భాషకు వ్యాకరణమే మూలస్తంభము
మిత్రులారా!
మన రచనలను సాధ్యమైనంత వరకు వ్యాకరణ బద్ధముగా నుండుటకే ప్రయత్నము చేయవలెను. కొందరు మహాకవులు వ్యాకరణ విరుద్ధములైన ప్రయోగములు చేయుటయు వాటిని "ఆర్య వ్యవహారములు గా" వదిలివేయుటయు జరిగినది. సమాసములలో పూర్వపదము చివరన "న్" లేక "ల్" వంటి వర్ణములు ఉన్నప్పుడు పర పదము "అ" కారము వంటి అచ్చుతో మొదలగునప్పుడు సంధి కార్యము ఎట్లుండును?
ఉదా: వానిన్ + అక్కడ = వానినక్కడ (సాధు ప్రయోగము)
‘వానిన్నక్కడ’ అని సాధించుట వ్యాకరణ సమ్మతము కాదు. కొందరు పూర్వ కవులు ఎందరో వర్తమాన కవులు ఈ విషయమును గమనించుట లేదు. నా ఉద్దేశములో అట్టి దోష ప్రయోగములను చేయకుండుట మంచిది.
పూర్వపదము సంస్కృత పదము అయినప్పుడు పర పదము అచ్చుతో ప్రారంభమయినప్పుడు సంధి కార్యము ఈ క్రింది విధముగా నుంటుంది:
కస్త్వం + అనెను = కస్త్వమ్మనెను;
తుభ్యం + అనుచు = తుభ్యమ్మనుచు.
ఈ సూత్రమును కేవల తెలుగు సంధులకు అన్వయించుట తగదు.
ఉంచెన్ + ఇక్కడ = ఉంచెనిక్కడ మాత్రమే అగును. ఉంచెన్నిక్కడ అని వాడరాదు. అటులనే:
వచ్చెన్ + అంతట = వచ్చెనంతట మాత్రమే అగును. వచ్చెన్నంతట అని సంధి చేయరాదు.
అందరకీ శుభాభినందనలతో. స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

అయ్యా ! మంచి పాఠం ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండినేమాని పండితార్యా ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమంచి పాఠం చెప్పినందుకు.
గురువు గారికి నమస్సుమాంజలులు. మంచి పాఠం చెప్పినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈరోజు వ్యాకరణం లో మంచి విషయాన్నీ తెలుసుకున్నాను.Thanks
రిప్లయితొలగించండి