ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అల్లుఁ డవినీతిపరుఁ డైన నత్త మెచ్చు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.కవిమిత్రులకు మనవి ...
నిన్న మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల ఈనాటి సమస్యను ఇవ్వడం ఆలస్యమయింది. నిన్నటి పూరణలు, వ్యాఖ్యలను ఈ మధ్యాహ్నం వరకు పరిశీలించి స్పందిస్తాను. ఆలస్యానికి మన్నించండి.
భోగ భాగ్యాలతో బిడ్డ తూగవలెన
రిప్లయితొలగించండిటంచు మురిసెడు నత్తకు నార్జనంబె
ఘనము కావున నక్రమార్జనము కొరకు
నల్లు డవినీతి పరుడైన నత్త మెచ్చు
నీతి రీతులెఱుగనట్టి, నేమమన్న
రిప్లయితొలగించండితెలియనట్టి, మనమునందు తృప్తి లేని,
ధనము పైన యాశ విడని తరుణి తనదు
యల్లుఁ డవినీతిపరుఁ డైన నత్త మెచ్చు.
మీ పాదపద్మములకు నమస్కరిస్తూ సవరణలకు ధన్యవాదములు తెలుపుతూ.
రిప్లయితొలగించండినేటి జనుకు శ్రీమంతులను కీర్తించుట నిత్యకృత్యమైనది.
--------------
నీతి శాస్త్రము లోనవినీతి నిండె
జాతియంతయు గీర్తించు జ్యోతివైన
కుందనపు పన్ను తోడను కులుకునట్టి,
యల్లు డవినీతి పరుడైన నత్తమెచ్చు
బల్ల క్రింద రాబడి మహ చల్లనౌను
రిప్లయితొలగించండిప్రల్లదుండైన మనకేమి; పరగ నేడు
యల్లుఁడవినీతిపరుఁడైన నత్త మెచ్చు;
ఔర! "సర్వే గుణాః హేమమాశ్రయన్తి".
అక్రమార్జన మనకేల? హాయి నిడదు ,
రిప్లయితొలగించండినీతి తప్పుట పాడియే? నింద గల్గు,
కూతు మగడెంత వాడైన చేతలందు
యల్లుఁడ! వినీతిపరుఁడైన నత్త మెచ్చు
నేడు ఆడువారు తల్లిదంద్రులను విడచి, అ(స)క్రమార్జనతో కూతురిని సిరులతో నింపగలిగిన జాలు
రిప్లయితొలగించండిఅతడు మగవాడనుకొనుచున్నారు.
-------------
కన్నవారిని వీధికి, కూతురి మెడ,
మేడ మిద్దులను సిరుల తోడనింపు
ధనికులను జూచి మురిసెడు తరుణి తనదు
యల్లు డవినీతి పరుడైన నత్తమెచ్చు
అల్లుఁడ! వినీతిపరుఁ డైన నత్త మెచ్చు
రిప్లయితొలగించండినీదు కొమరుని. మనుమడని కడు ముద్దు
సేయు. నీవు బుద్ధులు మప్పి, చేవ చూపి
శిక్షణము నిచ్చి ఘనునిగ చేయ వలయు.
**********************************************************************
రిప్లయితొలగించండిపండిత నేమాని గారూ,
అల్లుని జీతం కంటె ‘పై సంపాదన’ ఎంత అని అడిగి మరీ పిల్లనిచ్చే రోజులివి. అవినీతి సంపాదన ఒక ‘స్టేటస్ సింబల్’గా మారింది.
మీ పూరణ వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నది. చక్కని పూరణ. అభినందనలు.
**********************************************************************
మందాకిని గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ అన్వయక్లేశంతో ఉన్నాయి.
రెండవ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది.
**********************************************************************
రవి గారూ,
సంస్కృత లోకోక్తిని తెలుగు పద్యంలో ఇమిడ్చిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
**********************************************************************
మిస్సన్న గారూ,
అల్లుణ్ణి సంబోధించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
చింతా రామకృష్ణారావు గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
**********************************************************************
మంద పీతాంబర్ గారి పూరణ .....
రిప్లయితొలగించండిపసిడి మేడలు గట్టినా పట్టు బడని
కోట్ల సంపద దోచినా కోర్టు లేమి
చేయ లేనట్టి సిసలైన చేవ యున్న
నల్లు డవినీతి పరుడైన నత్త మెచ్చు!!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిఎందుకో మీ పూరణ నేరుగా బ్లాగులో ప్రకటింపబడలేదు. మీ ఒక్కరికే కాదు మరికొందరికి ఈ సమస్య ఎదురయింది. నా మెయిల్ ఇన్ బాక్స్ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయవలసి వస్తున్నది.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
పెద్దలందురు శిక్షను పెండ్లి యనుచు
రిప్లయితొలగించండిఅత్తవారిల్లు నకొక పేరదియె జైలు
అచటి సిబ్బంది మామలు నత్తలగును
అల్లుఁడవినీతిపరుఁ డైన నత్త మెచ్చు
అల్లు డవి నీతి పరు డైన నత్త మెచ్చు
రిప్లయితొలగించండికొనునె ? యుద్యోగ మూడగా ,కూతురు తన
యింట కొనువు దీర, కోడ లెంత కాల్చు
నో 'సినీ సీను 'బుర్ర లో నురుకు చుండ
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికనికరంబులు కనరావు కలియుగమున
స్వార్థమే నేడు గన పరమార్థమయ్యె
బిడ్డ సుఖమును గోరుచు నడ్డు పడక
అల్లుఁడవినీతిపరుఁ డైన నత్త మెచ్చు
పరుల కష్టాలు జూడక భార్యకొరకు
నల్లధనమును పోగేసి యిల్లుగట్టి
సుతకు బంగారు నగలతో సుఖము గూర్ప
అల్లుఁడవినీతిపరుఁ డైన నత్త మెచ్చు
3 వ పాదం టైపాటు
రిప్లయితొలగించండియింట కొలువు దీరగ ,కోడ లెంత కాల్చు
1)
రిప్లయితొలగించండిపుత్రిక మంత్రిణై నడమంత్రపుసిరులొంది
చేరి చెఱసాల, వెలువడు దారి కనక
వగచు చుండఁ, గూడిసతిని దిగులు దీర్ప
నల్లుఁడవినీతిపరుఁ డైన నత్త మెచ్చు.
2)
చోరు డైన, స్త్రీమానస చోరుడైన
వేల గోపల కనుగప్పి లీల గాను
మాపటికిదరిజేరుటమాననట్టి
యల్లుఁడవినీతిపరుఁ డైన, నత్త మెచ్చు.
ధనమె భువి సర్వ విధ సౌఖ్య దాయకమ్ము
రిప్లయితొలగించండితివిరి యెటులైన ధనము సాధించ వలెను
అనెడి భావమ్ము గల్గిన యామె కాన
అల్లుడవినీతి పరుడైన నత్త మెచ్చు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
అత్త లందరు నొకరీతి - యనుట తగునె?
ఆర్ష సంస్కృతి నేడెంత - అల్పమాయె !
అక్క డెక్కడొ నొకయత్త - అల్పబుద్ధి !
అల్లు డవినీతి పరుడైన - నత్త మెచ్చు
ననుట వాస్తవ దూరము - ఆర్యులార !
అల్లుడవినీతి పరుడైన - ఆపదొచ్చు
ఆలు బిడ్డలు శోకాన - నలమటించు !
అల్లుడొక రాము డైనచో - అత్త మెచ్చు !
_________________________________
ఘల్లు ఘల్లని గజలక్ష్మి గంతులిడగ
రిప్లయితొలగించండిసకల సంపదల్ తనయకు సౌఖ్యమిడగ
మాన మర్యాద లుడుగగ మసలుచు వెస
నల్లుఁ డవినీతి పరుడైన నత్త మెచ్చు .
కన్న వారిని విడనాడి యున్న పాటు
రిప్లయితొలగించండితనదు తనయతొ నమెరికా తరలి పోవ
గిట్టు బాటౌను మనకింత పెట్టు బడికి
అల్లుడవి నీతి పరుడైన నత్త మెచ్చు !
నమస్కారములు.
