8, ఆగస్టు 2011, సోమవారం

సమస్యా పూరణం -419 (విరులు దాఁకగానె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

24 కామెంట్‌లు:

  1. ప్రకృతి వైద్య మునకు పరగ కేరళ జేరి
    కాయ గూరల దిని కాయమునకు
    'స్టీము బాతు ' జేయ బూనితి, యట యా
    విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

    రిప్లయితొలగించండి
  2. విజయవాడ సొంపు వింతలింతలు గావు
    గ్రీష్మతాప మందు కేకరింపు
    మండుటెండ లోన మల్లె ఘుమఘుమలా
    విరులు దాఁకగానె వేఁడి పుట్టె (.పుట్టు)!

    రిప్లయితొలగించండి
  3. శీత కాలమందు చెప్పగా నొక రాత్రి
    విరుల బాణ మేయ పురహరారి
    విరులు ముడిచి రాగ కురులందు శ్రీమతి
    విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

    రిప్లయితొలగించండి
  4. పంచముఖుని పైన పంచశరుడు వేసె
    వాడి కోల లపుడు బ్రహ్మ సెప్ప
    చిచ్చు కన్ను విప్పి శివమెత్తి యాడెనే
    విరులు దాఁక గానె వేఁడి పుట్ట!

    రిప్లయితొలగించండి
  5. భృంగ చయము గూడె బిసరుహముల పైన
    విధువు వచ్చి యిచ్చె సుధలు గొన్ని
    కనుల కందక చన కమలాక్షి!మరుడేయు
    విరులు దాఁక గానె వేఁడి పుట్టె !

    రిప్లయితొలగించండి
  6. మరులు పుట్టఁజేయు మాలిక శోభను,
    కురుల సుందరతనుఁ గూర్మి పెంచు
    నెద్ది? ఎట్లు నిన్ను నిప్పు పలుకరించె?
    విరులు; దాఁకగానె వేఁడి పుట్టె.

    రిప్లయితొలగించండి
  7. సిరిగ దల్చె నతడు పొరుగింటి పిల్లను
    చంద్రభాసురమ్ము చవికి గొనుచు
    తురగ మెక్కి పడియె తూపుల గుఱి గొని
    విరులు దాఁక గానె వేఁడి పుట్టె !!!

    రిప్లయితొలగించండి
  8. డా.మూర్తి మిత్రమా! "చంద్రభాసురం-తురగం" చూస్తూవుంటే మీ తూపులు నా మీదకే సంధించినట్టున్నారు :-)

    రిప్లయితొలగించండి
  9. కోడె గాని మనసు కోమలిపై చిక్కె.
    గుబులు మనసు తోడ కోర నరిగి
    యామె చేరె నపుడు యామె నిశ్వాస యా
    విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

    రిప్లయితొలగించండి
  10. ఆ : అక్రమ సిరులు దోటి ఆట్లాడుచుండగ
    సిరుల రాక పోక చిత్రము జూడ
    గ సి.బి .ఐ, విషయము గరళము వోలె యా
    విరులు దాక గానె , వేడి పుట్టె|
    { అవినీతి పరులపై }

    రిప్లయితొలగించండి
  11. ఆమె కౌగిలింత నదుముకొనగ నన్ను
    చేర్చె వీపు పైన చేతు లపుడు!
    ఆమె చేతి వ్రేళు లగ్ని పూలుగ మారె -
    విరులు దాకగానె వేడి బుట్టె!

    రిప్లయితొలగించండి
  12. ఎదను నొకరు , తనువు నెడమన నొక్కరు
    సురలు సతుల దాల్చి మురియు చుండ
    నిచటి మగల కితర నెరజాణ చూడ్కుల
    విరులు దాక గానె వే(డ్క)డి పు(ట్టు)పుట్టె

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర మిత్రమా ! మరి నాకొఱకు తెచ్చిన చంద్రభాసురాన్ని మా పొరుగులో ఉన్న పడుచుకు సమర్పించు కొన్నారా ? ఆమెతో బాటు తర్వాత గుఱ్ఱము యెక్కుతారా ( మా విశాఖలో గుఱ్ఱమెక్కడమంటె =మస్తుగా త్రాగడమని కూడా అర్ధముంది. విజయవాడ వారికి విన్నపించుకోక తప్పదు.)
    అయినా పరనిందతో పద్యాలు వ్రాస్తే గురువు గారు యొప్పరు. నా పద్యాలన్నీ కల్పితాలే !

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురుభ్యో నమః, మీ సూచన చాలా బాగుంది.

    సిరిగ యెంచెఁ దాను పొరుగింటి పిల్లను
    చంద్రభాసురమ్ము చవి గొనుచును
    తురగ మెక్కి పడియె తూపుల గుఱి గొని
    విరులు దాఁక గానె వేఁడి పుట్టె !

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. ముఖ్యంగా స్టీమ్ బాత్ పూరణ శ్రేష్ఠం. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలూ ఉచ్చటగా ఉన్నాయి. అభినందనలు.
    ‘చవికి గొనుచు’ను ‘చవిగొనుచును’ అంటే బాగుంటుందేమో?
    *
    మందాకిని గారూ,
    ప్రశ్నోత్తరరూపమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘చేరె నపుడు + ఆమె నిశ్వాస’ అన్నప్పుడు యడాగమం రాదుకదా!
    ‘యామె చేరె నప్పు డామె నిశ్వాస’ అంటే ఎలా ఉంటుంది?
    *
    వరప్రసాద్ గారూ,
    పూరణకు మంచి విషయాన్ని ఎన్నుకున్నారు. అభినందనలు.
    కాని ప్రథమ, ద్వితీయ పాదాలలో గణదోషం ఉంది. నా సవరణ ..
    అక్రమార్జ(నమ్మె యాటలాడుచునుండ)
    సిరుల రాక పోక చిత్రము (గన)
    గ సి.బి .ఐ, విషయము గరళము వోలె యా
    విరులు దాక గానె , వేడి పుట్టె|
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సరసమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘సిరిగన్ + ఎంచి’.. యడాగమం రాదు కదా! ‘సిరిగ నెంచి’ అని ఉండాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  17. ఆర్యా! చేరెనపుడె అని వ్రాసినది చేరెనపుడు అని టైపు చేయడం జరిగినదానిని గమనించ లేదు.
    ఈ క్రింది విధంగా వ్రాసిన పద్యం అది.

    కోడె గాని మనసు కోమలిపై చిక్కె.
    గుబులు మనసు తోడ కోర నరిగి
    యామె చేరె నపుడె, యామె నిశ్వాస యా
    విరులు దాఁకగానె వేఁడి పుట్టె.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ ధన్యవాదములు.

    సిరిగ నెంచెఁ దాను పొరుగింటి పిల్లను
    చంద్ర భాసురమ్ము చవి గొనుచును
    తురగ మెక్కి పడియె తూపుల గుఱి గొని
    విరులు దాఁక గానె వేఁడి పుట్టె !

    రిప్లయితొలగించండి
  19. శ్రీపతిశాస్త్రిసోమవారం, ఆగస్టు 08, 2011 9:17:00 PM

    శ్రీగురుభ్యోనమ:
    పొంచిపొంచి తాను పొదలచాటులనుంచి
    భయముతోనె మరుడు బరితెగించి
    పూలశరము విడిచె ఫాలాక్షునింజేర
    విరులు తాకగానె వేడి పుట్టె

    రిప్లయితొలగించండి
  20. చింతా రామకృష్ణారావు గారూ,
    నేనది టైపాటని గమనించవలసింది. తొందరపడి దోషారోపణ చేసాను. మన్నించండి.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఇప్పుడు పద్యం నిర్దోషంగా ఉంది. సంతోషం!
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. విరులు దాకగానె వేడి పుట్టె ,వనిత
    కురులు మెరియ గానె మరులు పెరిగె,
    చిన్న దానికళ్ళు చిలిపి గొళ్ళాలాయె
    వయసుచిత్రమదియె వలపుమొలిచె!!!

    రిప్లయితొలగించండి
  22. మంద పీతాంబర్ గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. పెద్దల, మిత్రుల అందరి పూరణలూ అలరిస్తున్నాయి.
    హనుమచ్చాస్త్రి గారి ' స్టీమ్ బాత్ ' కు మాత్రం ఎక్కువ మార్కులు.

    రిప్లయితొలగించండి
  24. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మిస్సన్న గారూ ! నా ఆ విరుల స్నాన పద్యాన్ని మెచ్చు కున్నందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి