1, అక్టోబర్ 2012, సోమవారం

పద్య రచన - 129

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. మీరా గానము నే విను
  మీ రాధ మదిని ప్రేమ మించెను గనుమా!
  రారా కన్నయ్యా యని
  నోరారగ బిలుచు చుండె నో కృష్ణయ్యా!

  రిప్లయితొలగించండి
 2. రారా కృష్ణ! ముకుంద! మాధవ! హరీ! రారా జగన్నాయకా!
  రారా శ్యామ! మనోభిరామ! సుఖదా! రారా యశోదా సుతా!
  రారా దేవ! మహానుభావ! యని యాలాపించుచున్ గొల్చు నో
  మీరాబాయి! విశేష భక్తి విభవా! మేల్మేలు దీవ్యన్మతీ!

  రిప్లయితొలగించండి
 3. ఏరా ! యేమిటి వింతలు ?
  మీరా యట పాడు చుండె మేనును మఱ చీ
  రారా వినుదము మనమును
  నారాటము హెచ్చె నాకు నాలా పించన్ .

  .

  రిప్లయితొలగించండి
 4. మలిన విషయ రసముల వదలి హరిచర
  ణములనె దలచు దానిని ; నవ్వు కొందు
  కుటిల జగతిన నున్నట్టి కుత్సితమును
  గని ; జనమ జనమల దాసి గాన ? హరికి !

  మై హరి చరణన్ కీ దాసీ .. ( మీరా భజన్ ) ఆధారంగా -

  రిప్లయితొలగించండి
 5. మీరాబాయిని గురించి చక్కని పద్యాలు చెప్పిన
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. మీరా ప్రియముగ భక్తిని
  రారా కృష్ణయ్య యనుచు రంజిల్ల మదిన్ !
  కోరుచు మోక్షము నిమ్మని
  మారా మింకేల నయ్య మానస చోరా !

  రిప్లయితొలగించండి
 7. మీరా గానఁపు తీరే
  వేరది! నిరతంబు కృష్ణుఁ, వేణురవముఁ దాఁ
  నారాధనానుభవమున
  నోరారగ కృష్ణలీలఁనుతిగాఁబాడున్!

  రిప్లయితొలగించండి
 8. తరుణ మిదియ కృష్ణా! తామసమ్మున్ వహింపన్ ?
  చరణ యుగళి చెంతన్ చాలు నాకిమ్ము చోటున్
  మరణ మొకటె దిక్కౌ మానినిన్ బ్రోవకున్నన్
  శరణ మనెను మీరా జాలమేలోయి యేలన్?

  రిప్లయితొలగించండి 9. కృష్ణభక్తి పరాకాష్ఠ ,కృపణ లేని
  శాంతశృంగార భావాతిశయము మీర
  దనను దానె మరచి మాధవుని దివ్య
  గానమున గొల్చె ' మీరా ' జగమ్ము మెచ్చ .

  రిప్లయితొలగించండి 10. కృష్ణభక్తి పరాకాష్ఠ ,కృపణ లేని
  శాంతశృంగార భావాతిశయము మీర
  దనను దానె మరచి మాధవుని దివ్య
  గానమున గొల్చె ' మీరా ' జగమ్ము మెచ్చ .

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  మూడవ పాదంలో ‘మోక్షము నిమ్మనె’ అంటే బాగుంటుంది.
  *
  మిస్సన్న గారూ,
  మీ మాలినీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో టైపాటు కావచ్చు. గణభంగం జరిగింది. ‘మరచియు’ అంటే సరి!

  రిప్లయితొలగించండి


 12. శ్రీశంకరయ్య గారికి ,మీ సూచనమేరకు 3వ పాదంలో ' మరచియు ' అని సవరిస్తున్నాను.ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి


 13. శ్రీశంకరయ్య గారికి ,మీ సూచనమేరకు 3వ పాదంలో ' మరచియు ' అని సవరిస్తున్నాను.ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
  తామసము అనే పదాన్ని జాగు, ఆలస్యము అనే అర్థంలో కూడా వాడుతూ ఉంటారని అలా వ్రాశాను. కూడ దంటారా. దయచేసి చెప్పండి.

  రిప్లయితొలగించండి
 15. కం.
  హృదయముకృష్ణనివాసము
  పదములునాకృష్ణగీతపావన పదముల్
  పెదవులకృష్ణామృతమును
  ముదితకు మేనంతభక్తి మోహనమీరా

  రిప్లయితొలగించండి