28, ఆగస్టు 2011, ఆదివారం

సమస్యా పూరణం -441 (ఎద్దును జేరి పాల్పితుక)

వారాంతపు సమస్యా పూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
ఎద్దును జేరి పాల్పితుక
నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. ప్రొద్దున లేచి గోష్టముకు పోవగ పాలకు, చూడ నడ్డమై
    హద్దులు దాటి వచ్చి నట ఆవును హద్దులు దాటునట్లుగా
    రుద్దుచు నున్న, లాగి భళిరో! యని గాటకు కట్టి వైచి యా
    ఎద్దును; జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్ !

    రిప్లయితొలగించండి
  2. గ్రుద్దులు గ్రుద్దితిన్,మరియు కొమ్ములు పట్టితి కట్టదల్చి మా
    యెద్దును.లొంగ లేదు.పరమేశ్వర! కట్టగ నుంటి నేను యీ
    ఎద్దును జేరి. పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్
    శ్రద్ధగ నాకు సాయపడి,చక్కగ దీనిని కట్టనెంచుచున్.

    రిప్లయితొలగించండి
  3. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, ఆగస్టు 28, 2011 1:42:00 PM

    వద్దని జెప్పినన్ వినవు, పాతదినంబుల జేయ సాక్ష్యముల్
    కద్దె? మతిభ్రమించెనని కల్పన చేయుదురీజగంబునన్
    ఎద్దును జేరి పాల్పితుక నెంచిన!! కృష్ణుదలంతు నెమ్మదిన్
    ముద్దులమోమువాడఖిల ముజ్జగముల్ ధరియించు వానినిన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 28, 2011 1:49:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    సద్దిని మూటగట్టుకొని సాగిరి గొల్లలు ఆలమందతోన్
    ముద్దులు గొల్పు కన్నడును ముచ్చట నొందుచు వారి వెంట నా
    హద్దుల లోనజేరికొని హ్లాదనమందుచు బాల్య చేష్టగా
    ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  5. "ప్రొద్దున లేచిదున్నుటకు పోవలె" దువ్వుచు నందు. నేను,కా
    డెద్దునుఁ జేరి; పాల్పితుక నెంచెడి కృష్ణుదలంతు. నెమ్మదిన్
    సుద్దుల నొద్దికంబలుకు సోదరు డాకలిఁ దాళజాలడే
    చద్దులు సిద్ధపర్తునిక జాగును చేయను, పోదునిప్పుడే.

    రిప్లయితొలగించండి
  6. శివాలయములో నంది శృంగముల నడుమనుండి శివుని దర్శించు వేళ:-

    శుద్ధిగ నేను శంకరుని శోభనుఁ జూడగ దేవలమ్ముకున్
    ప్రొద్దున వెళ్లితిన్, పరమ రుద్రుని పావన మూర్తిఁ జూడగా
    ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్
    ముద్దుగ గ్రద్ద నెద్దులను పూనెడి వారలు వేరు కాదుగా!!

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పాపం! మీ పాలకోసం ఆవుపైన మరులు గొన్న ఎద్దును పక్కకు లాగుతారా :-)
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    ఎద్దును లొంగదీయడానికి కృష్ణుని దలంచిన మీ పూరణ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
    కానీ ... ‘నేను + ఈ’ అన్నచోట యడాగమం?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాల్యచేష్టగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    శివుణ్ణి చూస్తూ, కృష్ణుణ్ణి తలచిన మీ అద్వైతభావం అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. వద్దు సురాధి నాథునకు వార్షిక పూజలు, గోగిరాదులే
    ముద్దగు, నాలు యెడ్లు నవి మోసెడు కాడియు గోపకాళికిన్
    పెద్దలు పూజ సేయుడని వేడుక నర్చన జేసె నావు నా-
    యెద్దును జేరి; పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్.

    గోగిరి = గోవర్ధనగిరి

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ! ధన్యవాదములు.
    పాలకోసం తప్పదు కదా ! వెంటనే వదిలేశాను లెండి ....
    రకరకాలుగా పాల్పితికిన కవిమిత్రు లందరికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ముద్దియలార ! చూడుడటు ముగ్ధ మనోహరు డల్ల నల్ల వా
    డద్దిన విష్ణు తేజ మున- హా! మధురా నగరాన నింతు లీ
    యెద్దును జేరి పాల్పితుక నెంచెడి - కృష్ణుదలంతు నెమ్మదిన్
    కద్దనుచున్ వచించె నొక కామిని కంసుని నేవగించుచున్

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    గోవర్ధనగిరిధారి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజారావు గారూ,
    ముగ్ధమనోహర ధారతో మీ పూరన ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పాలు పితుకు కొనే వానికి రక్షించే బాధ్యత కూడా ఉంది కదండీ !

    ఎద్దయె యోగిరమ్ము నిట హింసకు పాలయె గోవులెన్నియో
    నిద్దరి యుండి గాంచితిని,హీనుఁడ సాయము నోప నిత్తఱిన్
    ముద్దుల గోపబాలుడుకి మూర్ధము వంచుచుఁ గావు మంచు నో
    యెద్దును జేరి, పాల్పితుక నెంచెఁడి కృష్ణు దలంతు నెమ్మదిన్ !

    రిప్లయితొలగించండి
  13. పాలు పితుకు కొనే వానికి రక్షించే బాధ్యత కూడా ఉంది కదండీ !

    ఎద్దయె యోగిరమ్ము నిట హింసకు పాలయె గోవులెన్నియో
    నిద్దరి యుండి గాంచితిని, హీనుఁడ సాయము నోప నిత్తఱిన్
    ముద్దుల గోప బాలునకు మూర్ధము వంచుచుఁ గావు మంచు నో
    యెద్దును జేరి, పాల్పితుక నెంచెఁడి కృష్ణు దలంతు నెమ్మదిన్ !

    రిప్లయితొలగించండి
  14. పద్దెము పద్దెమందు భగవానుని పావన లీలలద్దుచున్
    ముద్దులు గారభాగవతమున్ రచియించిన పోతనార్యునిన్
    ప్రొద్దున లేచివేడితిని పూవుల తోడ పొలమ్ముదున్న కా
    డెద్దును జేరి,. పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్!!!

    రిప్లయితొలగించండి
  15. గ్రుద్దులు గ్రుద్దితిన్,మరియు కొమ్ములు పట్టితి కట్టదల్చి మా
    యెద్దును.లొంగ లేదు.పరమేశ్వర! కట్టగ నుంటి నయ్య యీ
    యెద్దును జేరి. పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్
    శ్రద్ధగ నాకు సాయపడి,చక్కగ దీనిని కట్టనెంచుచున్.

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఆర్ద్రమైన భావంతో మీ పూరణ కరుణరసాత్మకమై ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మీ రెక్కడో పరదేశంలో చూసిన దృశ్యానికే ఇంతగా కరగిపోతే "గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యమ్’ అనే ఈ పవిత్రభూమిపైన అటువంటివి చూసే మా వంటివారి పరిస్థితి?
    *
    మంద పీతాంబర్ గారూ,
    ధారాళంగా సాగింది మీ పద్యం నడక. చక్కని పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కృష్ణ నామామృత పాన మత్త చిత్తులు
    శ్రీ లీలా శుకులకు
    దండ ప్రణామములతో ...................

    ముద్దులు మూటఁ గట్టు తన ముద్దియ రాధను గూడి యేటికి-
    న్నిద్దరిఁ సైకతావళుల, నింపగు చీకటి చెట్ల నీడలన్
    సుద్దుల పైన ధ్యాస నిడి చొక్కపుఁ బ్రేమ నెడంద నిండగా
    నెద్దును జేరి. పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ మీ పూరణ
    "ముద్దులు మూటఁ గట్టు తన ముద్దియ రాధను గూడి యేటికి-" బాగుంది.

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. అద్భుతం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ ధన్యవాదాలు. మీకు తెలియనిదేముంది?
    లక్కరాజు వారూ సంతోషం.
    మూర్తి మిత్రమా గురువుగారన్నట్లు నేటి భారతంలో గోగణ దుస్థికి
    అడ్డం పడుతోంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువు గారికి మిస్సన్న గారికి మిత్రులకు నమస్సులు.కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  22. సద్దియు వీడి పర్వులిడి సంబరమొందుచు బూతుజేరుచున్
    ముద్దు ప్రియంకనున్ దలచి ముచ్చట మీరిన మానసమ్మునన్
    కొద్దిగ కూడ బుద్ధిడక గుట్టుగ రాహులు నెన్నువాని నే
    నెద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్

    రిప్లయితొలగించండి