గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములాస్య అనెడు భార్యతో భర్త చెబుతున్న మాటలుదేవకీదేవికినివసు దేవులకునుఅష్టమసుతుడై కారాగృహమున నిశినపార్థసారధి జన్మించె, భానుమతికి లక్ష్మణకుమారు డుదయించే లాస్య వినుమ.
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నిశిని' అనండి.
పతిని జేరిన ఫలముగ భానుమతికిఆయె చకచక రెండన ఆరు నెలలుఅమ్మ కడుపున చల్లగ అయ్య చలువపార్థ సారధి జన్మించె భానుమతికి
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. 'రెండన నారునెలలు'.. అర్థం కాలేదు.
దన్యవాదాలండీ కంది వారు ! "తతశ్చ ద్వాదశే మాసే"అన్నట్టు రెండు ఆరు నెలలు = పన్నెండు నెలలు అన్న అర్థం లో వ్రాసాను సరియేనా ??సావేజితజిలేబి
రెండారు నెలలు అంటే అర్థం అయ్యేది. కాని ‘రెండనన్ ఆరు నెలలు’ అనేసరికి అర్థం కాలేదు.
శిష్ట జనులను రక్షించ శ్రీకరముగదేవకికి చెరసాలలో దివ్యముగనుపార్థసారధి జన్మించె, బానుమతికిలక్ష్మణ కుమారుడు కలిగె లక్షణముగ!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పార్థసారథి జన్మించె భానుమతికిపతి సుయోధను పినతల్లి వదిన గారు దేవకీ దేవికిన్ వసుదేవు డంతసంతసించగ కంసుడు చింత నొంద
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ బంధుత్వాల చిట్టా పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
చిమ్మచీకటిగలయట్టిచెరనుగాదెపార్ధసారధిజన్మించె.భానుమతికిలక్ష్మణకుమారుడననొకలక్షణుండుకొడుకుగాబుట్టెజూచితె?కోమలాంగి!
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఒక లక్షణుండు’... ఏ లక్షణం?
ఔను! "లలిత,సౌజన్యశ్రీ,భానుమతులు"నెలలు దప్పగ "లలిత"కు నెలలు నిండిపార్థసారథి జన్మించె-భానుమతికి రామమూర్తియె ప్రభవించె రాగమొదవ!
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. ‘జన్యశ్రీ’ అని మగణం వేశారు?
పాండు పత్ని కుంతిని జేరి పలికె నిటులపార్థసారధి, జన్మించె భానుమతికిమగశిశువనుచు తరలిరి మగువ లెల్లబారసాలయె ఘనమైన పండుగయ్యె
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య * గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,గో గ్రహణ సన్నివేశమున్ గూర్చి కృష్ణ కిటుల విశదముగా వివరి౦చె నపుడు ిపార్థసారధి | జన్మి౦చె భానుమతికి :- లక్ష్మణు౦డు , సమస్తావలక్షణు౦డు ,శౌర్యహీనుడు , కోతల చక్రవర్తి |ప౦దయై సైన్యము౦ గా౦చి పార దొడగె |{ కృ ష్ణ. = ద్రౌపది }
గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మణకుమారుడు పిరికివాడన్నది సినిమావాళ్ళ సృష్టి. అతడు సమరరథుడు (మహారథునకు తక్కువ, అర్ధరథునకు ఎక్కువ). మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించాడు.
అర్జునుని రథము నడుపగ నయ్యె నతడుపార్థసారథి.జన్మించె భానుమతికి రాజరాజుకు తనయుడై లక్ష్మణుండు,కూతు లక్షణ కృష్ణుని కోడలాయె
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది.‘కూతు’? ‘కూతురగు లక్షణ హరికి కోడలాయె’ అంటే ఎలా ఉంటుంది?
ధర్మ సంస్థాప నార్థమై ధరను బుట్టి నందునింటను పెరిగెను నల్లనయ్య పార్థ సారథి, జన్మించె భానుమతికి లక్ష్మణ కుమారుడున్ యువ రాజుగాను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
.పార్థసారధి జన్మించె భానుమతికిగాదు.”తెలియక యుద్దానకాలుమోపక,వెనుదిరిగె|గోవుల గావలేకయున్నలక్ష్మణుడే తనకన్న కొడుకు”.
కె. ఈశ్వరప్ప గారూ,మీ పూరణ బాగున్నది.మూడవపాదంలో గణదోషం. సవరించండి.
పడతి ద్రౌపదిన్ లంకించ భగ్గుమన్నభీనసేనున్, సుయోధనున్ వేటు వేయసకల వ్యూహకర్తగఁ దీరి స్వప్నమందుపార్థసారథి జన్మించె! భానుమతికి
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణను నాలుగైదుసార్లు చదివినా భావం అర్థం కాలేదు. వివరించండి.
గురుదేవులకు ప్రణామములు.ద్రౌపదిని అవమానించినందులకు సుయోధనుని వేటు వేయుటకు భీమసేనునితో శ్రీకృష్ణపరమాత్మ వ్యూహంపన్నినట్లుగా కలలో భానుమతికి తోచిందన్న భావంతో వ్రాశానండి.పరిశీలించ ప్రార్థన.
మీ వివరణ సంతృప్తికరమే. కాని భీమసేనున్, సుయోధనున్ వేటువేయ అన్నచోట అన్వయదోషం ఉంది. ఇద్దరినీ వేటువేయడానికి అనే అర్థం వస్తున్నది.
గురుదేవులకు ప్రణామములు.సవరించిన పూరణను పరిశీలించ ప్రార్థన:పడతి ద్రౌపదిన్ లంకించ భగ్గుమన్నభీమునిఁ గొని సుయోధనున్ వేటు వేయసకల వ్యూహకర్తగఁ దీరి స్వప్నమందుపార్థసారథి జన్మించె! భానుమతికి
పాండు తనయున కిలలోన బవరమందుసాయపడుటకై తా చెర సాల యందుపార్థసారథి జన్మించె;భానుమతికిలక్ష్మణ కుమారుడుదయించి లలిని పెంచె/పంచె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి కవిమిత్రులకు నమస్కారము
రిప్లయితొలగించండిలాస్య అనెడు భార్యతో భర్త చెబుతున్న మాటలు
దేవకీదేవికినివసు దేవులకును
అష్టమసుతుడై కారాగృహమున నిశిన
పార్థసారధి జన్మించె, భానుమతికి
లక్ష్మణకుమారు డుదయించే లాస్య వినుమ.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిశిని' అనండి.
రిప్లయితొలగించండిపతిని జేరిన ఫలముగ భానుమతికి
ఆయె చకచక రెండన ఆరు నెలలు
అమ్మ కడుపున చల్లగ అయ్య చలువ
పార్థ సారధి జన్మించె భానుమతికి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'రెండన నారునెలలు'.. అర్థం కాలేదు.
దన్యవాదాలండీ కంది వారు !
తొలగించండి"తతశ్చ ద్వాదశే మాసే"
అన్నట్టు రెండు ఆరు నెలలు = పన్నెండు నెలలు అన్న అర్థం లో వ్రాసాను సరియేనా ??
సావేజిత
జిలేబి
రెండారు నెలలు అంటే అర్థం అయ్యేది. కాని ‘రెండనన్ ఆరు నెలలు’ అనేసరికి అర్థం కాలేదు.
తొలగించండి
రిప్లయితొలగించండిపతిని జేరిన ఫలముగ భానుమతికి
ఆయె చకచక రెండన ఆరు నెలలు
అమ్మ కడుపున చల్లగ అయ్య చలువ
పార్థ సారధి జన్మించె భానుమతికి
శిష్ట జనులను రక్షించ శ్రీకరముగ
రిప్లయితొలగించండిదేవకికి చెరసాలలో దివ్యముగను
పార్థసారధి జన్మించె, బానుమతికి
లక్ష్మణ కుమారుడు కలిగె లక్షణముగ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపార్థసారథి జన్మించె భానుమతికి
తొలగించండిపతి సుయోధను పినతల్లి వదిన గారు
దేవకీ దేవికిన్ వసుదేవు డంత
సంతసించగ కంసుడు చింత నొంద
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ బంధుత్వాల చిట్టా పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిచిమ్మచీకటిగలయట్టిచెరనుగాదె
రిప్లయితొలగించండిపార్ధసారధిజన్మించె.భానుమతికి
లక్ష్మణకుమారుడననొకలక్షణుండు
కొడుకుగాబుట్టెజూచితె?కోమలాంగి!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒక లక్షణుండు’... ఏ లక్షణం?
ఔను! "లలిత,సౌజన్యశ్రీ,భానుమతులు"
రిప్లయితొలగించండినెలలు దప్పగ "లలిత"కు నెలలు నిండి
పార్థసారథి జన్మించె-భానుమతికి
రామమూర్తియె ప్రభవించె రాగమొదవ!
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘జన్యశ్రీ’ అని మగణం వేశారు?
ఔను! "లలిత,సౌజన్యశ్రీ,భానుమతులు"
రిప్లయితొలగించండినెలలు దప్పగ "లలిత"కు నెలలు నిండి
పార్థసారథి జన్మించె-భానుమతికి
రామమూర్తియె ప్రభవించె రాగమొదవ!
పాండు పత్ని కుంతిని జేరి పలికె నిటుల
రిప్లయితొలగించండిపార్థసారధి, జన్మించె భానుమతికి
మగశిశువనుచు తరలిరి మగువ లెల్ల
బారసాలయె ఘనమైన పండుగయ్యె
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గో గ్రహణ సన్నివేశమున్ గూర్చి కృష్ణ
కిటుల విశదముగా వివరి౦చె నపుడు
ి
పార్థసారధి | జన్మి౦చె భానుమతికి :-
లక్ష్మణు౦డు , సమస్తావలక్షణు౦డు ,
శౌర్యహీనుడు , కోతల చక్రవర్తి |
ప౦దయై సైన్యము౦ గా౦చి పార దొడగె |
{ కృ ష్ణ. = ద్రౌపది }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లక్ష్మణకుమారుడు పిరికివాడన్నది సినిమావాళ్ళ సృష్టి. అతడు సమరరథుడు (మహారథునకు తక్కువ, అర్ధరథునకు ఎక్కువ). మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించాడు.
అర్జునుని రథము నడుపగ నయ్యె నతడు
రిప్లయితొలగించండిపార్థసారథి.జన్మించె భానుమతికి
రాజరాజుకు తనయుడై లక్ష్మణుండు,
కూతు లక్షణ కృష్ణుని కోడలాయె
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘కూతు’? ‘కూతురగు లక్షణ హరికి కోడలాయె’ అంటే ఎలా ఉంటుంది?
ధర్మ సంస్థాప నార్థమై ధరను బుట్టి
రిప్లయితొలగించండినందునింటను పెరిగెను నల్లనయ్య
పార్థ సారథి, జన్మించె భానుమతికి
లక్ష్మణ కుమారుడున్ యువ రాజుగాను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.పార్థసారధి జన్మించె భానుమతికి
రిప్లయితొలగించండిగాదు.”తెలియక యుద్దానకాలుమోప
క,వెనుదిరిగె|గోవుల గావలేక
యున్నలక్ష్మణుడే తనకన్న కొడుకు”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మూడవపాదంలో గణదోషం. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపడతి ద్రౌపదిన్ లంకించ భగ్గుమన్న
రిప్లయితొలగించండిభీనసేనున్, సుయోధనున్ వేటు వేయ
సకల వ్యూహకర్తగఁ దీరి స్వప్నమందు
పార్థసారథి జన్మించె! భానుమతికి
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణను నాలుగైదుసార్లు చదివినా భావం అర్థం కాలేదు. వివరించండి.
గురుదేవులకు ప్రణామములు.ద్రౌపదిని అవమానించినందులకు సుయోధనుని వేటు వేయుటకు భీమసేనునితో శ్రీకృష్ణపరమాత్మ వ్యూహంపన్నినట్లుగా కలలో భానుమతికి తోచిందన్న భావంతో వ్రాశానండి.పరిశీలించ ప్రార్థన.
తొలగించండిమీ వివరణ సంతృప్తికరమే. కాని భీమసేనున్, సుయోధనున్ వేటువేయ అన్నచోట అన్వయదోషం ఉంది. ఇద్దరినీ వేటువేయడానికి అనే అర్థం వస్తున్నది.
తొలగించండిగురుదేవులకు ప్రణామములు.సవరించిన పూరణను పరిశీలించ ప్రార్థన:
తొలగించండిపడతి ద్రౌపదిన్ లంకించ భగ్గుమన్న
భీమునిఁ గొని సుయోధనున్ వేటు వేయ
సకల వ్యూహకర్తగఁ దీరి స్వప్నమందు
పార్థసారథి జన్మించె! భానుమతికి
పాండు తనయున కిలలోన బవరమందు
రిప్లయితొలగించండిసాయపడుటకై తా చెర సాల యందు
పార్థసారథి జన్మించె;భానుమతికి
లక్ష్మణ కుమారుడుదయించి లలిని పెంచె/పంచె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.