" భ్రాతృ విదియ పర్వ దిన శుభా కాంక్షలను నేను పంచు కొన లేక పోయి నందుకు బాధగా ఉంది. నేను ఇక్కడ లేను [ బోస్టన్ లో ఒక స్వీట్ సిక్స్ టీన్ పార్టీకి వెళ్ళాము ] అవకాసం దొరకాలే గానీ సోదరులకు ప్రీతి కరమైన భోజనము వండి వడ్డింఛి శుభాసీస్సులను పొందడం కంటె అదృష్టం ఇంకే ముంటుంది . సోదరు లందరికీ ధన్య వాదములు
**********************************************************************
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
అత్తవారిల్లును జైలుగా మార్చారే! ఇంతకీ అల్లు డవినీతి పరుడైతే అత్త మెచ్చి విడుదల చేస్తుందా? కొంచెం అన్వయక్లేశం కనిపిస్తోంది. మొత్తానికి పద్యం చమత్కారజనకమై శోభిస్తున్నది. అభినందనలు.
**********************************************************************
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
సమస్యను ప్రశ్నగా మార్చిన ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
**********************************************************************
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
**********************************************************************
ఊకదంపుడు గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
**********************************************************************
‘కమనీయం’ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
**********************************************************************
వసంత కిశోర్ గారూ,
రెండుపద్యాలలో ఒక పూరణ! చక్కని ప్రయోగం. మంచి పూరణ. అభినందనలు.
‘ఒచ్చు’ అనడం, ‘ఆలుబిడ్డలు - అలమటించు (తురు?) .. ఇవి చిన్న లోపాలు.
‘...............ఆపద యగు
నాలు బిడ్డలు శోకాన - నలమటింతు
రల్లుడొక ......’ అంటే సరి!
**********************************************************************
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
‘గజలక్ష్మి’ అనడంలో ఏదైనా వ్యంగ్యార్థం ఉందా?
**********************************************************************
రాజేశ్వరక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘భ్రాతృవిదియ’నాడు మీ ఆశీస్సులు మాకు లభించడ పోవడం దురదృష్టమే. అందుకేనేమో ఆరోజు నేను భగినీ హస్త భోజనానికి నోచుకోలేదు. అయినా మొన్న వెళ్ళి ‘వడ్డీ’తో భోచేసి వచ్చాను లెండి.
అవునూ ... ఈ వయసులో ‘స్వీటి సిక్స్ టీన్ పార్టీ’లా? ఈ పార్టీ గురించి తెలియదు. వివరాలు తెలిపితే సంతోషిస్తాం.
**********************************************************************
శంకరార్యా ! ధన్యవాదములు. అత్తా మామలు కొత్త అల్లుడు అత్త వారింటికి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు "మర్యాదలు" చేద్దామా అని చూస్తుంటారు. అవినీతి "అల్లుళ్ళు" ఎప్పుడు "అత్త వారింటికి" వస్తారా, ఎప్పుడు "మర్యాద" చేద్దామా అని "అత్తలు(మామలు)" ఎదురుచూస్తూ "మర్యాదలు " చేసే ఆవకాశం వచ్చినప్పుడు సంతోషిస్తారని నాబావం. (అవినీతి అల్లుళ్ళు "మర్యాదలు వద్దని" అత్తవారికి కానుకలు తెచ్చే (ఇచ్చే) అవకాశం కూడా వుంది.)
రిప్లయితొలగించండిపండిత నేమాని వారి భోగ భాగ్యాలతో..... పద్యం మంచి ధారాశుధ్ధితో అలరంచింది.
రిప్లయితొలగించండిమందాకినిగారి పద్యం నీతి రీతులెఱుగనట్టి..... చక్కదనానికి చిన్న అడ్డు తగిలింది సమస్య వలననే. 'అత్త' అన్న పదం తీసేస్తే సరిగా అన్వయం అవుతుంది. కాని అలా చేయరాదు కదా? తరుణి అనేశాక అత్త అన్నది అధికపదం అయిపోయింది. మూడవపాదాన్ని "ధనవిమోహంబు సుంతయు మాన లేని" అని మారిస్తే బాగుంటుందేమో. కాని అప్పుడు మొత్తం విశేషణాలన్నీ అల్లుడుగారికి అన్వయిస్తున్నాయి, అత్తకు గాక! అందుచేత ముడవ పాదాన్ని 'లేకితనమును విడనాడ లేని వేళ' అని మారిస్తే సరిపోతుంది.
వరప్రసాదు గారి పద్యం నీతి శాస్త్రము ....నాకు కొఱుకుడు పడలేదు. క్షమించాలి. అలాగే వారి మరొక పద్యం కన్నవారిని... లో అన్వయం కుదరటం లేదు కన్నవారిని వీధికి నెట్టి అనకుండా! పైగా రెండవ దానిలో ప్రధమపాదే యతిభంగః
రవి గారి పద్యం బల్లక్రింద..... లో మహ చల్లనౌను కంటే చాల చల్లనౌను అంటే బలవంతపు హ్రస్వం చేయ నక్కర లేదు కదా. పద్యం బాగుంది. వ్యక్తగతంగా నాకు సమస్యను పద్యం మధ్యలోకి లాగటం నచ్చకపోవటం వేరే విషయం.
మిస్సన్నగారి పద్యం బాగుంది. యల్లుఁడ! అనేసి విరుపుతో బయటివ్యక్తి అల్లుడుగారికి అత్త యెప్పుడు మెచ్చుతుందో చెప్పించారు. కాని న్యాయంగా యిందులో చిన్న చిక్కు ఉంది. వినీతిపరుఁడైన అని కాక, వినీతిపరుఁడవైన అనవలసి యంటుంది! ఇదే చిక్కు చింతా రామకృష్ణారావు గారి పద్యంలో కూడా ఉంది. వారు యీ పధ్ధతిలో పద్యం మొదలు పెట్టారు.
ఆయన పద్యం నాకు కొంత అన్వయం సౌఖ్యం లోపించి నట్లు తోచింది. ఆలోచించాలి.
పీతాంబర్ గారి పసిడి మేడలు .... వ్యావహారిక పదాలతో ఉంది. ఈరోజుల్లో నప్పుతుంది. చాలా బాగుంది. కట్టినా, దోచినా అనే పదాలను ఛందం చెడకుండా గ్రంధభాషలోనికి సులభంగానే మార్చనగును లెండి ఛాందసులకు.
గోలి వారి పెద్ధలందురు... లో రెండవ పాదం పరిష్కరణ చేయాలి. వ్యంగ్య బాణం.
వక్కాకులవారు సమస్యతో మొదలుపెట్టి, చమత్కారంగా దాన్ని ప్రశ్నగా మార్చారు. మూడవ పాదంలో టైపోకు వారి చేసిన సవరణ "యింట కొలువు దీరగ ,కోడ లెంత కాల్చు" అని. చివర కొంచెం హడావుడి ఐపోయినట్లుంది. "కోడ లెంత కాల్చు నో అను 'సినీ సీను 'బుర్ర లో నురుకు చుండ అనదలచినా", యీ ' అను'కు చోటు చాలలేదు. దాంతో కొంచెం అన్వయం పాడయింది మంచి పూరణలో. పోనీ సినీ అన్న మాటే వదిలేస్తే సరియేమో.
శ్రీపతిశాస్త్రిగారి కనికరంబులు..., పరుల కష్టాలు... బాగున్నాయి. కాని 'పోగేసి' అనేది గ్రామ్యం అవుతుంది కాబట్టి ప్రోగిడి అంటే సరి.
ఊకదంపుడుగారి రెండు పోట్లు. పుత్రిక మంత్రిణై...., చోరు డైన.... ఆర్యా, మంత్రిణై సరిగాదేమో. మంత్రిణియై అనాలనుకుంటాను. అదీ గాక నాకు అన్వయక్లిష్టత కనిపిస్తోంది. పునఃపఠనం చేయాలేమో. అలాగే రెండవ దానిలోని 'గోపల' అన్న పదం సాదువుగదని అనుమానం. ఇక్కడా నాకు అన్వయక్లిష్టత కనిపిస్తోంది. కొంచేం తీరికగా చదవాలి.
కమనీయం గారి ధనమె భువి.... లో 'వలెను అనెడి" అనే పదాలు సంధిని తప్పించుకోలేవని మనవి. వాటి మధ్యలో పాదాంతం అయనా సరే.
వసంత కిశోర్ గారి పద్యాలు రెండూ బాగున్నాయి. కాని మొదటిదానిలో ఒక అత్త అధికపదం. ఆపదొచ్చు అనేది గ్రామ్యం కాబట్టి ఆపదయగు అంటే సరి.
గన్నవరపువారి , రాజేశ్వరిగారి పద్యాలు బాగున్నాయి.
శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశ్యామలీయంగారూ ! ఎంతో శ్రమ తీసుకొని మీరు చేస్తున్న విశ్లేషణ
ఎంతో ఉపయుక్తముగా ఉంటోంది ! ధన్యవాదములు !