10, ఫిబ్రవరి 2016, బుధవారం

పద్యరచన - 1167

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. శీతల పానీయమ్ముల
    నేతీరుగ ద్రావగలుగు నిరుపేదలిలన్ ?
    భూతల మందున చవకగ
    ప్రీతినొసగు గోళిసోడ ప్రియమను గూర్చున్

    రిప్లయితొలగించండి
  2. తక్కువ ధరకే దొరుకును
    గ్రుక్కెడు సేవించి నంత గోళీ సోడా
    మక్కువ ఆంధ్రుల వరమిది
    మిక్కిలి ప్రియమంటు జనులు మీరిన వేడ్కన్


    రిప్లయితొలగించండి
  3. గ్రోలిన చాలును మనుజులు
    గోలీ సోడాను దప్పి కొర్కెల్ దీర్చున్
    సోలగ దేహము వేసవి
    కాలమున హితుడవు నీవె కావే సోడా!!

    నీముద్దుల నడుమదుముచు
    నీ మూతిని నోట బట్టి నేర్పరి రీతిన్
    నీ మాధుర్యము గ్రోలమె
    సామమె గుటగుట గటగట సడులిక సోడా!!

    తలపై గంగను దాల్చుట
    జలమున శయనించుట మరి సతతంబు కమం
    డలమున నీరము నింపుట
    తలచిన ముగ్గురికి నీవు దక్కక సోడా!!


    మేసిన తిండికి నుదరా
    యాసము నుబికుబికి వచ్చి యల్లాడించన్
    గ్యాసుకు గ్యాసె విరుగుడని
    ధ్యాసే నీపై కలుగును తప్పక సోడా!!

    కయ్యనుచు వచ్చు చప్పుడు
    కయ్యము కాదది తెఱచిన కంఠధ్వనమే
    నెయ్యపు పిలుపులు పిలుచుచు
    సయ్యాటకు రమ్మనుటయె సరసపు సోడా!!

    సంసార సారమె ద్రవము
    హింసించెడి యిడుమె గోలి, యిహమే సీసా
    ధ్వంసంబొందక నేర్పున
    కంసారి దయన్ గదుపుటె కర్జము సోడా!!

    రిప్లయితొలగించండి

  4. జిగురు వారు ఇన్నేసి పద్యాలు వ్రాసాక ఇంకా వ్రాయాలా అనిపించినా :)

    జోహారు "జీ" గురూ" :)

    చోళీ చూచిన వేసెద
    గోళీ సోడా జతయుగ గొప్పగ పదముల్
    పాళీ పోటున వ్రాసితి
    గోలుగ కందము సరళము గొలుసుగ గానన్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. నీ ముద్దుల నడుమదుముచు...జిగురి వారి శృంగార (చిలిపి) భావన అదిరింది...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందర్ని మర్చిపోయి నట్టున్నారు .మనతెలుగు వారు రాయడం మానేసారు .

      తొలగించండి
  6. ముద్దుల నడుమదుముచు..అన్ని విధాలా స్పృశించి జిగురు వారు మాకు గోలీ సోడా మిగల్చకుండా త్రాగేశారు...ఇంక గోలి వాడను నేనేమి గ్రోలవలెనో....

    రిప్లయితొలగించండి
  7. సోలిన వారికి ప్రీతిగ
    గ్రోలిన నుత్సాహమిచ్చు గోలీ సోడా !
    ప్రేలెడు గూండా చేతను
    ప్రేలగ నూ పడకు మమ్మ పెడుదు నమస్సుల్.

    రిప్లయితొలగించండి
  8. జిగురు వారి పద్యాల స్పూర్తితో....నాదొక సీసా

    నీమూతి మూతినుంచుచు
    సామూహిక ముద్దుజేయ స ' రసము ' గ్రోలన్
    ఏమీ తప్పనిపించద
    దేమో నీ " గ్యాసు " మహిమ తీయని సోడా !

    రిప్లయితొలగించండి
  9. రాత్రి మా తమ్ముడు (బాబాయి కొడుకు) మరణించాడు. మా స్వగ్రామం పైడిపెల్లికి వెళ్తున్నాను. మళ్ళీ ఏ రాత్రికో తిరిగిరావడం. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  10. నీటిలోనను కొంత నిమ్మరసము జేర్చి
    నింపుకొనుచు "గ్యాసు" నిక్కముగను
    బండిలో నెక్కుచు బరబరా దిరుగుచు
    గొంతు దడుపుగద గోలి సోడ
    విందు భోజనము పసందుగా నెక్కించ
    కడుపు నుబ్బరమును కడిగి వేయు
    మండుటెండనుబడి మసలెడు కూలీల
    దప్పికి చల్లని దారిజూపు

    దాని " కేక " వినగ వీనుల విందౌను
    సోకు దాని రూపు సొగసుమీరు
    మీరు ద్రావుడయ్య మిన్నగా రుచిజూడ
    సీసమిదియె " సోడ సీస " కిడుదు.

    రిప్లయితొలగించండి
  11. చప్పున దాహము దీర్చుచు
    గొప్పగ జీర్ణమ్ము జేయు గోలీ సోడా
    మెప్పును బొందుచునిలలో
    అప్పసముగ దొరకు గాదె నాంధ్రా సోడా!!!


    అప్పసము = ఎల్లప్పుడు

    రిప్లయితొలగించండి
  12. గోళీ సోడా మ్రోతకె
    కాళీయుడు పడగలెత్తి కస్సున రేగెన్!
    కేళీ వినోది యెగసియు
    గోళీ సోడాయె త్రాగి కూల్చగ నాడెన్!

    రిప్లయితొలగించండి
  13. గోలీ సోడా ప్రీతిగ
    గ్రోలుచు నుంద్రు సతతమ్ము కుప్పములందున్
    తాళగ వేసవి తాపము,
    చాల హితము కలుగుఁగొన్న జంబీరముతో
    కుప్పముః పల్లె, జంబీరముః నిమ్మ

    రిప్లయితొలగించండి
  14. సోడాద్రాగిన యెడలను
    మాడునగల నొప్పియంత మాయమయగును
    న్వేడెద నాకొకసోడా
    మాడుగులా!తెచ్చియిమ్శు మరినీవిపుడే

    రిప్లయితొలగించండి
  15. ఉన్నది గాజు బుడ్డినిట యోచన జేయగ ద్రావకంబెదో
    నున్నని గడ్డ రూపమున నువ్వుల నూనెను జేర్చినట్టుగా
    కన్నుల గానపట్టునది కాగను దోచును గోళిసోడగా
    తన్నుకు చావుడీ యనుచు తథ్యము శంకరులిచ్చిరిచ్చటన్

    రిప్లయితొలగించండి
  16. ఉన్నది గాజు బుడ్డినిట యోచన జేయగ ద్రావకంబెదో
    నున్నని గడ్డ రూపమున నువ్వుల నూనెను జేర్చినట్టుగా
    కన్నుల గానపట్టునది కాగను దోచును గోళిసోడగా
    తన్నుకు చావుడీ యనుచు తథ్యము శంకరులిచ్చిరిచ్చటన్

    రిప్లయితొలగించండి
  17. పద్యరచన గోలియుసోడ మీగొంతులోదిగినచో?
    ----------వేసవి వేడిమి వెళ్ళగొట్టు|
    ముద్దుగా ముద్దుల పద్దులు గైకొని
    ------గ్యాసు సోడాతీపి గళముజేర్చు|
    నాలుక తేలికై మేలును జేకూర్చ
    ----అంతరంగమునకు హాయినింపు|
    అరచెడి శబ్దమే నాహ్వాన మన్నట్లు
    -----పిలిపించుకొన గల్గు ప్రీతి సోడ
    జీర్ణ శక్తిని జేకూర్చు జింజరున్న
    వయసు బేధము లెంచని వన్నెసోడ
    దాహమెరుగక జేయును త్రాగ సోడ
    ఆంధ్రసోడాను మించిన యరుపు గలదె?



    రిప్లయితొలగించండి
  18. ఆదినుండి పేరున్నదీ యాంధ్ర సొడయె
    ఎండ కాలములోనను గుండె తడికి
    బడుగు బలహీన వర్గాల బంధు విదియె
    గోలిసొడ 'సుయ్యి'మని పిల్చు గోల జేసి.

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. అంగా రామ్లజ వాయు త
      రంగ సమృద్ధ విమలాతి రస నిక్షిప్తం
      బుంగనినం దాహంబు
      ప్పొంగదె జనులకు ననిశము మురియరె త్రాగన్

      తొలగించండి
  20. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గ్యాసెక్కువ. పట్టిన ---సో

    డా సీసా పగిలి పోవు ఢామ్మని | యటులే

    " గ్యాసెక్కువ కొట్టిన " నిక

    నీ సోదె విను నతని తల. నిజముగ. పగులున్

    ……………………………………………………

    { " గ్యాసెక్కువ కొట్టిన. " = పనికిమాలిన మాటలు వాగితే }
    ………………………………………………………

    రిప్లయితొలగించండి
  21. గురు మూర్తి గారు !

    సోడా య నమః !

    ఇవ్వాళ సోడా అందరికి జోష్ ఇచ్చినట్టుంది !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. 1.కడుపు యుబ్బరమును కరిగించు ద్రవమిది
    పేదవారి కెల్ల పెన్నిధిదియె
    తేన్పు లెన్నొ వచ్చు తిన్నగ కరిగించు
    మేలొనర్చు నిదియు ముందుగాను.
    2.గ్యాసు తొలగ చేసి గడబిడ తగ్గించు
    మంచి చేయుచుండు మానవులకు
    ధరయు తక్కువిదియు ధరలోన చూడంగ
    ఔషధమ్ము నిదియె నార్యులార !
    3.అలసిన జనముల నోటికి
    విలసితముగ హాయి నొసగి వేడిని తీర్చున్.
    కలలో తలచిన చాలును
    యిలలోకన్పించి ముదము నిచ్చును గనుమా.

    రిప్లయితొలగించండి