10, నవంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం - 521 (పాడు పున్నమ యిది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాడు పున్నమ యిది పండుగ కద!

49 కామెంట్‌లు:

  1. సాగరమ్ము సరససత్కవి ప్రకరమ్ము
    చెలువమలరు చిన్ని కలువ కన్నె
    బహు చకోరతతులు ప్రణయ భావాత్ములు
    పాడు పున్నమ యిది పండుగ కద

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    నేమాని వారిది బహు చక్కని పూరణ !

    01)
    _____________________________________

    పండు వెన్నె లదియె - ప్రసరించ పుడమిపై
    పరవశమ్ము గలుగు - ప్రజల మదిని
    పడతి దూరమైన - పతుల , మతులను, రా
    పాడు, పున్నమ యిది - పండుగ కద!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  3. నా పూరణ ....

    భగవంతుని కీర్తన నిం
    పుగ రాగము దీసి పాడు పున్నమ యిది, పం
    డుగ కద! మిత్రుల కెల్లర
    కగణిత శుభకాంక్ష లిప్పు డందగఁ జేతున్!

    రిప్లయితొలగించండి
  4. నామ జపము చేసి నరులు వేడుకొనిన,
    దీపములను బెట్ట- దేవతలగు
    కేశవుడును శివుడు కృపతోడ జనులకా
    పాడు పున్నమ- యిది పండుగ కద

    రిప్లయితొలగించండి
  5. అయ్యా శంకరయ్య గారూ !
    చేతున్ అనే ప్రయోగము చెయ్యనంటూనే యున్నా మళ్ళీ ఆ పదము మీ పద్యములో దొరలినది.

    రిప్లయితొలగించండి
  6. వేడిన సద్గతి నిచ్చును
    నేడు, నుమానాథుడయిన నీలపుకంఠున్
    వీడక సేవించిన కా
    పాడెడి పున్నమ యిదికద, పండుగ మనకున్.

    రిప్లయితొలగించండి
  7. నేమాని వారి పూరణ బ్రహ్మాండము.
    గురువు గారి పూరణ మిత్రుల పూరణలు వెన్నెల కురిపిస్తున్నాయి.

    తిమిర తతిని దరుమ దీపము వెలిగించి
    ప్రమిద నిల్పి నారొ ప్రమథ గణము
    పూర్ణ చంద్రు డట్లు పూర్తిగా వికసించె
    పాడు పున్నమ యిది పండుగ కద

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    అలవాటులో పొరపాటు. ధన్యవాదాలు
    సవరించిన నా పూరణ ....

    భగవంతుని కీర్తన నిం
    పుగ రాగము దీసి పాడు పున్నమ యిది, పం
    డుగ కద! మిత్రుల కెల్లర
    కగణిత సుఖసంపదల శుభాకాంక్ష లివే!

    రిప్లయితొలగించండి
  9. మిత్రుల పూరణలు అలరించుచున్నవి.
    వసంత కిశోర్ గారి వెన్నెల విరియుచుండగా, కేవలము విరహముతో నున్న పురుషులనే వర్ణించారు.
    శంకరయ్య గారి పద్య పరివర్తన ప్రశంసనీయము.
    మందాకినీగారి భక్తిరసము చవులూరిస్తోంది.
    మా తమ్ముడు నరసింహ మూర్తి ఉపమా కాళిదాసస్య ను మరపింపజేసేరు.

    రిప్లయితొలగించండి
  10. సరసులు, మిత్రులు డా. గ.న.మూర్తి గారికి అంకితమిస్తూ:
    వయసు తోడ వలపుహెచ్చు, పాఁత బడిన
    చంద్రభాసుర ప్రాభవ మి౦ద్రు డైన
    నెరుగడన్న చంద్ర-న.మూర్తు లిరువ రులకు
    పాట పాడు పున్నమ యిది పండుగ కద!

    రిప్లయితొలగించండి
  11. 02)
    _____________________________________

    వరుస దప్పకుండ - ప్రతి వత్సరం బేను
    తాతగారి యింటి - తలుపు తడుదు !
    చిక్కు లెన్నొ దాటి - చేరుకొంటి నురవ
    పాడు ! పున్నమ యిది - పండుగ కద!
    _____________________________________
    ఉరవపాడు = తాతగారి ఊరు

    రిప్లయితొలగించండి
  12. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, నవంబర్ 10, 2011 9:34:00 AM

    మొనసి నిష్ఠ తోడ ముత్తైదువల్ కూడి
    వ్రతము బూని 'గౌరి 'ప్రతిమ జేసి
    శర్వు రాణి గూర్చి సౌభాగ్యముల్ కోరి
    పాడు పున్నమ యిది- పండుగ కద!

    రిప్లయితొలగించండి
  13. 03)
    _____________________________________

    భక్తి తోడ శివుని - బ్రార్థించ గానేడు
    పాప మంతమగును ! - బాధ తొలగు !
    పరమ శివుడు, కరుణ - ప్రసరించి జనుల, గా
    పాడు, పున్నమ యిది - పండుగ కద!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  14. నిండు చందమామ నెరయ నింగిని బూయ
    సుధలు గురిసె నవని సొనల లోన
    తాన మాడ జనగ తాపమ్ము కత మేమి
    పాడు పున్నమ యిది పండుగ కద !

    రిప్లయితొలగించండి
  15. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేయుట కొఱకై :


    04)
    _____________________________________

    ప్రబలమైన భక్తి - పవలు రేయంతయు
    పరమ శివుని ముద్దు - భార్య దలచి
    పడతులంత జేరి - పరవశమున పాట
    పాడు, పున్నమ యిది - పండుగ కద!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని అన్నయ్య గారికి పాదాభివందనములు. మిత్రులు చంద్రశేఖరుల గారూ, మీరు ముందుగానే చెప్పారు కాబట్టి ఆరు బయటకు వెళ్ళి నిజంగానే చంద్రభాసురములో తనివి తీరా తానమాడాను. చంద్రుడి పక్కనే వెలిగి పోతున్నది శుక్రుడా ? భలే ఉన్నారు జంట !

    రిప్లయితొలగించండి
  17. పిల్లగాలివీచి వెల్లవెన్నెలపూచి
    పచ్చవింటివాని రెచ్చగొట్ట
    పడుచువారు తనిసి ప్రణయగీతమ్ములు
    పాడు పున్నమయిది పండుగ కదా.

    రిప్లయితొలగించండి
  18. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, నవంబర్ 10, 2011 10:06:00 AM

    పిల్లగాలివీచి వెల్లవెన్నెలపూచి
    పచ్చవింటివాని రెచ్చగొట్ట
    పడుచువారు తనిసి ప్రణయగీతమ్ములు
    పాడు పున్నమయిది పండుగ కదా.

    రిప్లయితొలగించండి
  19. మూర్తీజీ ! శుక్రుడు గాదు ! గురుడు !
    అయినా మీరు చూసినది
    చంద్రుడూ కృత్తికలనేమో !

    రిప్లయితొలగించండి
  20. పూర్ణ చంద్రికా వికీర్ణ ప్రసార సం
    జనిత నూత్న శోభ జగతి వెలుగు ;
    చిక్కనైన కటిక చీకట్ల నుండి కా
    పాడు పున్నమ యిది , పండుగ కద !!!

    రిప్లయితొలగించండి
  21. ' మా తమ్ముడు నరసింహ మూర్తి ఉపమా కాళిదాసస్య ను మరపింపజేసేరు. '

    గురువు గారూ తమ్ముడు అన్నప్పుడు ' మరపింప జేసేడు ' అని డుగామము రావాలి కదాండీ !

    రిప్లయితొలగించండి
  22. కిశోర్ జీ ధన్యవాదములు. చాలా ప్రకాశవంతముగా తెల్లగా ఉన్నాడు. అది మరో గ్రహమే , గురుడే అవచ్చు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి ధన్యవాదములు తెలుపుతూ
    నిన్న గురుగ్రహము చంద్రునికి అతిదగ్గరగా వచ్చినది. అది మంచిదని కొందరు, కదు చెడ్డదని కొందరు.
    ఆ విషయమును ఈ విధముగా
    -----------
    చంద్రునివలె గురువు జాబిలియైన నే
    పాడు పున్నమ యిది, పండుగ కద
    రెండు చంద్రులగను రేయి, పూజలు జేయ
    యముడు విధిని మరచి దమ్ముడౌనె

    రిప్లయితొలగించండి
  24. గుండె గుండె లోన పండువెన్నలనింపు
    పర్వదినము నేడు పరమ శివుడు
    కోరికలనుదీర్చు గొల్చుభక్తులనుకా
    పాడు పున్నమయిది పండుగ కద !!!

    రిప్లయితొలగించండి
  25. జ్యోతిష పరముగా గురుచంద్రుల సమాగమము మంచిదే. గురుచంద్రుల కలయికగల జాతకులకు గజకేసరీ యోగం పడుతుంది. ఈ రెండు గ్రహాలు జాతక చక్ర రీత్యా ఉన్న స్థతిని బట్టి యోగబలం ఆధారపడి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  26. శివుని మాసమంట భవుడు బ్రోచుననుచు
    తిండి తిన వలదని వండ లేదు
    కడుపు కాలె, నీల కంధరా! లేదు సా
    పాడు, పున్నమ యిది పండుగ కద!!

    రిప్లయితొలగించండి
  27. **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మీ పూరణతో బ్లాగుకు పండగే. సుందరపదభరతమై మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    ‘వెన్నెల + అదియె’ అన్నప్పుడు సంధి లేదు. ‘వెన్నెల యదె’ అంటే సరి!
    ఇక మీ రెండవ పూరణ వైవిధ్యంగా అమోఘంగా ఉంది. మనకు ‘పాడు’తో ముగిసే పేళ్ళున్న ఊళ్ళు చాలా ఉన్నాయి. ఉరవపాడును గుర్తుకు తెచ్చుకున్న మీ పూరణ అద్వితీయం. అభినందనలు.
    మూడవ పూరణ బాగుంది.
    నాలుగవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    అమందానందానుభూతిని కల్గించింది మీ పూరణ. అభినందనలు.
    మీ రెండవ పద్యం (పూరణ అనలేను) బాగుంది.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. నేమాని వారి యోగ్యతాపత్రం లభించిన తర్వాత నేనేమని వ్యాఖ్యానిస్తాను. శుభమస్తు!
    విరహతాపంతో ఉన్న వారికి పాడు పున్నమే కదా! బాగుంది మీ రెండవ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    పూరణలో మీ చమత్కారం అదిరింది. చక్కగా ఉంది. అభినందనలు.
    ‘ఇరువరులకు’. ..? అది ‘ఇరువురకును’ కదా!
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మనోహరమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ సర్వోత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
    **********************************************************************
    ‘గోకులం’ గారూ,
    స్వాగతం! మీ పూరణ చాలా బాగుంది. ‘దమ్ముడు’ శబ్దప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    మన బ్లాగులో జ్యోతిశ్శాస్త్ర చర్చలూ మొదలయ్యాయి. ధన్యవాదాలు.
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    కరుణరసాత్మకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సాపాటు’ విన్నాను కాని ‘సాపాడు’ వినలేదు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  28. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, నవంబర్ 10, 2011 7:39:00 PM

    మాస్టారూ, ధన్యవాదాలు. "ఇరువరులకు = ఇద్దరకు" అని ఎక్కడో చదివిన జ్ఞాపకం అది ప్రయోగించాను అంతే. మీరు చెప్పినాక నిఘంటువు చూశాను - "విరమా మోర్వలేనంటివి యేరా, ఇరువరులకు సరిపోరా." [సారంగ.].

    రిప్లయితొలగించండి
  29. పండితుల వారికి , గురువు గారికి నమోవాకములు.
    గురువుగారు, చాలా సంతోషమండి.
    వెన్నెల వెలుగుల్లో శంకరాభరణము మెరిసిపోతున్నది.అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. డా. మూర్తి మిత్రమా! మిగతా మిత్రులు చెప్పినట్లు అది, JUPITER (గురుడు, లేక బృహస్పతి). చూడటానికి నక్షత్రం లాగా కనిపిస్తుంది, కానీ అది గ్రహమే. గురుగ్రహం అన్ని గ్రహాలకన్నా పెద్ద గ్రహం. శ్యామలీయం గారు చెప్పినట్లు గురు చంద్రులు పరిభ్రమణంలో ఒకే లైన్లోకి వచ్చి కొన్ని నిముషాలు వున్నారు. అది అరుదుగా జరిగే సంఘటన. చంద్రుడు మనోకారకుడు. కాబట్టి చంద్రభాసురం మనసుకి మంచిదే. నా మాట మన్నించినందులకు ధన్యవాదాలు, సార్.

    రిప్లయితొలగించండి
  31. యెంత చిలిపి వాడొ యేమందు నారాజు
    నిదుర పోవ నీడు నిముస మైన
    మాటు నుండి చూచె మల్లె జాబిల్లి ఛీ!
    పాడు! పున్నమ యిది పండుగ కద!!

    రిప్లయితొలగించండి
  32. శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  33. నేమానివారికి ధన్యవాదములు !

    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    యముడు విధిని మరచి దమ్ముడౌనె ?
    శంకరార్యా ! యిందులో యతి ?

    రిప్లయితొలగించండి
  34. మిస్సన్న గారూ,
    మీ ‘ఛీ పాడు’ పూరణ ‘సో గుడ్’. చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    నిజమే సుమా! ‘గోకులం’ గారి పూరణలో యతిదోషాన్ని నేను గమనించనే లేదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  35. పట్టు బట్టి నీకు పట్టు కోకను దెస్తి
    కట్టుకోక నన్ను పట్టుకోక
    బెట్టు సేతు వేల ప్రేమ గీతి కలసి
    పాడు, పున్నమ యిది పండుగ కద

    రిప్లయితొలగించండి
  36. అయ్యా చంద్రశేఖర్ గారూ!
    మీ వ్యాఖ్యలో "మనోకారకుడు" అన్నారు - కానీ మనఃకారకుడు అనుటయే సాధువు.

    రిప్లయితొలగించండి
  37. గురువుగారూ ధన్యవాదాలు.
    ఆట వెలది పాదాన్ని సుందరమైన కందంగా మలచడం మీకే చెల్లు.
    నేమాని పండితుల, విష్ణు నందనుల పూరణలు అమందానన్దాన్ని కల్గించాయి.
    మొత్తం మీద మిత్రులందరూ పున్నమి వెన్నెల్లో తడిసి పోయారు.

    రిప్లయితొలగించండి
  38. ఈ రాత్రి గం. 1 0:21ని. కు హైదరాబాదుకు నుండి చూడగా చంద్రుడు మేషంలో 22°21'57" (భరణీ 3పా) మరియు వక్రీ గురుడు మేషంలో 09°35'06" (ఆశ్వినీ 3పా) ఇద్దరూ యేక రాశిగతులు. మేష రాశ్యధిపతి కుజుడు సింహంలో 5°44'15" (మఖా 2పాలో) గురుదృష్టి కలిగియున్నాడు. రవి తులలో 23°55'00" (అనురాధా 4పా) నుండి మేషమందలి గురుచంద్రులకు సమసప్తక దృష్టి.

    ఈ గురుచంద్రుల వలన గజకేసరీ యోగం కలిగినా నీచరవి చంద్రయుక్తవక్రీగురుని చూడటం వలన అంత ప్రశస్తం అనుకోను.

    రిప్లయితొలగించండి
  39. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, నవంబర్ 10, 2011 10:46:00 PM

    శ్రీనేమాని మహాశయా! గుర్తుకొచ్చింది. అదివరలో మన:కారకుడు గురించి ఇచ్చిన వివరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  40. మిస్సన్నగారు , సుందరమైనదో కాదో గాని 7వ తేదీ నాట ఆట వెలది సమస్య "దోచు కొనిన దొడ్డ దొరకు నతులు" ను నేను కూడా కందం లో చెప్పి కొంచెం దురద తీర్చుకున్నాను. మీరు గమనించినట్లు లేదు. ఆ పద్యం మరల యిదిగో మీ కోసం మరొక సారి.
    వనితల చీరలు వెన్నలు
    దనుజేంద్రుల తలలు భక్తి తత్పరు లగుస
    జ్జనుల మనంబులు దోచు కొ
    నిన దొడ్డ దొరకు నతులు మునిజన నుతునకున్

    రిప్లయితొలగించండి
  41. శ్రీపతిశాస్త్రిగురువారం, నవంబర్ 10, 2011 11:46:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    అంబ చెంతచేర నానందతాండవం
    బాడుచుండె శివుడు పరవశించి
    అర్ధనారి తత్వ మణువణువన్ దోచ
    పాడు, పున్నమ యిది పండుగ కద

    పాడు = పాట పాడు

    రిప్లయితొలగించండి
  42. శుభ్ర చంద్ర కాంతి శోభచే వెలిగెడి
    ప్రీతి దాయకమ్ము ప్రేమికులకు
    ప్రణయ గీతములను భావ రాగమ్ముల
    పాడు ,పున్నమ యిది పండుగ కద.

    రిప్లయితొలగించండి
  43. నిండు చంద మామ మెండుగా కవ్వించ
    కలువ కన్నె లన్ని కలత పడగ.
    ఈసు జెంది మేఘు డించుక క్రమ్ముకొని
    పాడు పున్నమ యిది పండుగ కద !

    రిప్లయితొలగించండి
  44. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘ఎంకి-నాయుడు బావలను’ గుర్తుకు తెచ్చారు. వ్యావహారిక పదప్రయోగం మీ పూరణకు ఒక సహజత్వాన్ని తెచ్చింది. అభినందనలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అణువణువన్ దోచ’ అనేది టైపాటా? అక్కడ ‘ఆణువణువున దోచ’ అని ఉండాలనుకుంటాను.
    **********************************************************************
    ‘కమనీయం’ గారూ,
    నిజంగానే కమనీయమైన పూరణ. సమర్థశబ్దప్రయోగం మీ పూరణకు వన్నె తెచ్చింది. అభినందనలు.
    **********************************************************************
    రాజేశ్వరి అక్కయ్యా,
    సుందరమైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘ఇంచుక క్రమ్ముకొని’ అన్నచో గణదోషం. ‘ఇంచుక క్రమ్మగా / ఇంచుక క్రమ్మిన’ అంటే సరి!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  45. చంద్రశేఖరులకు ధన్యవాదములు. చంద్రుడికి దగ్గరగా ( నిన్నంత దగ్గర కాదు ) గురుడిని, నైరుతి దిశలో శుక్రుడిని కూడా యీ రాత్రి చూసాను. ఈ దినము పూర్ణ చంద్రుడు ఇంకా అందముగా ఉన్నాడు.

    రిప్లయితొలగించండి
  46. శ్యామలీయంగారూ నిజమే సుమండీ. నేనంతగా గమనించలేదు.
    మీ పద్యం నిజంగా కన్నయ్య భక్త వాత్సల్యమంత మనోహరంగా ఉంది.
    అభినందన లండీ.

    రిప్లయితొలగించండి