పలుకె బంగార మాయెనా పవన పుత్రపిలిచితి హనుమాయనుచును పేరుతోడకరుణతోడపలుకవేమి కపివరేణ్యరామ నామమ్ము పలుకుమా రమ్యముగను
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పలుకె బంగార మాయెనా యలిగిన చెలితగదు నీకింత పంతంబు తగవు చాలునొప్పుకొందును నీముందునోడినానుపట్టుకొందును నీకాళ్ళు పట్టు విడుము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీనుండి నేనూహించిన పద్యమే వచ్చింది. బాగుంది. అభినందనలు.
పలుకె బంగార మాయెనా చిలిపి సకియ యలుక దీర్చగ దెచ్చితి వలపు పూలు కలల తేలించి కరిగించు కాచి నన్ను మదిని వేధింప తగదులే మగువ నీకు
రాజేశ్వరి అక్కయ్యా,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శుభోదయం ! పలుకె బంగార మాయెనా పతికి నేడు ?పలుకు లేమి పలుక ? తొలి పలుకు నీదిమరియు మలి పలుకును నీది ! మగడు వేరుపలుకు పలుకనేల జిలేబి? పలుక జాల !సావేజితజిలేబి
జిలేబీ గారూ, కులుకు పలుకుల ములుకుల చిలికిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ముత్యాల సరము2:పలుకె బంగార మాయెనా కనలుటె సింగారమాయేనాకులుకెవిడ్డూరమాయేనాసలుపు రామా కృపదత్త పాదమున కించుక సవరణతో: పలుకె బంగార మాయేనా యలుకె సింగారమాయేనాకులుకెవిడ్డూరమాయేనాసలుపు రామా కృప
పలుకె బంగార మాయెనా భద్ర శైలవాస కలనైన కనిపించవా యినకులసోమ జాగేల నను బ్రోవ సురవిభు నుతసుంతయిన దయ జూపవా సుంద రాంగ
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు. ‘ఆయేనా’ అనడం గ్రామ్యం.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. రామదాసు కీర్తనలో ఉన్నది కదా యని వ్రాసాను. ఆ సందేహముతోనే తేటగీతిలో కూడా పూరణ చేశాను. ధన్యవాదములు.
కామేశ్వర రావు గారూ, గాయకులు అలా పాడతారు కాని నిజానికి ఆ కీర్తనలోనిది ‘ఆయెనా’ అనే.
›పలుకెబంగారమాయెనాలలిత!నీకు నీదునామంబులన్నియుదినము దినముబారాయణంబు నుదీక్షతో!డ చేయుచుంటినిగదయమ్మ!వేయి మార్లు
పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది.రెండవపాదంలో గణదోషం. యతి తప్పింది. ‘నీదు నామంబు లన్నియు నేను దినము’ అనండి.
పలుకె బంగార మాయెనా వారిజాక్షి అలుకవీడి నీప్రియ సఖు నాదరించు తప్పులన్నియు మన్నించి దెప్పకుండ కౌ గిలింతల నియ్యవే కరము వేగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది.అభినందనలు.
పలుకె బంగారమాయె నోపడతికపుడుపతికి కట్నాల మోజున్నపాలుబంచశోభనంబున శోధనా లాభమేమి?ననుచు వరుడెంచు భావాలు మనసు ద్రుంచు|
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది.దత్తాంశంలో ‘ఆయెనా’ను మీరు ‘ఆయెనో’ అన్నారు. ‘లాభమేమి|యనుచు...’ అనండి.
మధురాక్కరపలుకె బంగారమాయెనా, పలుకవే లలనరో, నీకలువ పువ్వుల వంటి యా కన్నులెఱదనములచిలుకుచున్నవి గాదటే! చిరునవ్వు విసరవు గద,లుక మానవే కోమలా, యౌరౌర! బిగువిదేలో!
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. ‘కద+అలుక’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
గురువుగారు, సవరించిన పద్యం-పలుకె బంగారమాయెనా, పలుకవే లలనరో, నీకలువ పువ్వుల వంటి యా కన్నులెఱదనములచిలుకుచున్నవి గాదటే! చిరునగవులొలుకవె, యలుక మానవే కోమలా, యౌరౌర! బిగువిదేలో!
పలుకె బంగారమాయెనా చిలిపి భామమౌనమే శరణమయేన, మనసు దోచినట్టి మగువవె నీవని నమ్మి వచ్చినాను నారీశిరోమణి నన్ను గనవె
గెలిచిన వారిపై బడుగు, బలహీన వర్గాల ఆవేదన:పలుకె బంగార మాయెనా పట్టమంద!పూరి గుడిసెల సందుల దూరి దూరి!ఓట్లనడుగు నపుడు మాదు పాట్లఁ గనియుమిన్నకున్నారు మీకిది మేలు కాదు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పలుకె బంగారమాయెనా పరమ పురుషవేడుకొందును వినవయ్య విన్నపాలుదురితములు తొలగించి యాదుకొన వయ్యకరుణ జూపుము కంసారి ఖలవిదారి.2పలుకె బంగారమాయెనా కలికి నీకుమనసు పడి దెచ్చితి నిట మల్లెపూలుఅలక మానవె శరణంటి నందుకొనుముతప్పిదమునిక చేయను తరుణి రావె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పలుకె బంగార మాయెనా భారతప్రధాని నోట ప్రత్యేక హోదా నొసంగుచుంటి మాంధ్రదేశమునకు చూడు డనఁగనాస లడియాస లాయె పో యాంధ్రులకును.
పలుకె బంగార మాయెనా? పలుకు మోడి!కులుకు హెచ్చగ రాహులు డులుకు వీడె నిలను వీడి డీసెలు ధర నింగి నంటె వెలవెలను వోయె రూపాయ విలువ నిలను!
పలుకె బంగార మాయె, నా పల్కు నిన్నుకలల లోనదేల్చు మగడ కాచు కొనుమమిలమి లమెరిసె తారలు మేడ పైనకలల రాణిని రాజా సకలము నేను :)జిలేబి
👌
పలుకె బంగార మాయెనా పవన పుత్ర
రిప్లయితొలగించండిపిలిచితి హనుమాయనుచును పేరుతోడ
కరుణతోడపలుకవేమి కపివరేణ్య
రామ నామమ్ము పలుకుమా రమ్యముగను
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పలుకె బంగార మాయెనా యలిగిన చెలి
రిప్లయితొలగించండితగదు నీకింత పంతంబు తగవు చాలు
నొప్పుకొందును నీముందునోడినాను
పట్టుకొందును నీకాళ్ళు పట్టు విడుము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీనుండి నేనూహించిన పద్యమే వచ్చింది. బాగుంది. అభినందనలు.
పలుకె బంగార మాయెనా చిలిపి సకియ
రిప్లయితొలగించండియలుక దీర్చగ దెచ్చితి వలపు పూలు
కలల తేలించి కరిగించు కాచి నన్ను
మదిని వేధింప తగదులే మగువ నీకు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శుభోదయం !
రిప్లయితొలగించండిపలుకె బంగార మాయెనా పతికి నేడు ?
పలుకు లేమి పలుక ? తొలి పలుకు నీది
మరియు మలి పలుకును నీది ! మగడు వేరు
పలుకు పలుకనేల జిలేబి? పలుక జాల !
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండికులుకు పలుకుల ములుకుల చిలికిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిముత్యాల సరము2:
తొలగించండిపలుకె బంగార మాయెనా క
నలుటె సింగారమాయేనా
కులుకెవిడ్డూరమాయేనా
సలుపు రామా కృప
దత్త పాదమున కించుక సవరణతో:
పలుకె బంగార మాయేనా
యలుకె సింగారమాయేనా
కులుకెవిడ్డూరమాయేనా
సలుపు రామా కృప
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపలుకె బంగార మాయెనా భద్ర శైల
తొలగించండివాస కలనైన కనిపించవా యినకుల
సోమ జాగేల నను బ్రోవ సురవిభు నుత
సుంతయిన దయ జూపవా సుంద రాంగ
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
‘ఆయేనా’ అనడం గ్రామ్యం.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. రామదాసు కీర్తనలో ఉన్నది కదా యని వ్రాసాను. ఆ సందేహముతోనే తేటగీతిలో కూడా పూరణ చేశాను. ధన్యవాదములు.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిగాయకులు అలా పాడతారు కాని నిజానికి ఆ కీర్తనలోనిది ‘ఆయెనా’ అనే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి›
పలుకెబంగారమాయెనాలలిత!నీకు నీదునామంబులన్నియుదినము
దినముబారాయణంబు నుదీక్షతో!డ చేయుచుంటినిగదయమ్మ!వేయి మార్లు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
రెండవపాదంలో గణదోషం. యతి తప్పింది. ‘నీదు నామంబు లన్నియు నేను దినము’ అనండి.
పలుకె బంగార మాయెనా వారిజాక్షి
రిప్లయితొలగించండిఅలుకవీడి నీప్రియ సఖు నాదరించు
తప్పులన్నియు మన్నించి దెప్పకుండ
కౌ గిలింతల నియ్యవే కరము వేగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.అభినందనలు.
పలుకె బంగారమాయె నోపడతికపుడు
రిప్లయితొలగించండిపతికి కట్నాల మోజున్నపాలుబంచ
శోభనంబున శోధనా లాభమేమి?
ననుచు వరుడెంచు భావాలు మనసు ద్రుంచు|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
దత్తాంశంలో ‘ఆయెనా’ను మీరు ‘ఆయెనో’ అన్నారు. ‘లాభమేమి|యనుచు...’ అనండి.
మధురాక్కర
రిప్లయితొలగించండిపలుకె బంగారమాయెనా, పలుకవే లలనరో, నీ
కలువ పువ్వుల వంటి యా కన్నులెఱదనముల
చిలుకుచున్నవి గాదటే! చిరునవ్వు విసరవు గ
ద,లుక మానవే కోమలా, యౌరౌర! బిగువిదేలో!
లక్ష్మీదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘కద+అలుక’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
గురువుగారు, సవరించిన పద్యం-
తొలగించండిపలుకె బంగారమాయెనా, పలుకవే లలనరో, నీ
కలువ పువ్వుల వంటి యా కన్నులెఱదనముల
చిలుకుచున్నవి గాదటే! చిరునగవులొలుకవె,
యలుక మానవే కోమలా, యౌరౌర! బిగువిదేలో!
పలుకె బంగారమాయెనా చిలిపి భామ
రిప్లయితొలగించండిమౌనమే శరణమయేన, మనసు దోచి
నట్టి మగువవె నీవని నమ్మి వచ్చి
నాను నారీశిరోమణి నన్ను గనవె
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గెలిచిన వారిపై బడుగు, బలహీన వర్గాల ఆవేదన:
రిప్లయితొలగించండిపలుకె బంగార మాయెనా పట్టమంద!
పూరి గుడిసెల సందుల దూరి దూరి!
ఓట్లనడుగు నపుడు మాదు పాట్లఁ గనియు
మిన్నకున్నారు మీకిది మేలు కాదు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పలుకె బంగారమాయెనా పరమ పురుష
రిప్లయితొలగించండివేడుకొందును వినవయ్య విన్నపాలు
దురితములు తొలగించి యాదుకొన వయ్య
కరుణ జూపుము కంసారి ఖలవిదారి.
2పలుకె బంగారమాయెనా కలికి నీకు
మనసు పడి దెచ్చితి నిట మల్లెపూలు
అలక మానవె శరణంటి నందుకొనుము
తప్పిదమునిక చేయను తరుణి రావె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పలుకె బంగార మాయెనా భారతప్ర
రిప్లయితొలగించండిధాని నోట ప్రత్యేక హోదా నొసంగు
చుంటి మాంధ్రదేశమునకు చూడు డనఁగ
నాస లడియాస లాయె పో యాంధ్రులకును.
పలుకె బంగార మాయెనా? పలుకు మోడి!
రిప్లయితొలగించండికులుకు హెచ్చగ రాహులు డులుకు వీడె
నిలను వీడి డీసెలు ధర నింగి నంటె
వెలవెలను వోయె రూపాయ విలువ నిలను!
రిప్లయితొలగించండిపలుకె బంగార మాయె, నా పల్కు నిన్ను
కలల లోనదేల్చు మగడ కాచు కొనుమ
మిలమి లమెరిసె తారలు మేడ పైన
కలల రాణిని రాజా సకలము నేను :)
జిలేబి
👌
తొలగించండి