13, ఫిబ్రవరి 2016, శనివారం

సమస్య – 1943 (జలధరమ్ములు గరళ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె.
(మూడు, నాలుగు రోజులు ప్రయాణంలో ఉంటాను. బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. సమస్యలను షెడ్యూల్ చేశాను. ఈ నాలుగు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. మిత్రులు సహకరించవలసిందిగా మనవి.)

36 కామెంట్‌లు:

 1. కలుష ములునిండు వాయువు విలసి తమ్ము
  భక్తి శ్రద్ధలు లేనట్టి భరత వనిని
  యజ్ఞ యాగమ్ము లనువీడు ప్రాజ్ఞు లకట
  జలధ రమ్ములు గరళ వర్షమ్ముఁ గురిసె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మంచి భావంతో పూరణ చెప్పారు. బాగున్నది. మీ పద్యాన్ని ఇలా చెప్పితే ఇంకా బాగుంటుంది....
   కలుషములు నిండు వాయువుల్ గలతపెట్ట
   భక్తి శ్రద్ధలు లేనట్టి భరతభూమి
   యజ్ఞయాగమ్ములను వీడినట్టి కతన
   జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె.

   తొలగించండి
 2. వర్ష ములులేక యెండెను వనము భువియు
  శాంత వెళ్ళెను అడవికి సరస వచ్చె
  ఋష్య శృంగుడు; మనసు కరిగెను మునికి
  జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   మనసు కరిగిన ముని గరళవర్షాన్ని కురిపించడం ఏమిటి?

   తొలగించండి
  2. కంది వారు :)

   అర్రెర్రే ! అవునండోయ్ ప్రాస యతి వేసేస్తో భావం డమాల్ అయి పోయింది !!!

   నెనర్లు !

   వేరే వ్రాయాల్సిందే :)

   జిలేబి

   తొలగించండి

 3. రామలక్ష్మణులు వెడలిరి ముని జతగ
  కాననమునకు యజ్ఞయాగముల పరి ర
  క్షణమునకు; వచ్చె రచట రాక్షసులు జొతన
  జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె.

  రిప్లయితొలగించండి
 4. జిలేబీ గారూ,
  మంచి విషయం పూరణకు ఎన్నుకున్నారు.
  కాని... మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. 'రక్షణ' మన్నప్పుడు ర గురువై గణదోషం. 'జొతన'...?

  రిప్లయితొలగించండి
 5. యాగశాలన మునులందరామఘునికి
  హోమ కార్యముల్ శ్రధ్ధగ నొనరుచుండ
  రాక్షసులరక్త వర్షము రహినిజెలగి
  జలధరమ్ములుగరళవర్షమ్ముగురిసె
  నటుల దోచెనుజూడుమ యార్య!మీరు

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. శాస్త్ర విజ్ఞాన సంతుష్ట సద్వివేక
   విరహి తాలఘు కార్య సంప్రీతు లైరి
   కాని వాతావరణ మెల్ల కలుషితంబు
   జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. జనులెదురు చూచి విసిగినన్ జాలి లేక
  జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె
  వాగు లెండె వ్రయ్యెలు బారె వసుధ యంత
  కరువు రక్కసిజృంభింప కలత నిండె

  గరళము= కొలది (తక్కువ)

  రిప్లయితొలగించండి
 8. ప్రభుత కృత్రిమ వర్షంపు పథకమెంచె
  నక్రమమ్ముల పర్వమ్ము నంకురించి
  మాధ్యమ పతాక శీర్షికల్ మారు మ్రోగ
  జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. తరువు లన్నరికి నరుడు తనకు దాను
  నరక కూపము గను మార్చె ధరణి నంత
  రక్షణయె లేని పర్యావరణము తోడ
  జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె

  రిప్లయితొలగించండి
 10. జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె
  నాత్మ హత్యల పాలైరి యధిక రైతు
  మిత్రులు పయిరులెండి యమేయమైన
  అప్పు బాధల తాళక నవని పైన

  రిప్లయితొలగించండి
 11. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  మేఘ నాధుని మాయచే మేదిని పయి
  జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె |
  తాళని కపులు కొ౦దరు సోలి పడిరి ,
  లక్ష్మణుడు కూలె వాని శరముల చేత. |
  హనుమ కొనితెచ్చె గ౦ధమాదనము న౦త. |
  ఔషధ మహిమన్ జీవి౦చి ర౦ద రపుడు |

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి గారు హనుమంతుడు తెచ్చినది సంజీవనీపర్వత శిఖరాన్ని (సర్వౌషధి పర్వతము) గద. కైలాస , ఋషభ పర్వతాల దగ్గర. గంధమాదన పర్వతము దక్షిణముననున్నది గద.

   తొలగించండి
 12. కలుషితంబయ్యెగా నేడు గాలి కూడ
  యంత్రముల నుండి వెల్వడు నావిరెల్ల
  పొగలు చిమ్మ వనము మండి పుడమి యెండ
  జలధరమ్ములు గరళ వర్షమ్ముఁగురిసె.

  రిప్లయితొలగించండి
 13. ప్రకృతి సమతులి తమ్మును వమ్ముజేసి
  కలుషమొనరించ వసుధను,కడలి, జలము
  స్వార్థపరులైన మనుజులు సంతతమ్ము
  జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 14. మూడో సారి ముచ్చట గా సరి పోయిందా ?

  రామలక్ష్మణులు వెడలిరి ముని జతగ
  కాననమునకు యజ్ఞయాగముల గట్టి
  రక్షణకొరకు; వచ్చిరి రాక్షసులును
  జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   చాలా వరకు బాగున్నది. కాని మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. 'రామ-రిము' అన్నారు. ప్రాస ముందున్న అక్షరాల గురులఘు సామ్యాన్ని పాటించాలి.

   తొలగించండి
 15. కాన లన్నియు గూల్చగ మానవుండు
  ధిషణి పర్యావరణమెల్ల దెబ్బతినగ
  వాయు కాలుష్య మేర్పడి వసుధలోన
  జలధరమ్ములు గరళవర్షమ్ము గురిసె!!!

  రిప్లయితొలగించండి
 16. మేఘనాధుని యనుచరుల్ మింటినుండి
  యుద్ధ మొనరించు చుండగా యోధుడైన
  లక్ష్మణుండంత నేల గూలంగ జేయ
  జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె.

  రిప్లయితొలగించండి
 17. పుడమి తల్లికి పట్టిన యిడుమల గని
  పంచ భూతముల్ వికటించి ప్రళయములను
  ముంచి వైవగ విషవాయు పూరితములు
  జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె
  ప్రళయముల్ గాలి వానలు

  రిప్లయితొలగించండి