15, ఆగస్టు 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 5

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ..........
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

7 కామెంట్‌లు:

  1. manyaseema muddubidda seethraamaraju
    dopidaddukonu dodda gunamu
    adavithalli naakramanaku yaddani
    raamuni jampi harshamuna raaksasulellaru naatyamaadire

    రిప్లయితొలగించండి
  2. చిన్నా గారూ,
    మీ భావానికి వీలైనంత త్వరలో పద్యరూపాన్ని ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  3. భీమ పరాక్రమోపహిత భేరీనినాదములంత యెల్లెడల్
    సామజ ఘీంకృతుల్వలెను సామ్యము నొప్పగ తళ్ళికోటలో
    భామని సైన్య తుర్కలటు భండనమందున వృద్ధుడైన ఓ
    రామునిఁ జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే.

    విజయ నగర సామ్రాజ్యం అంతమైన తళ్ళికోటయుద్ధంలో రామరాజును భామనీ (బహుమని) సుల్తానులు అందరూ చేరి అంతమొందించారు.

    రిప్లయితొలగించండి
  4. "అసంఖ్య" గారి పూరణ -
    ఉ||
    క్షామముతోడిరాజ్యమున గద్దలు భిక్కుల భక్షమైననూ
    కామమదమ్ములందు గురిగల్గిన శిక్షకులుండుటే నిజం.
    క్షేమము లేనియా వికృతకేంద్రములో దయ విస్మరించి యా
    రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే
    22 ఆగస్టు 2010 1:16 ఉ

    రిప్లయితొలగించండి
  5. నారాయణ గారి పూరణ -
    భూములు పంచె పేదలకు భూపతులెల్లరు పెక్కటిల్ల; రా
    జ్యమ్ములు కంపమొంద జన జాగృతి సల్పెను; పోరు తప్ప ఇం
    కేమియు మిమ్ము కావవని యెర్రపతాకమునెత్తె-నట్టి మా
    రాముని జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే!

    పద్యం అలవాటు తప్పింది..చాలా రోజుల తర్వాత ప్రయత్నిస్తున్నాను..తప్పులుంటే క్షమించాలి. దయతో సరిచేస్తే దిద్దుకుంటాను.
    22 ఆగస్టు 2010 3:37 సా

    రిప్లయితొలగించండి
  6. "మిస్సన్న" అను దువ్వూరి సుబ్బారావు గారి పూరణ -
    యేమది గొప్ప సంబరములిత్తరి లంకను మిన్నుముట్టెడిన్
    రాముని జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే
    భూమిజ మారి నాపయిని మోహము జెందెనె యన్న రాజుతో
    స్వామి క్షమింపుడద్ది కపిబంధన హేలని మంత్రి వాకొనెన్

    దువ్వూరి సుబ్బారావు
    22 ఆగస్టు 2010 10:59 సా

    రిప్లయితొలగించండి
  7. ఏమని చెప్పెదన్ సుమతి? ఏడ్వగ రాముని భక్తులెల్లరున్
    గోముగ రంగనాయకమ కోపము మీరగ నిట్లు వ్రాసెబో:👇
    "రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే"
    చీమలు కుట్టగా గజము చిందులు త్రొక్కుచు చచ్చురీతినిన్

    రిప్లయితొలగించండి