6, అక్టోబర్ 2012, శనివారం

పద్య రచన - 134

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. హరికథలను వినరండని
  మురిపించెడు చిఱుకథలను ముచ్చట లెన్నో
  మరిమరి చేరిచి చెప్పగ
  చిఱకాలము క్రిందట ప్రజ చేరెడిదోయీ!

  రిప్లయితొలగించండి
 2. పస గా జెప్పినచో నవ
  రస ములు మరి జాలువారు రక్తియు గట్టున్
  కొస పిట్ట కథలు మెరయును
  దెస లేక హరి కథ నేడు దిక్కులు జుచెన్.

  రిప్లయితొలగించండి
 3. ఒక్కతె(డు) బహుపాత్రలలోఁ
  జక్కగపలుహావభావ సరసోక్తులతో
  చిక్కటి కథనంబుఁ గలిపి
  చెక్కచిటికెలాడఁజెప్పుచెవులూరించన్!

  రిప్లయితొలగించండి

 4. డప్పు సన్నాయి మధ్యన డాం భికముగ
  యువతి నిలబడి హరికధ యుత్సు కతన
  జెప్ప దొడ గెను జనముల చప్ప టు లు, గ
  గనము వఱకును వినబడు వినుడు మీ రు

  రిప్లయితొలగించండి
 5. హరికథలను వచియించెడి
  నరులకు సర్వార్థసిద్ధి, నవ్యసుఖంబుల్
  నిరతశ్రవణము చేసిన
  దరిజేరదు కల్మషంబు ధన్యత గల్గున్.

  రిప్లయితొలగించండి
 6. సంగీత రాగాలు సరస నృత్యంబులు
  ....నభినయనముల తోడ నలరుచుండు
  సరస పౌరాణిక సత్కథా శ్రేణితో
  ....హరికథ లాహ్లాదకరము లగుచు
  మును ప్రశస్తిని గాంచె మన రాష్ట్రమున నెల్ల
  ....పర్వదినాల సంబరములందు
  ఆదిభట్ల గురుండు హరికథలకు పితా
  ....మహుడంచు పేరొందె క్ష్మాతలాన
  భక్తిరస సంభరితంబులై రక్తి గూర్చు
  హరికథల వైభవములు నిరంతరంబు
  పెంపుగాంచుత చక్కగా వినుడు గొనుడు
  మంగళంబులు హారతి మంగళములు

  రిప్లయితొలగించండి
 7. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా! శుభాశీస్సులు.

  హరికథలు కనుమరుగవు చున్నవి. పూర్వమువలె పోషించే వారు లేరు. శ్రోతలు తక్కువే. మన ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు చాల ప్రఖ్యాతి గాంచిన ప్రక్రియ ఇది. హరికథా పితామహ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు (విజయనగరము) ఈ ప్రక్రియను బాగుగా వ్యాప్తిలోకి తెచ్చి ఎందరో గొప్ప గొప్ప భాగవతారులను తయారుజేసేరు. తరువాతి కాలములో ఎందరో భాగవతారులు ఈ ప్రక్రియను కొనసాగించారు.

  ఈనాటి హరికథను గురించి పద్యరచన చేసేరు ఎందరో కవి మిత్రులు - ఆహ్లాదముగ నున్నవి.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు చిరకాలము నాటి ప్రక్రియ నేడు కనుమరుగయిందని పేర్కొనినారు. పద్యము హృద్యముగా నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు ఒకనాటి రసమయమైన హరికథలు వానిలోని పిట్టకథలను గురించి వచించేరు. పద్యము ప్రశంసనీయముగా నున్నది.

  శ్రీ సహదేవుడు గారు చెక్క చిటికెల చిన్నది (భాగవతారిణి) చేయు విన్యాసము వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు గగనము వరకు చప్పట్లు వినిపించే హరికథలను పొగిడేరు. అందమైన పద్యము.

  శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు హరికథా శ్రవణ ఫలశ్రుతిని వివరించేరు - సొగసుగా నున్నది.
  అందరికీ పేరు పేరునా అభినందనలు.
  స్వస్తి.


  రిప్లయితొలగించండి
 8. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
  సుబ్బారావు గారూ! క్షమించండి..వాయిద్యములు మార్చితే బాగుంటుందని నా భావన..

  "డప్పు సన్నాయి మధ్యన డాం భికముగ " బదులుగా..
  "వాయులీనమ్ము తబలతో వైనముగను "..అంటే...

  రిప్లయితొలగించండి


 9. హరికథా కళాకారిణి హరువు మీర
  నృత్య,సంగీత,సమ్మేళనముగ,నీర
  జాక్షు నవతార లీలలనద్భుతముగ
  కథలుగా జెప్పుచున్నది కాంచుడిచట.
  --------
  బ్రతికి యుండె ప్రాచీనమౌ ప్రక్రియ యిది
  తిరిగి చూడ వచ్చును దీని టీ.వి.యందు
  ఆదిభట్లవారి స్మృతికి నంకితముగ
  సలుపుచుందురు హరికథోత్సవము లెన్నొ.

  ఇటీవలనే శ్రీకాకుళం లో హరికథా మహోత్సవం ఘనం గా జరిగింది.

  రిప్లయితొలగించండి