18, ఆగస్టు 2011, గురువారం

సమస్యా పూరణం -429 (కాలహరణమే చేకూర్చు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. దత్త పదిని నేఁ గోరితి, తలకు మించె
    దక్షులౌమిత్ర గణములు దడదడంచు
    చేసినారు. నేఁ బడితిని చిక్కులందు
    కాలహరణమే చేకూర్చెఁ గార్యఫలము

    మిత్రులంత అందంగా నేను చేయలేకపోయానని, చివరికేదో చేసానని.డంబాలు పలికి అడిగింది గుర్తుకు వచ్చి సరదాగా....

    రిప్లయితొలగించండి
  2. కాంగ్రె సందున కోటరీ ఘనుల మాట:
    అమ్మ సోనియ త్వరపడ కమ్మ నీవు
    తెలుగు వారల తగవును తీర్చ బోకు
    కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.

    రిప్లయితొలగించండి
  3. రచన జేయక పద్యమ్ము రక్తి నిడునె
    పూనుకొనకును కార్యమ్ము పూర్తి యగునె
    'కాల హరణమే చేకూర్చుఁ గార్యఫలము '
    ననగ గలుగునె ఘనతయు నవని యందు ?

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ పద్యము అదిరింది

    సవరణ ;

    రచన జేయక పద్యమ్ము రక్తి నిడునె ?
    పూనుకొనక యే కార్యమ్ము పూర్తి యగును ?
    'కాలహరణమే చేకూర్చుఁ గార్య ఫలము '
    ననగ గలుగునె ఘనత యీ యవని యందు ?

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    బాగుంది మీ స్వీయానుభవ పూరణ. అభినందనలు.
    ‘దడదడంచు’ అనేదానిని ‘దడదడమని లేదా త్వరితగతిని’ అంటే బాగుంటుందని నా సలహా.
    *
    మిస్సన్న గారూ,
    సమయోచితమైన పూరణ. వాస్తవమైన విషయాన్ని తెలిపారు. బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘ఆలస్యా దమృతం విషమ్’ అన్న సూక్తి గుర్తుకు వచ్చింది మీ పూరణ చూస్తుంటే. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారూ ధన్యవాదములు
    చేయుచు, కొనుచు అనేటప్పుడు ద్రుతము వస్తూంది, కాని చేయక, కొనక అనే వ్యతిరేకార్ధములో ద్రుతము రాదు. అందు వలన పద్యమును సవరించాను. పప్పులో కాలు వేసాక నాకు తెలుస్తుంది తప్పని.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సారంగధర చరిత్ర :

    ముందే సారంగ ధరుణ్ణి వలచిన చిత్రాంగి,రాజరాజు పంపినసారంగధరుని
    చిత్రపటాన్ని చూసి పెళ్ళికి అంగీకరిస్తుంది !
    కాని మంత్రి చేసిన దుర్బోధ తలకెక్కిన రాజరాజు వంచనతో
    తన కత్తికే బాసికము కట్టి పంపించి ,
    కోడలు కావలసిన చిత్రాంగిని భార్యను చేసుకుంటాడు !
    రాజరాజు అంతఃపురము చేరిన తరువాత గాని ఆ విషయం చిత్రాంగికి తెలియదు !
    హృదయం వ్రయ్యలైన చిత్రాంగి , వ్రతములేవో చెయ్యాలని చెలికత్తెలతో చెప్పించి కొద్దిరోజులు రాజరాజును అంతఃపురానికి రాకుండా కట్టడి చేసి ,
    తన సమస్యకు కాలహరణమే మార్గమని తలపోసి ,
    సారంగుని కోసం ఎదురు తెన్నులు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతుంటుంది !

    01)
    _______________________________________

    వనిత మనసును హరియించ - వాని సుతుడు
    రమణి చిత్రాంగి , పెండ్లాడె - రాజరాజు
    వంచనను కట్టి కత్తికి - బాసికమును !
    వాని బారిని పడకుండ - వ్రతము లనుచు
    వనిత గోరెను కొన్నాళ్ళ - వరకు గడువు
    వలపు ఫలియించ కుండునా ?- వరుని జేర
    కాల హరణమే చేకూర్చు- గార్య ఫలము !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  8. ఆ ఘడియ రానే వస్తుంది ! సారంగుని కలసి తన వేదన వెళ్ళబోసుకుంటుంది !
    కాని నువ్వు నా తల్లితో సమానురాలవని చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు సారంగుడు !
    అది వంచనతో కూడిన వివాహమని నెత్తీ నోరూ బాదుకుంటుంది !
    వంచనయినా ఏదయినా విధిలిఖితం అనుభవించవలసిందే నంటూ
    ఆమెను తిరస్కరిస్తాడు సారంగుడు !
    విఫలమైన ప్రేమ !
    వృద్ధరాజు మోసం !
    వంచనతో వివాహం !
    ప్రియుని తిరస్కారం !
    బ్రద్దలైన హృదయం !
    మతి తప్పిన మనసు !
    గతి తప్పిన బుద్ధి !
    అదే సమయంలో అంతఃపురానికి
    రాజరాజు రాక !
    తనేం చేస్తుందో తనకే తెలియని స్థితిలో సారంగుడే తనను బలాత్కరించబోయాడని
    రాజరాజుకు ఫిర్యాదు చేస్తుంది !
    ఆంధ్ర మహా భారతాన్ని నన్నయ ద్వారా మన కందించిన ఆ మహారాజు
    మతిమాలి బుద్ధిహీనుడై కన్నకుమారుని కాళ్ళూ చేతులూ నరికిస్తాడు !
    విషయం తెలిసిన చిత్రాంగి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకొంటుంది !
    కొడుకునే మోహించిందన్న అపప్రధ మాత్రం మూట గట్టు కుంటుంది !
    శివాంసా సంభూతుడైన ఒక యోగి కరుణతో సారంగునికి యథారూపు వస్తుంది !

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి ధన్యవాదములు,నమస్కారములతో
    తే: కాల హరణమే చేకుర్చు గార్యఫలమ
    ని మన నేతలు నిద్రలో నుండ, రైతు
    కష్టములు దీర్చ, సురులకు గష్టమై, న
    దృశ్యమైరి భారతదేశ దృశ్యమందు.

    రిప్లయితొలగించండి
  10. రావణుండను దైత్యుఁడు రామ పత్ని
    సీత నపహరింపగ; నాతి సీత నమ్మి
    జపము తపముల గడపెను జాగు యనక
    కాల హరణమే చేకూర్చు గార్య ఫలము

    యనుచు మనమునఁ వీడని యాత్మ బలము
    తోడ వేచెను శోకము తోడు గాను.
    కొన్ని వేళల నిజమగు కొత్త వింత
    కాలహరణమే చేకూర్చు గార్యఫలము.

    వసంత కిశొ ర్ గారు, కథ సస్పెన్స్ లో ఆపేయకుండా పూర్తిగా చెప్పినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. ఊకదంపుడు గారి పూరణ ....

    వసుధ న్యాయవాదులకును, వైద్యులకును
    ధనము కలుగు"కేసు"యొకటి దక్కినంత;
    మరియు నూకదంపుడుగార్కి మాన్య సభల-
    కాలహరణమే చేకూర్చుఁ గార్య ఫలము

    ( నరసింహ మూర్తి గారికి, విష్ణునందనుల వారికి క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి
  12. ఊకదంపుడు గారి వ్యాఖ్య ...

    3వ పాదం కొద్దిగా సవరించాను

    వసుధ న్యాయవాదులకును, వైద్యులకును
    ధనము కలుగుకేసుయొకటి దక్కినంత;
    నరయ నూకదంపుడువక్త కన్ని సభల
    కాలహరణమే చేకూర్చుఁ గార్య ఫలము

    రిప్లయితొలగించండి
  13. అన్న గోరెడి చట్టము అంతు తేల్చు
    దినము దినమున పెరిగెడి దీక్ష జూచి
    కలిసి యోచన జేసిరి కాంగి జనులు
    కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.

    రిప్లయితొలగించండి
  14. "కాలహరణ మేలర హరే" కరుణ జూప
    మనుచు త్యాగరాజలనాడు మథన పడెను
    భోగ రాజుల లసులిట భోరు మనిరి
    కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!

    రిప్లయితొలగించండి
  15. మాస్టారూ, రెండో పాదంలో అఖండ యతి వాడాను. అఖండయతి మీద మీ పాఠం బ్రహ్మాండంగా వుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. వార వర్జ్యమ్ము ఘడియల వాసి జూసి
    మొదలు బెట్టిన పనులన్ని ముదము నిచ్చు
    ననుట నెఱుగమే నేడును ,కనుక రాహు
    కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!

    రిప్లయితొలగించండి
  17. చంద్రశేఖరా ! అఖండయతి మీద పాఠమా ???

    శంకరార్యా ! ఇది చాలా అన్యాయం !
    చంద్రశేఖరులకు pravate గా ప్రైవేటు చెబుతున్నారా ???
    మేం ఒప్పుకోం !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !
    పాఠాలు----అందరికీ చెప్పాలి !

    రిప్లయితొలగించండి
  18. నమ్మవలె , జ్యోతిషమ్ము శాస్త్రమ్ము సుమ్ము !
    అమృత ఘటికా కృతములైన అన్ని పనులు
    విజయమొందును సర్వదా - వినుము ; రాహు
    కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము !!!

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ మీ పద్యము నిప్పుడే చూచాను . నేను వ్రాసిన దాని కన్నా మరింత సూటిగా , స్పష్టం గా ఉంది . మనః పూర్వకాభినందనలు ... చంద్ర శేఖర్ గారూ అఖండయతి మీద శంకరయ్యగారి పాఠమైన తరువాత నాదో చిన్న వ్యాకరణ పాఠం !!! చక్కని కరుణా రస భరితమైన పద్యం ...చాల బావుంది ...అయితే - ఆదేశార్థకములూ , విజ్ఞాపనార్థకములూ వ్రాసే పట్టుల ' చేయుమనిరి (చేయుము + అనిరి .)...వ్రాయుమనిరి ...(వ్రాయుము + అనిరి ) ..త్రాగుమనిరి .....(త్రాగుము + అనిరి) ...... నిలబడుమనిరి (నిలబడుము + అనిరి ) , ఈవిధముగా ' ఉకార సంయుక్తముగ వ్రాయవలె....లేనిచో చేయమనిరి....(చేయము + అనిరి) , , వ్రాయమనిరి (వ్రాయము + అనిరి ) ఈ ఇలా వ్యతిరేకార్థము నిస్తాయి కదా !!! అంటే పైపద్యములో " కరుణ జూపుమనుచు ( కరుణ జూపుము + అనుచు ) " త్యాగరాజు రాముడిని వేడుకొన్నాడని......" కరుణ జూపమనుచు (కరుణ జూపము + అనుచు " అని కూడదు ..ఇది ఒకానొక సర్వసాధారణమైన పొరపాటు , అందరూ చేసేదే !!!! మాట మన్నించినందులకు ధన్యవాదాలు , శంకరయ్యగారికి కృతజ్ఞతలు !!!!

    ఊకదంపుడు గారూ , క్షమాపణలవసరం లేదు ...ఆ మాటకొస్తే నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలేమో ....మనసారా నవ్వుకునే భాగ్యం కల్పించినందులకు......చక్కని పద్యం.....మంచి భావం !!! అభినందనలు !!!

    రిప్లయితొలగించండి
  20. పద్యమును వ్రాయ గోరితి హృద్యముగను
    వ్యర్ధమై పోయె నేరీతి నర్ద మవక
    మట్టి బుఱ్ఱకు తోచదు గట్టి పలుకు
    కాల హరణమే చేకూర్చుఁ గార్య ఫలము !

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 18, 2011 11:23:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    తలచి నంతనె జరుగవు తక్షణమున
    తలచకున్నను నాగవు తవమిదియె
    కాలపురుషుని లీలలు కాంచనగునె
    కాలహరణమే చేకూర్చు గార్యఫలము

    {ఆచార్య ఆత్రేయగారికి నమస్సులతో}
    కాలహరణము = కాలమును హరించటం {కాలాన్ని వినియోగపెట్టుకోవడం అనే అర్థంలో}.

    అరసున్నను ఎలా పోస్ట్ చేయాలో తెలుపప్రార్థన.

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 18, 2011 11:27:00 PM

    2 వ పాదంలో టైపాటు సవరణ

    తలచుకున్నను నాగవు తత్వమిదియె

    రిప్లయితొలగించండి
  23. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 18, 2011 11:37:00 PM

    తలచి నంతనె జరుగవు తక్షణమున
    తలచకున్నను నాగవు తత్వమిదియె
    కాలపురుషుని లీలలు కాంచనగునె
    కాలహరణమే చేకూర్చు గార్యఫలము

    రిప్లయితొలగించండి
  24. రక రకాల చీరలెదుట రహివహింప
    వనితలకొకటి యెన్నగ వల్ల కాదు
    మగువలు నిలుపఁ జాలరు మనసు, పలు
    కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!!

    రిప్లయితొలగించండి
  25. vasanta mahodayaa, akhanda yathi meeda paatham sankaraabharanam home page lo mastaru post cheshaaru. meeru koodaa choodavacchu. naa kantoo vere paatham emii ivvaledu.

    రిప్లయితొలగించండి
  26. Dr. VishnuNandan garu, Meeku chaalaa dhanyavaadaalu. chakkati suble point pattaaru. mee vyaakarana paatham sraddhagaa nerchukonnaanai cheppagalanu. mee lanti vaaru sankocham lekundaa saana badithene maaku aanandam.
    ee madhya mee pooranalu karuvainavi. veelu choosukoni prati pooranaa yedo rakamgaa poorinchi mee mudra veyandi. ave maaku cheppaka cheppe pathaalu. English lo type cheyavalasi vacchindi. manninchaali.

    రిప్లయితొలగించండి
  27. ఆర్యా! ఊకదంపుడు గారూ ధనము కలుగ చేసే కేసులు మాకు సమకూరుస్తూ క్షమాపణలెందుకు ? మీకు మేమే కృతజ్ఞతలు చెప్పాలి. కాకపోతే న్యాయవాదులు వలె మాకు ఒక కేసుతో బండి సాగదు. చాలా కేసులు కావాలి. ఈ దేశములో బెక బెక వైద్యులము మా వెనుకనే ఉండే వకీలు పాములను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి! మీ పద్యము బాగుంది.

    రిప్లయితొలగించండి
  28. డా.విష్ణు నందన్ గారూ మీ గురించే నిన్న తలచు కొన్నాను.శత్రర్ధ చువర్ణము గురించి చదువుదాము అంటే దగ్గఱ వ్యాకరణ పుస్తకము లేక. మీరు యీ దినము ప్రత్యక్షమయి మాకు ఆనందము కలుగ జేసారు. గురువు గారికి తోడుగా మీరు కూడా మాకు వ్యాకరణ పాఠాలు యివ్వండి. ఆనందిస్తాము.

    రిప్లయితొలగించండి
  29. వసంత కిశోర్ గారూ,
    మీ ‘సారంగధర చరిత్ర’ చెప్పిన తీరు చాలా బాగుంది. గతంలో ఒకసారి ‘భక్త సిరియాళ’ కథ కూడా చెప్పారు. అప్పుడే అన్నాను. మీలో మంచి ‘కథకుడు’ ఉన్నాడని.
    ఇక మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మంచి విషయంతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘ఫలమ/ను మన నేతలు నిద్రలో నుండ, రైతు’ అంటే సరి! కాకుంటే నిన్నటి ‘అఖండయతి’ పడింది.
    *
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘జాగు + అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘జాగు చేసె/ జాగు చేయ’ అంటే సరి!
    ఇక ఇది ఎనిమిది పాదాల ‘తేటగీతిక’ అనుకుంటే నాలుగవ పాదం ప్రథమాక్షరం, వేరువేరు పద్యాలనుకుంటే రెండవపద్యం మొదటి పాదం మొదటి అక్షరం యడాగమమై ఉండరాదు. అది తేటగీతిక అనుకుంటే ‘ఫలమ/ టంచు’ అనీ, విడిపద్యమే అయితే ‘అనుచు’ అనీ ఉండాలి.

    రిప్లయితొలగించండి
  30. ఊకదంపుడు గారూ,
    మీ పూరణలోని చమత్కారం అలరించింది. మంచి పూరణ. అభినందనలు.
    ‘కేసు + ఒకటి’ అన్నప్పుడు యడాగమం రాదుకదా! ‘కేసొకటైన/ కేసొకటియు’ అందామా?
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    కాలోచితమైన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    డా. విష్ణునందన్ గారి సూచన గమనించారు కదా!
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘రాహుకాలం’ విషయంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. గురువుగారూ, మంచిసూచనలు ఇచ్చినారు.
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  32. శంకరార్యా ! ధన్యవాదములు !
    మన్నించండి ! మీ పాఠం నేను చూడలేదు !

    చంద్రశేఖరా ! ఔనుగదూ ! నేనిప్పుడే చూశాను ! ధన్యవాదములు !

    విష్ణు నందనా ! సుందరా ! ధన్యవాదములు !
    అత్యంత సహజముగా జరిగే పొరపాటది !
    చాలా చక్కని విషయం చెప్పారు !

    రిప్లయితొలగించండి
  33. వసంత కిశోర్ గారూ,
    ఇప్పటికైనా అందరికీ ‘అఖండయతి’ పాఠం చూసారా, లేదా?
    *
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    చంద్రశేఖర్ గారికి (వారితో పాటు అందరికీ) వ్యాకరణ పాఠం చెప్పినందుకు ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరక్కా,
    నిర్దోషమైన చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పాటను గుర్తుకు తెచ్చిన మీ పూరణలోని వేదాంతధోరణి బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    అర్ధానుస్వారాన్ని ఎలా టైపు చేయాలో రాజేశ్వరక్కయ్య చెప్పారు కదా!
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మహిళలు చేసే కాలహరణం గురించి చమత్కారమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. జ్ఞాని ఆయన ' పీవీ' ప్రధాని గాను
    దేశ మేలెను, ఏమియావేశ పడక
    చేసి చూపెను మరియును చెప్పుచుండు
    'కాలహరణమే చేకూర్చు గార్యఫలము'

    రిప్లయితొలగించండి
  35. విష్ణునందన్ గారూ, నరసింహమూర్తి గారూ, గురువు గారూ,
    ధన్యవాదములు.

    గురువు గారూ,

    కేసు అన్యదేశ్యమని సంధి చేయలేదండి.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  36. ఊకదంపుడు గారూ,
    అలాంటప్పుడు ‘కేసు ఒకటి’ అని విసంధిగా వ్రాస్తే సరి! యడాగమం రాకూడదు.

    రిప్లయితొలగించండి
  37. గురువు గారూ,
    ధన్యవాదములు.

    యడాగమం గురించి మీ పాఠం కోసమై ఎదురుచూస్తుంటాను.

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  38. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 8:35:00 AM

    రాజేశ్వరి అక్కయ్యగారికి,గురువుగారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి