8, అక్టోబర్ 2012, సోమవారం

దత్తపది - 27 (క్రికెట్టు - హాకీ - టెన్నిసు - చెస్)

క్రికెట్టు - హాకీ - టెన్నిసు - చెస్
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. చక్రి కెట్టుల యొప్పును సఖ్యత చెన
    టెన్ని సుద్దులు చెప్పిన టెక్కు బోయె
    తాడు గట్టిరి పట్ట హా! కీడు సేయ
    సమర శంఖము పూరించె సమరమునకు.

    రిప్లయితొలగించండి
  2. యాదవసైన్యమును కోరబోయిన దుర్యొధనునితో, శ్రీకృష్ణుడు తాను ఒకపక్షమనీ, తక్కినవారలంతా ఒక పక్షమనీ తాను యుద్ధము చేయనని చెప్పినప్పుడు దుర్యోధనుని స్వగతము...........

    చక్రికెట్టులకలిగెనీ వక్ర బుద్ధి
    కేళిసల్పుచు తనుమహాకిల్బిషంబు
    జేయపొడసూపె, ధర్మమా చెస్!! భరింప
    నట్టెనిసుమంత యవమానమవనియందు.

    రిప్లయితొలగించండి
  3. నాటి భారతమున లేవు ధాటిగా క్రి
    కెట్టు టెన్నిసు చెస్సు హాకీ లనంగ
    నొప్పు నాటలు కావున నుభయ పక్ష
    ములకు ద్యూతమే కద యయ్యె ముఖ్య క్రీడ

    రిప్లయితొలగించండి
  4. వక్రి కెట్టు లదియు వరమౌను హా! కీల
    కంబు చక్రి యుక్తి గాని నేల
    పన్ని పేర్కొనుట కటెన్ని సుయోధను (సుసైన్యము)
    లున్న చచ్చె సుడుము లన్ని చూడ!

    రిప్లయితొలగించండి
  5. భార తంబున జూ దంబు పాడి య య్యె
    హాకి టెన్నిసు చె స్సులు క్రికెటు లేవి
    యాడి న ట్టులు గానము నార్య ! యెచట
    ధరణి పాలించు జక్కగ ధర్మ రాజ !



    రిప్లయితొలగించండి
  6. శ్రీకృష్ణుని పొందలేక పోయిన సుయోధనునితో నరనారాయణులగురించి విష్ణుభక్తుడైన భీష్ముడన్నట్లు:

    చక్రి కెట్టులఁదెలియును సర్వమనకు
    కృష్ణుని తరహా కీలక కేళియదియె
    కృష్ణువెంటెన్ని సుగుణాలు! క్రీడి కెరుక
    యందుకె తలంచె స్మరియించె నంద నతని

    రిప్లయితొలగించండి
  7. చక్రి కెట్టుల నచ్చెను శకుని మామ !?
    అంత మయె నహా ! కీచకు డెంత ఖలుడు !
    ముంద టెన్ని సుమావుల బూనిచె సరి
    స్యందనమునకు పార్థుడు సంగరమున ?

    రిప్లయితొలగించండి
  8. చిన్న సవరణతో :
    ... కీచకుం డెంత ఖలుడు !

    రిప్లయితొలగించండి
  9. హాకీలు క్రికెట్టు చస్సులు హాని కావు
    జూదమే గాదు టెన్నిసు బాధ వలదు
    మాయ పాచిక లాటను మత్తు విడక
    మగువ నోడెను ధర్మజు మర్మ మనక !

    రిప్లయితొలగించండి

  10. (కర్ణ వధానంతర మర్జునుని మదినిఁ గదలాడిన యూహలు)

    చక్రి కెట్టులుం గలిగెను సంతసమ్ము
    కర్ణుఁ డీల్గ! హా! కీడు వోఁ గంటి జయము!
    ఈ ధనుష్కు కంటె న్నిష్ఠుఁ డేను కాన?
    నా మదినిఁ దోచె సుమ సుగంధమ్ము నేఁడు!!

    రిప్లయితొలగించండి
  11. చక్రికెట్టువోలె మనము జయమటంచు
    పలుక దగును? హా! కీలకంబంద్రు జనులు,
    వైరివరులకటెన్ని సుపథకములను
    జేయునో? యని పనిచె సుషేణునటకు

    నా సు యోధనుడప్పుడు యనిని బాణ
    ఘాతమున యలసిన హరి గనిన యంత,
    వైద్యవిధిని నెరపుడంచు; భావమందు
    కినిసి యున్నను రణమను కేళియందు.

    రిప్లయితొలగించండి