3, ఆగస్టు 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 117 (సప్తస్వర పద్యాలు)

కం.
మాపని నీపని గాదా?
పాపమ మా పాపగారి పని నీ పనిగా;
నీ పని దాపని పని గద
పాపని పని మాని, దాని పని గానిమ్మా!
కం.
సరి సరిగా మా మానిని
గరిమగ మరిమరిని దాని గదమగ పదమా
సరిగాని దాని సమ మని
సరిగద్దా గసరి దానిదారి గమారీ!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
క్రింది సమస్యను పూరించండి.
(సప్తస్వరాలతోనే పద్యం వ్రాయాలనే నిబంధన లేదు)
సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!

13 కామెంట్‌లు:

  1. చంద్రశేఖర్:
    గరిమ గని పని సరిగ నీ
    యర రామ! సదమల మతిగ నాపని సరిగా
    సరమ గొనిసేతు,లేదా
    సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!

    రిప్లయితొలగించండి
  2. సరిగమ యనుచును నీవిట
    మరిమరి పలుకగ, విరించి మానిని నీకే
    వరముల నిచ్చునొ! కలలిక
    సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!

    ఇద్దరి మధ్య సంభాషణ--

    సరిగమ యనుచును నీవిట మరిమరి పలుకగ, విరించి మానిని నీకే వరముల నిచ్చునొ!
    కలలిక సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!

    రిప్లయితొలగించండి
  3. మరి నీపద మాగమ సరి
    పరి పరి నీపదమ నిగమ పద సంపద - నీ
    సరిగా నీపనిగ సదా
    సరిసరి మాపనిని సరిగ సాగగ నిమ్మా!

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 03, 2011 12:33:00 PM

    మరిమరి పొగడెద వినుము త
    మరి,తుంటరి పనుల నేను మాపటి వేళన్
    విరివిగ, వదలవె ఓగడు
    సరి,సరి! మాపనిని సరిగ సాగగ నిమ్మా!

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతి శాస్త్రి గారి పూరణ ...

    పరిపరి విధముల వగచితి
    పరమేశా నిన్ను గొలచి ప్రార్థన జేతున్
    పరిహాసములా తండ్రీ
    సరిసరి మాపనిని సరిగ సాగుగనిమ్మా

    రిప్లయితొలగించండి
  6. చంద్రశేఖర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్కరాజు వెంకట రాజారావు గారూ,
    సరిగమల సర్కస్ చూపించారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ గడుసరి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. paripari vidhamula pogaDeda
    mari nI pAdamu vadalaka marimari ninnE
    karivadhanaa, vaMdanamuna
    sarisari | mApanini sariga sAgaga nimmA|

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మీ సరి మరి (ఏ)రీ? ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీరు ఆంగ్లలిపిలో పంపిన వినాయక స్తుతిరూపమైన పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ ధన్యవాదాలు.
    రెండవ పాదంలో యతిని సవరించిన తర్వాత :

    'సరిగమపదనిస' గద! మరి
    సరిగా నను, సరిగ, సరిగ సరగున! పద! నీ
    సరసమ? సురసమ? సరసా!
    సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా

    రిప్లయితొలగించండి
  10. నిగమ శర్మ మిత్రులతో కలసి అత్యవసర పని మీద వెళ్తూ దారిలో కలసిన సానిదాన్ని చూస్తూ ఆగి పొతే .. మిత్రుల మందలింపు....

    దరి సాని దాని నిగ నిగ
    మరి మరి గని, మాపని సగమాపగ గాదా !
    సరిగా గని పద నిగమా !
    సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా!

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతమైన పద్యాన్ని వ్రాసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి