15, నవంబర్ 2011, మంగళవారం

నా పాటలు - (సాయి పాట)

సాయిబాబా ఏకాదశ సూత్రాలు

సాయిబాబ ఏకాదశ సూత్రము
లివియే బాగుగ తెలియండి
శ్రద్ధాభక్తుల సమన్వయంతో
నమ్మిన వారికె రక్షణము                
|| సాయిబాబ ||

షిరిడీపుర ప్రవేశ మొక్కటే
సర్వదుఃఖముల పరిహారం              
|| షిరిడీ ||
ఆర్తులు పేదలు ద్వారకమాయిని
చేరి పొందుదురు సౌఖ్యమును         
|| ఆర్తులు ||
భౌతికదేహము వీడిన పిదప
అప్రమత్తుడై వెలసెను సాయి           
|| భౌతిక ||
సమాధినుండే వెడలుచుండును
సాయిభక్తులకు సర్వరక్షణం            
|| సమాధి ||
సర్వకార్యములు సమాధినుండే
నిర్వహించును సాయినాథుడు        
|| సర్వ ||
సాయీమానుషదేహము మనతో
సమాధినుండే సంభాషించును        
|| సాయీ ||
అర్తుల శరణాగతులను బ్రోచుటె
సద్గురు సాయి కర్తవ్యం                   
|| ఆర్తుల ||
ఎవరు సాయిపై దృష్టి నిలిపిరో
వారిపైననే కటాక్షము                     
|| ఎవరు ||
తనపై నుంచిన భారము లన్నీ
మోసే ప్రభువు శ్రీసాయి                   
|| తనపై ||
కోరిన వెంటనె సహాయ మొసగే
కరుణాసింధువు మన సాయి           
|| కోరిన ||
సాయిని నమ్మిన భక్తుల యింట
లేమి అనునదే లేదు సుమా            
|| సాయిని ||

సాయిబాబ ఏకాదశ సూత్రము
లివియే బాగుగ తెలియండి
శ్రద్ధాభక్తుల సమన్వయంతో
నమ్మిన వారికె రక్షణము               
|| సాయిబాబ ||

(ఇది రికార్డింగ్ కాలేదని గమనించవలసిందిగా మనవి)

2 కామెంట్‌లు:

  1. ఏకాదశ సూత్రములను
    శ్రీకరముగ నలరు రీతి చేసితివి బళా
    నైకార్థదమగు సాయి
    శ్రీకరుణన్ శంకరార్య శిష్టగుణాఢ్యా!

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    ‘నైకార్థద మగు సాయికరుణ’ ప్రయోగం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి