ఆంజనేయ శర్మ గారూ, పూరణ బాగున్నది. కాని విష్ణువు కృష్ణావతారంలో ‘గట్టుతాల్పు’ అయ్యాడు కదా! రావణునితో హనుమంతుడు ఆ విషయాన్ని ఎలా ప్రస్తావిస్తాడు? ‘...కా దవనిలోఁ బుట్టిన కంజనేత్రుఁ| డతఁడు...’ అనండి. ‘భద్రత నిడు’ అంటే బాగుంటుందేమో?
కంది శంకరయ్య గారూ, ధన్యవాదములు.డా.బల్లూరి ఉమాదేవి గారు మీ సమస్యల పూరణలు పేస్ బుక్ లో పెట్టేవారూ. అవి చదివి నాకు కూడా, ఎప్పటి నుండో మీ బ్లాగు లోని సమస్యలను పూరించాలనే తాపత్రయం నాకు ఉండేది, ఛందస్సు తెలియదు కనుక రాలేదు. డా.బల్లూరి ఉమాదేవి గారూ మరియు శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారూ నాకు ఛందస్సు నేర్పించారు. చిన్న చిన్నగా మొదలు పెట్టాను.
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. మొదటిపాదంలో యతి తప్పింది. నా సవరణ.... శివధనుర్భంగం తర్వాత వచ్చిన పరశురాముని చూచి రాజలోకం తమలో తాము అనుకొన్నది.... (మన దృష్టిలో కాదు కాని, రాజలోకం దృష్టిలో అతడు రాక్షసుడే!) ఇరువదియొక మారు లెసగి ధరణిపతుల.... మిగతా మీ పద్యమే...
ఆంజనేయ శర్మ గారూ, మీ రెండు పద్యాలుగా బాగున్నవి కాని సమస్యాపూరణలో సంతృప్తికరంగా లేవు. రాక్షసమనగా అమానుషం అనే అర్థం తీసుకున్నా అది కలవాడు రాక్షసుడన్నా అది రామునకు వర్తించదు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ నాల్గవపద్యాన్ని చూసి ఉంటే నా పూరణను ప్రకటించకపోయేవాణ్ణి. ఇద్దరం ఒకే భావంతో వ్రాసాము. మీ ఐదు పూరణలలో మొదటిది తప్ప మిగిలినవి బాగున్నవి. మొదటి పూరణలో అన్వయలోపం ఉంది. మూడవపూరణలో ‘వేల+అసురుల’ అన్నపుడు సంధి లేదు.
(అసలు రాక్షసుడు అనేది తప్పు పదం కాదు. రక్షించే వాడు అని అర్థం. నందవంశానికి ఆ తరువాత చంద్రగుప్తునికీ మంత్రి అయిన ఆయన పేరు కూడా రాక్షసుడు. విశ్వామిత్రుని వంటి త్రికాలవేది అడిగాడంటే దానిలో ఏదో మర్మం ఉంటుంది. పంపమని వశిష్ఠమహర్షి చెప్పాడు. రాముడే రాక్షసుడు. రాక్షసులని ఓడించలేడా ? అనే చమత్కారం. )
(అసలు రాక్షసుడు అనేది తప్పు పదం కాదు. రక్షించే వాడు అని అర్థం. నందవంశానికి ఆ తరువాత చంద్రగుప్తునికీ మంత్రి అయిన ఆయన పేరు కూడా రాక్షసుడు. విశ్వామిత్రుని వంటి త్రికాలవేది అడిగాడంటే దానిలో ఏదో మర్మం ఉంటుంది. పంపమని వశిష్ఠమహర్షి చెప్పాడు. రాముడే రాక్షసుడు. రాక్షసులని ఓడించలేడా ? అనే చమత్కారం. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారికి సుకవి మిత్రులకు నమస్కారములు
తొలగించండిగురువు గారికి ధన్యవాదములు
రావణునితో హనుమ మాటలుగ నూహించిన పూరణము.
