సార్థకంగా, సమర్థవంతంగా పూరణలు పంపిన... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, సత్యనారాయణ మూర్తి గారికి, సహదేవుడు గారికి, నాగరాజు రవీందర్ గారికి, కళ్యాణ్ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, లక్ష్మీ నరసింహం గారికి అభినందనలు, ధన్యవాదాలు.
* వరప్రసాద్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘అవరతము’ అంటే విశ్రాంతి. అక్కడ ‘అనవరతము’ అని ఉండాలనుకుంటాను. ఒకవేళ విశ్రాంతి, సుఖము, శాంతి ఇచ్చు అని మీ అభిప్రాయమైతే ‘తలచ న/వరతము..’ అందాం. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం టైపాటు వల్ల కావచ్చు. ‘పతిని దైవమనుచు..’ అని ఉండాలనుకుంటా. * జంగిడి రాజేందర్ గారూ, ప్రశంసార్హమైన ప్రయత్నం చేసారు. అభినందనలు. మీ పద్యంలోని టైపాట్లను అమల ఫోన్ చేసి చెప్పింది కాని మరిచిపోయాను. ‘అంక చండలమ్ము’ ప్రయోగం దోషం. మూడవ పాదంలో యతిదోషం ఉంది. సవరించండి.
namaskaram sir.nenu pampinchu padyalannintini sari cheyagalaru.samasyapuranam-851 lo na padyam 3va padamlo nota---nata lo ta--ta ki prasa kalipanu.ala chevacchuno ledo theliyacheyagalaru.
namaskaram sir.nenu pampinchu padyalannintini sari cheyagalaru.samasyapuranam-851 lo na padyam 3va padamlo nota---nata lo ta--ta ki prasa kalipanu.ala chevacchuno ledo theliyacheyagalaru.
పాడు బుధ్ధి తోడ పలుకరించగ రాగ
రిప్లయితొలగించండిఆశ లెన్నొ జూపి యనునయించ
లెక్క జేయ కుండ ప్రక్క యింటను రతీ
పతిని బాధపెట్టు వనిత సాధ్వి
దుష్ట నాశనమ్ము శిష్ట రక్షణయును
రిప్లయితొలగించండిధర్మ పాలనమ్ము తనదు బాధ్య
తలగ జేయుచుండు తల్లి రాక్షసలోక
పతిని బాధ పెట్టు వనిత సాధ్వి
శ్రీ శంకరయ్య గారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
రిప్లయితొలగించండిగురువుగారికి దన్యవాదములు
======*=====
నిత్య కలహ మాడ నెమ్మది కరువయి
పతిని బాధ పెట్టు , వనిత సాధ్వి
పతి పితృలను కన్న వారిగ దలచు న
వరతము సుఖ శాంతి వరము లిచ్చు |
అతిథిసేవ చేయు డమితానురాగాన
రిప్లయితొలగించండిదీనజనుల జేరదీయుచుండి
మంచి మనసుతోడ మాటలాడుడటంచు
పతిని బాధపెట్టు వనిత సాధ్వి
బాల్యమందునుండిబాధ్యతనెరుగక
రిప్లయితొలగించండితిరుగుబోతుభర్తతీరుఁజూచి
నడతమార్చుకొనగనసపెట్టిబుసకొట్టి
పతినిబాధపెట్టువనితసాద్వి
శ్రీ సహదేవుడు గారి పద్యం అదుర్స్.
రిప్లయితొలగించండినరకలోక మేగు నర జన్మ తదుపరి
రిప్లయితొలగించండిపతిని బాధ పెట్టు వనిత, సాధ్వి
పతి దైవ మనియు భావించి నిరతము
పాద సేవ చేయు పాణి తోడ.
వాదులాటలు పతి వదనంబు చూడక
రిప్లయితొలగించండిఅంక చండలమ్ము ఆడిపోసి
నోట తిట్టి పతిని నటనచేయు వనిత
పతిని బాధ పెట్టు వనిత సాధ్వి
చెంగు చెంగు మనుచు చెంగలించుచు వచ్చు
రిప్లయితొలగించండిపసిడి మృగమును గని భ్రమసి సీత
మంకు పట్టు బట్టె జింకను తెమ్మని
పతిని బాధ పెట్టు వనిత సాధ్వి !
మగని దిద్దు కటువుమాటల సతిగాను
రిప్లయితొలగించండిబుద్ధిలోటునణచు బోధగాను
చిత్త మాంద్యమునకు చేదుయౌషధిగాను
పతినిబాధపెట్టు వనితసాధ్వి
వలపు కులుకు జూపి వయ్యార మొలికించి
రిప్లయితొలగించండిమంచి మాట లాడి మాయ జేసి
గడప దాటి యతడు నడివీధి బడకుండ
పతిని బాధ పెట్టు వనిత సాధ్వి
రిప్లయితొలగించండిపగటివేళయందు పర్వదినములందు
శ్రాద్ధక్రర్మ జేయు సమయమందు
పడకసౌఖ్యమన్న పాపమని తెలిపి
పతిని బాధపెట్టు వనిత సాధ్వి.
సార్థకంగా, సమర్థవంతంగా పూరణలు పంపిన...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
సత్యనారాయణ మూర్తి గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
కళ్యాణ్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
లక్ష్మీ నరసింహం గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘అవరతము’ అంటే విశ్రాంతి. అక్కడ ‘అనవరతము’ అని ఉండాలనుకుంటాను. ఒకవేళ విశ్రాంతి, సుఖము, శాంతి ఇచ్చు అని మీ అభిప్రాయమైతే ‘తలచ న/వరతము..’ అందాం.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం టైపాటు వల్ల కావచ్చు. ‘పతిని దైవమనుచు..’ అని ఉండాలనుకుంటా.
*
జంగిడి రాజేందర్ గారూ,
ప్రశంసార్హమైన ప్రయత్నం చేసారు. అభినందనలు.
మీ పద్యంలోని టైపాట్లను అమల ఫోన్ చేసి చెప్పింది కాని మరిచిపోయాను. ‘అంక చండలమ్ము’ ప్రయోగం దోషం. మూడవ పాదంలో యతిదోషం ఉంది. సవరించండి.
పేదరికముచేత పెను బాధ పడుచున్న
రిప్లయితొలగించండిత్రాగి మైకమెక్కి రచ్చ జేయు
నిల్లు చక్క దిద్దు ఎల్లాలు, మార్పుకై
పతిని బాధపెట్టు వనిత సాధ్వి.
namaskaram sir.nenu pampinchu padyalannintini sari cheyagalaru.samasyapuranam-851 lo na padyam 3va padamlo nota---nata lo ta--ta ki prasa kalipanu.ala chevacchuno ledo theliyacheyagalaru.
రిప్లయితొలగించండిnamaskaram sir.nenu pampinchu padyalannintini sari cheyagalaru.samasyapuranam-851 lo na padyam 3va padamlo nota---nata lo ta--ta ki prasa kalipanu.ala chevacchuno ledo theliyacheyagalaru.
రిప్లయితొలగించండిగురువుగారికినమస్సులు మరియు ధన్యవాదములు.అలాగే కవిమిత్రులు శ్రీ మారెళ్ళ వామనకుమార్ గారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమూఁడు లోకములను ముప్పతిప్పలు పెట్టి,
రిప్లయితొలగించండిసంతసమునఁ దేలు, సుంతయేని
మమత లేనియట్టి మహిషాసుర 'దనుజ
పతిని' బాధపెట్టు వనిత సాధ్వి.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిదేవీ నవరాత్రులు జరుగుతున్న ఈ సమయంలో మీ పూరణ సందర్భోచితంగా చక్కగా ఉంది. అభినందనలు.