15, ఫిబ్రవరి 2016, సోమవారం

సమస్య – 1945 (కోనేరున నొక్క చేఁప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్.

48 కామెంట్‌లు:

  1. వానా కాలము నందున
    మానేరు ననిండె నంట మత్స్యము లెన్నో
    మీనాక్షి తెచ్చి వండగ
    కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      పద్యం చక్కగా ఉంది. కాని 'కొంగను మ్రింగెన్' అన్న దానికి అన్వయం?

      తొలగించండి
    2. మీనాక్షి తెచ్చి వండెను
      కోనేరున నొక్క చేఁప , కొంగను మ్రింగెన్
      వానా కాలము గావున
      మానేరున దాగి యున్న మకరము లెన్నో

      తొలగించండి
    3. రాజేశ్వరి అక్కయ్యా,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. గురువు గారికీ, కవిమిత్రులకు నమస్కారములు

    వానలు కరువై లేదట
    కోనేరు ననొక్క చేప, కొంగను మ్రింగెన్
    మీనముల గోరి నిరతము
    కోనలలో తిరు గుచుండు కొండచిలువయే

    రిప్లయితొలగించండి
  3. ఒక సినిమా కథ ప్రస్థావనతో

    మీనాక్షిపతి యె ఘనవి
    జ్ఞాని యనుచు జనులు మెచ్చు జ్ఞానేశ్వరుడే
    తానిర్మించిన కథలో
    కోనేరున నొక్కచేప కొంగను మ్రింగెన్ .

    రిప్లయితొలగించండి
  4. "కొంగోదయము" అను కథ చెప్పె జిలేబి :)

    కానగ నయ్యరు పట్టెను
    కోనేరున నొక్క చేప, కొంగను మ్రింగెన్
    యేనుగు, జిలేబి కథ విను
    మా నేర్పుగ నల్లెనిటుల మాటల కోతల్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'మ్రింగెన్ + ఏనుగు' అన్నప్పుడు యడాగమం రాదు.

      తొలగించండి
  5. ఆనీట చేప బట్టెను తానొక్కటి కాపుగాచి దాపున బకమే దానిని మకరము బట్టను కోనేటను చేపపిల్ల కొంగనుామ్రింగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారూ,
      అది కేవలం టైపాటు. ధన్యవాదాలు.

      తొలగించండి
    3. హనుమచ్ఛాస్త్రి గారు మీరు సమస్యను (కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్.) మార్చి పూరించారు. కొంగనూ యని దీర్ఘముగా వ్రాసిన గణదోషమయినది. చేపపిల్లను, కొంగను రెంటిని యని చెప్పదలచిన “చేప పిల్లఁ గొంగను” లేదా “కోనేరున నొక్క చేఁపఁ గొంగను మ్రింగెన్” అని అనాలిగద. పరిశీలించగలరు.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      మీ అభ్యంతరం సహేతుకమే. నేను ప్రయాణపు తొందరలో ఉండి (నేడు మా బావమరిది గారి ఐదవరోజు) నిశితంగా పరిశీలించలేకపోయాను. వెంటనే స్పందించలేకపోయాను. ధన్యవాదాలు.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  6. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    లేనే లే దె౦డిన. యా

    కోనేరున నొక్క చేప. | కొ౦గను మ్రి౦గెన్ ,

    తా నమ్ము వేసి వ్యాధుడు |

    బోనము , జీవి కగు జీవి భూతల మ౦దున్ ! !

    { మ్రి౦గెన్ = కబళి౦చెను ; వ్యాధుడు = బోయ వాడు ; బోనము జీవికగు జీవి = ప్రాణికి ప్రాణి యే భోజన మగును ; }


    ి

    రిప్లయితొలగించండి
  7. కోనేరున జేరె మకరి
    దీనమ్ముగ వరద నీట దేవుని లీల
    న్నానీరాట మొక బకము
    కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్.
    [చేఁపకు+ ఒంగను= చేఁప కొంగను, చేఁపకొఱకువంగగ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు), తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు), వావిళ్ల నిఘంటువు లలో గమనించగలరు.

      తొలగించండి
    3. ఎక్కడో వెదకడం ఎందుకు? మన బ్లాగులోనే ఉన్న ‘ఆంధ్రభారతి’ లింకులో అన్ని నిఘంటువులనూ చూడవచ్చు. (నిజానికి ఉదయం నాకూ అనుమానం వచ్చి, ఆంధ్రభారతి చూసి సందేహనివృత్తి చేసుకున్నాను).

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  8. కానగ నయ్యెను వెదుకగ
    కోనేరున నొక్కచేప, కొంగనుమ్రింగె
    న్గోనేరునగల మకరము
    తానుగ మెల్లంగ వచ్చి దాపున నొదిగీ

    రిప్లయితొలగించండి
  9. వానలు కఱువై పొడమదు
    కోనేరున నొక్క చేఁప, కొంగను మ్రింగెన్
    వీనుల కంటి రయమ్మున
    కోనేటి తటమ్మునందు క్షుద్బాధడరన్
    వీనుల కంటిః పాము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘క్షుద్బాధ+అడరన్’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘క్షుద్బాధితమై’ అందామా?

      తొలగించండి
  10. పోచిరాజు గారూ ! నమస్తే

    అద్భతమైన పూరణ మ౦ది౦చారు .

    కానీ చేపకు + ఒ౦గను , అన్నప్పుడు :-

    సమస్య పాదము న౦దు యతి సరిపోదు కదా

    అలా పూరి౦చే సదుపాయము కలదా

    నా స౦దేహము నివృత్తి

    చేయ గలరని మనవి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారు నమస్కారములు. సమస్య పాదమేమి మారలేదు. అర్థభేదమే కలదక్కడ. “కో” కు “కొం” యతి యథాతథము. ఇక్కడ “కొ” కు గాని “ఒ” కి గాని యతి కుదర్చ వచ్చును. ఒకవేళ పాదారంభమున “కల - దీకొలను... “ అని యున్న “దీ” లోని “ఈ” కి “కొం” లోని “ఒం” కి యతి చెల్లుతుంది. సంధి వలన “ఈ” “దీ” అయినది అలాగే “ఒ”.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      పోచిరాజు వారు ఆ పాదంలో అఖండయతి వేశారని గమనించ మనవి.

      తొలగించండి
  11. ప్రాణమ్ములఁ గైకొనగన్
    తానొక రక్కసి యనెడు యథార్థపు చాటున్
    కానలఁ బాడుబడిన గుడి
    కోనేరున నొక్క చేప కొంగను మ్రింగెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. పానీయము తరుగ కుమిలె
    కోనేరున నొక్క చేఁప; కొంగను మ్రింగెన్
    మీనముకై జపము సలుపు
    ధ్యానములోనుండ, నొక్క ధన్వియె, తృటిలో

    రిప్లయితొలగించండి
  13. మీనమ్మయి దెచ్చె శ్రుతుల
    కీనాశుని జంపి తొల్లి, కృష్ణుడు బకునిన్
    పూని నిభ్భంగి జంపెను
    కోనేరున నొక్కచేప, కొంగనుమ్రింగెన్

    రిప్లయితొలగించండి
  14. . మానక కాల్మణి జేసెడి
    వానిని హతమార్చె నొకడు వడ్డీ బెరుగన్
    నానుడి సమస్య పూరణ
    కోనేరున నొక్క చేప కొంగ ను మ్రింగెన్|
    2.దీనులపై దయలేకను
    దానవుడిగ మారగానె ధర్మము నిలుపన్
    వానరుడాతని జంపగ
    కోనేరున నొక్కచేప కొంగను మ్రింగెన్|


    రిప్లయితొలగించండి
  15. meenamu baTTaga bakamE taanuga nilucunna,nilce daapu makaramE kaanaga tappiMcukonenu kOnEruna nokka cEpa, koMganu mriMgen.

    రిప్లయితొలగించండి
  16. జానకి సుతుండు బట్టెను
    కోనేటిన నొక్క చేప, కొంగను మ్రింగెన్
    మీనముల వెదకు దానిని
    గానగ నొక మీనరమ్ము కబళించెనుగా!!!

    రిప్లయితొలగించండి
  17. కానక మకరము కసితో
    కోనేరున నొక్క చేఁప, కొంగను మ్రింగెన్
    మీనము దిన వచ్చిన
    యా నక్రమ్మునకు కహ్వ మమిరెను మిత్రా!

    రిప్లయితొలగించండి
  18. మీనము బట్టగ బకమే
    తానుగ నిలుచుండె, నిల్చి దాపు మకరమే
    కానగ తప్పించుకొనగ
    కోనేరున నొక్క చేప, కొంగను మ్రింగెన్.

    రిప్లయితొలగించండి
  19. చిన్న విజ్ఞాపనము: మన శంకరయ్య మాస్టారు అఖండయతి ప్రయోగాన్ని అంతగా మెచ్చుకోరు. అలాగే కీ.శే.నేమాని గురువులు. కావున తెలుగు పండితులైన బ్లాగు మిత్రులు గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  20. రానీలే చిన్నది యన
    దీనుని గాజేరి గంజ తినదా భోగిన్?
    మీనా! యిది యెట్లన్నన్👇
    కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్!

    రిప్లయితొలగించండి


  21. నానాటికి జగమాయెన
    యా నాటకము! నదులెల్ల యాలము బోవన్
    పానాదిలోబడి, భళీ
    కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. జానెడు బెత్తెడు స్మృతియే
    దానవు నోడించి నవ్వి తన్నె నమేఠిన్
    కానగ నిదియెట్లన్నన్
    కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్

    రిప్లయితొలగించండి