15, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 850 (పితృదేవుల పూజసేయ)

కవిమిత్రులారా,
ఈరోజు ‘మహాలయ అమావాస్య’ సందర్భంగా పూరించవలసిన సమస్య   ఇది...
పితృదేవుల పూజసేయఁ బెనుపడు నిడుముల్.

9 కామెంట్‌లు:

  1. మతిలేని మాటలేలా?
    పితృదేవుల పూజసేయ బెనుపడు నిడుముల్
    క్షితినని, యథార్థమునుగను
    మతుల సుఖము గూర్చు పితల నర్చించు విధుల్

    రిప్లయితొలగించండి
  2. గతి తప్పిన జనులిపుడు కు
    మతులె ఘనులనుచు నుతించి మంచిని మరిచెన్
    మతిమాలి మేఘనాథుని
    పితృదేవుల పూజసేయఁ బెనుపడు నిడుముల్!!

    రిప్లయితొలగించండి
  3. క్షితిలో వంశము స్థితిగా
    పితృదేవుల పూజసేయఁ బెనుపడు; నిడుముల్
    వెతలును రెట్టింపగు నీ
    పితరుల దూరిన పరాకు విడువుము చంద్రా !

    రిప్లయితొలగించండి
  4. క్షితిలో సుఖసంపత్తులు
    పితృదేవుల పూజసేయ పెనుపడు, నిడుముల్
    గతిలేక పారిపోవును
    సతతము సంతసము గలుగు సత్వము హెచ్చున్.

    రిప్లయితొలగించండి
  5. క్షితిపై జన్మంబిచ్చియు
    స్థితిమంతులఁజేయనెంచి
    శ్రేయముగోరన్
    సుతరామిష్టముఁజూపక
    పితృదేవులపూజసేయఁబెనుపడునిడుముల్!

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రులకు నమస్కృతులు.
    కొన్ని ముఖ్యమైన పనుల వల్ల గత రెండు రోజులుగా మీ పూరణలను, పద్యాలను సమీక్షించడానికి అవకాశం దొరకడం లేదు. మన్నించాలి.
    వైవిధ్యంగా చక్కని పూరణలు చేసిన...
    పండిత నేమాని వారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    సత్యనారాయణ మూర్తి గారికి,
    సహదేవుడు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. గతి లేకను నిధి లేకను
    సతి యాజ్ఞను మీరలేక సతమత మౌచున్
    మతి లేకను ధృతి లేకను
    పితృదేవుల పూజసేయఁ బెనుపడు నిడుముల్

    రిప్లయితొలగించండి