిన
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   లయకారుని తలిస్తే వినుతెరువలి గమనాన్ని నిలువరించవచ్చనే మీ పూరణ బాగున్నది. కాని మూడవపాదానికి నాల్గవపాదానికి లంకె కుదరడం లేదు.

   తొలగించండి
 8. కాలమ్ము కదలుచుండును
  గాలములే లేవు దాని కట్టడి సేయన్
  మేలములాడకు మిట్టుల
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే  రిప్లయితొలగించండి
 9. కాలాను గతిం భగవ
  త్పాలిత మీజగతి యెల్లఁ బ్రకృతి వశమునన్
  మేలుగ, నతి దుస్సాధ్యము
  కాలగతిని నిల్పఁ, గలఁడు గద మానవుఁడే.

  రిప్లయితొలగించండి

 10. యేలను పలికెదవిట్టుల
  కాలగతిని నిల్పగలడుగదమానవుడే
  చాలింపుమికను నీ వా
  చాలత, యెవ్వండు విధిని శాసించునురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది.
   పద్యప్రారంభంలో యడాగమం ఎలా వస్తుంది? ‘ఏలను...’ అనండి.

   తొలగించండి
  2. ముందు వ్రాసిన పద్యంలోని మూడో పాదం నాలుగో పాదాన్ని పోస్టులో ఒకటి రెండు పాదాలు గా మార్చడం వలన కలిగినపొరపాటండీ

   తొలగించండి
 11. కాలపు గమనము నిల్పుట
  చాలముమరియొపుడుమనముచాలును శివుడే
  మేలపు పలుకులు గదయిది
  కాలగతిని నిల్పగలడుగదమానవుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘నిల్పగ| జాలము... పలుకే కద యిది...’ అనండి.

   తొలగించండి
 12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
  నిన్నటి నా పద్య భావం :-

  మానవుడు విజ్ఞాన సముపార్జన తో కత్తిపట్ట కుండ కాలితో మీట నొక్కి యంత్రం ద్వారా శత్రువును నిర్జింపగలడు
  కలం అవసరం లేక అంతర్జాలం తో కార్యం సాధించ గలడు .
  నేటి పూరణ :-
  చాలును నీ జీవితమని
  కాలుడు పిలువంగ నరుడు కాదన గలడే ?
  మేలము నకు గాక నెటుల
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే.?

  కూలిన జీవిని నిలుపునె ?
  గాలిని బధించ గలుగు ఘనత నెరుగునే ?
  గేలికి కాకెటులన నగు
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   నిన్నటి పద్యానికి మీ వివరణ సంతృప్తికరం. ధన్యవాదాలు.
   ఈనాటి మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. చాలా మార్పులు దెచ్చెను
  పాలించుచు పంచ భూత భావము వంచీ
  కాలపు విజ్ఞానముతో
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే!

  రిప్లయితొలగించండి
 14. తేల ప్రకృతిగుట్టు పనులు
  చాల జరుపుచుండె మనిషి సంతతమిలలో
  తేలినది కొలదియె యెటుల
  కాలపుగతిని నిలుపగలడుగద మానవుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘మనిషి’ అనడం వ్యావహారికమే. ‘మనుష్యుడు, మనుజుడు, మానిసి’ సాధువులు. ‘...జరుపుచుండె నరుడు...’ అనండి.

   తొలగించండి
 15. కాలము వేగము నెరుగును
  చాలా దూరముననున్న చంద్రునిపైనే
  కాలూనెను యికపైలో
  కాల గతినినిల్పగలడు గదమానవుడే !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంద పీతాంబర్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘కాలూనెను+ఇక= కాలూనె నిక’ అవుతుంది. యడాగమం రాదు. ‘కాలూనెనె యిక..’ అనండి.

   తొలగించండి
 16. వాలదు జీవన సారము
  కాలగతినినిల్ప?”గలడుగద మానవుడే
  జాలియు జన్మల ఫలమున
  తేలికగా బ్రతుకునింప ?దినములు దొరలున్”.|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారు,
   మీ పూరణలో భావం కొద్దిగా తికమక పెడుతున్నది. అన్వయలోపం ఉంది.

   తొలగించండి
 17. ఆలోచింపగ రవియే
  కాఖలగతిని నిల్పగలడు గద!మానవుడే
  లీలం యాపగలండీ
  కాలమహిమ నెవ్వరరయగల్గిన వారల్.
  2.ఆకాలంబున జూచిన
  కాలగతిని సుమతియాప గలిగెను పతికై
  యీకాలంబున ఛలమున
  కాలగతిని నిల్పగలడు గద మానవుడే.

  రిప్లయితొలగించండి
 18. ఆలోచింపగ రవియే
  కాఖలగతిని నిల్పగలడు గద!మానవుడే
  లీలం యాపగలండీ
  కాలమహిమ నెవ్వరరయగల్గిన వారల్.
  2.ఆకాలంబున జూచిన
  కాలగతిని సుమతియాప గలిగెను పతికై
  యీకాలంబున ఛలమున
  కాలగతిని నిల్పగలడు గద మానవుడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘కాలగతి’ టైపాటు వల్ల ‘కాఖలగతి’ అయింది. ‘లీలన్+ఆపగలండు’ అన్నపుడు యడాగమం రాదు. ‘లీల నిరోధించగలఁడు’ అనండి.

   తొలగించండి
 19. కాలమొక వాహమగుచో
  కాలగతిని నిలుప గలడు గద మానవుడే
  లీలనుశ్రమతో, గానీ
  కాల మనంతమ్మగుటను కలగామిగులున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కాలుని కె కడిది కాదా
   కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే
   ఇలనని భ్రమ వలదుసుమా
   అల నలువకునూ నసాధ్య మది నిక్కముగా.

   తొలగించండి
  3. మంథా భానుమతి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘నలువకునూ నసాధ్య’మనడం దోషం. ‘అల నలువకునైన సాధ్యమా నిక్కముగా’ అనండి.

   తొలగించండి
 20. శ్రీ శంకరయ్య గురువరులకు నమస్కారములు మీ సూచనకు ధన్యవాదములు
  పంచభూతముల తత్వములు (వంచు )నసింపజేస్తున్నాడు వ్రాయాలనుకున్నాను కన్ని కుదరలేదు
  పద్యమునే కొంచము మార్చాను
  చాలా మార్పులు దెచ్చెను
  కీలక మౌ సృష్టిలోని కీలెరిగియు నీ
  కాలపు విజ్ఞానముతో
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే!

  రిప్లయితొలగించండి
 21. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. వేల కొలది కందములను
  మాలలు శార్దూలములను మత్తేభములన్
  వీలుగ వ్రాయించుచు మా
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే :)

  రిప్లయితొలగించండి
 23. మేలగు కల్లును త్రాగుచు
  నేలను పొరలుచు మరింత నెయ్యము తోడన్
  వ్రాలుచు భూజపు ఛాయను
  కాలగతిని నిల్పఁగలఁడు గద మానవుఁడే

  రిప్లయితొలగించండి