శ్రీ సరస్వత్యై నమః:ఒక పవిత్ర స్థలములో సరస్వతీదేవి సమారాధనలు జరుగుచున్నవి. అందులో ఒక అష్టావధాన సభలో నిషిద్ధాక్షరిని ఇచ్చిన పృఛ్ఛకుడు ఇచ్చిన అంశము: లలితా దేవిని గూర్చి ఒక పద్యమును చెప్పండి - త ల అనే అక్షరములు లేకుండా చూడండి అని. జలజాతాసన భామినీ పద సమర్చల్ చేయుచున్ తత్సభాస్థలిలో నొక్క వధాన మందొసగె నంశంబౌ నిషిద్ధాక్షరిన్లలితా దేవిని గూర్చి చెప్పుడని యాహ్లాదంబుగా నక్షరాల్"త, ల" లేకుండగ జూడగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపగన్ నిషిద్ధాక్షరిని తరువాత ప్రకటించుతాను - స్వస్తి.
నిషిద్ధ్హాక్షరి - "త, ల" లేకుండా లలితాదేవి వర్ణన:మత్తకోకిల:శ్రీసదాశివ భామినీ! శశిశేఖరీ! భువనేశ్వరీ!వాసవాది సురావనా! గుణవైభవా! కరుణామయీ!భాసమాన యశోధనా! భవబంధ మోచని! శంకరీ!నీ సుధామయ వీక్షణన్ జననీ! సదా నను బ్రోవుమా.
అల వైకుంఠ పురంబునన్ వెలసి సర్వాంతర్యముల్ జొచ్చి నౌదల దాల్చున్ భువనంబులన్ ; హరియు భేదంబుల్ విలోకించడే ! కుల మేమంచు మతంబు యేమనుచు నీకుండెన్ ధనంబంచు నందల లేకుండగ జూడగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపగన్ ! అందల = మితి, మేర చూ. అంతర్జాల తెలుగు నిఘంటువు మరియు ఆచార్య జి . ఎన్. రెడ్డి తెలుగు పర్యాయ పద నిఘంటువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తలపై వాణియె నిల్చియుండి కరుణన్ తా విద్యలందీయగాతలపుల్ చేతలు పండితాళి మనలన్ తప్పంటు చూపింపకన్విలువల్ గల్గిన మంచి భావములతో వేరైన దోషంబు కైతల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.
కలలోజూచిన కన్నియన్, చెలియ నా కాంతామణిన్ చక్కనౌతలపందుంచిన పండితోత్తముడె యౌదార్యంబునన్ వర్ణనమ్మిలలో జేసిన వేళలన్ సభలలో యిల్లాలు రాకుండ, నత్తల లేకుండఁగఁ జూడఁగా వలయు;విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.
గురువు గారు,కొన్ని రోజుల వరకూ సభలో పాల్గొనడం వీలు కాకపోవచ్చును.
సోమార్క గారు పృచ్ఛకులు గా పాల్గొన్న అష్టావధాన విశేషాలు చూసినారా?.ఈ లంకెలో చూడగలరు.arkasomayaji.blogspot.in/2012/10/blog-post_14.html
లక్ష్మీదేవి గారూ "విద్వాంసుల్ ప్రశంసింపఁగన్" కలల కన్నియ వర్ణన చేసే పూరణ బాగుంది. కలలోజూచిన కన్నియన్, చెలియ నా కాంతామణిన్ చక్కనౌతలపందుంచిన పండితోత్తముడె యౌదార్యంబునన్ వర్ణన
నేమాని పండితార్యా! మీ పూరణ, అవధాని గారి నిషిద్ధాక్షరి అనుపమానం!
సలహానిచ్చెద బాలుడా వినుమురా జంఘాల శాస్త్రీయుడా!బలుపౌ సంస్కృత శబ్దముల్ విడియుచున్ పండంటి పద్యమ్ములన్గలభా ప్రాసలు ఘోరమౌ యతులనున్ కందమ్ము వృత్తంపు వ్రా తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిఒక పవిత్ర స్థలములో సరస్వతీదేవి సమారాధనలు జరుగుచున్నవి. అందులో ఒక అష్టావధాన సభలో నిషిద్ధాక్షరిని ఇచ్చిన పృఛ్ఛకుడు ఇచ్చిన అంశము: లలితా దేవిని గూర్చి ఒక పద్యమును చెప్పండి - త ల అనే అక్షరములు లేకుండా చూడండి అని.
జలజాతాసన భామినీ పద సమర్చల్ చేయుచున్ తత్సభా
స్థలిలో నొక్క వధాన మందొసగె నంశంబౌ నిషిద్ధాక్షరిన్
లలితా దేవిని గూర్చి చెప్పుడని యాహ్లాదంబుగా నక్షరాల్
"త, ల" లేకుండగ జూడగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపగన్
నిషిద్ధాక్షరిని తరువాత ప్రకటించుతాను - స్వస్తి.
నిషిద్ధ్హాక్షరి - "త, ల" లేకుండా లలితాదేవి వర్ణన:
రిప్లయితొలగించండిమత్తకోకిల:
శ్రీసదాశివ భామినీ! శశిశేఖరీ! భువనేశ్వరీ!
వాసవాది సురావనా! గుణవైభవా! కరుణామయీ!
భాసమాన యశోధనా! భవబంధ మోచని! శంకరీ!
నీ సుధామయ వీక్షణన్ జననీ! సదా నను బ్రోవుమా.
అల వైకుంఠ పురంబునన్ వెలసి సర్వాంతర్యముల్ జొచ్చి నౌ
రిప్లయితొలగించండిదల దాల్చున్ భువనంబులన్ ; హరియు భేదంబుల్ విలోకించడే !
కుల మేమంచు మతంబు యేమనుచు నీకుండెన్ ధనంబంచు నం
దల లేకుండగ జూడగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపగన్ !
అందల = మితి, మేర
చూ. అంతర్జాల తెలుగు నిఘంటువు మరియు ఆచార్య జి . ఎన్. రెడ్డి తెలుగు పర్యాయ పద నిఘంటువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితలపై వాణియె నిల్చియుండి కరుణన్ తా విద్యలందీయగా
రిప్లయితొలగించండితలపుల్ చేతలు పండితాళి మనలన్ తప్పంటు చూపింపకన్
విలువల్ గల్గిన మంచి భావములతో వేరైన దోషంబు కై
తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.
కలలోజూచిన కన్నియన్, చెలియ నా కాంతామణిన్ చక్కనౌ
రిప్లయితొలగించండితలపందుంచిన పండితోత్తముడె యౌదార్యంబునన్ వర్ణన
మ్మిలలో జేసిన వేళలన్ సభలలో యిల్లాలు రాకుండ, న
త్తల లేకుండఁగఁ జూడఁగా వలయు;విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.
గురువు గారు,
రిప్లయితొలగించండికొన్ని రోజుల వరకూ సభలో పాల్గొనడం వీలు కాకపోవచ్చును.
సోమార్క గారు పృచ్ఛకులు గా పాల్గొన్న అష్టావధాన విశేషాలు చూసినారా?.ఈ లంకెలో చూడగలరు.
రిప్లయితొలగించండిarkasomayaji.blogspot.in/2012/10/blog-post_14.html
లక్ష్మీదేవి గారూ "విద్వాంసుల్ ప్రశంసింపఁగన్" కలల కన్నియ వర్ణన చేసే పూరణ బాగుంది.
రిప్లయితొలగించండికలలోజూచిన కన్నియన్, చెలియ నా కాంతామణిన్ చక్కనౌ
తలపందుంచిన పండితోత్తముడె యౌదార్యంబునన్ వర్ణన
నేమాని పండితార్యా! మీ పూరణ, అవధాని గారి నిషిద్ధాక్షరి అనుపమానం!
రిప్లయితొలగించండిసలహానిచ్చెద బాలుడా వినుమురా జంఘాల శాస్త్రీయుడా!
రిప్లయితొలగించండిబలుపౌ సంస్కృత శబ్దముల్ విడియుచున్ పండంటి పద్యమ్ములన్
గలభా ప్రాసలు ఘోరమౌ యతులనున్ కందమ్ము వృత్తంపు వ్రా
తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్