తే.గీ.వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరుఏమి? వృషభము!?, యాంబోతు!?, ఎద్దు ఎద్దు దాక్కొ. దాగుడు మూతల దాండ యాడెనెద్దు బుజ్జాయి ముచ్చట నెంతొ మెచ్చి- వెంకోరా.
వెంకోరా గారూ, (వెంపటి కోదండ రామయ్య కాదు కదా!)మీ పద్యం బాగున్నది. ‘పేరు+ఏమి’ అని విసంధిగా వ్రాయరాదు. ‘పేర|దేమి’ అనవచ్చు. ‘వృషభము+ఆంబోతు’ అన్నపుడు యడాగమం రాదు. ‘వృషభమ? యాంబోత?’ అనండి. ‘దాక్కొ’ అనడం వ్యావహారికం. ‘దాండ’..?
కంది శంకరయ్య గారూ,మీ సూచనలను పాటిస్తానండీ. ధన్యవాదములు.
1.పసిదాని ప్రేమ గాంచినవృషభమ్మైనను మురియుట వింతే గదరా!మసిబారని మమతల కిదిసిసలైన యుదాహరణపు చిత్రము యిదియే2.పసిదానిపైన మక్కువపశువైనను వృషభమునకు వాసిగ కలిగెన్ విసరక కొమ్ముల నదియునుపసిప్రేమకు బానిసయ్యి పరవశమొందెన్
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యంలో ‘చిత్రము+ఇదియే’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘చిత్ర మ్మిదియే’ అనండి.
మాయింటన మాలక్ష్మీమూయించిననీ కనులన ముందర గనుమామాయింటి రమాలక్ష్మినిఈ యింపగు దృశ్యమునకు ఈడును గలదే ?
జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. ‘మా యింటను’ అనండి. ‘లక్ష్మిని ఈ’ అని విసంధిగా వ్రాశారు.
ఇసుమంత భయము లేకను పసిదేమో మోద మంది పరుగున వచ్చెన్ కసితీరగ యజమానులు విసిగించగ మాకు మెరుపు విరిసిన ముద్దే
రాజేశ్వరి అక్కయ్యా,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొమ్మును విసరకుమమ్మా ఉమ్మా యని ముద్దునిడుచు నున్నది నీకే అమ్మా యిదిగో మాతా అమ్మాయే ముదముమీరినది గోమాతా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పాలిచ్చి పెంచుచున్ మురిపాలను కలబోసినంత వాత్సల్యముతోలాలించు తల్లి నీవనిగోలమరచె! పాపముద్దుఁ గొను గోమాతా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
విమల ధవళ తనురుచి ప్రభశమక్షమగుణజిత ధరణి సౌరభ వరునిన్నమితానురాగ మొప్పగసుమ మృదునిభ తను కుమారి చుంబన మాడెన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కామేశ్వర రావు గారూ, లక్ష్మీదేవి గారి ప్రశంసను చూచేదాక మీ పద్యంలో ‘సర్వలఘుత్వాన్ని’ పరిశీలించాను. లఘు బాహుళ్యమే కాని సర్వలఘువు కాదు. అయినా మనోహరంగా ఉంది.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. లక్ష్మీదేవి గారి వ్యాఖ్య చూచేవరకు నేను గమనించలేదు. సహజముగ వచ్చిన వే యా లఘువులనన్ని.
›చిత్రమందునజూడుడుచిత్రముగను నావుముఖమునుగట్టిగానదిమిపట్టి పెట్టుచుండెనుముద్దునుబిల్లయొకతె యాహ!జోహార్లునాయవియందజేయ కోరుచుంటినిగురువులగూర్మితోడ
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కామేశ్వరరావు గారి సర్వ 'లఘు' ప్రయత్నము బాగున్నది.
లక్ష్మీదేవి గారూ ధన్యవాదములు. అది యప్రయత్నంగా వచ్చినది. అనుకోలేదు.
గోమాత! నన్ను గావుమ!నామాతయె నన్ను విడచె నమాంతముగన్ భూమాత కరుణ జూపగ నేముండును కష్ట తతులు నీకున్నాకున్ ?
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోమాత యింటనుండగ శ్రీ మహ లక్షుమి కొలువగు రీతి శుభము, యామోమున ముద్దిడు బాలయుతా ముదమందుచు నిలిచెను, తన్మయమగుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లక్ష్మీదేవి గారూ మీ పద్యము మనోహరముగనున్నది. “లక్ష్మియ” అంటే బాగుంటుందేమో? శ్రీ మహా యని యనవలెను గదా!
“శ్రీమద్వైభవరమానిషేవితమౌ యా ...” అనిననెట్లుండును?
ఓపికతో మీరిచ్చిన సూచనకు ధన్యవాదాలు.మహా అనవలసి ఉంది. నిజమే. మీ సవరణ బాగుంది. కానీ సంస్కృత పదాలు వాడగలిగేంతగా తెలియవు నాకు.(తెలుగూ అంతేననుకోండి. కొంచెమయినా తెలుస్తుంది.)గోమాత యింటనుండగ నేమిక కొదువ? సిరులింక హెచ్చును, కాదా?మోమున ముద్దిడు బాలయుతా ముదమందుచు నిలిచెను, తన్మయమగుచున్.
లక్ష్మీదేవి గారూ తేటతెలుగులో మీసవరణ చక్కగ నున్నది. అభినందనలు.
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. ‘మహలక్షుమి(క్ష్మి)’ అనడం దోషమే. కామేశ్వర రావు గారి సూచన, మీ సవరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
పాప మమతలు గ్రహియించె –పసువుమనసుఆడపిల్లని నలుసుగా చూడలేదు|ముద్దుముచ్చట మురిపాలు ముంచివేయ?బంధమన్నది బహువిధ గంధమాయె|2.చిన్నిపాపవు నీవిట యెన్నుకొన్నఎద్దుజేరియు ముద్దాడ సిద్దబడగ?“మమత మాధుర్య మన్నదిమనకు దెలుపతలను దించెను దేవతే నిలిచె ననుచు| {ఎద్దుకున్నగొప్పతనము}
2ఎద్దు-పాపమూగభావనదాగుడు మూతలెందులకు దగ్గరజేరిన చిన్నిపాప|నామూగమనస్సు గుర్తెరిగి ముద్దులు బంచెడి మాతవే గదా?సాగెడి జీవితాన మనసన్నది యెక్కడ?పాపనేర్పులోఆగక సేధ్యసాధన-ప్రయాసల యందున ఎద్దుకూర్పులో|
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
దూడయె దూరం బయ్యెన!తోడుగ నేనుంటి నీకు తోయకు మమ్మాచూడుము ముద్దిడు చుంటినియేడవకిక పెయ్య కొరకు యెప్పుడు సుమ్మీ!
మాన్యులు శంకరయ్యగారికి నమస్సులు. నాపద్యం రెండవ పాదంలో గణదోషం దొర్లింది.సరిచేసి పంపుతున్నాను."--------------"""""----------గోమాత!నన్ను గావుమనామాతయె నన్ను విడచె జ్ఞానములేకన్ భూమాత కరుణ జూపగనేముండును కష్ట తతులు? నీకును నాకున్ ?
కొమ్ములు బారెడు గలిగిననమ్మడి ప్రేమకదిబంధి యయ్యెను గాదేరొమ్మున గుమ్మెడు పసరమెకమ్మని ప్రేమసుధగ్రోల గనినను వింతే
పసిపాప ప్రేమఁజూపగపశువే యైనను మురియుచు వదనము వంచన్పసికూన ముద్దులిడగనెకసవును మేయుటను విడిచి కరుణను చూపెన్.పాప ప్రేమ తోడ పశువు చెంతకురాగవిసరకుండ కొమ్ము వృషభమపుడుపాప చేష్టితముల బాగుగా గమనించుతీరు గనగ మదికి తృప్తి గల్గె.
ఇరువురకూ ధన్యవాదములు. నమస్కారములు.
తే.గీ.
రిప్లయితొలగించండివీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు
ఏమి? వృషభము!?, యాంబోతు!?, ఎద్దు ఎద్దు
దాక్కొ. దాగుడు మూతల దాండ యాడె
నెద్దు బుజ్జాయి ముచ్చట నెంతొ మెచ్చి
- వెంకోరా.
వెంకోరా గారూ, (వెంపటి కోదండ రామయ్య కాదు కదా!)
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘పేరు+ఏమి’ అని విసంధిగా వ్రాయరాదు. ‘పేర|దేమి’ అనవచ్చు. ‘వృషభము+ఆంబోతు’ అన్నపుడు యడాగమం రాదు. ‘వృషభమ? యాంబోత?’ అనండి. ‘దాక్కొ’ అనడం వ్యావహారికం. ‘దాండ’..?
కంది శంకరయ్య గారూ,
తొలగించండిమీ సూచనలను పాటిస్తానండీ. ధన్యవాదములు.
1.
రిప్లయితొలగించండిపసిదాని ప్రేమ గాంచిన
వృషభమ్మైనను మురియుట వింతే గదరా!
మసిబారని మమతల కిది
సిసలైన యుదాహరణపు చిత్రము యిదియే
2.
పసిదానిపైన మక్కువ
పశువైనను వృషభమునకు వాసిగ కలిగెన్
విసరక కొమ్ముల నదియును
పసిప్రేమకు బానిసయ్యి పరవశమొందెన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘చిత్రము+ఇదియే’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘చిత్ర మ్మిదియే’ అనండి.
మాయింటన మాలక్ష్మీ
రిప్లయితొలగించండిమూయించిననీ కనులన ముందర గనుమా
మాయింటి రమాలక్ష్మిని
ఈ యింపగు దృశ్యమునకు ఈడును గలదే ?
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘మా యింటను’ అనండి. ‘లక్ష్మిని ఈ’ అని విసంధిగా వ్రాశారు.
ఇసుమంత భయము లేకను
రిప్లయితొలగించండిపసిదేమో మోద మంది పరుగున వచ్చెన్
కసితీరగ యజమానులు
విసిగించగ మాకు మెరుపు విరిసిన ముద్దే
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొమ్మును విసరకుమమ్మా
రిప్లయితొలగించండిఉమ్మా యని ముద్దునిడుచు నున్నది నీకే
అమ్మా యిదిగో మాతా
అమ్మాయే ముదముమీరినది గోమాతా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పాలిచ్చి పెంచుచున్ మురి
రిప్లయితొలగించండిపాలను కలబోసినంత వాత్సల్యముతో
లాలించు తల్లి నీవని
గోలమరచె! పాపముద్దుఁ గొను గోమాతా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
విమల ధవళ తనురుచి ప్రభ
రిప్లయితొలగించండిశమక్షమగుణజిత ధరణి సౌరభ వరుని
న్నమితానురాగ మొప్పగ
సుమ మృదునిభ తను కుమారి చుంబన మాడెన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిలక్ష్మీదేవి గారి ప్రశంసను చూచేదాక మీ పద్యంలో ‘సర్వలఘుత్వాన్ని’ పరిశీలించాను. లఘు బాహుళ్యమే కాని సర్వలఘువు కాదు. అయినా మనోహరంగా ఉంది.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. లక్ష్మీదేవి గారి వ్యాఖ్య చూచేవరకు నేను గమనించలేదు. సహజముగ వచ్చిన వే యా లఘువులనన్ని.
తొలగించండి
రిప్లయితొలగించండి›
చిత్రమందునజూడుడుచిత్రముగను నావుముఖమునుగట్టిగానదిమిపట్టి పెట్టుచుండెనుముద్దునుబిల్లయొకతె
యాహ!జోహార్లునాయవియందజేయ కోరుచుంటినిగురువులగూర్మితోడ
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కామేశ్వరరావు గారి సర్వ 'లఘు' ప్రయత్నము బాగున్నది.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ ధన్యవాదములు. అది యప్రయత్నంగా వచ్చినది. అనుకోలేదు.
తొలగించండిగోమాత! నన్ను గావుమ!
రిప్లయితొలగించండినామాతయె నన్ను విడచె నమాంతముగన్
భూమాత కరుణ జూపగ
నేముండును కష్ట తతులు నీకున్నాకున్ ?
గోమాత! నన్ను గావుమ!
రిప్లయితొలగించండినామాతయె నన్ను విడచె నమాంతముగన్
భూమాత కరుణ జూపగ
నేముండును కష్ట తతులు నీకున్నాకున్ ?
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోమాత యింటనుండగ
రిప్లయితొలగించండిశ్రీ మహ లక్షుమి కొలువగు రీతి శుభము, యా
మోమున ముద్దిడు బాలయు
తా ముదమందుచు నిలిచెను, తన్మయమగుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిలక్ష్మీదేవి గారూ మీ పద్యము మనోహరముగనున్నది. “లక్ష్మియ” అంటే బాగుంటుందేమో? శ్రీ మహా యని యనవలెను గదా!
తొలగించండి“శ్రీమద్వైభవరమానిషేవితమౌ యా ...” అనిననెట్లుండును?
తొలగించండిఓపికతో మీరిచ్చిన సూచనకు ధన్యవాదాలు.
తొలగించండిమహా అనవలసి ఉంది. నిజమే.
మీ సవరణ బాగుంది. కానీ సంస్కృత పదాలు వాడగలిగేంతగా తెలియవు నాకు.(తెలుగూ అంతేననుకోండి. కొంచెమయినా తెలుస్తుంది.)
గోమాత యింటనుండగ
నేమిక కొదువ? సిరులింక హెచ్చును, కాదా?
మోమున ముద్దిడు బాలయు
తా ముదమందుచు నిలిచెను, తన్మయమగుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిలక్ష్మీదేవి గారూ తేటతెలుగులో మీసవరణ చక్కగ నున్నది. అభినందనలు.
తొలగించండిలక్ష్మీదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది.
‘మహలక్షుమి(క్ష్మి)’ అనడం దోషమే. కామేశ్వర రావు గారి సూచన, మీ సవరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
పాప మమతలు గ్రహియించె –పసువుమనసు
రిప్లయితొలగించండిఆడపిల్లని నలుసుగా చూడలేదు|
ముద్దుముచ్చట మురిపాలు ముంచివేయ?
బంధమన్నది బహువిధ గంధమాయె|
2.చిన్నిపాపవు నీవిట యెన్నుకొన్న
ఎద్దుజేరియు ముద్దాడ సిద్దబడగ?
“మమత మాధుర్య మన్నదిమనకు దెలుప
తలను దించెను దేవతే నిలిచె ననుచు| {ఎద్దుకున్నగొప్పతనము}
2ఎద్దు-పాపమూగభావన
రిప్లయితొలగించండిదాగుడు మూతలెందులకు దగ్గరజేరిన చిన్నిపాప|నా
మూగమనస్సు గుర్తెరిగి ముద్దులు బంచెడి మాతవే గదా?
సాగెడి జీవితాన మనసన్నది యెక్కడ?పాపనేర్పులో
ఆగక సేధ్యసాధన-ప్రయాసల యందున ఎద్దుకూర్పులో|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
దూడయె దూరం బయ్యెన!
రిప్లయితొలగించండితోడుగ నేనుంటి నీకు తోయకు మమ్మా
చూడుము ముద్దిడు చుంటిని
యేడవకిక పెయ్య కొరకు యెప్పుడు సుమ్మీ!
మాన్యులు శంకరయ్యగారికి నమస్సులు. నాపద్యం రెండవ పాదంలో గణదోషం దొర్లింది.సరిచేసి పంపుతున్నాను.
రిప్లయితొలగించండి"--------------"""""----------
గోమాత!నన్ను గావుమ
నామాతయె నన్ను విడచె జ్ఞానములేకన్
భూమాత కరుణ జూపగ
నేముండును కష్ట తతులు? నీకును నాకున్ ?
కొమ్ములు బారెడు గలిగిన
రిప్లయితొలగించండినమ్మడి ప్రేమకదిబంధి యయ్యెను గాదే
రొమ్మున గుమ్మెడు పసరమె
కమ్మని ప్రేమసుధగ్రోల గనినను వింతే
పసిపాప ప్రేమఁజూపగ
రిప్లయితొలగించండిపశువే యైనను మురియుచు వదనము వంచన్
పసికూన ముద్దులిడగనె
కసవును మేయుటను విడిచి కరుణను చూపెన్.
పాప ప్రేమ తోడ పశువు చెంతకురాగ
విసరకుండ కొమ్ము వృషభమపుడు
పాప చేష్టితముల బాగుగా గమనించు
తీరు గనగ మదికి తృప్తి గల్గె.
ఇరువురకూ ధన్యవాదములు. నమస్కారములు.
రిప్లయితొలగించండిమాన్యులు శంకరయ్యగారికి నమస్సులు. నాపద్యం రెండవ పాదంలో గణదోషం దొర్లింది.సరిచేసి పంపుతున్నాను.
రిప్లయితొలగించండి"--------------"""""----------
గోమాత!నన్ను గావుమ
నామాతయె నన్ను విడచె జ్ఞానములేకన్
భూమాత కరుణ జూపగ
నేముండును కష్ట తతులు? నీకును నాకున్ ?