9, అక్టోబర్ 2012, మంగళవారం

పద్య రచన - 137

ఎర్రన
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. ఉభయ కవి మిత్రుడాయన
    యభయంబిడి వ్రాసె మిగులు నర పర్వమునే
    శుభమాయె తెలుగు జాతికి
    నభవుండని నుతులు జేతు నా యెర్రనకే.

    రిప్లయితొలగించండి
  2. భారతమందు నర్ధమది పర్వమరణ్యము బూర్తిజేసెనీ
    ధీరుడు యెఱ్ఱనార్యునకు తీయతెనుంగున మొక్కులందు, దా
    వారధివోలె నిల్చిజయ భారతమెల్లను పూర్ణమౌనటుల్
    దా రచియించి పేరిమిని దండిగ గాంచెను ధన్యుడీతడే!

    రిప్లయితొలగించండి
  3. దా పునరుక్తి అవుతున్నది.సవరణతో

    భారతమందు నర్ధమది పర్వమరణ్యము బూర్తిజేసెనీ
    ధీరుడు యెఱ్ఱనార్యునకు తీయతెనుంగున మొక్కులందు, నే.
    వారధివోలె నిల్చిజయ భారతమెల్లను పూర్ణమౌనటుల్
    దా రచియించి పేరిమిని దండిగ గాంచెను ధన్యుడీతడే!

    రిప్లయితొలగించండి
  4. "పరపూరితములను" భావ మేర్పడునట్టి
    ....వాక్యమ్ముతో నాగె భారతమున
    నన్నయ్యభట్టు సన్నయముగా తెనిగింప
    ....బూనిన కృతిలోన మూడవదగు
    పర్వము, తిక్కన వ్రాసె విరాట ప
    ....ర్వము నూని పదునేను పర్వములను
    ఆగిపోయిన యరణ్యాఖ్య పర్వమ్ములో
    ....శేషభాగమును విశిష్ఠశైలి
    పూర్తిజేసె సమర్థుండు కీర్తిశాలి
    యైన ఎర్రాప్రెగడ యట్టి యమిత దక్షు
    ధీవిశాలుని నే ప్రస్తుతించి కూర్తు
    తనరు వాఙ్మయ పుష్ప వందన శతమ్ము

    రిప్లయితొలగించండి
  5. నరసింహ పురాణంబును
    హరివంశము , రామచరిత నాంధ్రుల కొరకై
    కరుణించిన విభుడు జయము
    నరయుచు కూర్చుండె తెలుగు యాత్మోద్ధతియై

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    శ్రీ నేమాని వారికి దన్యవాదములు తెలిపుచు.
    యుగ karta ఎఱ్ఱాన్న గారికి ప్రణమిల్లి
    --------
    "శంభు daasu" datadu క్రొత్త శైలి నందు
    vishnu kathalu vraasenu vimta gaanu
    aadikavi shabda gati paina naadu konenu
    bhaavatagina tikkana vaarni paadu kolpi
    purti jese naranyamu pomdu gaanu lokapu "prabamdha parameshvaru da " nu birudu
    pomde varnanaatmakapu prabamdha rachana
    toda , srinaadhudu nilache todu gaanu.

    రిప్లయితొలగించండి
  7. భారతా రణ్య భాగంబు బదిల ముగను
    దెనుగు సేసితి వీ వయ ,తేట తెల్ల
    ముగను మఱియును జనములు మోద మలర
    శంభు దాసుడ! యె ఱ్ఱ న !శ తపు నతు లు .

    రిప్లయితొలగించండి
  8. రమ్యంపు భారతారణ్యపర్వమునందు
    శేష(శిష్ట)భాగము పూర్తిచేసె నతడు,
    కోదండపాణియౌ కోసలాధీశుని
    చరిత మాతడు పల్కె శ్రద్ధతోడ,
    హరివంశకావ్యంబు నతిసమర్థతతోడ
    విలిఖించి యున్నట్టి విజ్ఞు డతడు,
    నరసింహలీలను నైష్ఠికుడై నిల్చి
    వచియించె నలనాడు వైభవముగ

    ఆంధ్రసాహిత్య జగతిలో ననుపమమగు
    ఖ్యాతి గడియించి యున్నట్టి ఘనుడతండు
    ఎఱ్ఱనార్యుడు, కవిపరమేశ్వరుండు
    సరిసములు లేని సాహితీ స్రష్ట యతడు.

    నన్నయ్యకు తిక్కన్నకు
    నెన్నంగా మిత్రుడట్టు లింపుగ నాడున్
    మిన్నగ భారతశేషము
    నన్నింట సమర్థుడౌచు నాంధ్రము చేసెన్.

    శంభుదాసుడంచు సాహితీలోకాన
    ఖ్యాతినందియుండి చేతమలర
    నధికభక్తి శార్ఙి యవతారముల నెన్నొ
    పల్కినట్టి ఘనుని ప్రస్తుతింతు.

    రిప్లయితొలగించండి
  9. హరివంశము, నాంధ్ర చరితమాంధ్రమందు వ్రాయుటన్,
    మిరులు గొల్పు భారతమున మిగులు భాగ పూర్తితో,
    శర పరంపరల వలె తన సాహితీ పదాలతో,
    ధరను ఎర్రన - ఘన మకుట ధారుడయ్యె రాఘవా !

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కందుల వరప్రసాదు గారు:
    మీ పద్యము 2వ పాదములో టైపు పొరపాటు అనుకొంటాను -- విష్ణు కథలు కిబదులుగా విష్ణు కథలను అనాలి.
    భావతగిన - అనే పదమునకు అర్థము తెలియుటలేదు.
    స్వస్తి.

    శ్రీ వామన కుమార్ గారు:
    మీ పద్యము మొదటి పాదము మొదటిలోనే గణభంగము. సరిచేయండి. స్వస్తి.

    శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు:
    విలిఖించి కిబదులుగా విరచించి అంటే బాగుండును.
    సరిసములు కి బదులుగా -- ఆ పాదమును ఇలాగ మార్చండి:
    సములు లేనట్టి సాహితీ స్రష్ట యతడు - అని.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుభ్యోనమః
    హరివంశము అనేది వారు వ్రాసిన పుస్తకం కనుక, ఆ పేరు ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు. మార్పు చేయ ప్రయత్నించాను.(అయితే ఉత్సాహ వృత్తంలోనే ప్రయత్నించాలి అని నా ఆశయం.)

    హరియును,నరసింహ చరితమాంధ్రమందు రచనతో,
    పరగు భారతమునరణ్యపర్వ భాగ పూర్తితో,
    శర పరంపరల వలె తన సాహితీ పదాలతో,
    ధరను ఎర్రన - ఘన మకుట ధారుడయ్యె రాఘవా !
    (పరగు = వ్యాపించు)

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ వామన కుమార్ గారూ! శుభాశీస్సులు.
    మీ భావముతో ఒక పద్యమునకు నా ప్రయత్నము చూడండి:

    వరమతి విరచించెను హరివంశమును తెనుంగునన్
    సరసముగ నృసింహగాథ సద్యశస్వియున్ కవీ
    శ్వరుడు భారతమున శేషపర్వ భాగమున్ వెసన్
    ధరణి నెర్రనార్యు డతని దలతు నాత్మ రాఘవా!

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని వ్రాసిన విషయాన్ని చక్కని సీసపద్యంలో మనోహరంగా తెలియజేసారు. అభినందనలు.
    దయతో మిత్రుల పద్యాల విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ఎర్రన గురించి సమగ్ర విశేషాలతో చక్కని ఖండిక వ్రాసారు. మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ఎర్రన గురించి చక్కని పద్యాలను వ్రాసిన....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కళ్యాణ్ గారికి,
    వరప్రసాద్ గారికి,
    సుబ్బారావు గారికి,
    మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    ఎలాగూ పండిత నేమాని వారు విశ్లేషించినందున నేను కేవలం అభినందనలు తెలుపుతున్నానని గమనించ మనవి.

    రిప్లయితొలగించండి



  14. నన్నపార్యుడు,తిక్కనమహాకవియును
    రచియించినారు భారతము నొక్క
    వనపర్వమందలి భాగమ్ము దక్క తత్
    శేషమ్ము బూరించె శిష్టుడైన
    సుకవి యెర్రప్రగడ ,సుందరశైలితో
    కవిత తద్రచనయె కాదలంప
    నతని యశోకాంతి యాంధ్రదేశమ్మున
    శాశ్వత రీతి బ్రసార మయ్యె
    ఘనకవిత్రయమందు నొక్కడుగ ఖ్యాతి
    నందె నదికాక హరివంశ మను ప్రబంధ ,
    రామచరిత,నృసింహ పురాణ రచన
    దారిచూపె ,భావికవి సంతతులకెల్ల.

    రిప్లయితొలగించండి