9, ఆగస్టు 2011, మంగళవారం

సమస్యా పూరణం -420 (పొర్లుదండాలతో)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పొర్లుదండాలతో రాచపుండు మానె.
ఈ సమస్యను పంపిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.


23 కామెంట్‌లు:

  1. సోనియమ్మకు నక్కటా సుస్తి జేసె
    ఆమె యారోగ్యమే మాకు నాస్తి పాస్తి
    దేవుడా కాచి రక్షించు దేశ మనెడి
    పొర్లుదండాలతో రాచపుండు మానె.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ ! కాలానుగుణ పూరణ, బలే వుందండీ ! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్నగారూ మీ పూరణ అదిరింది

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ ! నేనూ మీ బాట లోనే వస్తున్నా....

    అమ్మ గారిని జేర్చిరి అమెరికాన
    ఆసుపత్రిలొ క్యాన్సరు ఆపరెషన్
    కొరకు, నేటికి భక్తులు కోరి సలుప
    పొర్లుదండాలతో రాచపుండు మానె.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి ధన్యవాదాలు,నమస్కారములతో
    కలియుగంబున దొరకును కలిమి గొరకు
    మందు, యంత్రతంత్రములతో మంత్రి పదవు
    లొచ్చు, గోటితో గిల్లిగ నొచ్చు కీర్తి,
    పొర్లు దండాలతో రాచ పుండు మానె|

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 09, 2011 9:27:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    వరములిచ్చెడి హరి తాను వైద్యు డనగ
    మోదమొందగ భక్తుడై మ్రొక్కు దీర్చె
    పొర్లు దండాలతో, రాచపుండు మానె
    వైద్యుడొసగిన మూలిక వాడినంత

    రిప్లయితొలగించండి
  7. భావ దాస్యమ్ము ప్రబలమై భారతాన
    నెవరు లేనట్లు సోనియా పవరు గోరి
    యమ్మదేవతకై పూజనమ్ము లొనరె
    పొర్లు దండాలతో రాచపుండు మానె

    రిప్లయితొలగించండి
  8. ధరలు బెరుగంగ దొర్లెడు దొరలు లేరు,
    పైర్లు మునుగంగ,యెండoగ పట్టి లేదు,
    పొంగి పొర్లంగ యవినీతి, పోరు లేదు,
    బరువు గుండెతో కళ్ళన్ని బైర్లు గ్రమ్మ
    పొర్లు దండాలతో రాచపుండు మానె ?

    రిప్లయితొలగించండి
  9. పీతాంబార్ గారూ, రాజారావు గారూ చక్కటి భావ ప్రకటన. సంతోషం. నాపూరణ:
    ఎచట గలిగెనో పుండది యేరికెరుక?
    ఖర్మ! ఘనభారతీయుల కన్నుగప్పి
    చాటు మాటుగ గొనునువైద్య సరణి నెటుల
    పొర్లు దండాలతో రాచపుండు మానె ?

    రిప్లయితొలగించండి
  10. మూడో పాదంలో టైపాటు సవరించి:
    ఎచట గలిగెనో పుండది యేరికెరుక?
    ఖర్మ! ఘనభారతీయుల కన్నుగప్పి
    చాటు మాటుగ గొనువైద్య సరణి నెటుల
    పొర్లు దండాలతో రాచపుండు మానె ?

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని భావమే సందిగ్ధంగా ఉంది. ‘గొరకు, ఒచ్చు’ పదప్రయోగం ..?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    భారతీయుల భావదాస్యాన్ని వివరిస్తూ మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    నిజమే! సామాన్యులకోసం ఏ రాజకీయనాయకుడూ, కార్యకర్తా ఏమీ చేయరు. నేతలకోసం శతచండీయాగాలు, అభిషేకాలు అన్నీ చేస్తారు. మంచి పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ ధన్యవాదాలు.
    హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
    మూర్తిమిత్రమా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. తనదు గోప్యము గాచెడి తనయునిడెను
    పార్టి పదవిన, కోటరీ ప్రక్క నెట్టి!
    నమ్మిన దెవరిన్ మరిముంచిన దెవరినిక
    సోనియా సోది తెలుసుకో సొంత బుద్ధి!
    పొంగు విడచి లంచగొండుల పొగరణచిన
    పొర్లు దండాలతో రాచపుండు మానె!!

    రిప్లయితొలగించండి
  14. ఐదవపాదంలో టైపాటు సవరించి:
    తనదు గోప్యము గాచెడి తనయునిడెను
    పార్టి పదవిన, కోటరీ ప్రక్క నెట్టి!
    నమ్మిన దెవరిన్ మరిముంచిన దెవరినిక
    సోనియా సోది తెలుసుకో సొంత బుద్ధి!
    పొంగు విడి లంచగొండుల పొగరణచిన
    పొర్లు దండాలతో రాచపుండు మానె!!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గురుభ్యో నమః

    కుక్క కాటుకి మందుల కొఱత యైన
    బక్క చిక్కిన బిడ్డల బ్రతుకు బరువు
    నరువ దేండ్లై మోయుచు భరత మాత

    పొర్లు దండాలతో రాచ పుండు మానె !

    కుక్క కాట్లతో మనుష్యులు మరణించడము, వైద్యానికి దేశ రాజకీయవేత్తలు అధికారులు విదేశాలకు పరుగెత్తడము కూడా భారత దేశ వైద్య వ్య్వస్థకు అవమానకరమే !

    రిప్లయితొలగించండి
  16. మూదవ పాదము

    అరువ దేండ్లుగ మోయుచు భరత మాత

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురుభ్యో నమః

    కుక్క కాటుకి మందులు కొఱత యైన
    బక్క చిక్కిన బిడ్డల బ్రతుకు బరువు
    నరువ దేండ్లుగ మోయుచు భరత మాత

    పొర్లు దండాలతో రాచ పుండు మానె !

    కుక్క కాట్లతో మనుష్యులు మరణించడము, వైద్యానికి దేశ రాజకీయవేత్తలు అధికారులు విదేశాలకు పరుగెత్తడము కూడా భారత దేశ వైద్య వ్య్వస్థకు అవమానకరమే !

    రిప్లయితొలగించండి
  18. ఫోరు ట్వంటీలతో నిండె పొలిటికల్సు
    తూచ లేనట్టి అవినీతి రాచ పుండు
    కోర్టు మెట్లపై పొర్లించి కుట్రలరయ
    పొర్లుదండాలతో రాచపుండు మానె!!

    (420వ సమస్య కాబట్టి ఫోరు ట్వంటీలతో మొదలు పెట్ట)

    రిప్లయితొలగించండి
  19. చంద్రశేఖర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని చివరి రెండు పాదాల అన్వయం సందిగ్ధంగా ఉంది?
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    దేశ వైద్యవ్యవస్థపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు. ధన్యవాదాలు.
    నిజానికి నేను నిన్న ఇవ్వాలనుకున్న సమస్య
    ‘శ్రీ చార్ సౌబీసులె కద శిష్టులు జగతిన్".
    కాని చివరి క్షణంలో ఎందుకోగాని మనసు మార్చుకున్నాను.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ప్రస్తుతపు భారత దేశపు దీనావస్థ !
    తినడానికే లేని పరిస్థితిలో జబ్బులకు డబ్బు లెక్కణ్ణుం చొస్తాయ్ !
    ముడుపులూ , మొక్కులూ , పొర్లు దండాలే గదా శరణ్యం :

    01)
    __________________________________

    నిక్కమిది భారతావని - చక్కదనము !
    మెక్కడానికె సొమ్ములే - తక్కు వైన
    మొక్కు తోడనె రోగాలు - చక్క బడును
    పొర్లుదండాలతో రాచపుండు మానె(ను)!!
    __________________________________

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ,
    సంతోషం! మీరు మీ ఆరోగ్యం కోసం మొక్కులతో పాటు వైద్యుణ్ణీ సంప్రదిస్తున్నారు కదా!
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి