3, అక్టోబర్ 2012, బుధవారం

పద్య రచన - 131

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. ఏమి సంబరములో? యేర్పాటు చేసిరి
    ....విందు భోజనము పసందుగాను
    పళ్ళెరమ్మున నొక్క పచ్చని యరటాకు
    ....చెంచాలు గిన్నెలు నుంచిరందు
    కమ్మ కమ్మని వంటకమ్ములు బిరియాని
    ....నూడుల్సు నుంచిరి వేడి గాను
    ప్రక్క గిన్నెల నుల్లి ముక్కలు పెరుగును
    ....సాంబారు బోలు రసమ్ము కలదు
    పంచ భక్ష్య పాయసములు పాత బడెను
    నేటి కప్రాచ్య పద్ధతుల్ మేటివయ్యె
    మంచి రుచుల భోజనము గావించి రండు
    డెంద మానంద లోకాల చిందులేయు

    రిప్లయితొలగించండి
  2. తెలుగు భోజన మనినేను తినగ వస్తి
    ముద్ద పప్పుయు కూరేది ముద్ద దిగను
    ఆయి లేదాయె శూన్యమే యప్పడమ్ము
    ఆవకాయయు గోంగూర యసలు లేదు
    కలదె పులుసందు లేదులే గడ్డ పెరుగు
    ఆకు యొక్కటి చూడగా నరటి దేను
    కడుపు నిండునె దానితో కాలుగాని.

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రిగారితో నూటికి నూరుపాళ్ళు ఏకీభావిస్తాను. మా ఇంట్లో నాకు ఆంధ్రా భోజనం వేరే వండాల్సిందే.

    రిప్లయితొలగించండి
  4. చిన్న సవరణ తో.. ఎనిమిది పాదాలుంటే బాగుంటుందని .. .

    తెలుగు భోజన మనినేను తినగ వస్తి
    కంచ మందున చూడగా కళ్ళు తిరిగె
    ముద్ద పప్పుయు కూరేది ముద్ద దిగను
    ఆయి లేదాయె శూన్యమే యప్పడమ్ము
    ఆవకాయయు గోంగూర యసలు లేదు
    కలదె పులుసందు లేదులే గడ్డ పెరుగు
    ఆకు యొక్కటి చూడగా నరటి దేను
    కడుపు నిండునె దానితో కాలుగాని.

    రిప్లయితొలగించండి
  5. చంద్ర శేఖర్ గారూ ! నా (మీ) ఆంధ్రా భోజనం లో అన్నీ వచ్చాయా.. ఇంకా ఏమైనా తగ్గాయా...

    రిప్లయితొలగించండి
  6. మరికొన్ని వాటి మధ్యలో కలుపుకొన మని మనవి ..
    ఒరుగు వడియము లేవయ్య ఉప్పు మిరప
    మినప గారెలు పులిహోర మీద జీడి
    పప్పు కిస్ మిస్సు వేసిన పాయసమ్ము
    చింత యుసిరిక లికలేవు చింత దీర్చ

    రిప్లయితొలగించండి
  7. నేనే కలిపి పెడదామనిపించింది...

    తెలుగు భోజన మనినేను తినగ వస్తి
    కంచ మందున చూడగా కళ్ళు తిరిగె
    ముద్ద పప్పుయు కూరేది ముద్ద దిగను
    ఆయి లేదాయె శూన్యమే యప్పడమ్ము
    ఆవకాయయు గోంగూర యసలు లేదు
    ఒరుగు వడియము లేవయ్య ఉప్పు మిరప
    మినప గారెలు పులిహోర మీద జీడి
    పప్పు కిస్ మిస్సు వేసిన పాయసమ్ము
    చింత యుసిరిక లికలేవు చింత దీర్చ
    కలదె పులుసందు లేదులే గడ్డ పెరుగు
    ఆకు యొక్కటి చూడగా నరటి దేను
    కడుపు నిండునె దానితో కాలుగాని.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ/శ్రీ చంద్రశేఖర్ గారూ!
    మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మన ఆంధ్రా వంటకములే దొరకుతాయా? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా తిండి తినుచు .... అనీ సుమతీ శతకమును తిరగ వేయుటో, లేక అన్నము పరబ్రహ్మ స్వరూపము - ఏది లభించినా భగవత్ ప్రసాదముగానే స్వీకరించాలి అని సర్దుకు పోవాలి - అని వేదాంతమును వల్లె వేయుటో చేయాలి కదా! స్వస్తి

    రిప్లయితొలగించండి
  9. తల్లికి దాస్యమున్ జెరుప తారలసీమను మీరి సూటిగన్
    వెళ్ళెనదేలనో సురుల వీధికి వీరుడు వైనతాత్మజుం
    డల్లదె తేగతా నమృతమల్లరదేలను తెల్గువారి వం
    టెల్లయు కాదొకో యమృతమెట్టుల తానది విస్మరించెనో

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమాని వారి 'హిత' బోధ తో..
    కొస మెరుపు..

    కాని తిందును దీనినే కలుపు కొనుచు
    కాలు గావున తిననిచో కడుపు లోన
    అన్న మెయ్యది ఏదైన నదియె బ్రహ్మ
    మనుచు దలతును చెప్పిరే మాన్యు లపుడు.

    రిప్లయితొలగించండి
  11. కూర పప్పును సాంబారు కూడి యున్న
    విందు భోజన మయ్యది తిందు మిపుడు
    రండు వేవేగ మీరలు రాము గుడికి
    అన్న దానము జరిగె వెం కన్న చేత .

    రిప్లయితొలగించండి
  12. subbarao గారూ మీ పద్యం బాగుంది

    "కూర పప్పును సాంబారు కూడి యున్న
    విందు భోజన మయ్యది తిందు మిపుడు

    రిప్లయితొలగించండి
  13. చిన్న సవరణ తో...

    తెలుగు భోజన మనినేను తినగ వస్తి
    కంచ మందున చూడగా కళ్ళు తిరిగె
    ముద్ద పప్పుయు కూరేది ముద్ద దిగను
    ఆయి లేదాయె శూన్యమే యప్పడమ్ము


    ఒరుగు వడియము లేవయ్య ఉప్పు మిరప
    మినప గారెలు పులిహోర మీద జీడి
    పప్పు కిస్ మిస్సు వేసిన పాయసమ్ము
    ఆవకాయయు గోంగూర యసలు లేదు

    చింత యుసిరిక లికలేవు చింత దీర్చ
    కలదె పులుసందు లేదులే గడ్డ పెరుగు
    ఆకు యొక్కటి చూడగా నరటి బాగు
    అన్ని వేళల దొరకునే యిన్ని రుచులు

    కాన తిందును 'బిర్యాని' 'కర్డ్ చట్ని'
    అన్ని కలుపుకు నొవ్వక యన్న దాత
    అన్న మెయ్యది ఏదైన నదియె బ్రహ్మ
    మనుచు దలతును మాన్యుల మాట లెపుడు.

    రిప్లయితొలగించండి
  14. అరటి యాకు పైన యవతార మైయుండె
    భక్ష్య భోజ్య మధుర వంట కములు
    కాశి యన్న పూర్ణ వాసిగా వడ్డించె
    వ్యాస మునికి వలెను పాయ సములు

    రిప్లయితొలగించండి
  15. సరిగ వడ్డించినట్టి విస్తరిని చూచి
    మురిసి కవిమిత్రులెల్ల నా భోజనంబు
    సేసి పద్యాలతో విందు సేతు రనుచు
    తలఁచితిని గాని యేమి యిట్టులయెఁ జూడ.
    *
    రసాస్వాదన కవిత్వంలోనే కాక భోజనం లోను చూపించారు కవిమిత్రులు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు తమ పద్యాన్ని మాటిమాటికి వండి ఆగి ఆగి మసాల దినుసుల్ని జోడిస్తూ చివరికి ఒక షడ్రసోపేత భోజనం సిద్ధం చేశారు. తృప్తిగా భుజించాను.
    వారికి అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారి పద్యమూ, భోజనం గురించిన వ్యాఖ్యా రెండూ బాగున్నవి. ధన్యవాదాలు.
    *
    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పద్యంలోని చమత్‘కారం’ బాగుంది. వారికి అభినందనలు.
    ‘తేగతా’ ఏమైనా టైపాటా?
    *
    సుబ్బారావు గారి అన్నదానము బాగుంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారు మన బ్లాగును తరచుగా వీక్షిస్తూ, మిత్రుల పద్యాలను నిశితంగా పరిశీలిస్తూ, తమ స్పందనలను తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారికి అందరి పక్షాన ధన్యవాదాలు.
    (వారు తమ పూర్తి పేరు ఒకసారి చెప్పినట్టు గుర్తు. కాని జ్ఞాపకం రావడం లేదు)
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    వంటకు నలభీములున్నారేమో కాని, కొసరి కొసరి ఆప్యాయతతో వడ్డించి తినిపించడంలో ఆడవారే ఉత్తములు.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ఈరోజు మీరు పద్యపు వంటలో వంకలు పెట్టదలచుకోలేదు.

    రిప్లయితొలగించండి
  16. ధరలు మండి పోవ వరియన్నమునుబెట్టి
    పప్పుచారు,పెరుగు,పచ్చడేసి
    అరటియాకుమీద కొరతన్నదేలేక
    పంక్తిలోన పెట్ట భలిర! భలిర!

    రిప్లయితొలగించండి
  17. సహదేవుడు గారూ,
    వడ్డించింది వంక పెట్టకుండా భోంచేసారు. బాగు బాగు! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. వట్టి యన్నమ్ము నొక రెండు వంటకములు
    నరటి యాకు మాత్రమ్మండె నందముగను
    ఏవి పచ్చళ్ళు మిఠాయీ లెచట గలవు
    తెలుగు శాక పాకము లేవి,తిండి యందు?

    రిప్లయితొలగించండి