జిలేబీ గారూ, మీ పూరణలో 'సంపదల నొసగు' అన్న దానికి అన్వయం లేదు. '... గనుము + ఇదియే =... గను మిదియే' అవుతుంది. మీ పూరణకు నా సవరణ.... సరసి! వదలుము చప్పున సంకటమగు పగటినిద్ర; బద్ధకము సంపదల నొసఁగు ననకు; వినవోయి సోమరితనము వలదు కనవె యిదియే కదా సృష్టిగమన మనఁగ.
పోచిరాజు సుబ్బారావు గారూ, మొదటి పాదానికి అన్వయం? మీ పూరణకు నా సవరణ... బద్ధకము కీ డొనర్చును బాల! వినుము పగటినిద్ర బద్ధకము సంపదల నొసఁగు ననుట హాస్యాస్పదమ్మగు నరయ సర్వ సంపదలను బోగొట్టు నిజము జగమున.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిఇనుప గజ్జెల తల్లినే యింపుగాను
గౌరవించుచు పిలిచెడు కార్యమనగ
పగటి నిద్ర బద్దకము, సంపదల నొసగు
యుక్తి యుక్తమైన శ్రమయేనుర్వియందు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'కార్యము లన' అనండి. అలాగే 'శ్రమయే యుర్వియందు' అనండి.
సందె వేళల నిదురించ సబబు గాదు
రిప్లయితొలగించండిపగటి నిద్రబద్ధ కము,సంపదల నొసఁగు
సంజ దీపము వెలిగించి సంత సముగ
గృహిణి చిరునవ్వు లొలికించ నహర హమ్ము
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'నిదురించ సబబె, వలదు | పగటినిద్ర... ' అనండి.
సందె వేళల నిదురించ సబబె, వలదు
తొలగించండిపగటి నిద్రబద్ధ కము సంపదల నొసఁగు
సంజ దీపము వెలిగించి సంత సముగ
గృహిణి చిరునవ్వు లొలికించ నహర హమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండిసరసి ! వదులుము చప్పున సంకటమగు
పగటి నిద్రబద్ధకము!, సంపదల నొసఁగు
తరుణి! వినవోయి సోమరి తనము వలదు
గనుము నిదియే గదా సృష్టి గమన మనగ !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణలో 'సంపదల నొసగు' అన్న దానికి అన్వయం లేదు. '... గనుము + ఇదియే =... గను మిదియే' అవుతుంది. మీ పూరణకు నా సవరణ....
సరసి! వదలుము చప్పున సంకటమగు
పగటినిద్ర; బద్ధకము సంపదల నొసఁగు
ననకు; వినవోయి సోమరితనము వలదు
కనవె యిదియే కదా సృష్టిగమన మనఁగ.
రిప్లయితొలగించండి›
బధ్ధకమునొనగూర్చును బాల!వినుము పగటినిద్ర,బధ్ధకముసంపదలనొసగు ననుటహాస్యాస్పదమగునునరయ.సంప దలనుబోగొట్టునిజముగ నిలనుసుమ్ము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమొదటి పాదానికి అన్వయం? మీ పూరణకు నా సవరణ...
బద్ధకము కీ డొనర్చును బాల! వినుము
పగటినిద్ర బద్ధకము సంపదల నొసఁగు
ననుట హాస్యాస్పదమ్మగు నరయ సర్వ
సంపదలను బోగొట్టు నిజము జగమున.
చలము నుత్సాహముం గృషి సరస మధుర
రిప్లయితొలగించండిభాషణమ్ముల నిమ్ముగ వసుధఁ బరగు
చుండ తనదరి రానీయ కుండ నున్న
పగటినిద్ర బద్ధకము సంపదల నొసఁగు.
నా శతక పద్యము:
అపరాహ్నపు తానంబులు
విపరీతపు జాప్యములును వికటపు నిద్రా
జపము పగలందు తగదు గ
ద పని వదలి పోచిరాజతనయా వినుమా
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ, శతక పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
సంజ వేళన నిదురించ సమయు సిరులు
రిప్లయితొలగించండిపనికి చేటును దెచ్చుచు ప్రజకు పెంచు
పగటి నిద్ర బద్ధకము, సంపదలనొసగు
వేగు జామున దైవమున్ వేడు కొనిన!!!
శైలజ గారూ,
తొలగించండిమీ ఫూరణ బాగున్నది. అభినందనలు.
సూర్యకాంతి చైతన్యపు స్ఫూర్తినీయ
రిప్లయితొలగించండిముందుకేగి కర్తవ్యము పూనినీవు
కర్మఁ జేయుము మానవా! కదలి!! విడువఁ
బగటి నిద్ర, బద్ధకము!, సంపదల నొసఁగు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రేయి కనులకూరుకు లేక సేయుచున్న
రిప్లయితొలగించండికార్యభారము చే యంత్ర కార్మికులకు
పగటి నిద్ర బద్ధకము, సంపదలనొసగు
నేమొ. ఆరోగ్యమకట క్షీణించు గాదె
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్య దక్షత దగ్గు,వికారమంటు
రిప్లయితొలగించండిపగటినిద్ర బద్దకము|”సంపదల నొసగు
విసుగుమానియు-విజ్ఞాన విధులయందు
స్వార్థ చింతనవిడనాడి సాగునపుడు.”
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పనినిచెరచును మనుజుల కనవరతము
రిప్లయితొలగించండిపగటినిద్ర బద్ధకము, సంపదలనొసగు
ప్రకృతి ననుసరించి తగిన పనుల జేయ
తెలిసి మెలగ వలయు నట్లు తీరుగాను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాద ఘట్టన సోకిన ప్రాణి జచ్చు
రిప్లయితొలగించండిప్రాణి జచ్చిన రాదకో పాప ములును
పాపములను బడయుటేల పనుల సేసి
పగటి నిద్రబద్దకము సంపదల నొసగు
ననుచు చెప్పెడు మూఢుడా కను మిదియును
సోమరితనమెపుడు నీకు క్షేమమవదు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిశిని జూదపానముల వివశు నకగు
రిప్లయితొలగించండిపగటినిద్ర బద్ధకము ; సంపదల నొసఁగు
సమయపాలన సద్గోష్టి సాధనమున
నిత్య కృత్య ములొనరించ, సత్యమిదియె
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పగటివేళలందలయక పనుల నెల్ల
రిప్లయితొలగించండిచేయుచుండ వలెను గాని వడలి పోయి
పగటినిద్ర బద్దకము;సంపదలొసగు
గాదె కన్నయ్య గాథలన్ గడుపు చుండ.
పనుల యందును యాసక్తి పడిపోవు
పగటి నిద్ర బద్దకము;సంపదలనొసగు
పొద్దు పొడుపున చేసెడి పూజలెల్ల
సత్ఫలితముల నొసగును సత్యమిదియె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలలోనూ అన్వయలోపం ఉన్నది. సవరించండి.