22, ఫిబ్రవరి 2016, సోమవారం

సమస్య – 1952 (నీవును నీవు నీవు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్. 

64 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవి మిత్రులకు నమస్కారములు

  కోవెల లోన పెండ్లియట గోరెను సాయము మిత్రుడొక్కడున్
  పోవలె మిత్రులందరము పుస్తెలొకండును పండ్లనొక్కడున్
  పూవులొకండు నింకొకడు పుట్టము లన్నియు భారమెంచకన్
  నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవురావలెన్

  రిప్లయితొలగించండి
 2. లంకనుండి తిరిగొచ్చిన అంజనిసుతుడు మిత్రులతో పలికిన మాటలుగా నూహించి

  పావని రామపత్ని గడు భారము తో గనుగొంటి లంకలో
  నేవిధి నాపురమ్మునకు జేరుట తెల్పుము జాంబవంతుడా
  చేవను గల్గినట్టి కపి శ్రేణులు రావణు గూల్చునే యికన్
  నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవురావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండవ పూరణ రెండవపాదంలో యతి తప్పింది. అన్వయలోపం కూడా ఉంది. సవరించండి.

   తొలగించండి
 3. భావము నందునిన్ మదిని భాసిలు భర్తగ కోరియుం టినే
  పూవును రుక్మిణీ సతికి భూరిగ నీయగ హేతువే మటన్
  జీవము నీవెనా కనుచు చెక్కిలి మీటుచు కల్లలా డగా
  నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   ‘నందనందనున్’ అన్నదానిని ‘నందునిన్’ అన్నారు. ‘ఏమటన్’ అన్నది ‘ఏమనన్’ అని ఉండాలి. సమస్య పరిష్క్రరింపబడలేదు.

   తొలగించండి
  2. భావము నందనం దనుని భాసిలు భర్తగ కోరియుం టినే
   జీవము నీవెనా కనుచు చెక్కిలి మీటుచు కల్లలా డగా
   పూవును రుక్మిణీ సతికి భూరిగ నిచ్చుట కేమిహేతువౌ
   సేవక భామినుల్ గనుచు చేష్టలు లేకను విస్తుబోవుచున్
   నీవును నీవునీవు మఱినీవును నీవును నీవు రావలెన్

   గురువులు క్షమిచాలి మరి ఈసవరణ ఎలాఉంటుందో ?

   తొలగించండి

 4. కావుని పెండ్లికై చనిరి కారున భామలు కొండపై నకున్
  కోవెల జూతమా యనెను కోమలి నొక్కతె కూడి సై యనెన్
  నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవురావలెన్
  పోవుద మెల్లరూ నిపుడు బోతము దేవుని కోవెలే గనన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   చివరిపాదం కొంత గజిబిజిగా ఉంది. ‘ఎల్లరూ’ అనడం గ్రామ్యం, దాని తర్వాత ‘నిపుడు’ అనడం దోషమే.

   తొలగించండి
 5. పోవుచునుంటి నేగుడికి ప్రొద్దది గ్రుంకుచునుండె, నుండెగా
  చేవగ గర్కిపాటినర 'సింహము ' చేసెడి నావధానమే
  కావలెనన్న పద్యసుధ కార్యములన్నియు నెట్టి ప్రక్కకున్
  నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమచ్ఛాస్త్రి గారు మీపూరణ చక్కగనున్నది. “చేసెడి నావధానమే”
   సాధువు కాదనుకుంటాను. చేసెడి నవధానమే లేక చేసెడి నాయవధానమే యన్న సాధువని తలుస్తాను. పరిశీలించండి.
   “సింహపుటయ్యవధానమిత్తరిన్” అనిన యెట్లుండును?

   తొలగించండి
  2. “సింహకృతావిరళావధానమున్” అనిననింకనూ బాగుండును.

   తొలగించండి
  3. పోచిరాజు గారూ ధన్యవాదములు..చక్కని సవరణ సూచించారు...

   పోవుచునుంటి నేగుడికి ప్రొద్దది గ్రుంకుచునుండె, నుండెగా
   చేవగ గర్కిపాటినర 'సింహపు ' టయ్యవధానమిత్తరిన్
   కావలెనన్న పద్యసుధ కార్యములన్నియు నెట్టి ప్రక్కకున్
   నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్

   తొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘...సింహము చేయు వధానకార్యమే’ అన్నా బాగుంటుంది.

   తొలగించండి
  5. అది ‘చేయు వధానకార్యమే’. అవధానము అన్నా వధానము అన్నా ఒకటే అర్థం. ‘వధానము’ అని ‘ఆంధ్రభారతి - నిఘంటుశోధన’లో వెదికితే దొరకదు. కాని పూర్వకవి ప్రయోగాలున్నాయి. కావాలంటే ‘వధాన’ అని టైప్ చేసి గూగుల్‍లో వెదకండి.

   తొలగించండి
  6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఇప్పుడే చూచి నా వ్యాఖ్యను తొలగించు చుండగ మీ సమాధానము వచ్చినది. ధన్యవాదములు.

   తొలగించండి
 6. నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవురా వలె
  న్బోవుద మిప్పుడే గుడికి పోచిన పెద్ది సు తుండ !వేంకటా !
  రావుల కామశా స్త్రి మఱి రాయల పాటి సుధా కరా !యిక
  న్వేగమె రండి పో వుదమ ప్రీతిని మ్రొక్కగ నా రమా ప్రభున్

  రిప్లయితొలగించండి
 7. పావనమైన భద్రగిరిఁ బబ్బము సేయగ నెంచి రెల్లరున్
  దైవ సుకార్యనిర్వహణ ధాత్రిని మానవ ధర్మమే యనిన్
  దేవుని పెండ్లికిం జనుల దీయని పల్కులఁ బిల్చిరివ్విధిన్
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   రెండవపాదం చివర ‘...యనిన్’..? ‘...యనన్’కు టైపాటా? ‘ధర్మ మంచు నా| దేవుని..’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ మరింత సందర్భోచితముగనున్నది. ధన్యవాదములు.

   పావనమైన భద్రగిరిఁ బబ్బము సేయగ నెంచి రెల్లరున్
   దైవ సుకార్యనిర్వహణ ధాత్రిని మానవ ధర్మమంచునా
   దేవుని పెండ్లికిం జనుల దీయని పల్కులఁ బిల్చిరివ్విధిన్
   నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

   తొలగించండి
 8. కోవెల లోన జేతు రట కూరిమి భక్తిని శ్రీనివాస ప
  ద్మావతి జంటకీ దినము మానిత రీతి వివాహ మెల్లరు
  న్నీవిధి గాంచి ధన్యులయి నీశు ప్రసాదము స్వీకరించగన్
  నీవును నీవు నీవు మరి నీవును నీవును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘ధన్యులయి యీశు ప్రసాదము...’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులసూచనతో సవరించిన పద్యము
   కోవెల లోన జేతు రట కూరిమి భక్తిని శ్రీనివాస ప
   ద్మావతి జంటకీ దినము మానిత రీతి వివాహ మెల్లరు
   న్నీవిధి గాంచి ధన్యులయి యీశు ప్రసాదము స్వీకరించగన్
   నీవును నీవు నీవు మరి నీవును నీవును నీవు రావలెన్

   తొలగించండి
  3. గురుదేవులసూచనతో సవరించిన పద్యము
   కోవెల లోన జేతు రట కూరిమి భక్తిని శ్రీనివాస ప
   ద్మావతి జంటకీ దినము మానిత రీతి వివాహ మెల్లరు
   న్నీవిధి గాంచి ధన్యులయి యీశు ప్రసాదము స్వీకరించగన్
   నీవును నీవు నీవు మరి నీవును నీవును నీవు రావలెన్

   తొలగించండి
 9. చావలి వారి పిల్ల గని సైగల జేసె నకార్య శీ లుడై
  కావలివాడు తోటకడ, కట్టడి చేయు తలంపుతోడుతన్
  చావడిలోన తీ ర్పునిడ సంఘపు పెద్దలు చేరిరచ్చటన్
  నీవును నీవునీవు మరినీవును నీవును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. . భావన,రాజ్యలక్ష్మి,రమ,వందన,చందన,హేమమాలినీ
  నీవును,నీవునీవు మరి నీవును నీవును నీవురావలెన్
  నే వధువయ్యదన్ గనుక నేనిటు దెల్పెద పెళ్లి కందరున్
  రావలె నంచు వేడెదను రమ్యను దోడ్కొని రమ్ము యెల్లరున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘వధు వయ్యెదన్’ అని ఉండాలి కదా! ‘రమ్ము+ఎల్లరున్’ అన్నపుడు యడాగమం రాదు. ‘రావలెన్ సుమీ’ అనండి.

   తొలగించండి
 11. శ్రావణి బిల్చెనందరిని సాకులు జెప్పక సంతసమ్ముగన్
  పోవలె పెండ్లి వేడుకకు పొద్దుట బండికి లక్షణమ్ముగన్
  దేవకి జూచుచుండునట దేవళమందున దారిమధ్యలో
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్!!!
  కావవె వెంకటేశ్వరుడ కష్టము దీర్చగ కన్నతండ్రివై
  దేవకి నందనుండ, హరి, దీవెన లీయుము నార్తిబాపగన్
  పావని, పావకాత్మజుడ, ఫాలుడ, శాంకరి, రామచంద్రుడా
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్!!!

  రిప్లయితొలగించండి
 12. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అమ్మాయిలూ చక్కగా చదువుకొన౦డి
  .............................................
  మోసగాళ్లను నమ్మి ప్రేమజబ్బులో పడక౦డి
  ...................................................


  పా వ ని యిట్లనెన్, "సుగుణ! భాగ్య!సుజాత!సరోజ!శ్రీ!మణీ!
  నీవును నీవు నీవు మరి నీవును నీవును నీవు రావలెన్ |
  నా -వలరాయు ప్రేమికుని - "నాగను" చూపెద పెద్ద పార్కులో "
  పా వ ని మాటలన్ వినిన వారలు నవ్వుచు పల్కి రిట్లు, " పో
  వే,వగలాడి మా కొరకు వె౦పర లాడిన వాడు ఛీ యనన్
  నీ వెనుకన్ బడెన్ |చదువు నెట్టుచు నీ తలతిక్క యె౦దుకే|
  పా వ ని ! పెద్దవారు మనపై కడు నమ్మక ము౦చి ప౦పగా
  నీ విధి పిచ్చి చేష్ట లొనరి౦చ నొకి౦చుక సిగ్గు లే దొకో|
  ఈ విక చక్కగా చదువవే గడియి౦పవె టాపు ర్యా౦కు|మే
  మా విగుణ౦పు బుధ్ధి గల నాతని త్రోసెద మి౦క దిట్టుచున్

  { విగుణ౦పు, = వికృత౦పు }

  రిప్లయితొలగించండి
 13. భూవరు నడ్గ బోవుదము భూతల మందలి తెల్గు వారికిన్
  జీవన నాడియైన కడు జిల్గుల వెల్గుల తెల్గు భాష శ్రీ
  నావను మున్గకుండ మన నైజము చూచుట రమ్ము మిత్రమా
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘తెల్గు భాష యీ|నావను...’ అంటే బాగుంటుందేమో? ‘చూడగ రమ్ము మిత్రమా’ అనండి.

   తొలగించండి
 14. పావన ''కృష్ణ ''పుష్కరము పాపములన్ హరియించ వచ్చె , నే
  పోవుచున్నవాడ సఖ ! పుణ్యము నొందగ మున్కలేయుదున్
  గావుమటంచు వేడుకొనగా ; హితులందర చేర బిల్చుచున్
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

  రిప్లయితొలగించండి
 15. edited as per your suggestion
  భూవరు నడ్గ బోవుదము భూతల మందలి తెల్గు వారికిన్
  జీవన నాడియైన కడు జిల్గుల వెల్గుల తెల్గు భాష , యీ
  నావను మున్గకుండ గన నైతిక భాద్యత మీదె కావునన్
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

  రిప్లయితొలగించండి
 16. బావలనెల్లగంటినిట పావని ద్రౌపది తోడునుండగన్!
  శ్రావణ శుక్లపక్షమున జన్మదినమ్మని యష్టమీ తిధిన్
  జీవితభాగస్వాములిలఁ జేయగనెంచిరి వైభవమ్ముగన్
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘భాగస్వాము’లన్నపుడు ‘గ’ గురువై గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   బావలనెల్లగంటినిట పావని ద్రౌపది తోడునుండగన్!
   శ్రావణ శుక్లపక్షమున జన్మదినమ్మని యష్టమీ తిధి
   న్నావసథమ్మునన్ సలుప నాలులుఁ గూర్చిరి వైభవమ్ముగన్
   నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్!

   తొలగించండి
 17. గురువుగారూ సవరించిన నాపూరణము


  లంకనుండి తిరిగొచ్చిన అంజనిసుతుడు మిత్రులతో పలికిన మాటలుగా నూహించి

  పావని రామపత్ని గడు భారము తో గనుగొంటి లంకలో
  రావణురాజ్యమందు, రఘురామునకీవిషయమ్ము జేర్చుచున్
  చేవను గల్గినట్టి కపి శ్రేణులు సిద్ధము గావలెన్నిక
  న్నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవురావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "కపిశ్రేష్ఠుడు" అన్నప్పుడు "పి" గురువు అవుతుంది కదా సర్ !

   తొలగించండి
  2. రవిప్రసాద్ గారూ,
   సమాసంలో ఉత్తరపదం రేఫసంయుక్తాక్షరంతో ప్రారంభమైనపుడు అవసరాన్ని బట్టి ముందున్న అక్షరాన్ని గురువుగానో, లఘువుగానో స్వీకరించే సంప్రదాయం ఉంది. వ్యక్తిగతంతా నేను గురువుగానే అంగీకరిస్తాను.

   తొలగించండి
 18. బావను పెండ్లి యాడగ ను భావన గల్గెను తండ్రి కోర్కెతో
  శ్రావణ మాసమందునను చక్కని లఘ్నము నిశ్చయంబయెన్
  పావని, మాధవీ , లలి త , రాణి , సుహాసిని , రాగిణీ
  నీవును నీవు నీవు మరి నీవునునీ వును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి
 19. రాగిణీ బదులు నాగ చంద్రికా అంటె గణములు సరిపోతాయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. నా వరపుత్రి ద్రౌపదికి నాథుడు కావలె నెట్టివాడనన్
  ధీవరుడయ్యు లక్స్యమును తీరుగ నెన్నుచు నీట జూచుచు
  న్నావల నున్న చేప కనులందున బాణము గ్రుచ్చు వీరుడున్
  నీవును నీవు నీవు మరి నీవును నీవును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘ధీరుడు నయ్యు’ అంటే అన్వయం కుదురుతుందేమో? ‘..గ్రుచ్చు వీరుడున్’ అని అన్నారు కదా... అందుకు.

   తొలగించండి
  2. నా వరపుత్రి ద్రౌపదికి నాథుడు కావలె నెట్టివాడనన్
   భూవరులార ! లక్ష్యమును బుద్ధిన నిల్పుచు నీట జూచుచు
   న్నావల నున్న చేప కనులందున బాణము గ్రుచ్చు ధీరుడే
   నీవును నీవు నీవు మరి నీవును నీవును నీవు రావలెన్

   తొలగించండి
  3. ధనికొండ వారూ,
   నేను ప్రాసను గమనించకుండా సవరణను సూచించాను. మన్నించండి.
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. అయ్యా ! మూడవపాదాన్ని మార్చివేశాను. ఇప్పుడు గమనింప వలసినది.

   తొలగించండి
  5. రవిప్రసాద్ గారూ,
   ‘కపిశ్రేష్థుడు’లో ‘పి’ గురువవుతుంది కదా అని ప్రశ్నించారు. సమాధానం ఇవ్వడంలో ఆలస్యమైంది. మన్నించండి.
   సమాసంలో ఉత్తరపదం రేఫసంయుక్తాక్షరంతో ప్రారంభమైనపుడు అవసరాన్ని బట్టి పూర్వపదం యొక్క చివరి అక్షరాన్ని గురువుగానో, లఘువుగానో స్వీకరించే సంప్రదాయం ఉంది. వ్యక్తిగతంతా నేను గురువుగానే అంగీకరిస్తాను.

   తొలగించండి
 21. మిత్రులు సత్యనారాయణ రెడ్డిగారూ మీ పూరణము బాగున్నది. అభినందనలు!

  మూఁడవ పాదమున యతిభంగమైనది.

  చిన్న సవరణ...

  పావని, మాధవీ , లలి త , రాణి , సుహాసిని , రాగిణీ

  దీనిని...

  పావని, మాధవీ, లలిత, పార్వతి, హాసిని, రాగిణీ వెసన్....అనిన నెటులుండును?

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. కోవెల లోన రాహులుడు కోరిక తీరను గోలపెట్టుచున్
  దీవన మీది కోరుచును దిల్లికి రమ్మని పోరుపెట్టగా
  బావురు బావురన్నెదలు భళ్ళున గొట్టుచు నేడ్వకుండగన్
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్!

  రిప్లయితొలగించండి
 23. ఉద్ధవ్ ఠాకరే ఉవాచ:

  చావగ భాజపా జనులు చక్కగ నేడ్చుచు దేశమంతటన్
  కావగ రాహులుండగను కమ్మని పావరు సోనితో సహా
  పావును మించ యైదునకు పండుగ నాదిది ముంబయందునన్
  నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్

  రిప్లయితొలగించండి