3, ఫిబ్రవరి 2016, బుధవారం

పద్యరచన - 1161

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

33 కామెంట్‌లు:

 1. మగవాడు మృగాడనుచును
  పగ బట్టిన పడతు లెల్ల వచి యించిరిపో
  మగ వాడును మగ వాడికె
  పగవాడిగ మారె నయ్యె బతుకగ నెట్లో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   చమత్కారంకోసం పత్రికలు వాడే పదం ‘మృగాడు’. ‘మగవాడు మృగ మ్మనుచును’ అనండి.

   తొలగించండి
 2. ఇవ్వాళ శుభోదయం చెప్పాలా కూడదా :)

  నీవేరా దుర్మార్గుడ నీవల్లన నేరా
  మావీ మీవీ యెల్లర మానమ్ములు పోయే
  కావీ రోజా పుష్పము కాలమ్ములు కావే
  చావేరా నీకు బ్రహ్మచారీ గతిగా నన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   ఇవాళ శుభోదయం ఎందుకు చెప్పకూడదు?
   విశేష వృత్తాలను వ్రాస్తున్నందుకు సంతోషం!
   మీ పద్యం ‘మత్తమయూర’మై నర్తించి ఆనందాన్నిచ్చింది. బాగుంది. అభినందనలు.
   ‘మావీ, మీవీ, కావీ’ అని వ్యావహారికాలను ప్రయోగించారు.

   తొలగించండి
 3. నాలుగు గోడల మధ్యన
  వేళ్ళను జూపెట్టి దాడి భీతిని గొల్పన్
  బాలుడు దు:ఖము నొందుచు
  లీలగ దప్పించు కొనగ లేదే దారిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అబినందనలు.

   తొలగించండి
  2. చేయగూడని పనియేదొ చేసెనేమొ
   తనదుచేతులు నోటికిదగ్గరునిచి
   సాటి వారలు వ్రేళ్లను జాపిచూప
   నేడ్చుచుండెను జూడుమ యెవడొగాని?

   తొలగించండి
  3. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. పలువురు వ్రేళ్ళను జూపుచు
  పలువిధముల తూలనాడు బ్రతుకెందుకనీ
  విలపించ నేమి లాభ
  మ్మిలపయి మను సజ్జనుండ వీవై నరుడా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. పద్యరచన కళ్ళు మూసుకున్న? గనుపించు నీతప్పు
  మనసు జెప్పినట్లు మసలుకొనక
  ఆశ ఆశయాలు నత్యాసగామార్చ?
  తప్పునిప్పులాగ తననెగాల్చు.
  2.ఆరుచేతులు నినుజూచి పోరుసలుప?
  రెండు హస్తాల కౌనటే కండలున్న?
  తప్పు జేసిన మోమును గప్పుకున్న
  ఫలిత ముండున?పాపమ్ము గట్టుకొనుటె.
  3.తప్పులు జేయుటేల?పరితాపము నందున గ్రుంగుటేల?నీ
  గొప్పను గూల్చుటేల?తన కుత్చిత బుద్దినిమార్చవేల?ఈ
  ముప్పును గప్పుటేల?గన మూలము నెంచక నుందువేలకో?
  అప్పుల నిప్పులో బడిన? హాయిగ చేతులుగప్పదీరునా?

  రిప్లయితొలగించండి
 6. శ్రీ గౌర వీయులైన గురువర్యులు కంది శంకరయ్యగారికి వందనాలతోతమరునిన్నటిరోజు కె = అనగా?
  కె=కవులూరుఅనితెలియ జేయడమైనది.

  రిప్లయితొలగించండి
 7. తప్పుజేసి నీవు తప్పించుకోలేవు
  శిక్ష పడుట మిగుల శ్రేయమగును
  జీవితాన నెపుడు చేయకుమిట్టుల
  భరత జాతి మనది మరువ వలదు !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. రిప్లయిలు
  1. అరిషడ్వర్గములు భయం
   కరాకృతిని దాల్చ ఘోరకర విహ్వలతం
   గరముం భీతిలి యాతడు
   కరాంగుళీసుముకుళిత ముఖార్తుం డయ్యెన్

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. కామేశ్వరరావుగారి పద్యం చాలా బాగుంది.వారికి అభినందనలు.

   తొలగించండి
  4. చేయరాని తప్పిదములఁజేసి, నేడు
   దుష్టుడవటంచు పదుగురు దూరుచుండ
   మూసికొంటివి చేతుల ముఖముచచ్చి
   శిక్షతప్పునా చేసిన చెడ్డపనికి

   తొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  6. వేంకట సుబ్బ సహదేవుడు గారూ నా పద్యము మీకు నచ్చినందుకు,మీ ప్రశంసకు ధన్యవాదములు.

   తొలగించండి
 9. నిన్నటి చిత్రానికి వ్రాసినపద్యమొకపరి తిలకించండిఅన్నయ్యగారూ.
  ఆడపిల్లలాడు నపురూపమైనట్టి
  ఆట యిదియె గనుడు యవని యందు
  కుంటిబిల్లియాట కూరిమితో నాడ
  హర్షమొదవు గాదె నందరకును.
  నేటి చిత్రానికి వ్రాసిన పద్యము:
  నలుగురొకట చేరి నాల్గుమాటలనాడ
  మోము చూపలేక ముడుచుకొనుచు
  గోడుగోడునుచును కుములుచుండెను తాను
  కరము యేడ్చుచుండె కనులు మూసి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   నిన్నటి పద్యంలో ‘...గనుడు+అవని’ అన్నపుడు యడాగమం రాదు. ‘...గాంచు డవనియందు’ అనండి. అలాగే ‘...గాదె+అందరకును’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘..గాదె యందరకును’ అనండి.

   తొలగించండి
 10. మానవతను వీడి మానిని వంచించి
  కట్నమాశ తోడ గలికిజంపి
  వ్యసన పరుడవైన వ్యర్థుడా నిన్నింక
  తాళలేము నీకు జైలు మేలు.

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. తప్పొప్పుల నెంచుచు మును
   పొప్పగు పనిజేసినంత మోముఁ గరములన్
   గప్పుకొనెడు దురవస్థలుఁ
   దప్పును! వ్రేళెత్తి చూపఁ దరమే ప్రజకున్!

   తొలగించండి
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. ఒక్కవ్రేలేచూపెను
  ఒక్కొక్కరిగా నెపములు ఎంచగ నిన్నూ
  బక్కోడినిచూసిననన్
  లెక్కనె సేయరు కడలిలొ లెస్సగ కృష్ణా

  గోగులపాటి కృష్ణమోహన్

  రిప్లయితొలగించండి
 13. కృష్ణమోహన్ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఒక్కవ్రేలే’ అన్నచోట గణదోషం. ‘ఒక్కొక వ్రేలే’ అనండి. రెండవపాదంలో యతి తప్పింది. ‘ఒక్కోడిని’ అనడం వ్యావహారికం. ‘ఒక్కొక్కడినే చూసిన’ అనండి. ‘కడలిలొ’ అన్నచోట ‘లో’ అనే ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. ‘కడలిని’ అంటే సరి. మీ పద్యం సవరణలతో....
  ఒక్కొక వ్రేలే చూపిన
  దొక్కొక్కరిగా నెపముల నొరయగ నిన్నున్
  ఒక్కొక్కడినే చూచిన
  లెక్కనె సేయరు కడలిని లెస్సగ కృష్ణా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఓపికకు ధన్యవాదాలు
   మేము సహస్రకవులు అనే ఒక గ్రూపును నడిపిస్తున్నాము. మీరు కూడా మాగ్రూపులో సభ్యులు కావాలని, మాకు మార్గదర్శము ఇవ్వాలని కోరిక.

   తొలగించండి