మిస్సన్న గారూ, మరీ ఇంత తత్క్షణస్పందనా? చాలా సంతోషం. సత్యాగ్రహ చాపానికి అహింసాబాణాలను సంధించి శ్వేతదైత్యులపై ప్రయోగించారన్న భావం చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.
మన గాంధి తాతయే మన జాతి నేతయై ....ప్రజలెల్లరకు శాంతి పథము జూపె మన గాంధి తాతయే మహిత సత్యాగ్రహ ....మను మహాయుధమూనె నాజియందు మన గాంధి తాతయే ఘనుల కాంగ్లేయుల ....కంతరంగమ్ముల నడలజేసె మన గాంధి తాతయే మన దేశమాతకు ....స్వాతంత్ర్యము నొసంగి శాంతి గూర్చె శాంత్యహింసల సారమ్ము చాటి చెప్పె సకల మత సామరస్య ప్రశస్తినూనె జాతిపిత యను విమల ప్రఖ్యాతి గాంచె నాతని దలంచి సాదృతి నంజలింతు
అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు. "నల్లారిని జూడలేక నలుకా బాపూ?" మీ భావము బ్రహ్మాండమే - కాని వ్యాకరణము మీరు చూడలేదు. చూడలేక అనేది వ్యతిరేకార్థకము - అందుచేత చూడలేకన్ అని ద్రుతము చేరదు. జాగ్రత్తగా చూచి పదములను మార్చండి. స్వస్తి.
Sub: Meeraabaayi: అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! మీరు మాలిని వృత్తము గురించి మంచి ప్రయత్నము చేసేరు. బాగున్నది. 1వ పాదములో "వహింపన్" అనేది టైపు పొరపాటా? వహింపన్ అంటే ధరింపన్ అని కదా అర్థము. తామసము అంటే అజ్ఞానము లేక చీకటి. ఒక మారు పరిశీలించండి. స్వస్తి.
గురువుగారూ ధన్యవాదాలు. మీరు క్షమించాలి. ఆ పద్యాలను ముందుగా వ్రాసి నా బ్లాగులో పెట్టే సమయంలో మీ పద్య రచన శీర్షిక చూసి వెంటనే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అంతే తప్ప సద్యః స్పందన కాదు. మీ ప్రశంసకు సంతోషంగా ఉంది.
శ్రీ సరస్వత్యై నమః: శ్రీ మధుసూదన్ గారికి శుభాశీస్సులు. మీ పద్యము చాలా బాగుగ నున్నది. దానికి ఇంకనూ వన్నెలు తేవాలి అని నేనొక చిన్న ప్రయత్నము చేసేను. తిలకించండి:
సత్యాగ్రహ చాపమ్మున
రిప్లయితొలగించండినిత్యమ్ము నహింస యనెడు నిశిత శరాళిన్
దైత్యుల బోలిన దొరల య-
కృత్యమ్ముల నేసి గొనవె కీర్తిని బాపూ!
స్తుత్యుడు జాతికి పితరుడు
నత్యుత్తమ భారతీయు డమరుడు బాపూ
ప్రత్యక్షమౌ నహింసకు
సత్యమ్మున కిరవులందు సత్యము బాపూ!
స్మరియింతును బాపూ నిను
స్మరియించెద నో మహాత్మ! సదమల భక్తిన్
స్మరియింతు ననవరతమును
హరియింపు మసత్య హింస లందరి యెదలన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమరీ ఇంత తత్క్షణస్పందనా? చాలా సంతోషం.
సత్యాగ్రహ చాపానికి అహింసాబాణాలను సంధించి శ్వేతదైత్యులపై ప్రయోగించారన్న భావం చాలా బాగుంది.
అభినందనలు, ధన్యవాదాలు.
కొల్లాయి, కర్ర తోడనె
రిప్లయితొలగించండితెల్లారిని వెడల గొట్టి తెచ్చిన స్వేచ్చన్
తెల్లారగ జేతురెయని
నల్లారిని జూడ లేక నలుకా బాపూ !
మన గాంధి తాతయే మన జాతి నేతయై
రిప్లయితొలగించండి....ప్రజలెల్లరకు శాంతి పథము జూపె
మన గాంధి తాతయే మహిత సత్యాగ్రహ
....మను మహాయుధమూనె నాజియందు
మన గాంధి తాతయే ఘనుల కాంగ్లేయుల
....కంతరంగమ్ముల నడలజేసె
మన గాంధి తాతయే మన దేశమాతకు
....స్వాతంత్ర్యము నొసంగి శాంతి గూర్చె
శాంత్యహింసల సారమ్ము చాటి చెప్పె
సకల మత సామరస్య ప్రశస్తినూనె
జాతిపిత యను విమల ప్రఖ్యాతి గాంచె
నాతని దలంచి సాదృతి నంజలింతు
అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండి"నల్లారిని జూడలేక నలుకా బాపూ?"
మీ భావము బ్రహ్మాండమే - కాని వ్యాకరణము మీరు చూడలేదు. చూడలేక అనేది వ్యతిరేకార్థకము - అందుచేత చూడలేకన్ అని ద్రుతము చేరదు. జాగ్రత్తగా చూచి పదములను మార్చండి. స్వస్తి.
శ్రీ నేమాని వారికి ధన్యవాదములు..మీ సీస పద్యము హౄద్య ముగా నున్నది. మిస్సన్న గారూ! మీ మూడు పద్యములు ముచ్చటగా నున్నవి.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని వారి సూచన తోనా సవరణ..
కొల్లాయి, కర్ర తోడనె
తెల్లారిని వెడల గొట్టి తెచ్చిన స్వేచ్చన్
తెల్లారగ జేతురెయని
నల్లారిని జూడ నిటుల నలుగకు బాపూ !
రిప్లయితొలగించండిచూ డ జాలక లోకంబు జూ డ్కు లవియ
మూ త బడినవి యౌ రౌ ర ముఖము దించె
నేమి సేతుము ? తాతయ్య ! యెవరు దిక్కు
రమ్ము గాం ధి జీ ! వేగమె మమ్ము గావ .
Sub: Meeraabaayi:
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
మీరు మాలిని వృత్తము గురించి మంచి ప్రయత్నము చేసేరు. బాగున్నది. 1వ పాదములో "వహింపన్" అనేది టైపు పొరపాటా? వహింపన్ అంటే ధరింపన్ అని కదా అర్థము. తామసము అంటే అజ్ఞానము లేక చీకటి. ఒక మారు పరిశీలించండి. స్వస్తి.
యుక్త వయసు గాదు రక్తపాతము లేదు
రిప్లయితొలగించండిఅస్త్రశస్త్ర బలము లసలు లేవు
సల్పె సమర మతడు స్వాతంత్ర్య సిద్ధికై
తెచ్చె మనకు గాంధి యిచ్చె నదియె !
ఉద్యమించి హరిజనోద్ధరణ కొఱకు
రిప్లయితొలగించండిదొరల దాస్టికమును తొలగ జేసి
సకల జనుల కొఱకు స్వాతంత్ర్య రథమును
కనుల యెదుట నిలిపె కాంక్ష లూర
రిప్లయితొలగించండిసీ,
తెల్లవారల మత్తు $ దించఁగ సమకట్టి
సత్యాగ్రహముఁ జేయు $ సాధుమూర్తి!
వర్ణభేదము లింక $ వలదంచు దళితుల
"హరిజను"లని పిల్చు $ హవనమూర్తి!
పేదవాండ్రకు వస్త్ర $ మేద, నా కెందుక
టంచు వస్త్రత్యాగ $ మెంచు ఘనుఁడు!
దేశమంతయుఁ గోరు $ దేశనాయకుఁడయ్యు
"పదవి"యాశించని $ పావనుండు!
గీ.
"జాతిపిత"యంచు నాతని $ జనులు కొలువ;
"గాంధి తాతయ్య"యని బాల $ కాళి పిలువ;
స్వార్థ మింతయు లేనట్టి $ "బాపు"కెపుడు
వందనము లందఁజేతును $ భద్ర మిడఁగ!
గురువుగారూ ధన్యవాదాలు. మీరు క్షమించాలి.
రిప్లయితొలగించండిఆ పద్యాలను ముందుగా వ్రాసి నా బ్లాగులో పెట్టే సమయంలో మీ పద్య రచన శీర్షిక చూసి వెంటనే
ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అంతే తప్ప సద్యః స్పందన కాదు. మీ ప్రశంసకు సంతోషంగా ఉంది.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిశ్రీ మధుసూదన్ గారికి శుభాశీస్సులు.
మీ పద్యము చాలా బాగుగ నున్నది. దానికి ఇంకనూ వన్నెలు తేవాలి అని నేనొక చిన్న ప్రయత్నము చేసేను. తిలకించండి:
తెల్లవారల మత్తు దించగ సమకట్టి
....సత్యాగ్రహము చేయు సాధుమూర్తి
వర్ణభేదము లింక వలదంచు దళితుల
....హరిజనులని పిల్చు హవనమూర్తి
పేదలకే వస్త్ర మేది? నా కేలంచు?
....నంగీల విడిచిన త్యాగమూర్తి
దేశమంతయు గోరు దేశనాయకుడయ్యు
....పదవి నాశించని భవ్యమూర్తి
జాతిపితయై చెలంగిన సత్యమూర్తి
బాలలకు గాంధితాతయౌ భద్రమూర్తి
స్వార్థ మించుకయును లేని యనఘమూర్తి
నంజలింతు మహాత్ముడౌ యమరమూర్తి
రిప్లయితొలగించండిగౌ. పండిత నేమాని వారికి ప్రణామములు!
తమరి చేఁతఁ బడిన నా పద్యము నిజముగా వన్నెల నలఁదికొని, కాంతులీనుచున్నది! పద్యమును సొగసుగా, నాలంకారికముగా, హృద్యముగా నెటుల రచియించవచ్చునో తెలుపుట కిది యొక యుదాహరణము, మార్గదర్శకమును! తమ వంటి పెద్దల మార్గదర్శకత్వము లభించినందులకు నేను ధన్యుఁడనైనాను!
ధన్యవాదములు మఱియుఁ గృతజ్ఞతలతో...
భవదీయ విధేయుఁడు...
గుండు మధుసూదన్
గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిపై చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు.....
రిప్లయితొలగించండిమిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, (తెల్లారు, నల్లారు అని వ్యావహారికపదాలు వేసినా)
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి, (దాస్టికము - దాష్టికము... టైపాటా?)
*
గుండు మధుసూదన్ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
నేనూ మొదట అలాగే అనుకొన్నాను.
రిప్లయితొలగించండిదాస్టికము.
చూ. ఆచార్య జి. ఎన్. రెడ్డి తెలుగు పర్యాయ పద నిఘంటువు.
చెంప చెల్లు మన్న చెలరేగి పోవక
రిప్లయితొలగించండిమరొక చెంపఁజూపు మాన్యుడితడు!
సహనభూషణుండుసత్యాగ్రహాయుధ
బలము తోటి కదలు బాపు!గాంధి!
రిప్లయితొలగించండి1. .
దక్షిణాఫ్రికలోన దనవారి కష్టాల
నుద్ధరింపగ బూని యుద్యమించె
భరతమాతకు బరపాలనా దాస్యశృన్
ఖలముల దెగగొట్టి కాచుకొరకు
అద్భుతమ్మైన సత్యాగ్రహాయుధమున
సమరమ్ము గావించె శాంతిదూత
సాధించె తుదకహింసా యుతోద్యమమున
స్వాతంత్ర్యమున్ భరత జనులకెల్ల
అఖిల దేశములను గొనియాడబడెయె
వైరులును గూడ మెచ్చిరా పరమ పురుషు
డా మహాత్ముడే గాంధిజీ యమరజీవి
కడకు హింసకే బలియౌట కాలమహిమ .
2.
అంతమైన భౌతికముగ ,నమరజీవి
బ్రతికి యున్నావు మా మనో ఫలకమందు
నీదు సందేశమును,బోధ ,నిత్యములుగ
జగతి వ్యాపించె నన్ని దేశముల యందు.