24, ఫిబ్రవరి 2016, బుధవారం

పద్యరచన - 1174

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

40 కామెంట్‌లు:

 1. పాదము లొత్తుట లేదని
  వేదన పడుచుంటి వేమొ వేంకట రమణా ?
  సాదరముగ యోచించుము
  భేదము లేదంట నీవె బీరము నుండన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'భేదము లేదంట నీకు పితృదేవులకున్' అంటే బాగుంటుంది.

   తొలగించండి
  2. పాదము లొత్తుట లేదని
   వేదన పడుచుంటి వేమొ వేంకట రమణా ?
   సాదరముగ యోచించుము
   భేదము లేదంట నీకు పితృదేవులకున్

   తొలగించండి
 2. పరమ శివునికన్న పాండు రంగని కన్న
  . తల్లిదండ్రులె మిన్న ధరణియందు
  వారిసేవను మించి కోరను నేనేమి
  . పాదసేవవిడను పరమ పురుష
  మన్నింపు మంటినీ మాధవా! వృద్ధుల
  . నిద్రభంగము జేయ నీకు తగదు
  పితృదేవతలువీరు పేర్మితో గొలచిన
  . పరమపదము దక్కుపాపహరము

  మాతృ సేవ మించి మాధవార్చనలేదు
  తండ్రి సేవకన్న ధర్మమేది?
  భక్తి తొడ వారి పాదసేవను జేయు
  వేళ యందు నన్నుపిలువ నేల?

  రిప్లయితొలగించండి
 3. నామాల సామి!నిటు నాకము వదిలివచ్చె ?
  మామాట వినుమోయి! మాతా పితరులొచ్చె
  వారికిని పాదములు వాడి పోయి యుండెర !
  వారి సేవజేసెద, వత్తును చిటికెన దరి

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం ఛందస్సు ఏమిటి?
   'సామి యిటు'అనండి. 'వచ్చె' ను 'ఒచ్చె' అనడం గ్రామ్యం. చివరి పాదంలో గణదోషం అని అనుమానం. 'సేవ జేసెదను' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. జిలేబి గారు “ద్విరదగతిరగడ” ఛందస్సు లో మీ పద్యము చాలా బాగుంది. 5 మాత్రల గణములుండవలెనన్న నియమము లో “జల” వాడారు బాగుంది. కానీ అది చంద్రగణాలలో లేదు. అంత్య ప్రాస లో కూడా యనుమానముంది. అయినా సమ్మతమేనేమో. తెలియదు. మంచి ప్రయోగము చేశారు. మీకు నా అభినందనలు.

   తొలగించండి
  3. కంది వారు/కామేశ్వర రావు గారు !

   నెనరస్య నెనరః !

   ఫోటో చూడగా నే నామాల మా సామి కనబడె ;

   ఆహా ! మా ఏడు కొండల మా సామి అనుకుని

   ఫ్లో లో రాస్తే ఎనభై పైబడి ద్విరద గతి రగడ అని ఛందస్సు సాఫ్టు జెప్పే ! సరే అని అట్లాగే దాని ప్రకారం ప్రాస సరి జేసి వేసా ! ఛందస్సు సాఫ్టు ప్రకారం ఓకే ! కానీ సరి యో కాదో తెలియదు !

   చీర్స్
   జిలేబి

   తొలగించండి

  4. సరి జేసినది

   నామాల సామి!నిటు నాకము వదిలివచ్చె ?
   మామాట వినుమోయి! మాతా పితరులొచ్చె
   వారికిని పాదములు వాడి పోయి యుండెర !
   వారి సేవయుజేసి, వత్తును చిటికెన దరి

   తొలగించండి

 4. హరి !నా మాతా పితరుల
  చరణపు సేవను ముగించి చట్టున వత్తున్
  జర వేచియుండు స్వామీ !
  చరణపు సేవన నిదియును చరణము లేరా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండవ పద్యం బాగున్నది.
   'జర' అన్యదేశ్యం. చివరి పాదంలో అన్వయం లోపించినట్లున్నది.

   తొలగించండి

 5. నీ పదపూజయు జేతుర
  యీ పద సేవ తరువాయి యిచ్చట సామీ
  యీ పదములు నీ పదములు
  గా పర మేశ్వర! పరిపరి గాంచుచు గొలుతున్

  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. తల్లిదండ్రులసేవలో ములిగి నదయి
  మాధవునినూరటబరచె మానినియట
  మాధవునిసేవకంటెను మాత్రపితల
  సేవమిన్నయ నిదెలియజేసెనుగద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   అక్కడ తల్లిదండ్రుల సేవ చేస్తున్నది తనయుడు. తనయ కాదు. మీ పద్యాన్ని సవరించండి.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి


  3. తల్లిదండ్రులసేవలో ములిగి యతడు
   మారమణునినూ రటబర్చె గారవముగ మాధవునిసేవకంటెను మాత్రపితల
   సేవమిన్నయ నిదెలియజేసెనుగద

   తొలగించండి
  4. సుబ్బారావు గారూ,
   సవరించిన మీ పద్యం బాగున్నది.
   ‘మునిగి’... ‘ములిగి’ అయింది? అలాగే ‘మాతృ’ మాత్ర అయింది.

   తొలగించండి
 7. మాతాపిత పద సేవా
  నీత తపఃఫల మది రమణీ యాకాశా
  పాతామరాపగా ప్లుత
  సీతానాధ పదపద్మ సేవా నిభమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. 30 నవంబరు 2015 దినమున పితృవియోగ దుఃఖము లో మీరు గమనించలేక పోయిన పద్యము:

   జననీ జనకుల పదములు
   వనజ భవాంఛిత పవిత్ర పాద సదృశముల్
   అనవర తారాధ్యార్హ క
   మనీయ కోమల కుసుమ సమానమ్ము లిలన్

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పద్యాలు చాల బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. నీ పాదమ్ముల సేవజేయ వెరవున్ నే పొంద, మాతా పితా
  శ్రీ పాదమ్ముల నాశ్రయించవలె. కించిత్జాప్యమున్ సైచుమా.,
  మా పాపమ్ముల పారద్రోలి కరుణన్ మమ్మేలు హే పాండురం
  గా! పీతాంబర! రుక్మిణీశ! విఠలా! కైవల్యమున్ గూర్చుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ శార్దూలపద్యం బాగున్నది. ‘పితృశ్రీపాదమ్ముల’ అనాలి అనుకుంటాను.

   తొలగించండి
  2. తిమ్మాజీ రావు గారు నమస్కారములు. మీ పద్యము చాలా బాగున్నది. “కించిజ్జాప్యమున్” అంటే సాధువనుకుంటాను.

   తొలగించండి
 9. నా బాగోగులఁ జూడగ
  నీ బంధముఁ గట్టినట్టి యీశుడవీవే!
  నా బాపు పాద సేవయె
  స్వాభావికమగును ముందు స్వామీ నాకున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఈపాదంబులనరయగ
  నీపద ములసరియయగునునీరజనయనా!
  యోపిక పట్టుము వత్తును
  నీపదములబట్టుకొందు నిర్మల బుధ్ధిన్

  రిప్లయితొలగించండి
 11. పాదము లంటియుంటి-యిట పాదముబట్టగనీవెగాద|ఆ
  మోదము నింపుమయ్య ఘన మోహన రూపము వీరియందునన్
  లేదని యెంచలేనుగద లీలలు జూడగ తల్లిదండ్రిలో
  కాదని యెక్కడుండెదవు?కామితదాయక రుక్మిణీపతీ?
  2.ముదసలి తల్లి దండ్రులకు మూలము నీవెగ?విగ్రహంబునన్
  కదలక పాండురంగడిగ కాంక్షలు దీర్చగ నిల్చియుండి|యీ
  విధమునతొంద రెందులకు వీరును,మీరును నొక్కటేగదా?
  పదముల,పల్కులందుగల పావన మూర్తివి లోకులెంచగా

  రిప్లయితొలగించండి
 12. కన్నవారె యిలను కనిపించు దైవాలు
  వారి సేవ జేయు భాగ్య మబ్బె
  అలక బూనకయ్య యాపన్న రక్షకా
  వత్తు నిపుడె దరికి వాసుదేవ.
  2.మత్తులోన పడితి మరచితి నిన్నాళ్ళు
  దారి చూపు నట్టి దైవములను
  వీడి తిరిగి చెడితి వేశ్యలంపటమున
  నిమిషమందె వత్తు నీరజాక్ష.
  3.కట్టుకొన్న దాని కంఠహారములన్ని
  వారకాంత కొసగి బాధ పడితి
  తల్లి దండ్రి దక్క ధరణిలో కావంగ
  నెవరు లేరటంచు నెరుగనైతి/నెరిగ నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. భగవదారాధననుమించి జగతి యందు
  తల్లిదండ్రుల పదసేవ ధన్యతొసగు
  పిలువ బోకుము మాధవా యలుగ బోకు
  శ్రీకరముగూర్చు నాతండ్రి సేవ నాకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘ధన్యత నిడు’ అనండి. ‘ధన్యత+ఒసగు’ అన్నపుడు యడాగమం వస్తుంది, సంధి లేదు.

   తొలగించండి
 14. జననీ జనకుల కన్నను
  ఘనమగు దైవమ్ము లేదు గాంచగ జగతిన్
  మనసారా వారిఁగొలువ
  నిను గొలిచిన ఫలము గాదె నీరజనేత్రా!!!

  రిప్లయితొలగించండి
 15. భక్తి మర్మము నెరిగితి పాండురంగ
  తల్లిదండ్రుల ప దసేవ దనయుచుంటి
  పిలచి దృష్టి మరల్చకు వేంకటేశ
  వేచి యుండుము వెలుపల పింగళుండ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘...దనియుచుంటి’ అనండి.

   తొలగించండి