30, అక్టోబర్ 2012, మంగళవారం

పద్య రచన - 145

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. మా కృతి శ్రీమదధ్యాత్మ రామాయణము నుండి:

  నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
  నమస్తే రుద్రాయ త్రిదశ నుత విజ్ఞాన నిధయే
  నమస్తే శర్వాయ ప్రమథగణ వంద్యాయచ నమో
  నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః

  నమస్తే సదా లోకానాథార్చితాయ
  నమస్తే గిరీశాయ నాద ప్రియాయ
  నమస్తే భవానీ మనస్సంస్థితాయ
  నమ శ్శంభవే విశ్వనాథాయ తుభ్యం

  నమో హిరణ్య బాహవే సనాతనాయ తే నమః
  నమశ్శివాయ సర్వభూత నాయకాయ తే నమః
  నమో హరాయ నందివాహనాయ శూలినే నమః
  నమో భవాయ నాగభూషణాయ శంభవే నమః


  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారూ,
  ధన్యోస్మి!
  శుభోదయంగా శివంకరమైన రుద్రస్తుతి అందించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. శ్రీవిశ్వేశ్వరు నాదిదేవు గిరిజా చేతోవిహారిన్ మహా
  దేవున్ నాగవిభూషణున్ శశిధరున్ దీవ్యత్ కృపాసాగరున్
  దేవవ్రాత సమర్చితున్ మునినుతున్ మృత్యుంజయున్ శంకరున్
  సేవింతున్ పరమాదరమ్మున జగఛ్ఛ్రేయోనుసంధాయకున్

  రిప్లయితొలగించండి
 4. శంకరుని గొల్తు నా యభ
  యంకరుని గొలుతు స్మరహరు నభవుని గొల్తున్
  అంకన దుర్గతొ వెలుగు శు
  భంకరుని శివుని పశుపతి భర్గుని గొల్తున్.

  రిప్లయితొలగించండి
 5. నాగారాజు రవీందర్ గారూ,
  మీ శివస్తుతి బాగుంది. అభినందనలు,
  కాకుంటే ‘అంకన’ శబ్దప్రయోగం, దుర్గతొ అని ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించడం విచార్యం.

  రిప్లయితొలగించండి
 6. ధన్యవాదములు గురువు గారూ !

  శంకరుని గొల్తు నా యభ
  యంకరుని గొలుతు స్మరహరు నభవుని గొల్తున్
  అంకమున చండి వెలయ శు
  భంకరుని శివుని పశుపతి భర్గుని గొల్తున్.

  రిప్లయితొలగించండి
 7. క్షీరముతో నభిషేకము
  నోరారగ హరుని పిల్పు నిజముగ నరుడా
  తీరగ జేయును పాపము
  తీరుగ నీ బ్రతుకు తేరు తిరుగును జగతిన్.

  రిప్లయితొలగించండి
 8. చిన్న సవరణ తో..

  క్షీరముతో నభిషేకము
  నోరారగ హరుని పిల్పు నిజముగ నరుడా
  తీరగ జేయును పాపము
  తీరుగ నీ బ్రతుకు తేరు తిరుగగ జేయున్.

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చిత్రానికి తగిన (అభిషేకాన్ని ప్రస్తావిస్తూ) పద్యాన్ని మీరొక్కరే వ్రాసారు. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి