21, ఆగస్టు 2011, ఆదివారం

సమస్యా పూరణం -432 (రాచి ఱంపాన బెట్టిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    తానూ ఒకప్పుడు కోడలినే అన్న సంగతి అత్తలెపుడూ
    మరచిపోతూ ఉంటారెందువల్లనో ?!

    01)
    _________________________________

    అత్త హోదాను బొందిన - అతివ లెపుడు
    పాత హోదాను మరచియే - వరలు చుంద్రు
    కొత్త కోడళ్ళ, కొడుకును - కొమరి గలసి
    రాచి ఱంపాన బెట్టిన - రమణి మెచ్చు!
    _________________________________

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో..

    ఇంటి కోడలి తోడ తా నేగ లేక
    'క్రొత్త కోడలు సీర్యలు' కోరి చూచి
    అందు కోడలి నెప్పుడు నత్త మిగుల
    రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు


    కిషోర్ జీ చక్కటి పూరణ ..

    రిప్లయితొలగించండి
  3. కట్నం లేకుండా వచ్చిన కోడల్ని అత్తలు రాచి రంపాన పెట్టుట
    సహజమే గద !

    02)
    __________________________________

    కొడుకు ప్రేమించి పెళ్ళాడ - కోడ లొచ్చు !
    కోడలిని జూడ నత్తకు - కోపమొచ్చు !
    కోరు కున్నంత కట్నంబు - కోలు పోయి
    రాచి ఱంపాన బెట్టిన, - రమణి మెచ్చు!
    __________________________________

    రిప్లయితొలగించండి
  4. శాస్త్రీజీ ! బావుంది ! కాని-"సీర్యలు"--అంటే?

    రిప్లయితొలగించండి
  5. మాస్టారూ, క్రింది పద్యానికీ, నాకూ, మా ఇంటావిడకి యే సంబంధమూ లేదనీ, హాయిగా నవ్వుకోమననీ మనవి చేస్తూ:-)
    చిన్న పంచెను గట్టుక చింత లేక
    పద్య రచనలు గావించు పతిని, ప్రీతిఁ
    పీట వేసి కూడుమనుచు పిలిచి కెలికి
    రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు!

    రిప్లయితొలగించండి
  6. కిషోర్ జీ ధన్యవాదములు. అది సీరియల్ కి వచ్చిన టైపాటు తిప్పలు ..

    చిన్న సవరణ తో..

    తనదు కోడలి బాధలు తాళ లేక
    'క్రొత్త కోడలు సీరియల్' కోరి చూచి
    అందు కోడలి నెప్పుడు నత్త మిగుల
    రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు

    రిప్లయితొలగించండి
  7. 03)
    __________________________________

    పూర్వ సినిమాల యందున - పొసగ దయ్యొ
    సూర్య కాంతమ్ము రేలంగి - భార్య యైన !
    తనివి దీరంగ కసురుచు - తనదు పతిని
    రాచి ఱంపాన బెట్టిన, - రమణి మెచ్చు!
    __________________________________

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 1:29:00 PM

    అధికమగు లాంఛనములకు నాశపడుచు
    కట్నకానుక విషయమై కసరుచున్న,
    భర్తనాఫీసునందున బాసులెపుడు
    రాచి ఱంపాన పెట్టిన, రమణి మెచ్చు.

    ఆంగ్ల పాదాలతో పూరణ చేసినందులకు గురువు గారు మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 1:50:00 PM

    SreegurubHyOnama:

    talupu vaakiLLu vaanaku taDasipOga
    sariga jEyimcagOrenu sarasa dharaku
    koyyapanivaaDu sarijEya komtavaraku
    raaci ~rampaana peTTina, ramaNi meccu

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 1:51:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    తలుపు వాకిళ్ళు వానకు తడసిపోగ
    సరిగ జేయించగోరెను సరస ధరకు
    కొయ్యపనివాడు సరిజేయ కొంతవరకు
    రాచి ఱంపాన పెట్టిన, రమణి మెచ్చు

    రిప్లయితొలగించండి
  11. క్రొత్త యల్లుడు ధనమును కోరి యలిగి
    మామ గారిని, పత్నిని మరల మరల
    రాచి ఱంపాన పెట్టిన రమణి మెచ్చు
    కొనదు; మర్యాద తొలగును, కూర్మి చెడును.

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    ముచ్చటైన మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో కొడుకును, కోడల్ని రాచి ఱంపాన పెడితే మెచ్చిన ‘రమణి’ ఎవరు?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అన్ని సీరియళ్లలో అత్తను కోడలో, కోడల్ని అత్తో వేధించడమే కదా! మంచి పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    నిజంగానే నవ్వు వచ్చింది. అదీ రెండు సార్లు!
    ‘పద్యానికీ, నాకూ, మా ఇంటావిడకి యే సంబంధమూ లేదనీ’ అన్నారు. పద్యంతో మీకు సంబంధం లేదు, ఓకే! మీ ఆవిడకీ సంబంధం లేదు. డబుల్ ఓకే! కాని ‘మీకూ, మీ ఇంటావిడకూ ఏ సంబంధం లేదు’ అనే అర్థం కూడా వస్తుందే! తర్కశాస్త్రంలో దీనిని ఏ దోషం అంటారో? ‘ఈ పద్యం‘తో’ నాకూ, మా ఇంటావిడకి ఏ సంబంధం లేదు’ అంటే బాగుండేది. అందుకే మొదటిసారి నవ్వుకున్నాను.
    ‘పీట వేసి కూడుమనుచు’ ... కుడువుమన్నదా? కూడుమన్నదా? పీట వేసి తిను అంటుందే కాని సంభోగించుమనదు కదా! అందుకే రెండవ సారి నవ్వుకున్నాను.

    రిప్లయితొలగించండి
  13. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కని చమత్కారంతో అలరించింది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ స్వభావోక్తి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మే రెప్పుడూ వైవిధ్యంగానే ఆలోచిస్తారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా ! ధన్యవాదములు !
    కొత్త కోడలిని , కొడుకూ కూతురూ కలిసి వేధిస్తే మెచ్చిన రమణి - అత్తగారు !

    రిప్లయితొలగించండి
  15. రాత్రి బారుల వెంబడి రోయ కుండ
    కోరి వలచిన సతికెంతొ దూరమవగ
    మామ పిలిచి యొకింత మందలించి
    రాచి ఱంపాన బెట్టిన రమణి మెచ్చు !

    రిప్లయితొలగించండి
  16. నేదునూరి రాజేశ్వరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. ‘రాత్రి బారుల వెంబడి రక్తిఁ దిరిగి’ అందాం!

    రిప్లయితొలగించండి
  17. మాస్టారూ, ధన్యవాదాలు. నా ప్రయత్నం ఫలించింది. మిమ్మల్నీ, కవిమిత్రులను నవ్వించటమే ఉద్దేశ్యం, అయినా నాకంటే పెద్దవారు, మీకు తెలియనిదేముంది, "రసపట్టులో తర్కం కూడదు" అని మాయాబజార్లో కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను విశదీకరించటం లేదు :-)

    రిప్లయితొలగించండి
  18. మా బండి చాలా చాలా లేటు.

    ' పొరుగు పుల్లయ్య భార్యకు బోలె డన్ని
    నగలు చీరలు ! తేవోయి నాకు ' ననుచు
    రాచి ఱంపాన బెట్టిన, రమణి మెచ్చు
    నప్పు జేసి యైనను నీయ నామె మగడు.

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    లేటైనా నీటైన చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    పాపం ఆ మగడు ..
    "పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకు లేవె
    వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవె" అనకుండా అప్పుచేసి నగలు చీరలు తెచ్చాడు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  20. ధన్యవాదాలు గురువుగారూ!
    ఆపాట మదిలో మెదిలే ఆ పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి