9, ఫిబ్రవరి 2016, మంగళవారం

పద్యరచన - 1166

కవిమిత్రులారా,
“నాపతి యిట కరుదెంచును...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగించి మీకు తోచిన అంశంపై పద్యాన్ని వ్రాయండి.

45 కామెంట్‌లు:

 1. నాపతి యిట కరుదెంచును
  నీపంతము వీడి పొమ్ము నిన్నెన్నడొ నా
  జ్ఞాపకముల నుండి తుడిచి
  నాపతినే నిల్పుకొంటి నాహృదయములోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. నాపతి యిటకరు దెంచును
  మాపటి వేళన విరిసిన మల్లెలు దెచ్చున్
  నాపూర్వపుణ్య ఫలమే
  రూపములోన నలకూబరుని మించెనటన్

  రిప్లయితొలగించండి
 3. నాపతి యిట కరుదెంచును
  నీపంచను జేరుట కది నేర మటంచున్
  కాపాడగ మనప్రేమకు
  శాపము గావించ కుండ సైరించు మదిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగుంది కాని కొంత భావం కొంత గందరగోళంగా ఉంది.

   తొలగించండి
  2. ఇప్పుడు పరదారగా నిన్ను జేరడం మంచిది కాదుగనుక మనసుని సరిదిద్దుకుని సంసారాలు చిన్నం కాకుండా అదిఒక మధుర స్మృతిగా ఉండి పోవాలి అని

   తొలగించండి
 4. శుభోదయం !

  నా పతి యిట కరుదెంచును
  నా పని బట్టుటకు నిజము నయ్యరొ వినరే !
  కోపము తోడను జూచుచు
  పాపము కందము నెరుగని పాఱుఁడు గానన్ :)

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. అశోక వనంలో హనుమంతునితో జానకీమాత:
  నాపతి యిట కరుదెంచును
  శాపమ్ములు తొలఁగు రోజు సతిఁ జేబట్టన్!
  కైపున సత్యము మరచిన
  ద్వీపమ్మున రావణు వధ దీటుగఁ జేయన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. అశోకవనిలో సీత హనుమతో...

  నాపతి యిట కరుదెంచును
  నీపయి నమ్మకము పావనీ ! జడబిళ్ళన్
  నాపతికిమ్మా గుర్తుగ
  నీ పతితులు రావణాదులే చత్తురుగా !

  రిప్లయితొలగించండి
 7. నాపతియిటకరుదెంచును
  నీపాలిటకాలుడౌను నిజముగ నీప్రే
  లాపన నీచము కీచక
  పాపపుకోరికయెనీకు ప్రాణాoతకమౌ !!!

  రిప్లయితొలగించండి
 8. నాపతి యిట కరుదెంచును
  తా పుత్రుని నన్ను గాంచి తమి దీరగ నన్
  కాపురముకు గొంపోవును
  రా! పాపాయని శకుంతల సుతుని నిమిరెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. నాపతియిటకరుదెంచును
  నాపాపను నన్నుజూడ నమ్ముము లక్ష్మీ!
  యీపూటకిచట నుండుచు
  మాపటికిన్నేగుమధుర మమ్ములగొనుచున్

  రిప్లయితొలగించండి
 10. నాపతి యిటకరుదెంచును
  మాపటివేళకు దహించు మారుని కతనన్
  సాపాటు వండవలయును
  శ్రీపతి! వెచ్చముల దెమ్ము శీఘ్రమ్మిటకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. నాపతి యిట కరుదెంచును
  పాపాత్ముల రక్కసుల సబాంధవ సఖులం
  దాపస వర ఘాతకుల
  న్నా పృథివీపతి సుతుండు హత మార్చంగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. పద్యరచన నాపతి యిట కరుదెంచును
  కోపమ్మునగొట్టివచ్చె గుడిలో జేరున్
  హే పరమేశా గలుపుము
  నీపై భారమ్ము వేతు నిందలుబడకన్ {త్రాగుబోతు భార్యా భర్తలఅనుబంధం}  రిప్లయితొలగించండి
 13. అన్నయ్యగారూ నిన్నటి పద్యాలను చూడరూ
  1.అంగడందు వున్న యన్నివస్తువులను
  వదలి మర్కటమ్ము పట్టె పత్రి
  కొకటి చూడ చూడ కోతి చేష్టలివియే
  గాంచరండు జనులు కన్నులార.
  2.కంటికింపుగ నగుపించు కదళి ఫలము
  వదలి వార్తలు చదివేటి వానరమును
  గాంచ నచ్చెరువు మదికి గలుగు గాదె
  నలువ సృష్టియందున్నట్టి నవ్యతిదియె.

  నేటి పద్యము
  నాపతి యిటకరుదెంచును
  నాపాలిటి దైవమతడెనాకీ బ్రతుకున్
  సాఫల్యము చేసినరమా
  పతి వవిశము గొలుతును మదిలో నెపుడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ అన్ని పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   నేటి పద్యంలో నాల్గవపాదం మొదటి అక్షరం మూడవపాదం చివర చేరింది.

   తొలగించండి
 14. (దాక్షాయణి తన జనకునితో సంభాషణ)

  నాపలుకులు విను తండ్రీ,
  పాపము గొని తేవలదని ప్రార్థన జేతున్
  నాపతి యిట కరుదెంచును
  కోపము బూనక వినతిగ కోరిన మీదన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పి.యస్.ఆర్. మూర్తి గారూ,
   మీ పద్యం బాగున్నది.
   కాని ‘నాపతి యిట...’ అన్నది ప్రద్యప్రారంభమన్న నియమాన్ని మీరు గుర్తించనట్టున్నారు.

   తొలగించండి
 15. నా పతి ఇట కరుదెంచును
  ఓప గలేక విరహమును యొంటరి తానున్
  “నా పని ముగిసిన యంతనె
  మాపటికిని రాగల”నని మాటను పంపెన్.

  నాపతి ఇట కరుదెంచును
  కోపముతో వెడలితినని క్షోభను పడతూ
  రేపటి వరకూ ఆగక
  మాపటికే వచ్చు నిజము మన్నించియు నన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేను మీకు వ్రాశానండీ. మీరు మెయిల్ మెసేజ్ చూసుకున్నట్టు లేదు భానుమతిగారూ!

   తొలగించండి
  2. మంథా భానుమతి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి.
   మొదటి పద్యంలో ‘విరహమును+ఒంటరి’ అని విసంధిగా వ్రాశారు. ‘విరహమున నొంటరి తానై’ అనండి.
   రెండవ పద్యంలో ‘పడుతూ, వరకూ’ అనడం గ్రామ్యం. ‘పడుచున్| రేపటివర కాగక యీ| మాపటి...’ అనండి.

   తొలగించండి
  3. ఎక్కడ వ్రాశారు? కనిపించడం లేదు లక్ష్మిగారూ.

   తొలగించండి
  4. నా పతి ఇట కరుదెంచును
   ఓప గలేక విరహమున నొంటరి తానై
   “నా పని ముగిసిన యంతనె
   మాపటికిని రాగల”నని మాటను పంపెన్.

   నాపతి ఇట కరుదెంచును
   కోపముతో వెడలితినని క్షోభను పడుచున్
   రేపటి వరకాగక యీ
   మాపటికే వచ్చు నిజము మన్నించియు నన్.

   తొలగించండి
 16. నాపతి యిటకరు దెంచును
  శ్రీపతియై జగమునేలు శ్రీహరి; "మీరా
  నా పదముల కీర్తించెడు
  నీ పదముల వింటి"ననుచు నిక్కము సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 17. నాపతి యిట కరుదెంచును
  పాపాత్ముడ రావణుండ స్వర్గతి మూడెన్
  శ్రీపతి కెదురుగ నిలచిన
  నీ పది తలలెగిరి పడును నిక్కము మూర్ఖా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘స్వర్గతి’...?

   తొలగించండి
  2. శ్రీ శంకరయ్య గురువరులకు ప్రణామములు
   స్వర్గతి = చావు అని ఆచార్య బి యన్ రెడ్డి పర్యాయ పదకొశములో రాయబడినది
   ధన్యవాదములు

   తొలగించండి
 18. నాపతి యిటకరు దెంచును
  కోపము తోనిల్లు వీడి కొండ్రల యందున్
  కాపురమే పెట్టినతడు
  తాపము లకు తాళలేక తనమది మారెన్

  రిప్లయితొలగించండి
 19. ఖడ్గతిక్కన భార్య జానమ్మ ఉవాచ:

  నాపతి యిట కరుదెంచును
  వాపసుగా పోరు నోడి వణకుచు నహహా!
  ఆ పసుపును కుంకుమలను
  దాపున నొక నులకశయ్య దయచేయత్తా!!!

  రిప్లయితొలగించండి
 20. నాపతి యిట కరుదెంచును
  కోపముతో నత్త తోడ కొట్టగ నన్నున్...
  వేపది బెత్తము పెరుకుచు
  తాపును తీయగ వడివడి తన్నుకు చచ్చున్

  రిప్లయితొలగించండి