10, ఫిబ్రవరి 2016, బుధవారం

సమస్య – 1940 (కలకాలము బ్రతుకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. గురువు గారికీ, కవి/కవయిత్రి మిత్రులెల్లరులకు నమస్సుమాంజలులు

   ఇలలో నజ్ఞానుల చే
   తలు సత్ఫలమొసగ వనుటె తథ్యము, యజమా
   నుల సేవన బానిసయై
   కలకాలము బ్రతుకు జీవి గార్ధభమార్యా!

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 2. చలిపులియని భయ పడకను
  నలసట యనుమాట లేక నహరహ ములనన్
  చలియించక యజమాని దరిని
  కలకాలము బ్రతుకు జీవి గార్ధభ మార్యా .

  రిప్లయితొలగించండి
 3. ఉత్తర భారత దేశమున శీతలి దేవి కి గార్ధభము వాహనము ;

  యిల చేట చీపురన శీ
  తలి మాతగను కలరాను తరిమెను చూడన్
  నలరితివి మాత జలలిగ
  కలకాలము బ్రతుకు జీవి గార్ధభ మార్యా :)

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. మలినంపు దుస్తు లెల్లను
  తెలతెల్లగ నుతికి, మోతఁ దెమ్మనియెడు చా
  కలి వారల జీవితమున
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా!

  రిప్లయితొలగించండి
 5. అలసట యెరుగక నెప్పుడు
  పొలుపుగ పనిజేయుచుండు పూనికతోడ
  న్నిలలో బరువులు మోయుచు
  కలకాలము బ్రతుకు జీవి గార్ధభ మార్యా!!!

  రిప్లయితొలగించండి
 6. రాత్రి మా తమ్ముడు (బాబాయి కొడుకు) మరణించాడు. మా స్వగ్రామం పైడిపెల్లికి వెళ్తున్నాను. మళ్ళీ ఏ రాత్రికో తిరిగిరావడం. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 7. కలకాలము నేజీవియు
  నిలలో మరి బ్రతుకదయ్య!యెచ్చటనైన
  న్బలుకుట న్యాయమె?యిట్లుగ
  కలకాలము బ్రతుకుజీవి గార్దభ మార్యా!

  రిప్లయితొలగించండి
 8. ఇల హంసపగిది నుండగ
  వలె న ల్పపు కాలమైన పదుగురు మెచ్చన్
  కలుషాత్ముండై భువిపై
  కలకాలము బ్రతుకు జీవి గార్ద భమార్యా

  రిప్లయితొలగించండి
 9. సమస్య విలువలు మరచిన తులువలు
  అలుపెరుగని తిండి దినుచు నధికుల మనుచున్
  కలికాలపు సోమరు లై
  కలకాలము బ్రతుకు జీవిగార్దభమార్యా|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంద పద్యం లో ఉంది కదా ఛందస్సు.. మొదటి పాదం వేరుగా ఉంది మరి
   ఈశ్వరప్పగారూ.

   తొలగించండి
 10. ఎలమిని విడనాడియు చా
  కలి మోయించు బరువులను ఖరముల చేతన్
  బలముడిగి బరువు మోయుచు
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా.

  రిప్లయితొలగించండి
 11. కలికాల మందు ధర్మము
  కలదని తెలుపంగ నేమొ కరముం బ్రీతిం
  గలతం జెందక సేవల
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా.

  రిప్లయితొలగించండి
 12. కలవారికి సేవ లిడుచు
  పలు కష్టము లొంది మెలగి బానిస గానే
  నలుగుచు శ్రమము నొనర్చచు
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా.

  ఇదే సమస్య కి క్రమాలంకారము లో పూరణ

  నిలిచెడి సమయము కీర్తికి
  పలు కష్టము లెదురు పడిన భవితవ్యముకై
  పొలి కేకలు పలు వేయును
  కలకాలము / బ్రతుకు జీవి / గార్దభ మార్యా.

  రిప్లయితొలగించండి
 13. విలువగు వస్త్రములైనా
  మలినపు వసనమ్ములైన మారాడక యా
  కలి దీరినచో మోయుచు
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా.

  రిప్లయితొలగించండి
 14. 1.మలిన వస్త్రములను మంచిగా యుతుకచూ
  వీపుపైన బరువు విధిగ మోయుచు నుండి
  చాకలింటి ముందు చక్కగా తిరుగుచు
  కలకాలము బ్రతుకు జీవి గార్దభమ్ము.

  2చాకలింటనుండు చతికిల బడబోదు
  మోయునెంతొ బరువు మూపు పైన
  కాపు కాయు చుండు గడబిడ చెందక
  కలకాలము బ్రతుకు జీవి.

  రిప్లయితొలగించండి
 15. పలువుర బరువులు మోయుచు
  వలవల నోండ్రించి మోత భారమ్మవగన్
  పలుకక రాజ్యసభ నెపుడు
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా!

  రిప్లయితొలగించండి
 16. తెలియక లోకపు పోకడ
  కలలందున తేలి యాడి కన్నెల యెదుటన్
  పులకించెడు పద్యములన
  కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా

  రిప్లయితొలగించండి