18, ఫిబ్రవరి 2016, గురువారం

సమస్య – 1948 (భరతమాతను దూషించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భరతమాతను దూషించువారె ఘనులు.

36 కామెంట్‌లు:

  1. ఇతర దేశము లందున వెతలు బడుచు
    ధనము నాశించి వలసరి జనులు మెండు
    కోట్లు గడియించి ప్రేమలు తూట్లు పరచి
    భరత మాతను దూషించు వారె ఘనులు

    రిప్లయితొలగించండి
  2. శుభోదయం !

    భరత మాతను దూషించు వారె ఘనులు
    చెబుత మరియిది యెట్లన జెప్పి వెర్రి
    ముఖము బెట్టితి భరతము భువిన మేటి
    కర్మ భూమిగ కనబడె గద జిలేబి !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. కాని భావం, పూరణ సంతృప్తికరంగా లేవు.

      తొలగించండి
  3. గురువు గారికి సుకవి మిత్రులకు నమస్కారములు

    1.
    పరమ ద్రోహులు నీచులు భ్రష్టులనగ
    భరత మాతను దూషించు వారె, ఘనులు
    మిక్కుటముగ దేశమును ప్రేమించు వారు
    దేశభక్తులు నిజమైన ధీరు లేను.

    2.
    జనులటను పాకి స్తానుదే శమ్మునందు
    భారతీయులెల్లరు తమ పగతురనుచు
    దలచు చుందురనెడు మాట తథ్యమచట
    భరతమాతను దూషించు వారె ఘనులు


    ( జనులటను పకిస్తాను దేశమ్ము నందు )

    పాకిస్తాను లో కి గురువేమొ అన్నశంక నామవాటకము కనుక పకిస్తాను అనవచ్చేమో నన్న యాశ గురువు గారు సందేహ నివృత్తి చేయగలరని నమ్మకము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      పాకిస్తానులో కి గురువే. 'జనులు పాకిస్తా ననెడి దేశమ్ము...' అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి ధన్యవాదములు

      జనులు పాకిస్తాననెడు దేశమ్మునందు అన్నా పాకిస్తా మగణమవుతుందని క్రింది విధంగా సరిచేసాను



      శత్రువైన పాకిస్తాను జాతి యెపుడు
      భారతీయులెల్లరు తమ పగతురనుచు
      దలచు చుందురనెడు మాట తథ్యమచట
      భరతమాతను దూషించు వారె ఘనులు

      తొలగించండి

  4. చెరుపు పనులను జేయగ చెదలు వీరె
    భరత మాతను దూషించు వారె; ఘనులు
    గదర మాతకు ముకుతాడు గట్టి బెట్టి
    పసిడి బంగరు భూమిని పాడు జేయు

    రిప్లయితొలగించండి


  5. ఓట్లకొరకిట్లు పడరాని పాట్లుబడుచు
    రాజకీయపు ధూర్తుల రక్కసులకు
    మాతనైనను తమ పరమాత్మనైన
    భరతమాతను దూషించు వారె ఘనులు

    రిప్లయితొలగించండి
  6. దుష్టశీలురు నీచులు ధూర్తు లగును
    భరత మాతను దూషించు వారె, ఘనులు
    మాతృదేశమ్ము కోసము మరణమైన
    లక్ష్య పెట్టని వారగు రక్షకులుగ!!!

    రిప్లయితొలగించండి
  7. పరమ చండాలురుగబుట్టుదురటభువిని
    భరత మాతనుదూషించువారె,ఘనులు
    తల్లి పుడమికి జేజేలు దనర చెప్పు
    వారు,నతులనే నిడుదునువారికిపుడు

    రిప్లయితొలగించండి
  8. సంఘ విద్రోహు లెల్లరఁ జక్క బఱుప
    మహిని, భక్తి శ్రద్ధల తోడ మదిని దలచి
    కన్నతల్లిని మించిన కరుణమూర్తి
    భరతమాతను, దూషించువారె ఘనులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. దూషణలు జేయునాతడు దోషియగును
    భరత మాతను దూషించు వారె, ఘనులు
    దోషములు జేయువారిలో, ధూర్తులగుట
    తగిన శిక్షకు పాత్రులు ధర్మ మిదియె

    రిప్లయితొలగించండి
  10. విశ్వ విద్యాలయమ్ములా వీధి బడుల ?
    రాయితీలను బొందుచు ప్రభుతనుండి
    సంఘ విచ్ఛిన్న శ క్తులు సాయమొంది
    హా ష్ట లుల తిష్ట వేయుచు ననవరతము
    భరతమాతను దూషించు వారె ఘనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      ఈ సమస్యకు నేను ఆశించిన పూరణ మీనుండి వచ్చింది. చాలా సంతోషం. బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  11. దేశ సౌభాగ్యమెంచని నాశపరుడు
    భరత మాతను దూషించు|”వారె ఘనులు
    వీరముస్తాకు,హనుమంతు దారియందె
    దేశ సేవకు ప్రాణాలు తెగువ జేయ|
    2.స్వార్థ చింతన గల్గిన వాడిమనసె
    భరత మాతను దూషించు|”వారె ఘనులు
    దేశ భద్రతకై వారు దేనికైన
    లెక్కజేయనిభక్తులు|నిక్కమిదియె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సౌభాగ్యమెంచని యాశపరుడు’ అనండి.

      తొలగించండి

  12. శత్రువైన పాకిస్తాను జాతి యెపుడు
    భారతీయులెల్లరు తమ పగతురనుచు
    దలచు చుందురనెడు మాట తథ్యమచట
    భరతమాతను దూషించు వారె ఘనులు

    రిప్లయితొలగించండి
  13. పాడు బుద్ధితోడ వినుచు పరులమాట
    భారతీయులకిచ్చోట బాధలిడుచు
    పరుల సేమ మరసి మాతృ భావన వీడి
    భరత మాతను దూషించువారు ఘనులు.
    2.తల్లి తర్వాత భువియందు తల్లవంటి
    దేశ సంపదలను మోస గాళ్ళ
    కొసగి వ్యర్తంగా తిరుగుచు కుళ్ళు బుద్ధిఁ
    భరత మాతను దూషించువారు ఘనులె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణలో ‘సేవ మరచి మాతృభావన విడి’ అనండి.
      రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. మూడవపాదంలో ‘వ్యర్తం(ర్థం)గా’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
  14. బ్రతుక వచ్చిన వారల పంచఁ జేరి
    దేశసంపద దోచగ నాశ పడెడు
    పరుల సేవించి, వంచించ పాప జనులు
    భరతమాతను, దూషించు వారె ఘనులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ఆధునికమను పేరుతో అంగలార్చి
    పరుల సంస్కృతి మోజులో పరవశించె
    భరత మాతను దూషించు వారె ఘనుల
    నుచును యువకులీ దేశాన నుడుచు చుండ్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది.
      ‘నుడువుచుండ్రి’ అనండి.

      తొలగించండి