అసుర రక్షక నానుడు లాలకింపు
రాముడన నెవ్వడత డొక రాక్షసుండు
కాదవనిలోన బుట్టిన గట్టుతాలు
పతడు, సంధి యొక్కటెనీకు బద్రతయగు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిపూరణ బాగున్నది. కాని విష్ణువు కృష్ణావతారంలో ‘గట్టుతాల్పు’ అయ్యాడు కదా! రావణునితో హనుమంతుడు ఆ విషయాన్ని ఎలా ప్రస్తావిస్తాడు?
‘...కా దవనిలోఁ బుట్టిన కంజనేత్రుఁ| డతఁడు...’ అనండి. ‘భద్రత నిడు’ అంటే బాగుంటుందేమో?
ఔనండి! ఆ విషయం నాకు స్ఫురణకు రాలేదు సరి జేస్తానండి ధన్యవాదములు
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిఅఫ్జ లుగురు వీరుడునేటి యధములకును,
తలపున భరతమాతను చెరచు నీచు
లకును, రావణుడే దేవరాయె, కాన
రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు.
- వెంకోరా.
వెంకోరా(?) గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. నా మనసులోని మాట చెప్పారు. సంతోషం! అభినందనలు.
కంది శంకరయ్య గారూ,
తొలగించండిధన్యవాదములు.డా.బల్లూరి ఉమాదేవి గారు మీ సమస్యల పూరణలు పేస్ బుక్ లో పెట్టేవారూ. అవి చదివి నాకు కూడా, ఎప్పటి నుండో మీ బ్లాగు లోని సమస్యలను పూరించాలనే తాపత్రయం నాకు ఉండేది, ఛందస్సు తెలియదు కనుక రాలేదు. డా.బల్లూరి ఉమాదేవి గారూ మరియు శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారూ నాకు ఛందస్సు నేర్పించారు. చిన్న చిన్నగా మొదలు పెట్టాను.
రావణుడు గొనిపోయెగా కావు నెటుల?
రిప్లయితొలగించండిరాముడన, నెవ్వడత డొక రాక్షసుండు
పోరు సల్పి సీతను మరి పొందెద మనె
లక్ష్మణుడు స్వాంతవచనములను బలుకుచు
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘కాచు టెటుల’ అనండి. ‘స్వాంతవచనములు’ కాదు, ‘సాంత్వవచనములు’.
సత్య ధర్మము పాటించు నిత్య వ్రతుడు
రిప్లయితొలగించండిరాముఁ డన , నెవ్వఁ డతఁ డొక రాక్ష సుండు
వరగరువ మున దిరుగెడి పాపి యనగ
లంక నేలెడి రావణు డంక తనము
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘వరగరువము’ అనరాదు. ‘అంకతనము’ ...? నా సవరణ....
వరపు గర్వాన దిరుగెడు పాపి యనగ
లంక నేలును గద రావణాంకు డతడు.
సత్య ధర్మము పాటించు నిత్య వ్రతుడు
తొలగించండిరాముఁ డన , నెవ్వఁ డతఁ డొక రాక్ష సుండు
వరపు గర్వాన దిరుగెడు పాపి యనగ
లంక నేలును గద రావణాంకు డతడు
ఇరువది యొకమారులు ధరణీపతులను
రిప్లయితొలగించండిజంపి తల్లితండ్రులకిల సంతసముగ
రక్త తర్పణమొనరించు ప్రజవి పరశు
రాముఁడన నెవ్వ డతడొక రాక్షసుండు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో యతి తప్పింది. నా సవరణ....
శివధనుర్భంగం తర్వాత వచ్చిన పరశురాముని చూచి రాజలోకం తమలో తాము అనుకొన్నది.... (మన దృష్టిలో కాదు కాని, రాజలోకం దృష్టిలో అతడు రాక్షసుడే!)
ఇరువదియొక మారు లెసగి ధరణిపతుల.... మిగతా మీ పద్యమే...
రిప్లయితొలగించండి›
మానవాకృతినొందినమహితుడార్య! రాముడనగ,నెవ్వడతడొకరాక్షసుండు లంకకధిపతియైనట్టిరావణుండు నిజమునమ్ముముమ్మాటికినిజముసుమ్ము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముఁ డన నెవ్వఁ డతఁడొ,క రాక్షసుండు
రిప్లయితొలగించండిరావణుని సంహరింపగా రత్న గర్భ
పైన జన్మించిన హరియె, వాని చంప
సీతతోపాటు జనుల సంప్రీతి పడిరి
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జనులు’ టైపాటువల్ల ‘జనుల’ అయింది.
రామ నామమాత్ర దురిత లాలసుండు
రిప్లయితొలగించండిసత్య వచన దూరు డవని నిత్య కపటి
పర ధనాసక్తుడు వ్యసన పరు డభినవ
రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు.
బాగుందండి మీ అభినవ రాముని గుణగణవివరణ ఇంతలా వర్ణించిన యా రాముడు రాక్షసుడే
తొలగించండివిరించి గారు ధన్యవాదములు. కలికాలములో యిట్టి యభినవ రాములకు కొరత లేదు.
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆస్తి కోసము తమ్ముని హత్య జేసె |
ఉవిదను విడనాడి గణిక. ను౦చు కొనియె |
పేరు కేమొ " రాముడు " నేతి బీరకాయ. |
రాము డన నెవ్వ డతడొక. రాక్షసు౦డు |
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సతతము వితండవాదము సలుపువారు
రిప్లయితొలగించండిరాముడననెవ్వ డతడొక రాక్షసుండు
దానవులె భువి నిజమైన దైవములని
దేశపు సమగ్రతను దెబ్బ తీయు చుండ్రి
కుక్కమూతి పిందెలె వారు కువలయమున
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
Guruvaryulaku dhanyavadamulu.
తొలగించండిGuruvaryulaku dhanyavadamulu.
తొలగించండిభక్తు లెంచగ దేవుడే వసుధ యందు|
రిప్లయితొలగించండి“మోసపూరిత కార్యాల మోజులున్న
రావణుండెదురించగ రంగమందు
రాముడన నెవ్వడతడొక రాక్షసుండు”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. కాని ‘రాక్షసుండు’కు అన్వయం?
సద్గుణాంభుధి సోముండు సత్యవ్రతుడు
రిప్లయితొలగించండిదీనజన రక్షకుడతడు ధీరుడతడు
రక్కసులపరి మార్చగ రాక్షసులకు
రాముడననెవ్వడతడొక రాక్షసుండు
రామబాణమె మేటిదౌ రాక్షసేంద్ర
నరుడు వాడంచు భావింప సరియుగాదు
వీరుడై భండనము జేయు వేళయందు
రాముడననెవ్వడతడొక రాక్షసుండు.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలుగా బాగున్నవి కాని సమస్యాపూరణలో సంతృప్తికరంగా లేవు. రాక్షసమనగా అమానుషం అనే అర్థం తీసుకున్నా అది కలవాడు రాక్షసుడన్నా అది రామునకు వర్తించదు.
రాము డన,నెవ్వ,డత డొక రాక్షసుండు,
రిప్లయితొలగించండితమ్ముడౌ సుబాహు౦ డధ్వరమ్ము ధ్వంస
మొనరుప౦బూన యమునిసదనము కంపి,
జలధి ద్రొబ్బెమారీచ నిశాటు నలిగి.
2.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
సీత నెత్తుకు పోవగ శృ౦గజముల
గూల్చి రక్షించి నట్టి రఘుపతిగాదె
దశరథాత్మజు డైనట్టి దానవారి.
3.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
పదియు నాల్గువేలసురుల ఫౌజు
ననికి వచ్చిన నందర హతమొనర్చు
ధనువు చేబట్టు విక్రమ ధనుడ తండు
4. .రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
మాయలేడియై గన్పింప జాయ కొరకు
వెంటబడి గూల్చి,కోల్పోయె నింటనున్న
ప్రాణసతిని రావణుడు హరణము సేయ
5. రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
పత్ని చెర బట్ట వానర బలముగూడి
సేతు నిర్మించి లంకను జేరి దనుజ
వైరులను జంపి సీతను బడసె మరల
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ నాల్గవపద్యాన్ని చూసి ఉంటే నా పూరణను ప్రకటించకపోయేవాణ్ణి. ఇద్దరం ఒకే భావంతో వ్రాసాము.
మీ ఐదు పూరణలలో మొదటిది తప్ప మిగిలినవి బాగున్నవి. మొదటి పూరణలో అన్వయలోపం ఉంది.
మూడవపూరణలో ‘వేల+అసురుల’ అన్నపుడు సంధి లేదు.
గురుదేవుల సూచనమేరకు3వ పద్యము సవృంచితిని
తొలగించండి25.02.2016. .శంకరాభరణము.
సమ:స్య::రాము డన నెవ్వ డత డొక రాక్షసుండు
పూరణ :రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు,
తమ్ముదౌ సుబాహు౦ డధ్వరమ్ము ధ్వంస
మొనరుప౦బూన యమునిసదనము కంపి,
జలధి ద్రొబ్బెమారీచ నిశాటు నలిగి .
2.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
సీత నెత్తుకు పోవగ శృ౦గజముల
గూల్చి రక్షించి నట్టి రఘుపతిగాదె
దశరథాత్మజు డైనట్టి దానవారి.
3.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
పదియు నాల్గువేలుగలుగు ఫౌజు తోడ
ననికి వచ్చిన నందర హతమొనర్చు
ధనువు చేబట్టు విక్రమ ధనుడ తండు .
4. .రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
మాయలేడియై గన్పింప జాయ కొరకు
వెంటబడి గూల్చి,కోల్పోయె నింటనున్న
ప్రాణసతిని రావణుడు హరణము సేయ.
5. రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
పత్ని చెర బట్ట వానర బలముగూడి
సేతు నిర్మించి లంకను జేరి దనుజ
వైరులను జంపి సీతను బడసె మరల.
L
గర్భవతిని సతిని కడు దుర్భరంపు
రిప్లయితొలగించండికాన కంపెనే! రాముడు కరుణలేక
ననెను ప్రల్లదు డొక్కరు డాగ్రహాన
రాముడన నెవ్వడతడొక రాక్షసుండు
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘కరుణలేక| యనెను...’ అనండి.
గర్భవతిని సతిని కడు దుర్భరంపు
రిప్లయితొలగించండికాన కంపెనే! రాముడు కరుణలేక
ననెను ప్రల్లదు డొక్కరు డాగ్రహాన
రాముడన నెవ్వడతడొక రాక్షసుండు
ఖలులు కల్పితమే రామ కథయెననుచు
రిప్లయితొలగించండితప్పు మాటల నాడుచున్ చెప్పిరిటుల
అగ్ని దూకమంచానతి యాలి కొసగు
రాముడననెవ్వడతడొక రాక్షసుండు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘కథయె యనుచు’ అనండి. ‘అగ్నిలో దూకుమను నాజ్ఞ నాలి కొసగు’ అనండి.
మగఁడు లేడిని తేఁబోవ మాయఁ జేసి
రిప్లయితొలగించండిసీతఁ గామించి జెరఁబట్టి చిక్కుకొనియె!
కావఁడెవ్వండు నానుంచి రావణునని
రాముఁడన! నెవ్వడతఁడొక రాక్షసుండు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
పద్యాంతంలొ అన్వయం సందేహాస్పదం.
గురుదేవులకు ధన్యవాదములు. మరో పాదము పెంచి వ్రాసిన పద్యము పరిశీలించ ప్రార్థన:
తొలగించండిమగఁడు లేడిని తేఁబోవ మాయఁ జేసి
సీతఁ గామించి జెరఁబట్టి చిక్కుకొనియె!
కావఁడెవ్వండు నానుంచి రావణునని
రాముఁడన! నెవ్వడతఁడొక రాక్షసుండు!
ధర్మమూర్తియౌ రామునే తల్లడించ!!
తార వాలితో....
రిప్లయితొలగించండిరాముఁ డన నెవ్వఁ? డతఁడొక రాక్షసుండు
మాయలేడియై మోసగింపఁగఁ దన సతిఁ
గోలుపోయి యామెకొఱకు కొండకోన
లధిగమించుచు వచ్చి సూర్యాత్మజునకు
నండగా నిల్చె, చూడకు మల్పునిగను.
రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు
రిప్లయితొలగించండికాడ ! ఐనచో నతడేల కదలి వచ్చె
నసురులను గాక వింత వానరుల తోడ
లంక కేతెంచె నని బల్కె లండియొకతె
సద్గుణాంభుధి సోముండు సత్యశీలి
రిప్లయితొలగించండియాశ్రిత జనరక్షకుడు మహాత్ముడైన
రాముడననెవ్వడతడొక రాక్షసుండు
శరణ మనివేడ బ్రోచెను కరుణ తోడ
అగ్రజునితో విభీషణుండనియె నిటుల
రిప్లయితొలగించండి"రాముడన నెవ్వడతడొక రాక్షసుండు
కాడు"తిరిగి సీత నొసగి గనుము సుఖము
యనుచు రావణాసురు తోడ ననుజుడనియె.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆస్తి కోసము తమ్ముని హత్య జేసె |
ఉవిదను విడనాడి గణిక. ను౦చు కొనియె |
పేరు కేమొ " రాముడు " నేతి బీరకాయ. |
రాము డన నెవ్వ డతడొక. రాక్షసు౦డు |
నమస్సులు. పొరబాటు గమనించాను. కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండినమస్సులు. పొరబాటు గమనించాను. కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిఈ సమస్యని యథాతథంగా పూరించదలచాను.
రిప్లయితొలగించండిరాముడన నాత డెవడొక రాక్షసుండు
రాక్షసుల గూల్చి ఋషులకు రక్షనిచ్చు
కౌశిక మహర్షి యనగ త్రికాలవేది
రాము నతనితో బంపుము భ్రమల విడచి
(అసలు రాక్షసుడు అనేది తప్పు పదం కాదు. రక్షించే వాడు అని అర్థం. నందవంశానికి ఆ తరువాత చంద్రగుప్తునికీ మంత్రి అయిన ఆయన పేరు కూడా రాక్షసుడు. విశ్వామిత్రుని వంటి త్రికాలవేది అడిగాడంటే దానిలో ఏదో మర్మం ఉంటుంది. పంపమని వశిష్ఠమహర్షి చెప్పాడు. రాముడే రాక్షసుడు. రాక్షసులని ఓడించలేడా ? అనే చమత్కారం. )
ఈ సమస్యని యథాతథంగా పూరించదలచాను.
రిప్లయితొలగించండిరాముడన నాత డెవడొక రాక్షసుండు
రాక్షసుల గూల్చి ఋషులకు రక్షనిచ్చు
కౌశిక మహర్షి యనగ త్రికాలవేది
రాము నతనితో బంపుము భ్రమల విడచి
(అసలు రాక్షసుడు అనేది తప్పు పదం కాదు. రక్షించే వాడు అని అర్థం. నందవంశానికి ఆ తరువాత చంద్రగుప్తునికీ మంత్రి అయిన ఆయన పేరు కూడా రాక్షసుడు. విశ్వామిత్రుని వంటి త్రికాలవేది అడిగాడంటే దానిలో ఏదో మర్మం ఉంటుంది. పంపమని వశిష్ఠమహర్షి చెప్పాడు. రాముడే రాక్షసుడు. రాక్షసులని ఓడించలేడా ? అనే చమత్కారం. )