12, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 64

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
నవమి నాఁడు వచ్చె నాగ చవితి.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

9 కామెంట్‌లు:

  1. చిత్రం! ఈ రోజు ఒక్కరు కూడా సమస్యాపూరణం చేయలేదు. కారణం తెలియదు. నాకైతే తప్పదు కదా!
    నా పూరణ -
    జరిగె రామపూజ చైత్ర బహుళ పక్ష
    నవమి నాఁడు; వచ్చె నాగ చవితి
    యాశ్వయుజములోన నదె బహుళ పక్షాన
    కొలువవలెను నాగకులము నేఁడు.

    రిప్లయితొలగించండి
  2. చవితి నాటి పూజ చండీశు తనయునకు
    దశమి నాడు చేస్తి దుర్గ పూజ
    వరము లెన్నొ కోరి వరలక్ష్మి పూజించి
    నవమినాడు వచ్చె నాగ చవిత్

    రిప్లయితొలగించండి
  3. మనము చేయగ పను లొనరింపఁ దగనట్టి
    నవమి నాఁడు వచ్చె. నాగ చవితి
    యైన నవమి కన్న హాయిని గొలుపును.
    నవమి కన్న చవితి నయము తలప.

    రిప్లయితొలగించండి
  4. చవితి నాటి పూజ చండీశు సుతునకు
    దశమి నాడు చేస్తి దశమి పూజ
    వరము లెన్నొ కోరి వరలక్ష్మి పూజించి
    నవమి నాడు వచ్చె నాగ చవితి.

    రిప్లయితొలగించండి
  5. నీఁదు కోర్కెఁ దీర్ప నేనశక్తుఁడ, రామ
    నవమి నాఁడు; వచ్చె నాగ చవితి
    రేపుమాపనంగ.ఓపుమల్లుఁడ దయ
    నంతవరకు.విడకు నాలి నిచట!

    రిప్లయితొలగించండి
  6. నిన్న రాత్రి వరకు ఒక్క పూరణ కూడా రాకపోయే సరికి కొద్దిగా నిరుత్సాహపడ్డాను. కాని ఆశ్చర్యం! ఆ తర్వాత ఒకటి వెంట ఒకటి నాలుగు పూరణలు వచ్చాయి. ఈ ఉదయం చూసి ఎంతో సంతోషించాను.
    నేదునూరి రాజేశ్వరి గారు తమ పద్యంలోని గణ యతి దోషాలను తామే సవరించి పోస్ట్ చేసారు.
    చింతా రామకృష్ణారావు గారు, రవి గారు చక్కని పూరణలు పంపారు.
    అందరికీ వందనాలు.

    రిప్లయితొలగించండి
  7. పుట్టినింటికమల పురిటికి శ్రీరామ
    నవమి నాఁడు వచ్చె; నాగ చవితి
    దాటె, కలిగె నొక్క తనయుడు ముద్దార
    జూపి మురిసె భర్త చూడ రాగ.

    ( పుట్టినింటికి + అమల)

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతమైన విరుపుతో చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘పుట్టినింటికి(న్) + అమల’ పుట్టినింటికి నమల అవుతుంది. ‘పుట్టినింటికి లత/కళ/సతి/మణి .. ఏదైన రెండక్షరాల పేరు’ సరిపోతుంది కదా.

    రిప్లయితొలగించండి