1, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 838 (అనుమానించు పతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్.

25 కామెంట్‌లు:


  1. అనయము ప్రేమాదరముల
    మన మెఱిఁగి చరించుచుండి, మానక సతి మో
    మును చంద్రబింబ మనఁగా
    ననుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్.

    రిప్లయితొలగించండి
  2. మాస్టారు గారూ! ముఖమును చంద్ర బింబముగా ననుమానించారు..బాగుంది.
    మాకు అనుమానించ దానికి ఏదైనా దొరుకుతుందో లేదోనని అనుమానంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  3. అనుమానము పెను భూతము
    అని మానక చేయు పనుల నన్నిటి తానే
    గని లోప రహితమునకై
    అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్.

    రిప్లయితొలగించండి
  4. మాస్టారు ఎలాగైనా అనుభవజ్ఞులు. చక్కటి పూరణ సొగసైన చమత్కారము.

    రిప్లయితొలగించండి
  5. గోలివారు ప్రశ్న అడగకముందే సమాధానం చెప్పారు. బాగుంది:-)

    రిప్లయితొలగించండి
  6. అనునిత్యమ్ము నుపాసన
    నొనరించుచు భక్తి రుచుల నొప్పెడు భార్యన్
    గని యొక్కెడ దేవత యని
    యనుమానించు పతి బడసి యతివ సుఖపడెన్

    రిప్లయితొలగించండి

  7. అనవరతము దుః ఖిం చె ను
    అనుమానించు పతి బడసి , యతివ సుఖ పడెన్
    ననుమాన రహిత భర్తను
    ననునయముగ బొంది యపుడు యా జన్మ మునున్ .

    రిప్లయితొలగించండి

  8. కనులా, మీనములా? యా
    ననమా, పద్మమ? సువీక్ష, నన తూపుల? దం
    శనముల, మల్లియల? యనుచు
    ననుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్!

    రిప్లయితొలగించండి
  9. తనవారిని వియ్యంకులఁ
    యణుమాత్రపు తేడ లేక నాలియె జూడన్
    తనుజూపు ప్రేమ కొరతని
    యనుమానించుపతిఁబడసియతివసుఖపడెన్!

    రిప్లయితొలగించండి

  10. పనియుండి తాను పొరుగూ
    రిని చేరి గృహమున నొంటరిగ నుండియు తిం
    డిని నిద్రను మరచెనొ యని
    యనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్.

    రిప్లయితొలగించండి
  11. తనను విడిచి నేను చరిం
    చననుచు పల్కితి ద్విజవర సన్నిధిన, పరాం
    గనను గనుట పాపమనుచు
    ననుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్!!

    రిప్లయితొలగించండి
  12. తనువందముగల కన్యను
    మనువాడగ కోరుకొనును మనుజుండిలలో
    పనియే మిక్కిలి సొబగని
    యనుమానించు పతి బడసి యతివ సుఖపడెన్.

    రిప్లయితొలగించండి
  13. అనుమానింప బడియె గద ?
    వనముల పాలయ్యె సీత వ్యధలను జెందెన్ !
    విన లేదెన్నడు యిటులన
    "యనుమానించు పతి బడసి యతివ సుఖపడెన్! "

    రిప్లయితొలగించండి
  14. వనజాక్షి సొగసు గాంచిన
    కనులే మిరుమిట్లు గొలుపు కధలే పలుకన్ !
    తన మాటలు వినలేదని
    అనుమానించు పతిఁ బడసి యతివ సుఖ పడెన్ !
    ---------------------------------------
    తన వెంటనె సతిని గూడ
    గొని పోవగ నెంచి యతడు కొండకు భక్తిన్ !
    అనుమతి నిడి వచ్చునొ రాదో
    అనుమానించు పతిఁ బడసి యతివ సుఖ పడెన్ !

    రిప్లయితొలగించండి
  15. నాగరాజు రవీందర్ గారూ మీ పూరణ చిన్నగా బాగుంది.

    అనుమానింప బడియె గద ?
    వనముల పాలయ్యె సీత వ్యధలను జెందెన్ !

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అనుమానించ డానికి ఏమీ దొరకదేమో అని అనుమానం పెట్టుకొని మీరు అనుమానం మీద మంచి పూరణ చెప్పారనడంలో నాకే అనుమానమూ లేదు. అభినందనలు.
    అనుమానించెద నెది యని
    యనుమానము తెలియఁజేసి యనుమానముపై
    యనుమానించెడి పూరణ
    ననుమానము లేక చెపితె హనుమచ్ఛాస్త్రీ!
    *
    చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మనోహరమైన భావంతో అలరారుతున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    వర్ణనాత్మకమైన అందమైన పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వియ్యంకుల నణుమాత్రము..’ అనంది. ‘తేడా’ను హ్రస్వాంతంగా ప్రయోగించరాదు. అక్కడ ‘పొరపు లేక’ అందాం.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో 1,3 పాదాలలో గణదోషం.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. స్వానుభవం రంగరించిన పూరణ:
    తనపతి కేమియు చెప్పను
    పనిలేదుగదా, ఘుమఘుమ వచ్చెడి యా వా
    సనబట్టి వంటల రుచుల
    ననుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్
    మనవి: అనుమానించు=ఊహించు, నిర్ణయించు అనేఅర్థంలో

    రిప్లయితొలగించండి





  18. తన పుణ్యమ్మో ,భాగ్యమొ
    కనులకు విందగు విలాస గాత్రమ్మెలయన్ ,
    వనదేవత యేమో యని
    'అనుమానించు పతి బడసి యతివ సుఖపడెన్.'

    రిప్లయితొలగించండి
  19. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మాస్టారు గారూ ! 'అనుమానములతో' చెప్పిన మీ పద్యం
    అమోఘం గా ఉన్నది. అందులో అనుమానం లేదు. ధన్యవాదములు.
    చంద్రశేఖర్ గారూ! లేటుగా వచ్చినా లే 'టేస్టు' గా వచ్చారు బాగుంది...

    రిప్లయితొలగించండి
  21. తన తపమును జెరచుటకై
    కనివిని యెరుగని వలపును కందర్పుండే
    చొనిపించె న్నేమోయని
    అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్

    రిప్లయితొలగించండి
  22. కనివిని యెరుగని నగలను
    ఘనమగు ప్రేమను కొనుచును కడుపుబ్బులతో
    జనములు ద్వేషించెదరని
    యనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్

    రిప్లయితొలగించండి