ఈ ‘భేదం’ ఏమిటి?
తే. గీ.క్షాంతి, మేదస్సు, జలజము, సంక్షయమ్ము,
నొంటిపాటు, మోదమ్ము, ముక్కంటి, మౌని
యనెడి చతురక్షరపదమ్ము లందులో ద్వి
తీయవర్ణంబు లే ‘వాసిఁ’ దెలియఁజేయు?
కవిమిత్రులారా,
ఆ భేదం ఏమిటో చెప్పండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
వసంత కిశోర్ గారి సమాధానం ...
రిప్లయితొలగించండిసహనము - మస్తిష్కము - కమలము - నాశనము - ఏకాంతము - సంతసము - భైరవుడు - "--?--"
హస్తిమశకాంతరము
కోడీహళ్ళి మురళీ మోహన్ గారి ఛందోబద్ధ సమాధానం ...
రిప్లయితొలగించండిసీ.
స‘హ’నము కలిగిన సాధన తొలగించు
మ‘స్తి’ష్కమందలి మలినములను
క‘మ’లము హృదయము కంజరుడా హరి
నా‘శ’నమొనరించు పాశములను
ఏ‘కాం’తమందు లక్ష్మీకాంతు దలచుచు
సం‘త’సముననుండు చింత తొలగు
ప‘ర’మేశు చింతన చెరగక మదిదాల్చు ఓ
ము‘ము’క్షువ నీవు యోగమబ్బు
తే.గీ.
పలుకు పలుకుట సులభమ్ము చిలుక వోలె
నిష్టతో హరి జేరుట కష్టతరము
‘హస్తిమశకాంతరము’ జూడ ఆర్యులార
శంకరాభరణము జూచు సరసులార!
చంద్రశేఖర్ గారి సమాధానం ...
రిప్లయితొలగించండిసమాధానము: హ-స్తి-మ-శ-కాం-త-ర-ము
స-హ-న-ము
మ-స్తి-ష్క-ము
క-మ-ల-ము
నా-శ-న-ము
ఏ-కాం-త-ము
సం-త-స-ము
పు-ర-హ-ర
ము-ము-క్షు-వు
*
గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం ...
సహనము,మస్తిష్కము,కమలము,నాశనము,ఏకాంతము,సంతసము,కరకంఠి,ముముక్షువు
‘హస్తిమశకాంతరము’
సమాధానములు వ్రాసిన కవిమిత్రులకు అభినందనలు.
రిప్లయితొలగించండిమురళీ మోహన్ గారూ !మీ ఛందోబద్ధ సమాధానం చాల బాగుంది.
హస్తి వోలె దోచె హాయిగా సీసమ్ము
తెలియ మశక మాయె తేట గీతి
అంతరమ్ము లేదు అర్థమ్ము గ్రహియింప
రెండు గలిపి చూడ మెండు యగును.