8, ఫిబ్రవరి 2016, సోమవారం

సమస్య – 1938 (వర్షాకాలమ్ము వచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్.

49 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు

  1.
  తండ్రి తనకొడుకు హర్షకుమార్ కు చెబుతున్న మాటలుగా నూహించిన పూరణము

  కర్షకులకు పని పెరిగెడు
  వర్షా కాలమ్ము వచ్చు, వైశాఖమున
  న్నార్షము నిశ్చయ మయ్యెను
  హర్షకుమారా! వలదని యనబోకుమికన్

  2.
  కర్షకు లే హర్షించెడు
  వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖము నన్
  కర్షువు లెండుట చేతన్
  కర్షణమే సంభవమ్ము గాదనిరిగదే.

  ఆర్షము=కన్యాశుల్కము గల వివాహము

  కర్షువు= కాలువ
  కర్షణము=దున్నుట

  రిప్లయితొలగించండి
 2. కర్షకులు సంత సించగ
  వర్షాకాలమ్ము వచ్చు , వైశాఖమున
  న్నార్షము కుదరగ వధువుకు
  శీర్షమున బరువు తొలగు శ్రీనిధి తండ్రీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   చివరిపాదంలో గణదోషం. ‘శీర్షమ్మున బరువు తొలగు...’ అనండి.

   తొలగించండి
  2. కర్షకులు సంత సించగ
   వర్షాకాలమ్ము వచ్చు , వైశాఖమున
   న్నార్షము కుదరగ వధువుకు
   శీర్షమ్మున బరువు తొలగు శ్రీనిధి తండ్రీ

   తొలగించండి
 3. ఆర్షమయమగు భరతమున
  శీర్షములూప జలదములు శీఘ్రము నెలకున్
  వర్షములు మూడు కురిసిన
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ ‘నెలకు మూడువానల’ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి

  ఏ చెట్టూ లేనిచోట - ఆముదపు చెట్టే మహా వృక్షము
  వర్షాకాల మెప్పుడు వస్తుందో ఎవరికీ తెలియ నప్పుడు :

  01)
  ________________________________________

  హర్షాతిరేకులైరిగ
  ఘర్షణతో కుములుచున్న - ఘన సువ్రతులే
  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హర్షుం డొక్కడె యిట్లన
  వర్షాకాలమ్ము వచ్చు - వైశాఖమునన్
  ________________________________________

  రిప్లయితొలగించండి
 5. హర్షంబులిడగ జనులకు
  వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
  శీర్షములు మాడిబోవగ
  తర్షుని వేడిమికి జగతి తాపము నొందున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మాడిపోవగ’ అనండి.

   తొలగించండి
 6. శుభోదయం :- రైన్ మేకర్ కథకుడు :)

  హర్షాతి వర్షమను ఆ
  కర్షణ మంత్రము చదివెను కథకుడు ; చెప్పెన్
  కర్షణ సాక్షిగ గనుమా
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్ :)

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. రైన్ మేకర్ ని తెలుగు లో ఏమని చెప్పవచ్చు ?

  వర్ష వర్ధనుడు లేక వర్షరి లేక వర్షకర్మ లేక భగీరథ ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. వర్షములకువనసంపద
  హర్షంబగుగాన జనులవనిన్ తరులన్
  కర్షకులై తెగబెంచిన
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంద పీతాంబర్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   రెండవ పాదంలో గణదోషం. 'హర్షం బగు గావున జను లవనిన్...' అనండి.

   తొలగించండి
  2. గణదోషంసవరించిన గురువుగారికిధన్యవాదములు.

   తొలగించండి
 9. నవనాగరికత మహిమో?
  సవరింప బడె ఋతువులు! వసంతము దాట
  న్నవనిన్ వర్షాకాల
  మ్మువచ్చు, వైశాఖమునను ముదరగ నెండల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   పాదభ్రంశం చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. తర్షణము గొనిరి లోకులు
  వార్షికమున నమరు వాన వైనము లేకన్
  కర్షణకై వరుణు కొలువ
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంథా భానుమతి గారూ,
   మీ పూరణ బాగున్నది కాని వరుణుని కొలిచినంత మాత్రాన వర్షాకాలం గతి తప్పుతుందా?

   తొలగించండి
  2. ఏమోనండీ.. కరుణ జూపుతాడేమోననీ.. ఇప్పుడు మాత్రం.. గతి తప్పి, రావడమే మానేశాడు కదా!

   తొలగించండి
 11. కర్షకులకుఁ బ్రీతి నొసగ
  వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
  హర్షాతి రేక హృదయా
  మర్ష విదూరాత్ములు గద మానవులు భువిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఆర్షంబగు భ రతంబున
   కర్షకులన మునులేవారు కడునిస్వార్థుల్
   వర్షములో హర్షంబున
   వర్షా కాలమ్ము వచ్చు వైశాఖమునన్

   తొలగించండి
 12. శీర్షము లెడ పెడలైనవి
  ధర్షి0చిరి నాతపమును తమ కౌగిళ్లన్
  ఘర్షణ పడి దంపతులన
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. వర్షించిన మెండుగనీ
  వర్షాకాలమ్ము - వచ్చు వైశాఖమునన్
  'వర్షా' పెండ్లిని చేసెద
  హర్షముతో పంట చేతికందిన యంతన్
  (వర్షాలు పడి పంటచేతికందితే కూతురు వర్షా పెళ్ళి చేయ వచ్చని ఓ రైతు ఆశ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. హర్షమునొసంగ రైతుకు
  వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
  వర్షము చెదురుమదురుఁ బడ
  కర్షకులభువి పదనుకొను కావించ పనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. హర్షా!శ్రావణ మందున
  వర్షాకాలమ్శువచ్చు, వైశాఖమున
  న్హ ర్షముగలుగగ దరువులు
  శీర్షములకుబూలనిచ్చుసింగారించన్

  రిప్లయితొలగించండి
 16. సమస్య కర్షక వర్యుల వర్షము
  హర్షమునే బంచిపెట్టు |అవనికి నెపుడున్
  పర్షియ దేశమునందున
  వర్షా కాలమ్మువచ్చు వైశాఖమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. 'కర్షక జనులకు' అంటే బాగుంటుంది.

   తొలగించండి
 17. శీర్షములు వంచి యనిశము
  కర్షకులు కృషిని సలుపగ కండలు కరుగన్
  వర్షించగ ఘర్మజలము
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్.

  రిప్లయితొలగించండి
 18. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. హర్షించగ శ్రావణమున
  వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
  వర్షము మాటే నుండదు
  వర్షించునధిక తపనము, బాధలు హేచ్చన్.

  రిప్లయితొలగించండి
 20. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది.
  ‘మాటే యుండదు’ అనాలి కదా! ‘హెచ్చన్’ టైపాటు వల్ల ‘హేచ్చన్’ అయింది.

  రిప్లయితొలగించండి
 21. హర్షానందమ్ములొదవు
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్
  కర్షకులెల్లరు సలుపగ
  నార్షపు విధి యజ్ఞముల మహాత్మ్యపు నెఱుకన్.

  రిప్లయితొలగించండి
 22. 1.హర్షము తోడను పలికెను
  కర్షకుని తనయుడు తికమక పడుచు చదివెన్
  వర్ష ఋతువునందేయీ
  వర్షాకాలము వచ్చె వైశాఖమునన్.
  2.వర్షంబునకోసారియె
  వర్షాకాలము వచ్చు;వైశాఖమునన్
  కర్షకుడుల్లాసముతో
  హర్షముతోడను పొలమును అరకతొ దున్నెన్.

  రిప్లయితొలగించండి
 23. కం.కర్షక లోకమువిసిగిరి,
  హర్షించిపొదగుచునాట్లు యాహోయనయా
  కర్షించుచినుకుకలగక
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్

  గమనిక: ఇక్కడ కర్షకులు ఏంటో ఆనందం తొ నాట్లు వేసినా ఆహా అనేది వర్శమొకటి కూడా లేక మొత్తం సంవత్సరం వైసాఖమే అయ్యింది అంటే కేవలం ఎండే తప్ప ఇంకే కాలం లేకుండా పోయింది అన్న ఉద్దేశం తొ వ్రాసాను. వర్షము = సంవత్సరం కాలం

  రిప్లయితొలగించండి
 24. హర్షించెను కైలాసము
  ఘర్షించిన రాహులునకు కంపము హెచ్చన్...
  కర్షక! ముక్కంటి వడకె!
  వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్!

  రిప్లయితొలగించండి