వైవిధ్యంగా, అద్భుతంగా చక్కని పద్యాలు రచించిన... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, శ్రీపతి శాస్త్రి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, సహదేవుడు గారికి, గుండు మధుసూదన్ గారికి, జిగురు సత్యనారాయణ గారికి, నాగరాజు రవీందర్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు, ధన్యవాదాలు. * జంగిడి రాజేందర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ఏసిన(వేసిన), ఎట్టు(పెట్టు), చేసును(చేయును)’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. నా సవరణలతో మీ పద్యం.... పవనసుతునిముందు పసిడిని పెట్టిన పాడుచేసి యదియు పక్కన నిడు, సెల్లుఫోనునైన చెల్లు జేయునుగాక! మారుతిగుణమేల మారునయ్య!
అబ్బుధ్ధి మారదెప్పుడు
రిప్లయితొలగించండి'సుబ్బరముగ ' పగులగొట్టి చూచును దానిన్
అబ్బా! సెల్ఫోనైనను
కొబ్బరి కాయై ననేమి కోతికి యొకటే.
కరముల నలరెడు నీ యుప
రిప్లయితొలగించండికరణమ్మే దూరవాణి కర్ణములకు సం
బరమును గూర్చునట నిరం
తరమంచును మర్కటంబు తగ మురిసె బళా!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికనిపించె ఫలములిందున
తినగోరుచు దీని తలుపు తెరచితి కానీ
వినిపించె వింత శబ్ధము !
కనుగొనెదను కానరాని కారణమేదో(మో).
మును హనుమంతుడయోధ్యన్
రిప్లయితొలగించండిపనిగట్టుకు రత్నమాల పరికించువిధం
బును గుర్తుతెచ్చువానర
మునకిదె జోహారులందు మోదముతోడన్.
రెండు కోతుల జూ డుము పండను కొని
రిప్లయితొలగించండిసెల్లు ఫోనును బరికించి డొల్ల జేసె
కోతి చేష్టలు వింత ను గొలుపు చుండు
రూ ప మరయగ మనుజుని రూ ప మేను .
నాదువారసులైనట్టినరులునేడు
రిప్లయితొలగించండిసెల్లు తోడ ప్రపంచమ్ముచేతఁబట్టి
కాలుఁగదపక కార్యాల కర్త లైన
వారసత్వపు చేష్టలు వదలరైరి
రిప్లయితొలగించండికోఁతి, చేతిలో సెల్ ఫోను 'కొబ్బరి' యని,
పగులఁ గొట్టంగఁ, గొబ్బరి వ్రక్క గూడ
నచటఁ గనరాక యుండఁగ నచ్చెరువయె!
కోఁతి చేష్టలు కొంగ్రొత్త రీతులు గద!!
రిథముగ కిచకిచ యనెను రింగు టోను
రిప్లయితొలగించండికోతి యొకటి తలచె "తన భ్రాత సెల్లు
లోన దూరెనేమో" యని ఫొనుఁ బగుల
గొట్టి పరికింప, సెల్లులో కోతి నాస్తి!!
పవనసుతునిముందు పసిడి ముద్దేసిన
రిప్లయితొలగించండిపాడుచేసినదియు పక్కనెట్టు
సెల్లుఫోనునైన చెల్లు జేసునుగాక!
మారుతిగుణమేల మారబోదు!
హారమందున నారాము హనుమ వెదకి
రిప్లయితొలగించండిత్రెంచి వేసిన సంగతి తెలిసె నేమొ
కపియె కూర్చొని యారాము గాను తాను
వెదకు చుండెన సెల్ విప్పి వేగిరముగ.
కరమున నదేమి ? చెప్పుము కపివరుండ !
రిప్లయితొలగించండిసెల్లు ఫోనండ్రు దానిని - చింత యేల !
మాట లాడగ మున్ముందు మనిషికి వలె
వానరములకున్ సెల్లు ఫోన్స్ వచ్చు నేమొ !
తెలివి లేనట్టి దీనికి తెగుల దేమి
రిప్లయితొలగించండితినుట కేరీతి గాంచిన పనికి రాదు
వారసులు మనతోడి వా నరుల కేల
కల్లు త్రాగిన మనకబ్బె సెల్లు ఫోను
వైవిధ్యంగా, అద్భుతంగా చక్కని పద్యాలు రచించిన...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
గుండు మధుసూదన్ గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.
*
జంగిడి రాజేందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఏసిన(వేసిన), ఎట్టు(పెట్టు), చేసును(చేయును)’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. నా సవరణలతో మీ పద్యం....
పవనసుతునిముందు పసిడిని పెట్టిన
పాడుచేసి యదియు పక్కన నిడు,
సెల్లుఫోనునైన చెల్లు జేయునుగాక!
మారుతిగుణమేల మారునయ్య!
వస్తువు విలువల్ మారును వాడెడి విని
రిప్లయితొలగించండియోగదారుఁ బట్టి వినరా! యోగుల కిలి
యాన, కోతికి సెల్ ఫోను, అప్పట మతి
లేని వానికి మొగలిపూ లివ్వకెపుడు!