20, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 854 (అవధానముఁ జేయువారలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అవధానముఁ జేయువార లల్పులు గాదే!

22 కామెంట్‌లు:


 1. వ్యవధానము లేకుండగ
  జవదాటక నడుగు ప్రశ్న శహభాషుల వ
  హ్వ వహవ్వ యన సరసముగ
  నవధానముఁ జేయువార లల్పులు గాదే?

  రిప్లయితొలగించండి
 2. నవరస భరితమగు సరణి
  నవధానము జేయువార లల్పులు గాదే?
  కువిమర్శకులకు నకటా!
  వివేకహీనులకు రసము వెగటగు గాదే?

  రిప్లయితొలగించండి

 3. స్తవనీయ కవిత్వ దక్షులె
  యవధానముఁ జేయువార; లల్పులు గాదే
  యవధాన విద్య యెడఁ ద
  క్కువ భావము గలిగి లెక్క గొననట్టి జనుల్.

  రిప్లయితొలగించండి

 4. సవనమ్మౌ యవధానపు
  కవన మ్మత్యంత రమ్య గతి నడుపంగన్
  సవిధాన రీతి నెఱుఁగక
  యవధానముఁ జేయువార లల్పులుగాదే?

  రిప్లయితొలగించండి


 5. అవధాన మరయ నొక కళ
  రవ ళిం చును జనుల నెపుడు రసముల తోడ
  న్నవ నవ లాడుచు నుండును
  నవధా నము జేయు వార లల్పులు గాదే !

  రిప్లయితొలగించండి
 6. వివరము తెలియక గురువు ల
  ఘువుల వరసలయరకుండ కూర్చెడి కవితల్
  నవనవనవ కవనంబని
  అవధానముఁ జేయువార లల్పులు గాదే!

  రిప్లయితొలగించండి
 7. వివరము తెలియక గురువు ల
  ఘువుల వరసలరయకుండ కూర్చెడి కవితల్
  నవనవనవ కవనంబని
  అవధానముఁ జేయువార లల్పులు గాదే!

  రిప్లయితొలగించండి
 8. కువలయమునేలుదిత్పతు
  లవలెన్ పృచ్ఛకులప్రశ్నలన్నింటికిఁదా
  నవలీలగ పూరణలిడ
  నవధానముఁజేయువారలల్పులు గాదే?

  రిప్లయితొలగించండి
 9. కువలయమునేలుదిత్పతు
  లవలెన్ పృచ్ఛకులప్రశ్నలన్నింటికిఁదా
  నవలీలగ పూరణలిడ
  నవధానముఁజేయువారలల్పులు గాదే?

  రిప్లయితొలగించండి
 10. స్తవనీయులు దీక్షితులై
  యవధానము చేయువార లల్పులుగాదే
  యవధానుల శ్రమ నెరుగక
  కువిమర్శలు చేయువారు కుంభినిలోనన్

  రిప్లయితొలగించండి
 11. నవరసములు కురిపించగ
  కవులందరు కవన మల్లి గానము చేయన్ !
  భువనములు దద్ద రిల్లగ
  అవధానముఁ జేయు వారలల్పులు గాదే !

  రిప్లయితొలగించండి
 12. అవనిని గలరే మరియిం
  కెవరైనను కవుల మించి కీర్తి గడించన్ !
  రవి సైతము వెఱ గొందగ
  అవధానముఁ జేయు వార లల్పులు గాదే

  రిప్లయితొలగించండి
 13. భవమున కవనము చేయుచు
  అవధానముఁ జేయువార లల్పులు గాదే
  నవయుగమున కవనమనియు
  కవిగన్ జన్మంబు సార్థకంబున్ బొందున్.

  రిప్లయితొలగించండి
 14. సవరణల న్ముందుగ నడి
  గి వట్టి పృచ్ఛకుల మేపి గెలువన్గల నం
  చవకతవకలుగ పేరున
  కవధానముఁ జేయువార లల్పులు గాదే!

  రిప్లయితొలగించండి
 15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణలో విరోధాభాసం ఉన్నది. సరసంగా అవధానం చేసేవాడు అల్పుడెలా అవుతాడు?
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  నా పూరణలో మొదటిపాదంలో గణదోషం ఉందని గుండు మధుసూదన్ గారు ఫోన్ చేసి చెప్పేదాక గమనించలేదు. వారికి ధన్యవాదాలు. ‘స్తవనీయ కవిత్వ ఘనులు’ అని సవరించుకుంటున్నాను.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణలోనూ విరోధమే గోచరిస్తున్నది. అంత చక్కగా అవధానం చేసేవారు అల్పులా?
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణలోనూ విరోధమే. అవలీలగ అవధానం చేసేవారు అల్పులా?
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పూరణలలోనూ విరోధమే. భువనాలు దద్దరిల్లే విధంగా అవధానం చేస్తే అల్పులా?
  *
  జంగిడి రాజేందర్ గారూ,
  మీ పద్యం నిర్దోషంగా, చక్కని ధారతో విలసిల్లుతున్నది. కాని భావమే కొద్దిగా దురవగాహంగా ఉంది.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. ఆర్యా! ధన్యవాదములు.
  నా పూరణలో ప్రశ్నార్ధకాన్ని తీసివేస్తే సరిపోతుంద నుకొంటాను.

  వ్యవధానము లేకుండగ
  జవదాటక నడుగు ప్రశ్న శహభాషుల వ
  హ్వ వహవ్వ యన సరసముగ
  నవధానముఁ జేయువార లల్పులు గాదే!

  రిప్లయితొలగించండి
 17. పవలును రాత్రుల్ జూదరి
  భవనములోగుములు కూడి భామల తోడన్
  జవురుచు నాలుగు మోముల...
  అవధానముఁ జేయువార లల్పులు గాదే!

  నాలుగు మోముల అవధానము = చతుర్ముఖ పారాయణము = పేకాట

  రిప్లయితొలగించండి
 18. చవిగొని వానరుల వలెన్
  లవలేశము క్షోభ లేక లాఘవ రీతిన్
  కవులను లంఘించి మురిసి
  యవధానముఁ జేయువార లల్పులు గాదే!

  అల్పము = సూక్ష్మము

  రిప్లయితొలగించండి