6, ఫిబ్రవరి 2016, శనివారం

సమస్య – 1936 (కత్తి వదలి వచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కత్తి వదలి వచ్చెఁ గదనమునకు.

62 కామెంట్‌లు:

  1. యుద్దమందుచూసె రక్తపాతములను
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
    వైరులంతగూడ ఔరాయనుచువెళ్ళె
    జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని కర్తను పేర్కొనలేదు. కొద్దిగా అన్వయలోపం ఉంది. ‘చూసె, వెళ్ళె’ అన్నవి సాధుశబ్దాలు కావు. మీ పూరణను ఇలా చెప్తే బాగుంటుందేమో!
      రక్తపాతముఁ గని రాజు మెచ్చక తాను
      కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
      వైరివీరతతియు నౌరా యని తొలఁగె
      జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల (?)

      తొలగించండి
    2. సార్
      నేను ఛందోరీతిగ పద్యాలు రాయడం ప్రారంభించింది జనవరి ౨౪ నుండే....
      నావి తాపత్రయ ప్రయత్నాలు మాత్రమే... అన్యదా భావింపకండి

      తొలగించండి
  2. గురువు గారికీ కవిమిత్రులకు నమస్కారము

    జనుల స్వామ్యమందు సమరమే యెన్నిక
    లోటరిచ్చు తీర్పె మేటి గనుక
    మధురవాక్కులెన్నొ మార్ధవమ్మున బల్క
    కత్తి వదలి వచ్చె గదనమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ఎన్నికలే ఆధునిక సమరాలన్న మీ పూరణ బాగున్నది.
      ‘సమర మెన్నికలె ప్రజాస్వామ్య మందున| నోటరిచ్చు...’ అంటే బాగుంటుందేమో? ‘కదనము’ టైపాటువల్ల ‘కధనము’ అయింది.

      తొలగించండి
    2. సమర మెన్నికలె ప్రజాస్వామ్య మందున
      నోటరిచ్చు తీర్పు మేటి గనుక
      మధుర వాక్కులెన్నొ మార్ధవముగ పల్క
      కత్తి వదలి వచ్చె గదనమునకు

      తొలగించండి
  3. కదనమనగ ఎన్నికలుగాదె యీనాడు
    విల్లు బాణ మిచట చెల్లదాయె
    ఓటె ఆయుధంబు ఓటరే రథికుండు
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      ఎన్నికల కదనరంగంలో మారణాయుధాల అవసరం లేదన్న మీ పూరణ బాగున్నది.
      ‘విల్లు బాణము లట చెల్లవాయె’ అంటే బాగుంటుంది.

      తొలగించండి
  4. కండ బలము కన్న గుండె ధైర్యము మిన్న
    కత్తి వదలి వచ్చెఁ గదన మునకు
    యుక్తి తోన గెలువ నుర్విజన కుమేలు
    రక్త పాత మందు రక్తి లేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      సామదానాద్యుపాయాలతో యుద్ధం గెలిస్తే ప్రజలకు మేలన్న మీ పూరణ బాగున్నది.
      ‘జనులకు’ అనవలసింది ‘జనకు’ అన్నారు. ‘యుక్తి గెలువ మేలు నుర్విజనుల కెల్ల’ అనండి.

      తొలగించండి
    2. కండ బలము కన్న గుండె ధైర్యము మిన్న
      కత్తి వదలి వచ్చెఁ గదన మునకు
      యుక్తి గెలువ మేలు నుర్విజనుల కెల్ల
      రక్త పాత మందు రక్తి లేదు

      తొలగించండి
  5. ఆ.వె. ఆయుధమును పట్ట యని ముందు గనుజెప్పి
    యాదవులొక వంక యతనొకడొక
    పక్ష మనుచు నంద బాలుడు యనినట్లె
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంథా భానుమతి గారూ,
      ఆయుధం పట్టనంటూ పాండవపక్షం చేరిన కృష్ణుడు విషయంగా మీ పూరణ బాగున్నది.
      ‘పట్ట నని...వంక నాతఁడు నొక... బాలుఁ డవ్విధమున..’ అనండి. ‘అని, కదనము’ అని పునరుక్తి ఉంది కనుక.

      తొలగించండి
    2. ఆయుధమును పట్టనని ముందు గనుజెప్పి
      యాదవులొక వంక నాతడు నొక
      పక్ష మనుచు నంద బాలుడవ్విధమున
      కత్తి వదలి వచ్చెఁ గదనమునకు.

      తొలగించండి
    3. చాలా బాగుందండీ సవరణ. ధన్యవాదములు శంకరయ్యగారూ.

      తొలగించండి
  6. బీరువొక్కడేగి పోరుకై సేనతో
    శత్రు బలము గాంచి జంకె నతడు
    కత్తి వదలి వచ్చె, గదనమునకు నేడు
    మంచి రోజుగాదు మరలు మనెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      పిరికివానిని గూర్చిన మీ రెండవ పూరణ బాగున్నది. సమస్యను విరిచి భావాన్ని సమర్థంలో నిర్వహించారు.

      తొలగించండి
  7. శా౦త్య హింస లనెడి సాధనముల చేత
    విజయ మమరు ననుచు విశ్వసించి
    దేశ స్వేచ్చకొరకు దీక్ష బూనిన గాంధి
    కత్తి వదలి వచ్చె గదనమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      సత్యాగ్రహ సమరాన్ని గురించిన మీ పూరణ బాగున్నది.
      ‘దేశస్వేచ్ఛ’ అన్నచోట ‘శ’ గురువై గణభంగం. ‘దేశముక్తి కొఱకు...’ అందామా?

      తొలగించండి
  8. తెల్ల వారి నెల్ల వెళ్ళగొట్టగ నెంచి
    సమర శంఖమూది జాతిపితయె
    శాంతియుతముగాను సాధింప స్వేచ్ఛను
    కత్తివదలివచ్చె కదనమునకు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      గాంధీజీ విషయంగా మీ పూరణ బాగున్నది.
      ‘వెళ్ళగొట్టగ’ అన్నది వ్యావహారికం. ‘తెల్లదొరతనమ్ము నెల్ల వెడలఁగొట్ట’ అనండి.

      తొలగించండి
  9. తనదు దోర్బలమును తరుణికి జూపంగ
    మదిని తలచు కొనుచు మగడు తాను
    వేడ్క జూడ గదలి వేగ రమ్మనుచును
    కత్తి వదలి వచ్చెఁగదనమునకు.
    2.సమర రంగమందు సహన భావనతోడ
    కయ్యమునను గాదు నెయ్యమొకటె
    చివరి వరకు శాంతిసిరుల పంచుననుచు
    కత్తి వదలి వచ్చెఁగదనమునకు.
    3.విశ్వశాంతి కోరి వినయంబుతో బాపు
    సహనము నిల జూపి శాంతి పెంచి
    జనులమదిని దోచి జయమునం దించగ
    కత్తి వదలి వచ్చిఁగదనమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ చివరి రెండు పూరణలు బాగున్నవి. మొదటి పూరణలో అన్వయలోపం ఉంది. భావం స్పష్టంగా లేదు.

      తొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఉత్తరు౦డు పలికె నుత్త ప్రగల్భముల్ --
    తరుణుల కడ. | ధనువు దాల్చె , గాని
    శరధిని ధరి యి౦ప మరచి పోయి , మరియు
    కత్తి వదలి >> వచ్చె కదనమునకు

    { శరధి = అమ్ముల పొది }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      అమ్ములపొది, కత్తి వదలి వచ్చిన ఉత్తరుని గురించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి

  11. ఉత్తరుడు బృహన్నలు జతన వెళ్ళెర
    యుద్ధమునకు; అచట యున్న సేన
    జూచి భీతి తోడ ఉత్తరుడు గనెను
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు !

    జిలేబి

    రిప్లయితొలగించండి

  12. ఆట వెలది తోడ నాటలా డుదమని
    కత్తి వదలి వచ్చె కదన మునకు
    ఆట ఆట పాట గాగన సుఖమున
    ఛందమును వదిలితి చందము గన :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మొదటి పూరణలో ఛందోవ్యాకరణ దోషాలు పెక్కులున్నవి. మొదటిపాదంలో యతి తప్పింది. ‘ఉత్తరుడు బృహన్నలలు’ అనవలసింది. ‘వెళ్ళెర’ అనడం సాధువు కాదు. రెండవపాదంలో ‘అచట నున్న’ అనాలి. అక్కడ యడాగమం రాదు. మూడవపాదంలోను యతి తప్పింది. పద్యం నడక, భావం కృతకంగా ఉన్నాయి.
      రెండవ పూరణలో ఛందోదోషాలు లేకున్నా మీ భావం అవగాహన కావడం లేదు.
      మీరు మరికొంత కాలం కేవలం ‘పద్యరచన’ శీర్షికలోనే అభ్యాసం చేసి, చేయి తిరిగిన తదుపరి సమస్యలను పూరిస్తే బాగుంటుందని నా సలహా.

      తొలగించండి
  13. పెండ్లినాడ తరలు వేళలో సమరమ్ము
    ముంచు కొచ్చెననుచు యెంచి నట్టి
    వరుడు వధువు కంపె బాసికమును గట్టి
    కత్తి , వదలి వచ్చెగదనమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. ‘బాసికాన్ని కట్టిన కత్తిని వధువుకు వదలి రావడం’ చక్కని ఊహ. బాగుంది.
      ‘అనుచు+ఎంచి’ అన్నపుడు యడాగమం రాదు. ‘అనుచు నెంచి’ అనండి.

      తొలగించండి
  14. హింస తోడి పోరు హేయ మటంచును
    కరుణ నాశ్రయించె ఘనుడశోక
    చక్రవర్తి విమల సార యశుడు
    కత్తి వదలి వచ్చె గదనమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      హింసను వదలిన అశోకుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘సారయశు డగుచు’ అనండి.

      తొలగించండి
  15. ఏక చక్ర పుర జనేప్సితముం దీర్పఁ
    దల్లి పంపున జని దనుజు బకునిఁ
    జంప ననిల సుతుడు శకటంబు పైనెక్కి
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      రిక్తహస్తాలతో బకుని చంప వచ్చిన భీముని గురించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. పూర్వ కాల మందు నేర్వదొడగిరట
    కత్తియుధ్ధములను,గ్రొత్తయాయు
    ధములు వచ్చు కతన దారకొం డయిపుడు
    కత్తి వదలి వచ్చె గదన మునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      కత్తియుద్ధాల కాలం పోయి కొత్త ఆయుధాలు వచ్చాయన్న మీ పూరణ బాగున్నది.
      కాని ‘దారకొం డయిపుడు’.. అర్థం కాలేదు.

      తొలగించండి
    2. దారకొండ మనిషిపేరు ఏజెన్సీ ఏరియావారి పేర్లు ఇలానే ఉంటాయండి

      తొలగించండి
  17. సరసు లంత మెచ్చు సమరమే యవధాన
    క్రీడ యనుచు దలచి, కీర్తి కొరకు
    కదిలె పండితుండు కలమనెడు తనదు
    కత్తి వదలి వచ్చె గదనమునకు.

    రిప్లయితొలగించండి
  18. కామ కదన మాడ గత్తితొ పనియేమి?
    మగువ మనసు దోచు మల్లెలున్న
    కురుల విరులు దురిమి కులుకులాడులు బిల్వ
    కత్తి వదలి వచ్చె గదన మునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      అవధాన సమరాన్ని గురించిన పూరణ, కామ కదనాన్ని గురించిన పూరణ రెండూ బాగున్నవి.

      తొలగించండి
  19. 16 కత్తివదలివచ్చె కదనమునకు-యుద్ధ
    వీరు డయ్యు –విర్ర వీగ ఫలమ?
    కత్తిగలిగి యుండి కర్షకు డయ్యును
    పంట వేయకున్న ఫలము రీతి|
    2.కత్తి కరుకుదనము కలముచురుకు దనం
    చేత నైన వాడి చెంత జేర
    ఫలిత మబ్బు|లేద?పరిహాసమే-తను
    కత్తి వదలివచ్చె కదనమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మొదటి పూరణ బాగున్నది.
      రెండవ పూరణలో అన్వయం లోపించింది. ‘కరుకుదనం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  20. మతిమరుపుగలిగిన మనుజులపనులన్ని
    గతులుదప్పుచుండు వెతలుపెరుగు
    వెడెలె కలము మరచి బడికొకండు నొకడు
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      మతిమరుపు వ్యక్తులను గురించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
  21. కరము చందు గాంధి పరుల పాలన నుండి
    ముక్తి కలుగ జేయు యుక్తి తోడ
    హంస వన్నె మదిని హింసను విడనాడి
    కత్తి వదలి వచ్చె కదనమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      గాంధీజీని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
  22. కలము చేత బట్టి కావ్యమ్ము రచియించె!
    కత్తి చేత బట్టి కదను ద్రొక్కె!
    గెలువ కావ్య చర్చ కృష్ణరాయలవారు
    కత్తి వదలి వచ్చె గదనమునకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      సాహితీ సమరాంగణ సార్వభౌముని గురించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
  23. కలము వదలి జేర కార్యాలయమొకండు
    కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
    విశ్వమందు నరులు విజ్ఞాన మార్జించ
    కార్య సాధనముల గనెదరటులె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      కార్యసాధనాల గురించిన మీ పూరణ బాగున్నది.
      కొంత అన్వయలోపం ఉన్నట్టుండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. యుధ్ధముల నొనర్చ నుదజని యస్త్రము
      లుప్పరమ్ము నుండి నిప్పు గురియు,
      మరతుపాకి యుండ నురుమాడ, కరమున
      కత్తి వదలి వచ్చె గదనమునకు

      తొలగించండి
    4. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.

      తొలగించండి

  24. తనదు దోర్బలమును తరుణికి జూపంగ
    మదిని తలచు కొనుచు మగడు తాను
    వేడ్క జూడ గదలి వేగ రమ్మనుచును
    కత్తి వదలి వచ్చెఁగదనమునకు.
    తన బాహుబలంతతో శత్రునిర్మూలనం చేయాలనుకొన్న భర్త ఆయుద్ధ వేడుకను భార్యకు చూపాలనుకొని కత్తి లేకుండా వచ్చాడని వూహించి వ్రాశానండి

    రిప్లయితొలగించండి
  25. గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
    శా౦త్య హింస లనెడి సాధనముల చేత
    విజయ మమరు ననుచు విశ్వసించి
    దేశముక్తి కొరకు దీక్ష బూనిన గాంధి
    కత్తి వదలి వచ్చె గదనమునకు

    రిప్లయితొలగించండి
  26. గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
    శా౦త్య హింస లనెడి సాధనముల చేత
    విజయ మమరు ననుచు విశ్వసించి
    దేశముక్తి కొరకు దీక్ష బూనిన గాంధి
    కత్తి వదలి వచ్చె గదనమునకు

    రిప్లయితొలగించండి
  27. పొరబాటు గమనించాను. అనుకున్నదే వ్రాయలేక పోయాను.కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  28. అస్త్ర విద్య లెల్ల నభ్యసించని వాడు

    శస్త్ర విద్య కూడ సాధ్య పడక

    పోరు మొగము కూడ యెరుగని వీరుడు

    కత్తి వదలి వచ్చె కదనమునకు

    విద్వాన్ డాక్టర్ మూలె. విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామమునిరెడ్డి గారూ,
      అకృతాస్త్రుని గురించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి